19 May 2019

రమదాన్ మరియు పర్యావరణo లేదా గ్రీన్ రమదాన్ (Observing Ramadan the Green Way)



ఆదునిక ప్రపంచం  లోని   ముస్లిం సమాజం లో బాగా  అభివృద్ధి చెందుతున్న భావన “గ్రీన్ రమదాన్” అనేది. పవిత్ర రమదాన్ నెలలో పర్యావరణ పరిరక్షణ ఒక ఉద్యమం గా మారింది. రమదాన్ నెల విశ్వాసులను అల్లాహ్ తో, తమతో  మరియు సమాజo తో  మరియు  ఖుర్ఆన్ బోధనలలో ముఖ్యమైన అంశం అయిన పర్యావరణంతో సన్నిహితం చేస్తుంది. పవిత్ర రమదాన్  నెలలో ఖురాన్ వెల్లడి అయ్యింది.  ముస్లింలు దివ్య ఖురాన్ భోదనలను పారాయణం చేయటం  లేదా వినటం ద్వారా తమ అవగాహనను పెంచుకొంటారు.  దివ్య ఖురాన్ లో పర్యావరణ అనుకూలమైన జీవితం కు సంబంధించిన సుమారు రెండు వైపుకు వందల కంటే ఎక్కువ ఆయతులను విశ్వాసులు గమనించవచ్చు.
 దివ్య ఖురాన్ ప్రకారం  అల్లాహ్ విశ్వంలో అన్నింటినీ సృష్టించినాడు. భూమి దాని వాతావరణం, వర్షాలు, వృక్షాలు, జంతువులు, పర్వతాలు, నదులు మరియు మహాసముద్రాలను  సృష్టించినాడు మరియు మనం ఆయన సృష్టించిన జీవావరణ వ్యవస్థ యొక్క ప్రయోజనాలను అనుభవిస్తున్నప్పుడు ఆయనకు(అల్లాహ్)   కృతజ్ఞతలు వెల్లడించాలి.  దివ్య ఖుర్ఆన్ (7:10) ఇలా చెబుతోంది: "మేము మీకు భువిలో చోటు కల్పించాము.ఇంకా అందులో మీకు జీవన సామగ్రిని సమకుర్చాము. కాని మీరు కృతజ్నలవటమనేది  బహు స్వల్పం.
రమదాన్ కు  సంబందించిన దివ్య ఖుర్ఆన్ ఆకుపచ్చ/పర్యావరణ (గ్రీన్) బోధనలు వినియోగంకు అనుగుణంగా ఉన్నాయి. ఉపవాసం వినియోగ విధానాలను నియంత్రిస్తుంది. రోజా సమయంలో తినడం మరియు తాగడం పూర్తిగా నిషేధించబడింది. ఉదయాన్నే సుహూర్ సాధారణoగా తేలిక  ఆహారంగా ఉంటుంది. సాయంత్రం భోజనం కంటే నీరు. ఎక్కువ తీసుకొంటారు. పండ్లు తీసుకోవడం ఈ నెలలో పెరుగుతుంది. ఈ వినియోగం కొన్ని నియమాల ద్వారా నిర్దేశించబడుతుందని దివ్య ఖుర్ఆన్ గుర్తు చేస్తుంది.
 దివ్య ఖుర్ఆన్ లో ఆహారం మరియు పానీయాల వ్యర్థాలను నివారించడం గురించి వివరించబడినది.  రమదాన్లో విశ్వాసులు అనుసరించవలసిన  విధివిధానాలు ఖుర్ఆన్ లో బోధించబడినవి. (2: 168), "ఓ ప్రజలారా! ధరణి లోని ధర్మసమ్మతమైన,  పరిశుద్దమైన వస్తువులను  తినండి." మరో ఆయత్  (7:31) ఇక్కడ చాలా సందర్భోచితమైనది, “తినoడి, త్రాగoడి, కానీ మితిమీరకండి. నిశ్చయంగా, మితిమీరేవారిని  దేవుడు  (అల్లాహ్) ఇష్టపడడు".
 అనుమతిoచబడిన  మరియు స్వచ్ఛమైన వాటిని తినాలని దివ్య  ఖుర్ఆన్ పేర్కొంది. పర్యావరణ కాలుష్యం సాధారణంగా చాలా మలినాలను ఉత్పత్తి చేస్తుంది. రసాయన ఎరువులు, పురుగుమందులు, మరియు కొన్ని పెరుగుదల హార్మోన్లు ఉపయోగించడం ఆధారంగా ఉత్పత్తి అయిన  వ్యవసాయ, పౌల్ట్రీ మరియు పాడి ఉత్పత్తులను అనుమతించదగినవిగా తీసుకోవచ్చు - కానీ, అవి తయ్యబ్( tayyab,) కావు. విశ్వాసులు సేంద్రీయ ఆహారాలు తీసుకోవాలి.
 కాని నేడు పరిస్థితి చాలా అగోచరoగా  ఉంది. అందుబాటులో ఉన్న ఆహార పదార్ధాలు సాధారణంగా కలుషితం మరియు కల్తీ గా ఉన్నాయి మరియు వాటి  ప్యాకేజింగ్ వాటిని మరింత విషపూరితం చేస్తుంది. ఇటువంటి ఆహారాలు మరియు పానీయాలన్నీ దివ్య ఖుర్ఆన్ లో పేర్కొన్న బడిన 'పవిత్రమైనవి’(PURE)కావు..
టయ్యబ్ (Tayyab) సమతుల్య ఆహార భావనను  తెల్పుతుంది. నాణ్యతతోపాటు, ఆహార పరిమాణాన్ని తెల్పుతుంది.  ప్రతి ఒక్కరు తమ సొంత జీవక్రియ సామర్థ్యం ప్రకారం ఆహరం తీసుకోవాలి. అపరిమిత వినియోగం  ఆరోగ్యకరమైన విషయం కాదు. శరీరo జీర్ణం చేసుకొనే  సామర్ద్యం ప్రకారం తినాలి. ఇస్లాం లో అతిగా తినటం మరియు  ఊబకాయం నిషేధం. అందువల్ల, ఈ నెలలో వీటిని   మరింత ధృడంగా గుర్తుంచుకోవాలి.
 ఇస్రాఫ్ Israf  భావన - ఆహార వృధా - చాలా ముఖ్యమైనది. అల్లాహ్ తన అనుగ్రహాలను వృథా చేసేవారిని ఇష్టపడడు. ఒక గింజ  ధాన్యాన్ని ఉత్పత్తి చేయడానికి జీవావరణవ్యవస్థలో ఎన్నో  ప్రక్రియలు, శక్తులు మరియు వనరులు అవసరమవుతాయి.. ఉదాహరణకు, ఒక కిలో బియ్యం ఉత్పత్తి కోసం సగటున, 2,500 లీటర్ల నీటిని వరి క్షేత్రంలో (వర్షపాతం మరియు / లేదా నీటిపారుదల ద్వారా ) వినియోగిస్తారు. అయినా, ప్రపoచo లో ఉత్పత్తి చేయబడిన ఆహారo లో మూడింట ఒక వంతు వ్యర్థమవుతుంది. ఇది భారీ నష్టం. ఈ ఆహార వ్యర్థం ముస్లిం సమాజాల్లోనూ మరియు రంజాన్ నెలలో కూడా కనిపిస్తుంది.
 నేషనల్ కన్స్యూమర్ ఇన్స్టిట్యూట్ (INC) నివేదిక ప్రకారం టునీషియా లో బ్రెడ్ (46%),పండ్లు(32)  మాంసం (19%), పాలు మరియు డైరీ పదార్ధాలు (18%), కూరగాయలు (14%) మరియు పానీయాలు (13%) ఈ పవిత్ర నెలలో వ్యర్ధం చేస్తారు.  UAE పర్యావరణ మరియు పర్యావరణ మార్పుల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం  "రమదాన్లో ఆహార పదార్ధాలు  రెట్టింపు వ్యర్ధం  అవుతున్నాయి మరియు సంవత్సరానికి $ 4 బిలియన్ల ఆహార పదార్ధాలు వ్యర్థo అవుతున్నాయి." బహ్రెయిన్లో, పవిత్ర రమదాన్  నెలలో ఆహార పదార్ధాల వ్యర్థాలు రోజుకు 400 టన్నులు మించుతున్నాయి, ఖతార్లో రమదాన్లో తయారైన దాదాపు 50% ఆహారo చెత్త కుండిలకు చేరుకుంటాయి. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమె. ముస్లిం సమాజాలలో ఆహార వ్యర్థాలు గణనీయంగా పెరుగుతున్నాయని తెలుస్తుంది. ఇస్రాఫ్ Israf  భావన - ఆహార వృధా చేయకుండా మరింత జాగ్రత్త వహించాలి. ఇది ఒక స్థిరమైన వినియోగం కోసం పిలుపు.

ప్రార్థనలకు హాజరయ్యే ముస్లింల సంఖ్య పెరిగిన కారణంగా రమదాన్లో నీటి వినియోగం చాలారెట్లు పెరుగు తుంది.  వజూ (Wudu) కోసం, సాధారణoగా 15-25 లీటర్ల నీటిని విశ్వాసి ఉపయోగిస్తాడు. రమదాన్ సమయంలో పెరిగే  ఆరాధకుల వలన ముస్లిం దేశాలలో నీటి వినియోగం పెరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ (స) నీటి వినియోగంపై స్పష్టమైన విదివిదానాలు తెలిపారు. పారే నది ఒడ్డున ఉన్న నీటిని వ్యర్ధం చేయవద్దన్నారు. ప్రవక్త(స) ఒక (Mudd) లీటర్ కన్నా తక్కువ నీటిని వజూ కోసం వినియోగించమన్నారు. రమదాన్ సమయంలో వజూ కోసం అనుమతించదగిన నీటి పరిమాణాన్ని వాడటం లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. స్నానం కోసం గరిష్ట నీటి వినియోగం సుమారు (Sa‘a)  5 లీటర్లు. రమదాన్ మాసం లో నీటి వినియోగం లో తీసుకొన్న జాగ్రత్తలను   సంవత్సరం యొక్క ఇతర రోజులలో కూడా పాటించ గలిగితే అది సాధారణ అలవాటుగా మారవచ్చు.

స్వచ్ఛమైన లేదా తైయాబ్ భావన పిల్చే గాలికి కూడా వర్తిస్తుంది. ఒక ఆరోగ్యవంతమైన మానవుడు రోజుకు సగటున 11,000 లీటర్ల గాలి  పీల్చుకొంటాడు అందులో  మంచి శారీరక విధుల కోసం 21% ఆక్సిజన్ కలిగి ఉండాలి. ఆధునిక జీవితం మనం తక్కువ ఆక్సిజన్ మరియు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర కాలుష్య కారకాలతో కూడిన  మలిన పరిసర గాలిని పీల్చుకునేలా చేసింది. కలుషితమైన గాలిని పీల్చుకునే శరీరం స్వచ్ఛంగా ఉండదు. రమదాన్ మనకు 'స్వచ్ఛమైన' గాలిని తీసుకుంటున్నామా లేదా  అనే విషయాన్నీ గుర్తు చేస్తుంది. స్వత్చమైన గాలి తీసుకోవటం లో వ్యక్తుల పాత్రను మనం  గుర్తించాలి. ఉదాహరణకు, వాహన కాలుష్యం తగ్గించడానికి, ఒక విశ్వాసి తన వాహనాన్ని అవసరమైనప్పుడు మాత్రమె వాడాలి. తన వాహనం కాలుష్యం తగ్గించే పరిపూర్ణ స్థితిలో ఉoదా లేదా అని  అతడు తనిఖీ చేయాలి. ఈ నెలలోని ప్లాంటేషన్ కూడా చేయాలి.  మొక్కలను  ఈద్ బహుమతులు గా ఇవ్వవచ్చు. ఈ చర్యలు  పరిసర గాలి కొంత వరకు స్వచ్ఛమైనదిగా చేయడానికి దోహదపడుతాయి.



No comments:

Post a Comment