15 May 2014

వేసవి ఆరోగ్య పానీయాలు



వేసం కాలం వచ్చేసింది. వేసవి కాలం లో చెమట రూపంలో శరీరంలోని నీరు మొత్తం బయటకు పోతుంటుంది. ఈ నీటితో పాటూ మన శరీరంలో ఉం డే ఎలక్ట్రొలైట్స్‌, సోడియం, పొటాషియం లాంటి లవణాలు అన్నీ వెలుపలికి వెళ్లిపోతాయి. వీటన్నిటినీ భర్తీ చేయడానికి శరీరానికి తగినన్ని మంచినీళ్లు, వీటితో పాటు సహజ పోషకాలు ఉన్న కొన్ని పళ్ళ రసాలు తీసుకోవడం మంచిది .

నీరు:
వేసవిలో నీటిని ఎక్కువ శాతం తీసుకోవాలి. గుర్తొచ్చినప్పుడల్లా నీటిని తాగడం చాలా మంచిది రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. నీరు, చర్మం లోని తేమను కాపాడుతుంది. కాలుష్యాన్ని బయటికి పంపుతుంది. రక్తాన్ని శుద్దిచేస్తుంది.వేసవిలో తీరికి దొరికినప్పుడుల్లా గొంతు తడుపుకోవడమే మంచిది.
కుండలోనీళ్లు రుచిగాను, చల్లగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిది

కోబ్బరినీరు.
దీనిలో శ్రేష్టమైన పోషకాలు కలిగి ఉన్నాయి.వేసవి కాలంలో కొబ్బరినీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందంటున్నారు వైద్యులు. వాంతులు, పైత్యం గలవారు ఈ కొబ్బరి నీరు ఎక్కువగా తాగుతారు. కిడ్నీలోని రాళ్లను కరిగించే శక్తి కొబ్బరినీళ్లకు ఉంటుందని, చిన్న పిల్లలకు ప్రతిరోజు కొబ్బరినీళ్లు తాగించిన వారి శరీరంలో పోషకవిలువలు చేరి జ్ఞాపకశక్తి చేరుతాయి. గుండెజబ్బులు, అధిక రక్తపోటు గల వారికి కొబ్బరినీళ్లు మేలు చేస్తాయి. ఈ కొబ్బరినీళ్లు తాగడం వలన మూత్రవిసర్జన సాఫీగా ఉంటుంది. వేసవికాలంలో మనిషికి తగిలే వడదెబ్బ / డీహైడ్రేషన్ నుంచి కాపాడే ఔషధ గుణాలున్న పానీయం కొబ్బరినీళ్లు.ఇందులో 5 కీలక ఎలెక్ట్రాలైటులు (electrolytes) పొటాషియం,మెగ్నీషియం,ఫాస్పరస్,సోడియం,కాల్షియంలను కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచును.

మజ్జిగ :
వేసవిలో మజ్జిగ తీసుకోవడం ఏమాత్రం మరిచిపోకూడదు. మజ్జిగ చలవనిస్తుంది పోషక విలువలు, విటమిన్లను కలిగి ఉంది . మజ్జిగ జీర్ణశక్తిని ఇస్తుంది. వ్యాధి నిరోధక శక్తి ని  పెంచును . ఇందులో పొటాషియం,క్యాల్షియం,రైబోఫెవిన్ ,విటమిన్ B-12 లభిస్తాయి.మజ్జిగ రుచిగా ఉండాలంటే కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి ముక్కలను చేర్చి తాగొచ్చు.పల్చగా చేసిన మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే వేసవిలో ఉండే అధిక దాహార్తి తగ్గి శరీరానికి కావలసిన లవణాలు లభిస్తాయి. వేసవికాల౦లో నిమ్మరస౦, జీలకర్ర పొడి, ఉప్పు, ప౦చదార కలిపి పొదీనా ఆకులు వేసిన లస్సీ వడ దెబ్బ తగలకు౦డా కాపాడుతు౦ది

సబ్జా నీరు:
ఇంట్లో సులువుగా తయారు చేసుకునే వేసవి పానీయాల్లో ఇది ఒకటి. దీని తయారీకి సబ్జాగింజలు, బెల్లం, మిరియాల పొడిని వినియోగిస్తారు.  ఇది శరీరంలో వేడిని నియంత్రిస్తుంది. ఇది పాలేట్,నియాసిన్, విటమిన్ ఇ అధికంగా కలిగి శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ది చేస్తుంది.మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

పుచ్చకాయ  రసం:
దీనిలో    పొటాషియo,విటమిన్ A ఎక్కువగా ఉంటుంది.ఇందులో ఉండే లైకోపిన్ (LYKOPIN )సూర్యరశ్మి లోని అతినిలలోహిత కిరణాలు  (U.V కిరణాల) నుండి చర్మాన్ని రక్షిస్తుంది. పుచ్చకాయ వల్ల, జీర్ణక్రియ ఉత్తేజం అవతుంది. రక్తవృద్ధితో, హెమోగ్లోబిన్‌ పెరుగుతుంది. కిడ్నీ, గుండెలకు మంచిది
తాటి ముంజలు : తాటి ముంజ మనిషికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో పొటాషియం ఆదికముగా  గా ఉంటుంది.బి.పి ని అదుపులో ఉంచి కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.ఎముకలను బలంగా ఉంచుతుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తాటి ముంజ లోని నీరు శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తుంది. మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది.


నిమ్మరసం:
వేసవిలో అందరూ ఇష్టంగా తాగే పానీయం నిమ్మరసం నిమ్మలో విటమిన్ సి అపారం. నిమ్మ ఆరోగ్య ప్రదాయని. నిమ్మలోని పోషక విలువలు మెదడు చురుకుగా పనిచేయడానికి, దంతాలు ఎముకలు పటిష్టంగా పని చేయడానికి ఎంతగానో సహకరిస్తాయి. రోజూ నాలుగుసార్లు నిమ్మరసం తాగితే పచ్చ కామెర్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది. వేడి నీటిలో నిమ్మరసం పిండి తాగినట్టయితే ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తిని ఇస్తుంది. ఎండ వేడిమి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఆకలిని పెంచుతుంది. జీర్ణశక్తిని పెంచతుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. పానీయంగానూ ఆస్వాదిస్తుంది.సిట్రిక్ ఆసిడ్ మూత్ర పిండాలలోని రాళ్ళను కరగదీస్తుంది. కొబ్బరినీరు లేకుంటే నిమ్మ రసం త్రాగడం శ్రేయస్కరం

చెరుకు రసం:  

వేసవికాలంలో చాలామంది సేవించే పానీయం చెరుకురసం  ఇందులో ఐరన్ ,ఫాస్పరస్ క్యాల్షియం ,మెగ్నీషియం పొటాషియం మూలకాలుంటాయి .ఇవి రొమ్ము ,ప్రోస్టేట్ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.మూత్ర పిండాలు గుండె,మెదడుల పనితీరుని మెరుగు పరుస్తాయి.

మ్యాంగో జ్యూస్:  

 ఒక గ్లాసు మామిడి పండు రసంలో కొంచెం తేనె కలిపి తగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మామిడి రసము వల్ల చూపు కూడా బాగుంటుంది. చర్మానికి మెరుపు కూడా వస్తుంది. మామిడి రసం జీర్ణశక్తికీ ఎంతో సహకరిస్తుంది. మామిడి మిల్క్‌షేక్ చలవనిస్తుంది.
క్యారెట్ జ్యూస్:

దీనిలో విటమిట్ ఏ ఎక్కువుగా ఉంటుంది.

ఆరెంజ్ లేదా బత్తాయి జ్యూస్:  

నారింజలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది.
లెమన్ సోడా
.
వేసవిలో చాలామంది ఎక్కువగా తాగే పానీయం ఇది. నిమ్మకాయ రసం, ఉప్పు కలిపి తయారు చేస్తారు. దాహార్తి తీరుస్తుంది. . 

ఫలూదా...
ఇది ఇరానియన్ పానీయం. దీని తయారీకి పాలు, సబ్జా గింజలు, సేమ్యాలు వినియోగిస్తారు. రుచి కోసం డ్రైఫ్రూట్స్ వేస్తారు. చల్లదనం కోసం ఐస్‌క్రీమ్ వాడుతారు. పోషకవిలువలు అధికంగా ఉండే పానీయం ఇది.

పుదీనా పానీ
వేసవిలో పుదీనా నీరు త్రాగటంవలన డీహైడ్రేషన్ నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు. పుదీనా నీరు త్రాగటం వలన ఒంట్లో వేడిని తగ్గించి, చల్లదనాన్ని ఇస్తుంది పుదీనా కషాయంలో తేనె కలిపి తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి బాగా వేస్తుంది. పుదీనా ఆకులను నీళ్లలో మరిగించి పుక్కిలిస్తే చిగుళ్ల వాపు తగ్గి రక్తం కారడం ఆగిపోతుంది. నీటిలో పుదీనా ఆకులను వేసి స్నానం చేస్తే రక్తపస్రరణ బాగుండడమే కాకుండా శరీరం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.
పుదీనా ఆకును మరిగించిన నీటితో ముఖాన్ని రోజూ కడుగుతుంటే ముఖచర్మం కాంతివంతంగా తయారవుతుంది.

దోసకాయ, పుచ్చకాయ, ద్రాక్ష జ్యూస్‌తో పాటు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్‌ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్‌ పంచదార కలిపి ఒ.ఆర్‌.ఎస్‌ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది.ఎండదెబ్బ/దేహైడ్రేషన్ నుంచి శరీరాన్ని కాపాడును.  
ఎండు ఖర్జూరాలను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వాటిని నలిపి, ఆ నీళ్లలో పటిక బెల్లం వేసి చిన్నపిల్లలకు ఇస్తే చలువ చేస్తుంది. తాజా పండ్లు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ రసం లాంటివి వేసవి లో ఆరోగ్యానికి మంచివి. వేసవి లో చల్లటి ఆరోగ్య  పానీయాలు తీసుకునేటప్పుడు ఒక్కసారిగా తాగేయకుండా కొంచెం కొంచెంగా తాగడం మంచిది.



..


.


















No comments:

Post a Comment