నేడు బాలల హక్కులపైన
ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతర్జాతీయంగా బాలల స్థితిగతులపై
చర్చ, చైతన్యం పెరుగుతుంది. నేటి
బాలలే రేపటి పౌరులు అన్న నానుడిని బట్టి బాలల సంరక్షణ దేశానికి చాలా ముఖ్యం. 1924
లోనే బాలల హక్కులపై వెలువడ్డ జెనీవా ప్రకటన పిల్లల ప్రత్యేక సంరక్షణ
పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్ని తెల్పింది. . ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి
సభ 1948 డిసెంబర్ 10 న మానవ హక్కుల
ప్రకటన చేసింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కులకు చట్ట బద్ధత కల్పించబడింది.
బాలల హక్కులు కూడా మానవ హక్కులేనని స్పృహ పెరుగుతూ వచ్చిన క్రమంలో 1959లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బాలల హక్కుల ప్రకటన (డిఆర్‌సి) ను చేసింది. దీని
వలన ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కులకు ప్రాధాన్యత ఏర్పడింది.
1974
లో భారత ప్రభుత్వం బాలలకు
సంబంధించి ప్రకటించిన జాతీయ విధానంలో బాలల పట్ల ఉన్న రాజ్యాంగ బాధ్యతలను
పునరుద్ఘాటించింది నేషనల్ చిల్డ్రన్స్ బోర్డు ను 1974 లో ప్రారంభించినది. 1985 లో కేంద్ర
మానవ వనరుల శాఖ ఆద్వర్యం లో భాగంగా స్త్రీ-శిశు సంక్షేమ శాఖను ప్రారంబించిన్నది. ఐసిడిఎస్
పధకం తో పాటు అనేక స్త్రీ –శిశు సంక్షేమ పధకాలను ఈ శాఖ ప్రారంబించినది. ఐక్యరాజ్యసమితి
1989
నవంబర్ బాలల హక్కుల ఒడంబడికలో 180 దేశాలు సంతకాలు చేశాయి. భారత
ప్రభుత్వం 1992 డిసెంబరు
11 న ఈ
ఒడంబడికను ఆమోదించి సంతకం చేసింది.ప్రపంచంలోని పలు దేశాలతో పాటు ఈ ఒప్పందం మీద
సంతకం చేసిన తొలి దేశాల జాబితాలో భారతదేశమూ ఉంది. మనదేశం 1992 డిసెంబర్ 11న సంతకం చేసి,
బాలల హక్కుల ప్రకటన జారీ
చేసింది. బాలల ప్రపంచ శిఖరాగ్ర సదస్సు క్రీ.శ 2000 వ సంవత్సరానికి రూపొందించిన బాలల
జీవన, అభివృద్ధి
లక్ష్యాల నన్నింటిని బారతదేశం ఆమోదించేసింది కూడా.
బాలలు అంటే ఎవరు?
యునైటెడ్ నేషన్స్ చైల్డ్ రైట్స్
కమ్యూనికేషన్ (యుఎన్‌సిఆర్‌సి) ప్రకారం (ఆర్టికల్ 1)
18 సంవత్సరాల లోపు వారందరూ
బాలలే
బాలల హక్కులు
అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం 18
సం.
ల లోపు వారంతా 40
రకాల హక్కుల్ని కలిగి
ఉంటారు. ఆ హక్కుల్ని బాలల హక్కులు అందురు. వాటిని స్థూలంగా 4
రకాలుగా
వర్గీకరించవచ్చు.యుఎన్‌సిఆర్‌సి ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా బాలలు ప్రధానంగా 1.జీవించే హక్కు 2. రక్షణ పొందే హక్కు 3.
అభివృద్ధి చెందే హక్కు 4.
భాగస్వామ్య హక్కు కలిగి
ఉన్నారు.
బాలల హక్కులు –
భారత
రాజ్యాంగం :
.బాలల హక్కుల గురించి మన భారత
రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపర్చబడినవి. భారత రాజ్యాంగంలోని బాలల హక్కులకు
సంబంధించిన వివిధ ప్రకరణలను భారత రాజ్యాంగంలోని మూడు భాగాలలో పేర్కొన్నారు. అవి విభాగం-3లో ప్రాథమిక హక్కులు,
విభాగం-4లో ఆదేశిక సూత్రాలు,
విభాగం-4(ఆ)లో ప్రాథమిక విధులు.
ఇందులో ముఖ్యమైనవి.
1.
ప్రాథమిక
హక్కులు
·
సమానత్వపు
హక్కు – ఆర్టికల్
14
·
మత,
జాతి,
కుల,
లింగ వివక్షతకు గురికాకుండా
ఉండే హక్కు – ఆర్టికల్
15.
·
మహిళలు
మరియు పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.-15 (3) ఆర్టికల్
·
ఆర్టికల్
19(1) : పేర్కొనబడిన
ఆరు ప్రాధమిక స్వాతంత్రాలు.బాలలకు కూడా వర్తిస్తాయి.
·
6 సం.ల నుండి 14 సం. ల బాలలందరికీ ఉచిత నిర్భంధ ప్రాథమిక
ప్రాథమిక విద్య హక్కు – ఆర్టికల్ 21 ఎ.
·
ప్రతి
బిడ్డ నిర్భందం, శిక్ష
నుండి రక్షణ పొందె హక్కు.-ఆర్టికల్ 22 :
·
అక్రమ
రవాణా, కట్టు
బానిసత్వం నుండి రక్షణ పొందే హక్కు – ఆర్టికల్ 23
·
14 సం. ల వయస్సు వరకు ఎలాంటి ప్రమాదకరమైన
పనులు చేయించరాదు – ఆర్టికల్
24
2.ఆదేశిక సూత్రాలు 4వ విభాగం :
·
బాలలను
తగని పనులలో పెట్టటంపై నిషేధం, వారి అభివృద్ధికి అవకాశాలు,
సౌకర్యాలు కల్పించడం. -(ఆర్టికల్) 39
ప్రసూతి సహాయం, వారికి తగిన మంచి పరిస్థితులు కల్పించడం -(ఆర్టికల్) 42 .
పిల్లలందరికీ 14 సంవత్సరాల వయస్సు పూర్తయ్యేదాకా ఉచిత, నిర్భంధ విద్య.-అధికరణం (ఆర్టికల్) 45
ప్రసూతి సహాయం, వారికి తగిన మంచి పరిస్థితులు కల్పించడం -(ఆర్టికల్) 42 .
పిల్లలందరికీ 14 సంవత్సరాల వయస్సు పూర్తయ్యేదాకా ఉచిత, నిర్భంధ విద్య.-అధికరణం (ఆర్టికల్) 45
·
ప్రజల్లో
బలహీన వర్గాలను మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల విద్యా ఆర్థిక ప్రయోజనాలను
అభివృద్ధి చేసేందుకు, వారిని సాంఘిక అన్యాయం నుంచి,
దోపిడీ నుంచి కాపాడాలని
పేర్కొంటుంది. – ఆర్టికల్ 46
·
పుష్టికరమైన
ఆహారానికి, ఆరోగ్యానికి
హక్కు-అధికరణం (ఆర్టికల్) 47
86వ రాజ్యాంగ సవరణ 2002
ప్రకారం :
·
ప్రకరణ
21 (ఎ) :
ఉచిత నిర్భంధ ప్రాథమిక విద్య 6-14 సంవత్సరాలలోపు బాలబాలికలకు ఉచిత
నిర్భంధ ప్రాథమిక విద్యను అందించాలని ఈ నిబంధన పేర్కొంది.
·
ప్రకరణ
51 (ఎ) :
6-14 సంవత్సరాల
లోపు బాలబాలికలకు ప్రాథ మిక విద్య అందించటం తల్లిదండ్రుల బాధ్యత (ఇది 11
ప్రాథమిక విధి)
3. ప్రాథమిక విధులు విభాగం-
·
ఆర్టికల్
51 (ఎ) :
11వ
విధి : 6-14
సంవత్సరాల లోపు పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రుల బాధ్యత.
·
ఆర్టికల్
350(ఎ)
ప్రతి విద్యార్థి మాతృ భాషలో విద్యను అభ్యసించే హక్కు ఉంది.
భారతదేశంలో బాలల సంరక్షణ కొరకు
మన దేశం లో చాలా చట్టాలున్నాయి
ప్రాథమిక
హక్కులు ఆర్టికల్ 23,
ఆర్టికల్ 24కు అనుగుణంగా వచ్చిన చట్టాలను
అసుసరించి మన దేశంలో కొన్ని చట్టాలు చేశారు. అవి
1. ఫాక్టరీ చట్టం 1982 - ఈ చట్టం ప్రకారం 14 సంవత్సరాలు నిండని బాలలను ప్రమాదం
ఉన్న పనిలోకి తీసుకోరాదు.
2. గనుల చట్టం 1952 - గనులలో బాలశ్రామికులను నియమించడం
నిషేధించారు. 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని
వైద్యుల నుండి సర్టి ఫికెట్ పొంది ఉంటే యుక్త వయస్కులకు పని కల్పించవచ్చు. కాని
వీరి సేవలను సాయంత్రం 6
గంటల నుండి ఉదయం 6 గంటలలోపు ఉపయోగించుకోకూడదు.
3. ప్లాంటేషన్ కార్మిక చట్టం 1951 - 12 సంవత్సరాలు నిండని బాలలను
ప్లాంటేషన్ పనులకు తీసుకోకూడదు. అలాగే 15 - 18
సంవత్సరాలలోపు వయస్కులను వైద్యుల నుండి ఆరోగ్య దృవపత్రాలు లేకుండా పనులలోకి
తీసుకోకూడదు.
4. మోటారు రవాణా కార్మిక చట్టం 1961 - ఈ చట్టం ప్రకారం 15 సంవత్సరాలలోపు బాలలను మోటారు రవాణా
రంగంలో పనికి తీసుకోరాదు. అలాగే 15 - 18
సంవత్సరాలలోపు బాలలను వైద్య దృవీకరణతోనే పనిలోకి తీసుకోవాలి. ఇది 12 నెలలకు మాత్రమే పని చేస్తుంది.
దాటితే మళ్లిd వైద్య పరీక్షలు చేయించుకొని
సర్టిఫికెట్ పొందాలి. అదే విధంగా వీరికి అర్థగంట విశ్రాంతి సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రవే వీరి సేవలను
ఉపయోగించుకోవాలి.
ఇవేకాకుండా ఆర్డికల్ 23కు అనుగుణంగా వచ్చిన చట్టాలు.
1955 - స్త్రీలు, బాలబాలికల అవినీతి వ్యాపార చట్టం.
1976 - వెట్టిచాకిరి నిషేద చట్టం
1976 - కనీస వేతనాల చట్టం
1986 - బాలకార్మికుల చట్టం
1929 - బాల్యవివాహ నిరోధక చట్టం. 18 సంవత్సరాలు నిండని ఒక మైనరు బాలికను
21 సంవత్సరాలు నిండిన ఒక యువకుడు
వివాహం చేసుకున్న యెడల అతనికి మూడు నెలల జైలు శిక్ష విధించబడును.
- ఇద్దరు మైనర్లు అయిన సందర్భంలో వారి
తల్లిదండ్రులు శిక్షార్హులు అగును.
2000 - బాలల న్యాయచట్టం - నేరం మోపబడిన బాల
నేరస్థులు అన కుండా చట్టంలో ఘర్షణ పడిన బాలలు అంటారు.
1956 - వ్యభిచార నిరోధచట్టం - బాలికలను
వ్యభిచారం చేయించుట ప్రోత్సహించుట, రవాణా
చేసిన, వ్యాపారం చేసిన, నిర్భంధించినా 7 సంవత్సరాలకు తక్కువ కాకుండా 14 సంవత్సరాలు కఠిన కారగారశిక్ష
విధించబడును.
1860 భారత శిక్షా స్మృతిలో పేర్కొనబడిన
కొన్ని నియమాలు :
- ఐపిసి-317 తల్లిదండ్రులు గాని లేదా
సంరక్షుకులు గాని తమ పిల్లలను వదిలేయటం నేరంగా పరిగణించబడును. అలా వదిలివేయటం వల్ల
ఆ బిడ్డ మరణిస్తే అది ఐపిసి-302
సెక్షన్ క్రింద హత్యనేరం అగును.
- ఐపిసి - 361 ప్రకారం 18 సంవత్సరాలు నిండని బాలుడు. 16 సంవత్సరాలు నిండని బాలికను వారి తల్లిదండ్రులకు
లేదా వారి సంరక్షణ చూస్తున్నవారికి తెలపకుండా తీసుకువెళ్తె అది బలాత్కారంగా, ఎత్తుకపోవటంగా పరిగణిస్తారు.
- ఐపిసి -363ఎ ఒక మైనరును బిక్షాటన చేయించడం
కోసం ఎత్తు కపోవడం అందుకు ప్రోత్సహించడం నేరంగా పరిగణించబడుతుంది.
No comments:
Post a Comment