24 May 2019

భారత పార్లమెంట్ లో ముస్లింల ప్రాతినిద్యం (Muslim representation in Indian Parliament)




·        భారత దేశం అధికారిక జనాభా లెక్కల(2011) ప్రకారం దేశ జనాభా లో ముస్లింలు 14% గా ఉన్నారు.
·        2019 పార్లమెంట్ ఎన్నికలలో ఎన్నికైన ముస్లిం సబ్యుల సంఖ్య 27. ఇది  లోక్ సభ మొత్తం సబ్యులలో   కేవలం 5% మాత్రమె.


·        మొత్తం ఎన్నికైన 27 మంది ముస్లిం లోక్ సభ సబ్యులలో  6గురు ఉత్తర ప్రదేశ్ , 6గురు వెస్ట్ బెంగాల్ నుండి ఎన్నికైనారు.

·        2014 లోక్ సభ ఎన్నికలలో ఎన్నికైన ముస్లిం లోక్ సభ సబ్యుల సంఖ్య  23 మాత్రమే.

·        గెలిచిన ముస్లిం సబ్యులలో ప్రముఖులు; అసదిద్దిన్ ఒవైసి(హైదరాబాద్) బద్రుద్దీన్ అజమల్ (ధుబ్రి –అస్సాం) ఫరూక్ అబ్దుల్లా (శ్రీనగర్-JK) ఆజం ఖాన్ (రాంపూర్), ఇంతియాజ్ జలీల్, షఫీకుర్ రహ్మాన్, ST హసన్, PK కున్హలికుట్టి.

·        2014 లో ఒక్క ముస్లిం సబ్యుడు కూడా ఉత్తర ప్రదేశ్ నుంచి లోక్ సభ కు ఎన్నిక కాలేదు.

2019 లో ఎన్నికైన ముస్లిం అబ్యర్దుల జాబితా   


నియోజక వర్గం
అబ్యర్ది పేరు
పార్టీ

 అస్సాం


1
బార్పేట
అబ్దుల్ ఖాలీక్
 కాంగ్రెస్
2
ధుబ్రి
బద్రుద్దీన్ అజ్మల్
ఐ.యు.డి.ఎఫ్.

 బీహార్


3
ఖగరియ
చౌదరి మహబూబ్ ఖైసర్
ఎల్.జే.పి.
4

కిషన్గంజ్
డాక్టర్ మొహమ్మద్
జావేద్  
కాంగ్రెస్

జమ్మూ కాష్మీర్


5
అనంతనాగ్
హుసైన్ మసూది
నేషనల్ కాన్ఫరెన్సు
6
బారాముల్ల
మొహమ్మద్ అక్బర్ లోనే
నేషనల్ కాన్ఫరెన్సు
7
శ్రి నగర్
ఫరూక్ అబ్దుల్లా
నేషనల్ కాన్ఫరెన్సు

కేరళ


8
అలపుజ్హ
AM ఆరిఫ్
సి.పి.ఐ-ఎం
9
మల్లపురం
PKకున్హలికుట్టి
ఇండియన్ యునియన్ ముస్లిం లీగ్
10
పొన్నాని
ET మొహమ్మద్ బషీర్
ఇండియన్ యునియన్ ముస్లిం లీగ్

లక్షద్వీప్


11
లక్షద్వీప్
మొహమ్మద్ ఫైజల్ PP
ఎన్.సి.పి.

మహారాష్ట్ర


12
ఔరంగాబాద్
ఇంతియాజ్ జలీల్ సయ్యిద్
ఐఎంఐఎం(AIMIM)

పంజాబ్


13
ఫరీద్ కోట్  
మొహమ్మద్ సిద్దిక్
కాంగ్రెస్

తమిళ్ నాడు


14
రామనాధపురం
K నవాజ్ కనీ
ఇండియన్ యునియన్ ముస్లిం లీగ్

తెలంగాణా


15
హైదరాబాద్
అసదుద్దీన్ ఒవైసీ
ఐఎంఐఎం (AIMIM)

ఉత్తర ప్రదేశ్


16
అమ్మ్రోహ
కున్వర్  డేనిష్ అలీ
బిఎస్పి
17
ఘాజీపూర్
అఫ్జల్ అన్సారి
 బిఎస్పి
18
మొరదాబాద్
డాక్టర్ ST హసన్
ఎస్పి
19
రాంపూర్
ఆజం ఖాన్
ఎస్.పి.
20
సహరన్పూర్
హజీ ఫజులర్ రెహమాన్
బిఎస్పి
21
సంభాల్
డాక్టర్ షఫీకుర్ రహ్మాన్ బర్గ్
ఎస్.పి.

వెస్ట్ బెంగాల్


22
అరంబాగ్
అపరుప  పోద్దర్
(అఫ్రిన్ అలీ)
టిఎంసి
23
బసిర్హట్
నుస్రత్ జహాన్
టిఎంసి
24
జన్గిపూర్
ఖలిలుర్ రెహమాన్
టిఎంసి
25
మల్దా దక్షిణ్
అబూ హసీం ఖాన్ చౌదరి
కాంగ్రెస్
26
ముషిరాబాద్
అబూ తాహెర్ ఖాన్
టిఎంసి
27
ఉలుబెరియా
సజ్డా అహ్మద్
టిఎంసి



·        క్రిందటి లోక్ సభ లో ఎన్నికైన ముస్లిం సబ్యుల సంఖ్య23.
·        ఎన్నికైన సబ్యులు కేవలం భారత దేశం  లోని 11 రాష్ట్రాలకు చెందినవారు.  
·        దేశం లో 40 నియోజక వర్గాల పలితాలను నిర్ణయిoచే స్థితి లో ముస్లింలు ఉన్నారు.వాటిలో 30% వరకు ముస్లిమ్స్ ఉన్నారు.
·        2018 డిసెంబర్ నాటికి భారత దేశం లో ముస్లిమ్స్ 15.5% ఉన్నారు.  జనాభా రీత్యా లోక్ సభ  లో 65 మంది ముస్లింలు ఉండాలి.
·        ఈ సారి ఉత్తర ప్రదేశ్ నుంచి ఆరుగురు ముస్లిం సబ్యులు ఎన్నికైనారు. క్రిందటి సారి ఎవరు  ఎన్నిక కాలేదు.
·        ఉత్తర ప్రదేశ్ నుంచి ఎన్నికైన ఆరుగురు ముస్లిం సబ్యులలో ముగ్గురు సమాజ్వాది పార్టి నుంచి ముగ్గురు బహుజన్ సమాజ్ పార్టి నుంచి ఎన్నికైనారు.
·        వెస్ట్ బెంగాల్ నుంచి క్రిందటి సారి 8మంది ముస్లిమ్స్ ఎన్నికకాగా ఈసారి 6గురు ఎన్నికైనారు. వారిలో 5గురు టి.ఎం.సి. కి చెందినవారు. ఒకరు కాంగ్రెస్ కు చెందినవారు.
·        2019 లోక్ సభ లో అధిక స్థానాలు పొందిన భారతీయ జనత పార్టి తరుపున లోక్ సభ లో ఒక్క ముస్లిం సబ్యుడు కూడా లేదు.

·        భారతీయ జనత పార్టి ఈ సారి ఎన్నికలలో మొత్తం 6గురు ముస్లిం అబ్యర్ధులను(కాశ్మీర్ నుంచి ముగ్గురు, ఒకరు లక్షద్వీపాలు ఇద్దరు వెస్ట్ బెంగాల్ ) నిలబెట్టగా వారిలో ఒక్కరు కూడా ఎన్నిక కాలేదు.
·        కాంగ్రెస్ పార్టి నుంచి ఈ సారి నలుగురు ముస్లిం అబ్యర్ధులు ఎన్నకైనారు. వారు వరుసగా అస్సాం, బీహార్,పంజాబ్, వెస్ట్ బెంగాల్  కు చెందినవారు.
·        బీహార్ నుంచి ఇద్దరు  ముస్లిం అబ్యర్ధులు ఎన్నిక కాగా, వారిలో LJP చెందిన వారు ఒకరు. క్రిందటి సారి బీహార్ నుంచి నలుగురు ఎన్నికైనారు
·        AIMIM  నుంచి ఇద్దరు ఎన్నికైనారు. వారిలో అసదుద్దీన్ ఒవైసీ వరుసగా నాలుగు సార్లు ఎన్నిక కాగా ఈ సారి ఒవైసీ తో పాటు ఇంతియాజ్ జలీల్ సయ్యిద్ ఔరంగాబాద్ నుంచి ఎన్నికైనారు. లోక్ సభ లో AIMIM ఇద్దరు సబ్యులను కలిగి ఉండటం ఇదే మొదటి సారి.   
·        ఇండియన్ ముస్లిం లీగ్ 3 స్థానాలు పొందినది. ఇద్దరు కేరళ నుంచి ఎన్నిక కాగా ఒకరు తమిళ్ నాడు నుంచి ఎన్నికైనారు. తమిళనాడు లో ఇండియన్ ముస్లిం లీగ్, DMK  తో పొత్తులో ఉంది

·        జమ్మూ కాష్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ ఈ సారి 3 స్థానాలు(అనంతనాగ్, శ్రీనగర్, బారాముల్లా) కాష్మీర్ లోయ నుంచి పొందినది. క్రిందటి సారి ఆ స్థానాలు PDP కి చెందినవి.

·        హసన్ మసూది, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి(PDP)ని అనంతనాగ్ లో ఓడించినాడు

·        గుజరాత్, మద్య ప్రదేశ్, రాజస్తాన్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీ నుంచి ముస్లిం  అబ్యర్ది ఎన్నిక కాలేదు. ఆ రాష్ట్రాలలో తగినంత సంఖ్య లో ముస్లిమ్స్ ఉన్నప్పటికీ.  
·        లోక్ సభ లో అత్యధికంగా ముస్లిం సబ్యుల ప్రాతినిద్యం 34,  అది 2004 యు.పి.ఏ.హయం  లో ఉంది. 
·        ఇక సామ్యవాద పార్టీల నుంచి అలప్పుజ్హ (కేరళ) నుంచి  సి.పి.ఐ.(మార్క్సిస్ట్) A M అరిఫ్ఫ్ ఎనికైనారు.

·        1952 నుంచి జరిగిన లోక్ సభ ఎన్నికలలో  2014 లో జరిగిన ఎన్నికలలో  అతి తక్కువ సంఖ్య(23) లో ముస్లిం అబ్యర్ధులు ఎన్నికైనారు. ఈ సారి అనగా 2019లో  వారి సంఖ్య 27 కు పెరిగింది.
·        కాంగ్రెస్ తరుపున ఎన్నికైన ముస్లిం లోక్ సభ అబ్యర్దుల సంఖ్య కనిష్టం గా 3కు పడిపోయింది. కాంగ్రెస్ తరుపున మొహమ్మద్ జావేద్ (కిషన్ గంజ్) అబ్దుల్ ఖాలిక్ (బరాపేట) AH ఖాన్ చౌదరి (దక్షణ మల్దా) క్రిందటిసారి కాంగ్రెస్ తరుపున నలుగురు ముస్లిం ఎన్నికైన అబ్యర్ధులు కలరు.

·        మొదటిసారి AIMIM  మహారాష్ట్రలో పాగా వేసింది. ఆ పార్టి తరుపున సయ్యద్ ఇంతియాజ్ జలీల్ ఔరంగాబాద్ నుంచి ఎన్నికైనారు.ప్రస్తుత  లోక్ సభ లో  AIMIM బలం రెండుకు పెరిగింది. AIMIM బీహార్ లోని కిషన్గంజ్ నుంచి కూడా పోటి చేసింది కాని పరాజం పొందినది.  

·        2014 లో లాగా   చౌదరి మెహబూబ్ కైసర్(లోక్ జనశక్తి పార్టి) NDA తరుపున ఎన్నికైన ఏకైక ముస్లిం అబ్యర్ది

·        ముస్లిం జనాభా 30% వరకు ఉన్న అస్సాం  నుంచి కేవలం ఇద్దరు ముస్లిం అబ్యర్ధులు ఎన్నికైనారు. ఒకరు బద్రుద్దిన్ అజ్మల్ (ధుబ్రి నుంచి)  AIUDF మరొకరు అబ్దుల్ ఖాలిక్ (బారపేట)కాంగ్రెస్ కు చెందినవారు.

·        AIUDF’ బలం ఈసారి ఒకటికి పడిపోయింది. 2014 లో ముగ్గురు సబ్యులు కలరు











No comments:

Post a Comment