భారతీయ ముస్లింల పాత్ర లేని భారత జాతీయ ఉద్యమం యొక్క చరిత్ర అసంపూర్తిగా
మరియు పక్షపాతంతో ఉంటుంది. కానీ భారత జాతీయ ఉద్యమంలో భారతీయ ముస్లింల పాత్ర గురించి
ప్రెస్ లేదా పుస్తకాలలో తగినంత కవరేజీ ఇవ్వలేదు. వాస్తవ చరిత్రకు బదులుగా ఇది వక్రికరించబడినది.
ముస్లిం విప్లవకారులు, కవులు మరియు రచయితల సహకారం నేటి తరానికి తెలియదు. మాతృభూమి
కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరుడు ముహమ్మద్ అష్ఫాఖ్ ఉల్లా ఖాన్ గురించి తెలియదు.
అదేవిధంగా, భారతదేశ
స్వాతంత్ర్యం కోసం జైలులో తన 95 సంవత్సరాల జీవితo లో45 ఏళ్ళు జైలు లో గడిపిన
గొప్ప జాతీయవాది సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గురించి నేటి తరం విద్యార్థులకు
తెలియదు. భోపాల్కు చెందిన
బరకతుల్లా, గదర్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు, అతను
బ్రిటిష్-వ్యతిరేకo పోరాటానికి ఒక నెట్వర్క్ను సృష్టించాడు మరియు 1927 లో జర్మనీలో
మరణించాడు. ఫ్రాన్స్లో రహస్య విప్లవకారుడిగా పనిచేసిన గదర్ పార్టీ
యొక్క వ్యవస్థాపుకులలో ఒకరైన సయ్యద్ రహమత్ షా 1915 లో ఉరి
తీయబడినాడు. ఫైజాబాద్కు చెందిన అలీ అహ్మద్ సిద్దికి, మలయా మరియు
బర్మాలో భారతీయ తిరుగుబాటు కోసం కృషి చేసినాడు మరియు అతను జౌంపూర్కు చెందిన సయ్యద్ ముజ్తబా హుస్సేన్తో
పాటు 1917 లో ఉరితీయబడినాడు. మహాత్మా గాంధీకి ఖాళీ చెక్ ను
సమర్పించిన ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త మరియు లక్షాధికారి ఉమర్ సుభాని, స్వాతంత్ర్యం
కోసం తన జీవితాన్ని అర్పించినాడు. ముహమ్మద్ బషీర్, ఖుదా బక్ష్, ఎ. జకారియా, జఫర్ హసన్, అల్లా నవాజ్
మరియు అబ్దుల్ అజీజ్ లాంటి వేలాది మంది
విప్లవకారులు నేడు నిర్లక్ష్యం చేయబడ్డారు.
ముస్లింలు జాతీయ ఉద్యమానికి భారీగా దోహదం చేసారనుటలో
ఎటువంటి సందేహం లేదు. భారతదేశంలో బ్రిటీష్ పాలన
రావడంతోనె వారి పోరాటం ప్రారంభమైంది. 1857-58 మధ్య కాలంలో
ఢిల్లీలో కేవలం 27,000 మoది ముస్లింలను విద్రోహనులు అనే నెపంతో ఉరి
తీయబడ్డారు అని ఖైసేర్-ఉల్-తవార్కి చెందిన ఆర్కైవ్స్ పేర్కొన్నారు.
బ్రిటీష్ పాలన నుండి దేశం యొక్క విమోచనకు కృషి చేసిన వారిని గురిoచి హోం శాఖ యొక్క దస్త్రాలు పెర్కొంటున్నాయి. సన్యాసి
ఉద్యమం నుండి స్వాతంత్ర్యము వరకు అన్ని జాతీయ తిరుగుబాట్లు అపారమైన త్యాగాలతో నిండి ఉన్నాయి. అది చివరకు 1947 లో భారతదేశo
నుండి బ్రిటీష్ ఉపసంహరణకు దారితీసింది.
50 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలలో కూడా ముస్లింలు జాతీయ
పోరాటం లో నిర్వహించిన పాత్ర పాత్రికేయులచే అశ్రద్ధ చేయబడినది. ఆల్-ఇండియా మిల్లి
కౌన్సిల్, దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల పాత్ర గురించి ప్రజలకు
అవగాహన కల్పించడం కోసం నిర్వహించిన “కారవాన్-ఎ-అజాది ర్యాలీ” శ్రీరంగపట్నం మరియు సిల్చార్
(అస్సాం) నుండి ప్రారంభించ బడినది.
దేశం కోసం పోరాడిన సుల్తాన్ టిప్పు యొక్క సమాధి స్థలం
నేడు యువకుల క్రికెట్ ప్రాక్టిస్ గ్రౌండ్ గా మారినది. స్థానిక పరిపాలకాదికారులు కూడా దీనిని అడ్డుకోలేదు. భారతదేశ స్వేచ్ఛ కోసం
తమ ప్రాణాలను అర్పించిన గొప్ప దేశభక్తుల పట్ల భారతీయుల అజ్ఞానంను ఇది చూపిస్తుంది.
ఇండియన్ నేషనల్ ఉద్యమం గురించి అనేక పుస్తకాల వచ్చినాయి కానీ వాటిలో ముస్లింల పాత్ర గురించి స్వల్ప ప్రస్తావనలు
మాత్రమే కలవు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వందలాది మంది
మహిళల్లో కేవలం బేగం హజ్రత్ మహల్ మరియు బి-అమ్మలను గురించి మాత్రమే మన్మోహన్ కౌర్ తన
పుస్తకం లో పేర్కొన్నారు. అనేక మోనోగ్రాఫ్లు, అందులో శాంతిమాయ్
రే “ఫ్రీడం మూవ్మెంట్ అండ్ ఇండియన్ ముస్లిమ్స్” లేదా పి.ఎన్. చోప్రా'స్ “రోల్ ఆఫ్
ఇండియన్ ముస్లిమ్స్ ఇన్ ది స్ట్రగుల్ ఫర్ ఫ్రీడం” లేదా కమతా చౌబే
యొక్క “ముస్లిమ్స్ అండ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ ఇండియా” మరియు ముస్లింల పాత్ర
గురించి ముజాఫర్ ఇమామ్ “రోల్ అఫ్ ముస్లిమ్స్ ఇన్ ది నేషనల్ మూవ్మెంట్” మరియు హసన్
ఇమామ్ యొక్క “ఇండియన్ నేషనల్ మూవ్మెంట్” వంటి కొన్ని ప్రాంతీయ అధ్యయనాలు
ప్రచురించబడ్డాయి.
కానీ విషయం విస్తృతమైనది మరియు ఒక సమగ్ర అధ్యయనం
అవసరం. ఇటువంటి అధ్యయనం ముస్లింల పట్ల ఉన్న దురభిప్రాయాలు తొలగించడం లో సహాయం
చేస్తుంది దీనికి ప్రధాన కారణం ముస్లింల పట్ల సరఅయిన హిస్టరిగ్రఫీ లేకపోవడమే. ఈ విషయంలో అద్భుతమైన పుస్తకం
ప్రొఫెసర్ షాన్ ముహమ్మద్ వ్రాసిన ముస్లిమ్స్ అండ్ ఇండియాస్ ఫ్రీడమ్ మూవ్మెంట్.
దీనిని అయన భారతదేశ స్వతంత్రతకు బాధ్యులైన
వారికి అంకితమిచ్చినాడు.
జాతీయ ఉద్యమం లో ముస్లింలు ఇతర వర్గాలతో కల్సి భుజం భుజం కలిపి పోరాడారు.
బ్రిటిష్ వారు దేశాన్ని విడిచి వెళ్ళేటట్లు నిరంతర పోరాటo జరిపారు.
భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రారంభ దశల్లో ఫరీజి మరియు వహాబి ఉద్యమాలు
తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ ఉద్యమాలు బ్రిటీష్ వారిని తొలగించటాని చేసిన అత్యంత వ్యవస్థికృత పోరాటాలు
అని పిలువ బడతాయి. వాహ్హీబిలు, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన తోలి స్వతంత్ర సమర యోధులు మరియు భారతదేశంలో ఆంగ్లేయుల
బస తాత్కాలికమైనది అని వారు అన్నారు.
స్వేచ్ఛ కోసం జరిపిన పోరాటంలో వారి పాత్ర జాతీయ చరిత్రలో తగినంతగా లిఖించ బడలేదు.
స్వాతంత్ర్య పోరాటంలో ముస్లిం మహిళల పాత్ర మరియు సహకారం వాస్తవానికి చరిత్రకారులచే
పూర్తిగా విస్మరించబడడిoదనే వాస్తవం మరింత
ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ముస్లిం మహిళలు తమ సహచరులతో పాటు బ్రిటిష్ వారికి
వ్యతిరేకంగా గట్టిగా పోరాడారు. 1857 లో అశ్గారీ
బేగం (ముజాఫర్ నగర్ యొక్క విప్లవకారుడు ఖాజీ
అబ్దుర్ రహీమ్ తల్లి) ఆంగ్లేయులతో పోరాడారు మరియు సజీవంగా దహనం చేయబడినారు. అదేవిధంగా, హబీబా మరియు
రహిమి అంగ్లేయులచే ఉరి తీయబడ్డారు. సుమారు 225 మంది ముస్లిం
మహిళలు 1857 తిరుగుబాటు లో తమ ప్రాణాలను
సమర్పించారు.
భారత జాతీయోద్యమ చరిత్రలో
అజరామరం అయిన వీర నారి మణులలో అబిది బేగం
(మౌలానా ముహమ్మద్ అలీ తల్లి), అంజాది బేగం (మౌలానా ముహమ్మద్ అలీ భార్య), నిషాత్-ఉన్-నిసా
(బేగం హస్రత్ మోహని), సాదాత్ బానో కిచ్లు
(డాక్టర్ సైఫుద్దీన్ భార్య) బెగుమ్
ఖుర్షీద్ ఖ్వాజా (MAఖ్వాజా భార్య) జులేఖ బేగం (మౌలానా ఆజాద్ భార్య), ఖదీజా బేగం మరియు
సరిహద్దు ప్రాంతం లోని ఖుర్షీద్ సాహిబా, మెహర్ తాజ్ (ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కుమార్తె), జుబాయిదా బేగం దావుది
(దావుది షఫీ యొక్క భార్య – బీహార్ ) కనీజ్ సజిదా బేగం(బీహార్) మునీరా బేగం (మౌలానా మజ్హార్-ఉల్-హక్ భార్య), అస్మాత్ ఆరా బేగం
సుగ్రా ఖాతూన్ (లక్నో), అమీనా త్యాబ్జీ
(అబ్బాస్ తయాబ్జీ భార్య),
బేగం సకినా
లుక్మని (ప్రముఖ జాతీయవాది డాక్టర్
లుక్మని మరియు బద్రుద్దీన్ త్యాబ్జీ కుమార్తె), రహనా తయాబ్జీ ( అబ్బాస్ త్యాబ్జీ యొక్క కుమార్తె
), హమీదా తాయబ్జి , (షంషుద్దీన్
త్యాబ్జీ యొక్క మనుమరాలు) ఫాతిమా తయాబ్ అలీ, సఫీయా సాద్ ఖాన్, షాఫాత్-అన్-నిసా
బీబి (మౌలానా హబిబుర్ రెహమాన్ భార్య,
లుదియనా ) కుల్సుం సియానీ (డాక్టర్ జాన్ ముహమ్మద్ ఎస్ భార్య సియనీ) ముఖ్యులు.
వీరు బెంగాల్ విభజన నుండి భారతదేశ విభజన వరకు దాదాపు అన్ని రాజకీయ ఉద్యమాలలో తమ చేతుల్లో
కాంగ్రెస్ బ్యానర్లుతో పాల్గొన్నారు. వారు ఖైదు చేయబడ్డారు, వీరిపై జరిమానా విధింప
బడినది మరియు లాటి-ఛార్జ్ చేయబడ్డారు. వీరు దేశం కోసం
సర్వస్వం త్యాగం చేసారు. వారి జీవిత కథ జాతీయ
ఉద్యమంలో ఒక భాగం, ఇది
తిరస్కరించబడదు మరియు నాశనం చేయబడదు. “కలెక్టడ్ వర్క్స్ అఫ్ గాంధీ ” లో స్వేచ్ఛ కోసం భారతదేశం జరిపిన పోరాటంలో వారి అద్భుతమైన పోరాటం మరియు త్యాగం గురించి
ప్రస్తావించబడినది.
No comments:
Post a Comment