ఇస్లామియా ఆరాధనలలో
భాగంగా ఖాతిబ్ (khaṭīb (orator) అనబడే వ్యక్తి
ఇచ్చే ప్రసంగాన్ని ఖుత్బా అని అందురు. ఇది శుక్రవారం సముహ ప్రార్ధన సందర్భంలో, రెండు పండగ (ʿĪd) దినాలలో
మరియు హజ్ 9వ రోజు (ధుఅల్-హజ్జ యొక్క తొమ్మిదవ) ఇవ్వబడుతుంది. ఇంకా ఇది వివాహలు,
గ్రహణాలు లేదా కరువు కాటకాల సమయంలో
కూడా ఇవ్వబడుతుంది. శుక్రవారం సముహ ప్రార్ధనలో ఖుత్బా ప్రార్ధనకి ముందు, పండుగుల (ʿĪd ) సందర్భం లో ప్రార్ధన
తరువాత ఉంటుంది.
వివాహ వేడుకలో, ఇమాం నిఖా ఒప్పందం
ముందు ఖుత్బా చదువుతాడు. హదీస్ ప్రకారం వివాహ ఒప్పందంలో ((khuṭbatu al-nikāh) ఖుత్బా సిఫారసు కాని, తప్పని సరి కాదు. వివాహ ఖుత్బా
లో భాగంగా ఇమాం మూడు ఆయతులు (ఖురాన్ 4: 1, 3: 102, 33: 70-71) మరియు వివాహానికి
సంబంధించిన హదీసును పఠిస్తాడు. దీనితో పాటుగా, దంపతులకు ఇరువురికి
వారి హక్కులు మరియు బాధ్యతలను
విశిదికరిస్తాడు తద్వారా వారిలో దైవభీతి (తఖ్వా) ప్రేరేపించవచ్చు
ఖుత్బా అనేది శుక్రవారం
సమూహా ప్రార్ధనలో తప్పని సరి అంశము. శుక్రవారంను అరబ్బీ లో జుమాహా అందురు.జుమాహ్
(శుక్రవారము jumʿah (Friday) అనే పదo అరబిక్ పదo జమా jamaʿa) నుండి వచ్చింది. జమా jamaʿa) అనగా సేకరించడం, సంఘటిత
పరచడం మరియు ఏకం చేయడం అని అర్ధం. ఈ విధంగా జుమ్'అహ్ ప్రార్థన, ముస్లింలను ప్రార్ధన కొరకు సoఘటిత పరుస్తుంది. శుక్రవారపు సమూహా ప్రార్థన అనేది ఒక
విశ్వాసికి తప్పనిసరి అయిన ఆచరణ.
ముస్లిం సంప్రదాయం
ప్రకారం, శుక్రవారం అత్యంత పవిత్రమైన రోజు. అల్లాహ్ శుక్రవారంనాడు సముహ ప్రార్ధనను
తప్పనిసరి చేసాడు.దివ్య ఖురాన్ లోని ఆయతులు 62: 9-11 ప్రకారం శుక్రవారం
అనగా వారంలో ఆరోవ రోజు అల్లాహ్ ఆకాశం మరియు భూమిని సృష్టించినాడు మరియు
సృష్టిని పూర్తి చేసాడు. హదీస్ ప్రకారం దేవుడు శుక్రవారం
ఆదామును సృష్టించాడు మరియు అతనిని స్వర్గంలో ఉంచాడు మరియు శుక్రవారం నాడు ఆదామును స్వర్గం నుంచి
తొలగించాడు. ముస్లింలు అంతిమ ఘడియ (Last Hour) శుక్రవారం
ప్రారంభమవుతుందని నమ్ముతారు మరియు హదీసు
ప్రకారం శుక్రవారం నాటి ఒక నిర్దిష్ట ఘడియ
లో అన్ని దువాలు ఆమోదించ బడతాయి. ఆ
ఘడియ విషయం లో పండితులు విభేదించారు, చాలామంది అది
ఖుత్బా (khṭbah) మరియు ప్రార్థన
మధ్య లేదా ఆ రోజు చివరిలో ఉంటుందని అంటారు.
ప్రవక్త(ప) మదీనాకు
వలస వెళ్ళే ముందు ముస్లిం సమాజం మక్కాలో
శుక్రవారం సమూహా ప్రార్ధనలు నిర్వహించ లేదు. శుక్రవారo (జుమా'హ్) ప్రార్ధన అనేది
మదీనాలో సురా “అల్-జుమాహ్” యొక్క అవతరణ ఫలితంగా అభివృద్ధి చెందింది. శుక్రవారం
సమూహా ప్రార్ధన ప్రస్తావన దివ్య ఖురాన్ 62: 9 ఆయత్ లో ఉంది; “విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై
పిలిచి నప్పుడు అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తండి; క్రయవిక్రయాలను వదిలి
పెట్టండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది." అందువల్ల
ఖుత్బా యొక్క ప్రాధమిక విధి అల్లాహ్ ను సమూహా ప్రార్ధన ద్వారా స్మరించడం. దీనినే
దివ్య ఖురాన్ పరిభాష లో “దిక్ర్ అల్లాహ్ dhikr Allāh” అందురు.
శుక్రవారం సముహా
ప్రార్ధన ప్రతి ముస్లిం మగవారి కోసం తప్పనిసరి చేయబడింది. జమ్మూ ఖుత్బా మరియు ప్రార్థనలకు మహిళలకు హాజరు కావొచ్చు, అది వారికి
తప్పనిసరి కాదు. ఒక వ్యక్తి శుక్రవారం ప్రార్ధన కు తప్పనిసరి గా హాజరు కావడానికి
ఐదు షరతులు ఉన్నాయి: 1. అతను నగరం లేదా పట్టణం
యొక్క నివాసి (ముకిమ్)అయి ఉండవలయును, ప్రయాణికులు హాజరు
కావడం నుండి మినహాయించబడ్డారు; 2.పురుషులు ; 3. యవ్వన వయస్సును చేరుకొన్నవారు ; 4.ఖాళి గా ఉన్నవారు. (being free) మరియు 5. ఆరోగ్యవంతుడు.
జబ్బుపడిన ప్రజలు
హాజరవ్వకుండా మినహాయించబడినారు.కావున పై నియామల ప్రకారం అర్హుడైన ప్రతి వ్యక్తి
ఖుత్బా మరియు ప్రార్ధనకు తప్పనిసరిగా హాజరు కావలి. తీవ్రమైన వర్షం, అనారోగ్యంతో ఉన్నవారికి
సేవచేసే వారిని లేదా ఏవైనా ప్రాణాంతక
పరిస్థితులు వ్యక్తిని ప్రార్ధనకు హాజరు కాకుండా నిరోదిస్తున్నప్పుడు వారికి మినహాహింపు ఉంది.
శుక్రవారం ఖుత్బా ఒక నిర్దిష్ట విధానంను అనుసరిస్తుంది. షాఫి న్యాయ సంప్రదాయం( ఫికా) ప్రకారం శుక్రవారం
ప్రార్థన లో దేవుని (hamdalah హమ్దాలా) ప్రశంసలు, ప్రవక్త(స)పై
ఆశీర్వాదాలు (సలావాత్ salawāt)) పంపడం మరియు షాహదాహ్ (ఒకే దేవుడు మరియు ముహమ్మద్ను అతని దూతగా ధృవీకరించడం)
అంశాలుగా ఉంటాయి. వీటన్నింటినీ అరబిక్లో
పఠoచాలి.హనఫీ
న్యాయ సంప్రదాయం (ఫికా) ప్రకారం ఇది సిఫార్సు గాని తప్పనిసరి కాదు.
కుతుబ్బా రెండు
విభాగాలుగా విభజించబడింది, మొదటి
భాగం రెండవ భాగం కన్నా ఎక్కువ కాలం ఉంటుంది.
మొదటి విభాగం చాలా వరకు మతపరమైనదిగా ఉంటుంది, అయితే రెండవ విభాగం
లో రోజువారీ వ్యవహారాలు మరియు మరింత రాజకీయపరంగా ఉంటుంది. ఖుథ్బాహ్
యొక్క రెండు విభాగాల మధ్య నిశ్శబ్దం గా ఖాతిబ్
కూర్చుంటారు.. ప్రవక్త ముహమ్మద్ (స) మీద ఆశీర్వాదాలు పంపి మరియు అoదరు ముస్లింల
కొరకు ప్రార్థన చేయడం ద్వారా ఇమాం ఖుత్బా ముగిస్తాడు.
కొంతమంది
విద్వాంసులు అరబిక్ భాషలో ఖుత్బా ఇవ్వాలని అంటారు.. కొన్నిసార్లు అరబిక్లో మాట్లాడటం లేదా అర్ధం
చేసుకోలేని దేశాలలో కూడా ఖుత్బా అరబిక్లో ఇవ్వటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో, ఖుత్బా (küṭbah) యొక్క మొదటి
భాగాన్ని అరబిక్లో ఇస్తారు, అయితే రెండవ భాగం
ప్రజల స్థానిక భాషలో ఇవ్వడం జరుగుతుంది.
No comments:
Post a Comment