బుకర్ ప్రైజ్ గెలుచుకొన్న మొదటి అరబ్ మహిళ జోఖ అల్హర్తి (Jokha Alharthi)
ఓమానీ రచయిత జోఖ అల్హర్తి ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్
ఇంటర్నేషనల్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి అరబిక్-భాషా రచయిత్రి అయ్యారు. కుటుంబం సంభందాలు మరియు చరిత్ర నేపద్యం లో ఆమె రాసిన “సిలిస్టిల్
బాడీస్” Celestial Bodies అనే నవల రాబోయే సంవత్సరాలలో ముగ్గురు సోదరి మణుల గాధను
వివరిస్తుంది.
బ్రిటన్ రాజధాని
లండన్లో పురస్కారోత్సవ వేడుకలో జోఖ
అల్హర్తి విలేకరులతో మాట్లాడుతూ తన నవల "గొప్ప సంస్కృతికి ద్వారం తెరిచిందని
నేను ఆశ్చర్యపోతున్నాను" అన్నారు అల్హర్తి, తన అనువాదకుడు
మార్లిన్ బ్రూత్తో తో కల్సి బహుమతి సొమ్ము 50,000 పౌండ్ల (USD64,000) పంచుకొన్నారు.
ఐదుగురు సభ్యుల
న్యాయనిర్ణేత కమిటీకి నాయకత్వం వహించిన చరిత్రకారుడు బెటానీ హుఘ్స్ మాట్లాడుతూ గెలిచిన నవల "ప్రతి హృదయ మరియు
మస్తిష్క విజేతగా పేర్కొన్నారు. "ఖగోళ శక్తులు మనల్ని
బలహీనపరిచే బలగాల నుంచి స్వేచ్ఛ కల్పించటానికి
పుట్టుకొచ్చాయి." అన్నారు.
అల్హర్తీ యొక్క
అనువాదకుడు అమెరికా విద్యావేత్త అయిన మార్లిన్ బోత్. ఇతడు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అరబిక్
సాహిత్యాన్ని బోధించేవాడు. హుఘ్స్ ప్రకారం పుస్తకంయొక్క అనువాదం "ఖచ్చితమైనడి
మరియు అందులోని సాహిత్య, కవిత్వం అందంగా
సరళం గా అల్లినట్లు ఉంది " అని అన్నారు.
“ సిలిస్తిల్ బాడీస్
"గత సంవత్సరం విజేత,
పోలాండ్ యొక్క
ఓల్గా తోకర్జుక్ (Olga Tokarczuk) తో సహా యూరోప్ మరియు దక్షిణ అమెరికా నుండి ఐదుగురు
ఇతర ఫైనలిస్టులను ఓడించినది.
ఈ బహుమతి
ఆంగ్ల భాషా నవలల మ్యాన్ బుకర్ ప్రైజుకు ప్రతిరూపం మరియు ఆంగ్లంలోకి అనువదించబడిన
ఏదైనా ఇతర భాషలోని పుస్తకాలకు ఇవ్వబడుతుంది.
No comments:
Post a Comment