18 May 2014

దేశ పార్లమెంట్ /రాష్ట్రా అసెంబ్లి ల లో తగ్గిన ముస్లిం ల ప్రాతినిద్యం



.
2014 పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్ర ప్రదేశ్/తెలంగాణ రాస్త్రాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ముస్లింలకు తీవ్ర నిరాశకు గురిచేసినాయి. స్థానాల సంఖ్య పెరగక పోగా తరగటం జరిగింది.
 
2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశ జనాభా 121 కోట్ల మందిలో 15% వరకు ముస్లిం లు ఉన్నారు. దేశవ్యాప్తం గా 35 నియోజకవర్గాలలో 35% పైగా, 38 నియోజక వర్గాలలో 21-30% వరకు ముస్లింలు ఉన్నారు. 145 నియోజక వర్గాలలో 11-20% వరకు ముస్లిం లు ఉన్నారు. దేశం మొత్తం మీద 218 నియజవర్గాలలో ఫలితాలను ప్రభావితం చేసే స్థితి లో ముస్లిం లు ఉన్నారు.

కానీ రాను రాను లోక్ సభలో ఉండే ముస్లిం ఎం‌పిల సంఖ్య గణనీయం గా తగ్గిపోవుచున్నది. 16వ లోక్  సభలో గత 50 ఏళ్లలో కన్నా  అత్యంత తక్కువుగా 23గా  ముస్లిం ఎం‌పిల సంఖ్య ఉంది.  1980 ఎన్నికలలో అత్యధికంగా  51 మంది, ముస్లిం లోక్ సభ సబ్యులు ఎన్నికైనారు.  15 వ లోక్ సభలో ముస్లిం ఎం‌పి ల సంఖ్య 29 గా ఉంది ఈ సారి వీరి సంఖ్య 23 గా  ఉంది. మొత్తం పార్లమెంట్ సబ్యుల సంఖ్య లో ముస్లిం సభ్యుల సంఖ్య కేవలం 4% కన్నా కొంచం అధికంగా ఉంది.
16వ లోక్ సభ లో ముస్లిం ఎం‌పిలు
16వ లోక్ సభ లో గెల్చిన ముస్లిం అబ్యర్ధులు =23
పశ్చిమ బెంగాల్  -8గురు               
1.ఇద్రీస్ అలీ -తృణమూల్ కాంగ్రెస్ –బసిర్హాట్ 2.    సుల్తాన్ అహ్మద్ –తృణమూల్ కాంగ్రెస్స్-ఉలుబెరియా 3.మహమ్మద్ సలీం -  సి‌పి‌ఐ‌ఎం –రాయ్  గంజ్4.బహరుద్దీన్ ఖాన్ – సి‌పి‌ఐ‌ఎం –ముషీరాబాద్,*5మౌసమ్ నూర్ – కాంగ్రెస్స్ –మాల్డా నార్త్ 6.అబు హశీమ్ ఖాన్ చౌదరి –మాల్డా సౌత్ *7.డా.మంతాజ్ సంఘమిత –తృణమూల్ కాంగ్రీస్ –బర్ద్వాన్-దుర్గాపూర్*8.అపరూప పొద్దర్ (ఆఫ్రిన్ అలీ) –తృణ మూల్ కాంగ్రెస్- ఆరాంబాఘ్ –వెస్ట్ బెంగాల్
బిహార్ -4
1.తస్లీముద్దీన్ –ఆర్‌జే‌డి –అరారియా 2.తారిక్ అన్వర్ –ఎన్‌సి‌పి –కతిహార్
3.చౌదరి మహబూబ్ అలీ ఖైసర్ –ఎల్‌జే‌పి –ఖగరియ 4.మహమ్మద్ ఆష్రరూల్ హక్ ఖాస్మి –కాంగ్రెస్స్ –కిషన్ గంజ్
తెలంగాణ -1
అసద్దుద్దీన్ ఔవైసీ –ఏ‌ఐ‌ఎంఐ‌ఎం –హైదరాబాద్    
అస్సాం -2
1.సిరాజుద్దీన్ అజ్మల్ –ఏ‌ఐ‌యూ‌డి‌ఎఫ్ –బార్పేట 2.బదృద్దీన్ అజ్మల్ –ఏ‌ఐ‌యూ‌డి‌ఎఫ్ –ధూబ్రి
జే&కే -3
*1.మెహబూబా ముఫ్తి –పి‌డి‌పి-అనంత నాగ్ 2.ముజాఫ్ఫర్ హుసైన్ బేగ్ – పి‌డి‌పి –బరా ముల్లా 3.తారిక్ హమీద్ కర్ర –పి‌డి‌పి –శ్రీనగర్
కేరళ -౩
1.ఈ. అహమద్ –ఐ‌యూ‌ఎం‌ఎల్ –మాలప్పురమ్2.ఈ.టి. మహమ్మద్ బశిర్ – ఐ‌యూ‌ఎం‌ఎల్ –పొన్నాని.3.ఎం.టి.షానవాస్ –కాంగ్రెస్స్-వయనాడ్
తమిళ్ నాడు-1
అన్వర్ రాజా –ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే –రామనాథ పురం
లక్ష ద్వీప్-1
మహమ్మద్ ఫైసల్ –ఎన్‌సి‌పి –లక్షద్వీప
వీరిలో *నలుగురు  ముస్లిం స్త్రీ లోక్ సభ సబ్యులు. వారు 1.మౌసమ్ నూర్ – కాంగ్రెస్స్ –మాల్డా నార్త్ ,2.డా.మంతాజ్ సంఘమిత –తృణమూల్ కాంగ్రీస్ –బర్ద్వాన్-దుర్గాపూర్,3. మెహబూబా ముఫ్తి –పి‌డి‌పి-అనంత నాగ్.4. అపరూప పొద్దర్ (ఆఫ్రిన్ అలీ) –టి‌ఎం‌సి –వెస్ట్ బెంగాల్
 వీరిలో ముగ్గురు పశ్చిమ బెంగాల్ కు, ఒకరు జే&కే కు చెందిన వారు. వీరిలో ఒకరు కాంగ్రెస్స్, ఇరువురు తృణమూల్ కాంగ్రెస్స్, ఒకరు పి‌డి‌పి కు చెందిన వారు
 2014 ఎన్నికలలో బి‌జే‌పి తరుపున 7గురు ముస్లిం లు పార్లమెంట్ కు పోటీ చేయగా ఎవరు గెలవలేదు. బి‌జే‌పి మిత్ర పార్టీ ఎల్‌జే‌పి తరుపున ఒకరు బిహార్ నుంచి ఎన్నికైనారు అనగా ఎన్‌డి‌ఏ నుంచి కేవలం ఒకే ఒక ముస్లిం లోక్ సభ సబ్యుడు ఎన్నికైనాడు.
యూ‌పి‌ఏ నుంచి 7మంది  ముస్లింలు పార్లమెంట్ కు ఎన్నికైనారు.  వీరిలో నలుగురు కాంగ్రెస్ నుంచి, ఆర్‌జే‌డి నుంచి ఒకరు, ఎన్‌సి‌పి నుంచి ఇరువురు ఎన్నికైనారు.
ముస్లిం పార్టీల నుండి 8 మండి ముస్లిం లోక్ సభ సబ్యులు ఎన్నికైనారు.  
2009 లో యూ‌పి నుంచి 7గురు లోక్ సభ సబ్యులు ఉండగా 2014 లో యూ‌పి నుంచి ఒక్క ముస్లిం పార్లమెంట్ సబ్యుడు కూడా ఎన్నిక కాక పోవటం ఒక విశేషం.
గెల్చిన ముస్లిం పార్లమెంట్ సబ్యులు తృణమూల్ కాంగ్రెస్, సి‌పి‌ఎం,కాంగ్రెస్స్, ఆర్‌జే‌డి, ఎన్‌సి‌పి,ఎల్‌జే‌పి,ఏ‌ఐ‌ఎం‌ఐ‌ఎం,ఏ‌ఐ‌యూ‌డి‌ఎఫ్(అస్సామ్) పి‌డి‌పి, ఐ‌యూ‌ఎం‌ఎల్,మరియు ఏ‌ఐ‌ఏ‌డి‌ఎం‌కే కు చెందినవారు.
గెల్చిన వారిలో పశ్చిమ బెంగాల్ నుంచి 8గురు, బిహార్ నుంచి నలుగురు, కేరళ నుంచి ముగ్గురు , అస్సామ్ నుంచి ఇరువురు, జే&కే నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఒకరు, తమిళ నాడునుంచి ఒకరు, లక్షద్వీపాల నుంచి  ఒకరు ఎన్నికైనారు.
పరాజితులలో కాంగ్రెస్స్ కు చెందిన సల్మాన్ ఖుర్షీద్, మహమ్మద్ అజరుద్దీన్,గులాం నబీ ఆజాద్, ఎన్‌సి‌పి కు చెందిన ఫరూక్ అబ్దుల్లా, బి‌జే‌పి కి చెంది షానవాజ్ హుస్సైన్ ముఖ్యులు.
బి‌జే‌పి పాలిత రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్, మద్య ప్రదేశ్ ల నుంచి లోక్ సభ కు ఒక్క ముస్లిం సబ్యుడు కూడా ఎన్నిక కాలేదు. యూ‌పి, మహారాస్త్ర, కర్ణాటక, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలనుంచి కూడా ఒక్క ముస్లిం కూడా లోక్ సభ కు ఎన్నిక కాలేదు మొత్తం 29 రాష్ట్రాలలో కేవలం 7 రాష్ట్రాల నుంచి మాత్రమే ముస్లిం లోక్ సభ సబ్యుల ప్రాతినిద్యం ఉంది. 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో కేవలం ఒక్క లక్ష ద్వీపాల  నుంచి మాత్రమే ముస్లింల ప్రాతినిద్యం ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలలో ముస్లిం ల  పరిస్తితి
ఇక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలనుంచి జరిగిన పార్లమెంట్/అసెంబ్లి ఎన్నికలలో గెలిచిన  ముస్లిం అబ్యర్ధుల వివరాలను పరిసిలించుదాము.
ఆంధ్రప్రదేశ్ నుండి 25 లోక్ సభ స్థానాలు ఉండగా ఒక్క ముస్లిం అబ్యర్ధికూడా ఎన్నిక కాలేదు.
తెలంగాణ నుండి 17 లోక్ సభ స్థానాలు ఉండగా ఒకేఒక ముస్లిం అబ్యర్ధి ఏ‌ఐ‌ఎం‌ఐ‌ఎం కు చెంది అసదుద్దీన్ ఔఐసీ ఎన్నికైనారు.
అనగా మొత్తం 42 (ఆవిబక్త రాష్ట్రం) లోక్ సభ స్థానాలలో ఒకే ఒక ముస్లిం ఎం‌పి ఎన్నికైనారు. ఆవిబక్త రాష్ట్రం లో ముస్లిం లు సుమారు 12-15% వరకు ఉన్నారు.
ఇక అసెంబ్లిల పరిస్థితి కి వస్తే
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లి లో గల 175 స్థానాలలో కేవలం 4 స్థానాలలోనే ముస్లిం అబ్యర్ధులు గెలిచినారు.వారు 1. జలీల్ ఖాన్ (విజయవాడ-పశ్చిమ –వైకాప ) 2. ఎం. ముస్తఫా (గుంటూర్ –తూర్పు-వైకాప) 3. అంజాద్ బాష (కడప-వైకాప) 4. చాంద్ బాష –(కదిరి-వైకాప) గెలిచిన నలుగురు వైకాప పార్టీ కి చెందుట విశేషం. తెలుగు దేశం,కాంగ్రెస్  నుంచి ఒకరు కూడా ఎన్నిక కాలేదు.
కోస్తా ఆంధ్ర నుంచి ఇరువురు, రాయల సీమ నుంచి ఇరువురు ముస్లిం శాసన సబ్యులు ఎన్నికైనారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాల లో 9 జిల్లాలనుంచి  ముస్లిం లకు అసలు  ప్రాతి నిద్యం లేదు.
తెలంగాణ లోని 119 అసెంబ్లి స్థానాలనుంచి మొత్తం 8 మండి ముస్లిం శాసన సబ్యులు ఎన్నికైనారు వీరు 1.బోదన్-షకీల్ –టి‌ఆర్‌ఎస్ 2.నాంపల్లి-జాఫర్ హుస్సైన్ –ఎం‌ఐ‌ఎం 3.మలక్ పేట –మహమ్మద్ బిన్ బలాలా –ఎం‌ఐ‌ఎం 4.కార్వాన్ –కౌసర్ –ఎం‌ఐ‌ఎం 5.ఛార్మినార్ –అహ్మద్ పాషా ఖాద్రి –ఎం‌ఐ‌ఎం 6.చంద్రాయణ గుట్ట-అక్బరుద్దీన్ఔవైసీ –ఎం‌ఐ‌ఎం 7.యాకుత్ పూర్ –ముంతాజ్ అహ్మద్ ఖాన్ –ఎం‌ఐ‌ఎం 8. బహదూర్ పురా-మోజామ్ ఖాన్ –ఎం‌ఐ‌ఎం  .వీరిలో 7గురు ఎం‌ఐ‌ఎం కు ,ఒకరు టి‌ఆర్‌ఎస్ కు చెందినవారు.
తెలంగాణా లోని 10 జిల్లాలలో 2 జిల్లాలనుంచి మాత్రమే అనగా నిజామాబాద్,హైదరాబాద్ జిల్లాలనుంచి మాత్రమే ముస్లిం శాసన సబ్యులు ఎన్నికైనారు. తెలంగాణ లో ముస్లిం ల జనసంఖ్య 30% కన్నా అధికం గానే ఉంది. టి‌డి‌పి, కాంగ్రెస్స్ ల నుంచి ఒకరు కూడా ఎన్నిక కాలేదు.


No comments:

Post a Comment