30 May 2019

భారతీయ ముస్లింలు విద్యాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు – పరిష్కారాలు.



Image result for indian muslim in school

భారతదేశంలో ముస్లింలు 172 మిలియన్ల మంది ఉన్నారు, ఇది మలేషియా మరియు ఇండోనేషియా తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ముస్లిం జనాభా గలిగిన దేశం.  ముస్లింలు  దేశం లో అతి పెద్ద మైనారిటి  సమాజం గా ఉన్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన 71 ఏళ్ళ తర్వాత కూడా ముస్లింల సమస్యలపై మనం ఇప్పటికీ ఆలోచించాల్సి వస్తుంది. లోపం ఎక్కడ ఉంది? దీనికి బాద్యులు ఎవరు? ముస్లిం సమాజమా! లేకా పాలకులా!

భారతదేశ 2011 జనాభా లెక్కల ప్రకారం విద్య స్థాయిలో 42.7% ముస్లింలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. దేశంలోని అన్ని మత వర్గాలలో ఇది అత్యధిక నిరక్షరాస్యత రేటు. భారత దేశ మొత్తం జనాభా నిరక్షరాస్యత రేటు 36.9%.
భారతదేశంలో ముస్లిం సమాజం యొక్క విద్యాపరమైన వెనుకబాటుతనం గోపాల్ సింగ్ మైనారిటీ ప్యానెల్ రిపోర్ట్, 43 వ రౌండ్ మరియు 55 వ రౌండ్ జాతీయ శాంపిల్ సర్వే యొక్క రిపోర్ట్  మరియు ప్రోగ్రాం అఫ్ ఆక్షన్ అండర్ ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (1986) NEP రివైస్డ్ (1992) మరియు సచార్ కమిటీ (2006)  రిపోర్ట్ తెలియజేసినవి. ముస్లింల ఆర్థిక మరియు విద్యా పరిస్థితిని మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రారంభించిన పలు పథకాలు కాగితాల పై ఉన్నవి. సమాజంలోని బలహీన వర్గాల సామాజిక-ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి ఉద్దేశించిన  అనేక ప్రభుత్వ పథకాలు  ముస్లింలకు ప్రయోజనం కల్పించలేదు.
ఒక భారతీయ ముస్లిం దృష్టిలో ప్రధానమైన సమస్యలు ఏమిటి? లేదా ముస్లిం సమాజం ఎక్కడ విఫలమైందో మనం తెలుసుకోవాలి.
వివిధ ప్రభుత్వ నివేదికలు ముస్లింలలో 4% మంది మద్రాసాకు వెళుతున్నారని, మిగతా 96% మంది భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలలు లేదా ప్రైవేటుగా నడుస్తున్న పాఠశాలల్లో అధ్యయనం చేస్తున్నారని వివరించినవి.
96% ముస్లిం విద్యార్థుల యొక్క విధి మరియు నాణ్యతపై మనము దృష్టి పెట్టాలి. అనేక సంవత్సరాలుగా  భారతదేశంలోని  ప్రతి వర్గానికి చెందిన ఆశించిన విలువలు పెరిగినవి  మరియు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను  ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలో విద్యావంతులను చేయాలని కోరుకొoటున్నారు.
భారతదేశం అంతటా వివిధ రాష్ట్రాల్లో మరియు చిన్న పట్టణాలు మరియు నగరాల్లో, 5 వ లేదా 8 వ తరగతి వరకు ఇంగ్లీష్-మాధ్యమిక పాఠశాలలను స్థాపించుటలో  స్థానిక విద్యావేత్తలు లేదా పారిశ్రామికవేత్తలు చూపిన  చొరవలను చూశాము. ఈ పాఠశాలలు, స్వల్ప రుసుము తో  పెద్ద సంఖ్యలో ముస్లింలకు ప్రాథమిక విద్యను అందిస్తున్నాయి. కానీ వారు తరగతి 5వ లేదా 7వ  పూర్తి చేసినప్పుడు ప్రశ్న తలఎత్తుతుంది? వారిలో చాలామంది వారి  ప్రైమరీ అనంతర విద్యను కొనసాగిస్తున్నారా? కొనసాగిస్తే ఏ సంస్థలలో కొనసాగిస్తున్నారు.
ఈ విద్యార్థులు వారి ప్రైమరీ విద్యను ముగించిన తర్వాత, వారిలో కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారు  మరియు మెజారిటీ విద్యార్ధులు డ్రాప్-అవుట్లు గా మిగిలి పోతున్నారు. దీనికి తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్థితి ప్రధాన  కారణమని చెప్పబడింది, ఎందుకంటే తమ  పిల్లల యొక్క విద్యా ఖర్చులను వారు భరించే స్థితిలో లేరు మరియు తమ పిల్లలు చదువుకు బదులు ఏదో ఒక పని చేయటానికి లేదా ఒక చిన్న వృత్తి ని నేర్చుకోవటానికి వారు ఇష్టపడతారు .
ఒక సమాజంగా, మనం ముస్లిమ్స్ భారతదేశ వ్యాప్తంగా సాధారణ బోధనా పద్ధతిని అనుసరించే మరియు నాణ్యమైన విద్యను ఉచితంగా లేదా కనీస రేటు వద్ద అందించే  పాఠశాలలను ఏర్పాటు చేయగలిగామా? పై ప్రశ్నకు సమాధానం కాదు అని వస్తుంది.
మరో విచిత్రమైన వాస్తవం ప్రతి పెద్ద భారతీయ నగరం లో కనీసం ఒకటి లేదా రెండు ముస్లిం పాఠశాలలు ఉనికిలో ఉన్నాయని  చెప్పవచ్చు. కానీ ఈ పాఠశాలల్లో చాలా వరకు ఉర్దూ మీడియం లేదా హిందీ మాధ్యమంలో విద్యను అందిస్తాయి, అక్కడ బోధనా నాణ్యత కూడా ప్రశ్నార్థకం గా ఉంటుంది.
ముస్లిం  సమాజం లోని విద్యాపరమైన వేనుకుబాటు కు ఎవరు బాద్యులు? కమ్యూనిటీ నాయకులు లేదా మత నాయకులా? దీనికి పక్కాగా సమాధానం ఉంది..
ముస్లిం కమ్యూనిటీ యొక్క మతపరమైన నాయకులు ముస్లింల ఆర్థిక మరియు సామాజిక విమోచనకు దారి తీసే ఏకైక మార్గం విద్య అని ప్రతి ముస్లింకు సందేశాన్ని ఇవ్వాలి. దీనితో పాటు జాకత్ లేదా ఫిత్రర్ ద్వారా ముస్లిం సమాజం లో  పోగైన డబ్బును విద్యాసంస్థలు  స్థాపించటానికి, మరియు నాణ్యమైన విద్యను అందించటానికి ప్రయత్నించాలి.
రెండవది, కమ్యూనిటీ నాయకులు వారి సాంఘిక ప్రయత్నాల ద్వారా  కొన్ని సంస్థలను స్థాపించాలి.  దానికి మత పండితులు  మద్దతు ఇవ్వాలి. కమ్యూనిటీ లో ఒక విద్యాసంబంధ పునరుజ్జీవనానికి గాను మద్రాస్సా లేదా పాఠశాల నుండి ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు సాంకేతిక విద్యా సంస్థలు స్థాపించాలి. ఈ ఆలోచన ఉత్తర భారతం లో కన్నా దక్షిణ భారతదేశంలో ఎక్కువ జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.
భారతదేశంలో ముస్లిం సమాజంచే ఏర్పాటు చేయబడిన లేదా నిర్వహించబడుతున్న పాఠశాలల్లో కామన్, మోడరన్ మరియు కరెంటు  సిలబస్ను రూపొందించడం అవసరం. పాఠశాల అనంతరం విద్యార్ధులకు నైపుణ్యాలు లేదా విద్యావేత్తల ద్వారా  ఉత్తమమైన కెరియర్ మార్గానికి సంబంధించిన కౌన్సిలింగ్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే కమ్యూనిటీ  విద్యాపరంగా అభివృద్ధి చెందగలదు.

No comments:

Post a Comment