24 May 2019

ఇస్లాం ధర్మంలో శుక్రవారం ప్రార్థనల ప్రాముఖ్యత ఏమిటి? (What is the significance of Friday prayers in Islam?)




ముస్లింలు ప్రతిరోజు ఐదు సార్లు ప్రార్థన చేస్తారు, కానీ వారం లో అతి ముఖ్యమైన ప్రార్థన "జుమా," అనగా శుక్రవారం జరిగే సమూహ ప్రార్ధన. ముస్లింలు ఒకే దేవుణ్ణి ఆరాదించేందుకు తమ విశ్వాసాన్ని, భక్తిని ప్రకటించడానికి భుజం మరియు భుజం కలిపి నిలబడే సమయం ఇదే.

ఇస్లామీయ విశ్వాసం - శుక్రవారం ప్రార్ధనలు
మతపరమైన ప్రాముఖ్యత


దివ్య ఖుర్ఆన్ "అల్-జుమాహ్" అని పిలువబడే ఒక అధ్యాయంలో  ఇస్లామిక్ ప్రార్ధనల పవిత్ర దినం గా శుక్రవారం ను పేర్కొన్నది . అల్-జుమాహ్ అనగా  అరబిక్లో సమూహ దినం అని అర్ధం.

‘ఓ విశ్వాసులారా! శుక్రవారం ప్రార్థనకు పిలుపు నిచ్చినప్పుడు, అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తoడి; క్రయవిక్రయాలను వదిలి పెట్టండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది.  "(దివ్య ఖుర్ఆన్ 62: 9)

ముస్లింలు శుక్రవారం దేవుణ్ణి ఆరాధించే ప్రత్యేకమైన రోజుగా ఎంచుకున్నారు. సాధారణంగా  జరిగే మధ్యాహ్న ప్రార్ధనల కంటే ఇది చిన్నది అయిన ప్రార్థన. ప్రార్థన ముందు ముస్లింలు ఇస్లాం మరియు అల్లాహ్ గురించిన విలువైన జ్ఞానం కల ఉపన్యాసం వింటారు. ఇదిఅల్లాహ్ దీవించిన రోజు మరియు వారంలో అత్యంత శుభకరమైన రోజు. 

ముస్లిం పురుషులు శుక్రవారం ప్రార్ధనలకు తప్పనిసరిగా హాజరు కావాలి. మహిళలు సాముహిక ప్రార్ధనలకు హాజరు కానవసరం లేదు.

భారతదేశం, పాకిస్థాన్ మరియు తజికిస్తాన్ వంటి కొన్ని దేశాల్లో, మహిళలు సాధారణంగా మసీదులలో ప్రార్ధనకు అనుమతించబడరు. అయితే ఇరాన్ మరియు కెన్యా వంటి దేశాలలో వారు పెద్ద సంఖ్యలో మసీదు కు  హాజరవుతారు. దాదాపు అన్ని మసీదులలో, పురుషులు మరియు మహిళలు విడి విడిగా ప్రార్థన చేస్తారు. కొన్ని ప్రదేశాల్లో మహిళలు ఒకే గదిలో పురుషుల వెనుక నిలబడి ప్రార్ధన చేస్తారు. కొన్ని ప్రదేశాల్లో  మహిళలు వేరే గదిలో లేదా అవరోధం వెనుక ఉండి ప్రార్ధన చేస్తారు.

పాశ్చాత్య దేశాలలో, చాలా మoది స్త్రీలు తమ విరామ సమయం లో  ప్రార్థనకు  హాజరు అగుదురు.
 లాస్ ఏంజిల్స్ మరియు ఉత్తర అమెరికా మరియు ఐరోపాలో, మహిళలు స్వయంగా తమ శుక్రవారం ప్రార్ధన సేవలు నిర్వహించెదరు.

ప్రార్ధనలు కోసం హాజరయ్యే విశ్వాసులు తమ  దంతాలను బ్రష్ చేసుకొని,  అబ్యంగ స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు దరించి పెర్ఫ్యూమ్ పూసుకొని వస్తారు. ఇస్లాంలో అత్యంత ప్రధానమైన విధులలో సాముహిక ప్రార్ధనలు (పురుషుల కోసం విధిగా) ఒకటి.

 ప్రవక్త ముహమ్మద్ (స) వ్యక్తిగత ప్రార్ధన కన్నా సమూహ ప్రార్ధన మిన్న అని అన్నారు. సమూహ ప్రార్ధన ఆధ్యాత్మిక ప్రతిఫలాలను ప్రోత్సహించే ప్రార్థన మరియు దానివల్ల పాపాలకు   క్షమాపణ లబించును అని అన్నారు. . శుక్రవారం ప్రార్ధనలకు హాజరు అవడం ప్రవక్త (స) ప్రకారం ఒక సంవత్సర ప్రార్ధన మరియు  ఉపవాసమునకు సమానమైనది

ఇటివల U.S. ముస్లిం గాయకుడు రఫ్ హగ్గగ్ (Raef Haggag) ముస్లింలు జుమా ప్రార్ధనలకు ఎలా సిద్దమగుదురో మరియు దాని ప్రయోజనాలను ఒక పాపులర్  పాట లో వివరించినాడు. శుక్రవారం ప్రార్ధనల ప్రాముఖ్యత గురించి పాశ్చాత్య ముస్లిమ్స్ కు ఇది  సరళమైన  లోతైన సందేశాన్ని అందిస్తుంది.

ప్రార్థన యొక్క సంప్రదాయం

ఈజిప్టు, ఇరాన్ మరియు పాకిస్తాన్ వంటి ముస్లిం మెజారిటీ దేశాలలో   శుక్రవారం వారపు సెలవు దినం, అది కొన్నిసార్లు గురువారం లేదా శనివారంతో కలిపి ఉంటుంది.ఆదివారం రోజువారీ పని దినం.

శుక్రవారం రోజు అనేక మంది ముస్లింలు వారి కుటుంబాలతో జుమా సమూహ ప్రార్ధనలో పాల్గొoటారు  మరియు ఆ తరువాత విశ్రాంతి గా గడుపుతారు. శుక్రవారం ప్రార్ధనల తరువాత వ్యాపార కార్యకలాపాలు సాగుతాయి  కానీ ముస్లిం-మెజారిటీ దేశాలలో చాలా మంది ప్రజలు ఆ రోజు సెలవు తీసుకొంటారు. మామూలు రోజులలో ప్రార్ధనకు హాజరు కాలేని వారు కూడా విధిగా జుమా సమూహ ప్రార్ధనకు హాజరు అగుదురు. 

లౌడ్ స్పీకర్ల నుండి వచ్చే అజాన్ పిలుపు మొత్తం నగరo అంత ప్రతిధ్వనిస్తుంది.  ప్రబోధాలు కూడా తరచూ బహిరంగంగా ప్రసారం అవుతాయి మరియు ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా,  జర్మనీ  వంటి పాశ్చాత్య దేశాల్లోని  అనేక నగరాల్లో, మసీదుల పరిసరాలు విశ్వాసులతో నిండి పోతాయి.
జనసమర్ధత అధికం గా గల నగరాలు కూడా జుమా ప్రార్ధన జరిగే సమయం లో తరచుగా ఖాళీగా మరియు నిశ్శబ్దంగా ఉంటాయి.

యునైటెడ్ స్టేట్స్ లో, ముస్లింలు సమీపంలోని మసీదును సందర్శించడానికి వారి కార్యాలయం నుండి ప్రత్యేక అనుమతిని పొందుతారు. విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు లేదా కార్పోరేట్ కార్యాలయాలు మరియు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముస్లిం ఉద్యోగులు తమ శుక్రవారం ప్రార్ధన  నిర్వహించడానికి  ప్రత్యెక స్థలం కేటాయించుతాయి.

హదీస్ లో వివరించినట్లు ముస్లింలకు ఒక మతపరమైన ఆచారంగా, శుక్రవారం ప్రార్ధనలు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి.

జుమా విశిష్టత

ప్రవక్త ముహమ్మద్(స) ప్రకారం , "దేవుని దృష్టిలో ఉత్తమ రోజు మరియు  సామూహిక  ప్రార్ధనలకు ఉద్దేశించిన రోజు శుక్రవారం”. – బైహాకి Bayhaqi.

ప్రవక్త ముహమ్మద్(స) ఇలా అన్నారు, "ఇది నిజంగా ముస్లింలకు సూచించిన ఈద్ రోజు (వేడుక రోజు)" [ఇబ్న్ మాజా].

శుక్రవారం విశ్వాసులు తమకు అల్లాహ్ పంపే ఆశీర్వాదాల ప్రయోజనాన్ని నమ్మిన జ్ఞానవంతులై ఉంటారు. ఇది సాముహిక రోజు, వేడుకరోజు మరియు ధ్యానం మరియు ప్రార్థన యొక్క రోజు.

శుక్రవారం సాముహిక ప్రార్ధన రోజు. జుమా నమాజ్ కొరకు  అనేక సిఫార్సు చేయబడిన విధులు ఉన్నాయి. ఈ విధులలో స్నానం చేయటం మరియు శుభ్రమైన వస్త్రాలు దరించి, అల్లాహ్ కొరకు అనేక ప్రార్థనలు చేయడం ప్రవక్త ముహమ్మద్(స) కొరకు దీవెనలు పంపడం మరియు 'The Cave' అల్ కహఫ్ (ఖురాన్ చాప్టర్ 18) పారాయణం ఉన్నాయి.

ప్రవక్త ముహమ్మద్(స) ప్రకారం  "శుక్రవారం కంటే శుభకరమైన రోజు లేదు. అందులో అల్లాహ్ కు  తప్ప ఎవరికీ ప్రార్థన చేయబడని మరియు  అల్లాహ్ మాత్రమే విశ్వాసి ప్రార్థనవినే ఒక గంట ఉంది. "[తిర్మిజి]

"శుక్రవారం పన్నెండు గంటలు కలిగి ఉంటుంది, వీటిలో ఒకటి నమ్మిన వారి ప్రార్థనలు మంజూరు చేయబడే గంట, ఈ గంట అసర్  చివరి గంటగా ఉంటుంది.-[అబూ దావూద్]

""ఎవరైతే శుక్రవారం 'The Cave' అల్ కహఫ్ (ఖురాన్ చాప్టర్ 18) పారాయణం చేస్తారో వారికి అల్లాహ్ తరువాతి శుక్రవారం వరకు వెలుగును ఇస్తాడు." -(Bayhaqi బైహాకి)

" మంచి రోజు శుక్రవారం. ఇది ఆదం సృష్టించబడిన రోజు, ఆదం స్వర్గపు తోటలో ప్రవేశించిన రోజు,అతను దాని నుండి బహిష్కరించ బడిన రోజు మరియు మరణించిన రోజు కూడాఉంది. ఆ రోజు పునరుత్థానo కూడా జరుగుతుంది. "[సహి ముస్లిం, తిర్మిజి,అబూ దావూద్  ]





No comments:

Post a Comment