25 May 2019

ముస్లిం రాజకీయ ప్రాతినిధ్యం భారతదేశంలో ఎందుకు తగ్గిపోతుంది? (Why is Muslim political representation declining in India?) 

భారతదేశము లో  ముస్లిం జనాభా క్రమంగా పెరుగుతోంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ అమెరికా ప్రకారం, 2015 నాటికి, వారి సంఖ్య 19.5 కోట్లకు చేరుతుంది. జననాల  రేటు లో వృద్ది కారణంగా ముస్లిం జనాభా  1991 నుండి దాదాపు రెట్టింపు అయ్యింది. జనాభా లో వారి శాతం  ఈ కాలంలో 12% నుండి 15% వరకు పెరిగింది. ప్యూ అంచనా ప్రకారం 2060 నాటికి ప్రపంచ దేశాలలో    ఇండియా లో అధికంగా  ముస్లింలు ఉంటారు (ప్రస్తుతం ఇండోనేషియా లో ఎక్కువగా ఉన్నారు) మరియు వారు భారత దేశం జనాభా లో 19% ఉoటారు.

అదే సమయంలో 545 సీట్లతో కూడిన లోక్ సభలో ముస్లిం ప్రతినిధుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది.   ముస్లింలు ఎప్పుడూ ఇక్కడ అల్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది ప్రస్తుతం 50 గత సంవత్సరాల లో తక్కువగా ఉoది. 1980 ఎన్నికలలో, లోక్ సభ మొత్తం స్థానాలలో దాదాపు 10% మంది ముస్లింలు ఎన్నికయ్యారు. 2014 లో అది 4% కన్నా తక్కువగా ఉంది. 2019 లో అది 5% గా ఉంది.

2019 జాతీయ ఎన్నికల ఫలితాల ఫలితాలు ప్రకటించబడిన్నాయి, 27 మంది ముస్లిం ప్రజా ప్రతినిధులు ఎన్నికైనారు. భారతీయ రాజకీయాల పరిశోధకుల అభిప్రాయం ప్రకారం  ఈ అధోముఖ ధోరణి కి ప్రధాన  కారణం భారతీయ జనతాపార్టీ పెరుగుదల మరియు అది భారత రాజకీయాలలో అనుసరిస్తున్న విధానాలు.

చరిత్రకారుల ప్రకారం  7 వ శతాబ్దంలో ఇస్లాం మొదటిసారిగా  భారత ఉపఖండంలోకి ప్రవేశించినది. 18 వ మరియు 19 వ శతాబ్దాలలో, బ్రిటిష్ వారు భారత ఉపఖండాన్ని వలసగా మార్చారు.  స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో, ముస్లింలు మరియు హిందువులు కలసి పోరాడారు.  స్వాతంత్ర్యం అనంతరం బ్రిటిష్ ఇండియా భారతదేశం మరియు పాకిస్తాన్ అను రెండు దేశాలగా  విభజించబడింది. ఒకటి హిందూ మెజారిటీ కలిగిన భారతదేశం (పెద్ద సంఖ్యలో ముస్లింలు మరియు ఇతర మత మైనార్టీలు ఈ  లౌకిక రాజ్యంలో ఉన్నారు). రెండు పాకిస్తాన్, ఇది  ఇస్లామిక్ గణతంత్ర రాజ్యంగా మారింది.  విభజన సమయంలో దాదాపు ఒక మిలియన్ మరణాలు సంభవించాయి.

భారతదేశంలో సుమారు 35 మిలియన్ ముస్లింలు విభజన తర్వాత ఉన్నారు. ఆ జనాభా ఇప్పటికీ ఉంది మరియు అది ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను కలిగి ఉన్న గంగ నదీ పరీవాహక ప్రాంతంలోను మరియు  దేశంలోని ఉత్తర భాగంలో కేంద్రీకృతమై ఉంది. దేశంలోని ముస్లింలలో సగం మంది ఆ మూడు రాష్ట్రాల్లో ఉన్నారు. దేశంలోని దాదాపు ప్రతి భాగం గణనీయమైన ముస్లిం మైనారిటీని కలిగి ఉంది. ఒడిశా మరియు పంజాబ్ మాత్రమే 5% కంటే తక్కువగా ముస్లిం జనాభా ను కలిగి ఉన్నాయి.

లోక్ సభకు మొదటి ఎన్నికలు  1952 లో జరిగినాయి. ఆ ఎన్నికలలో ఎన్నికైన మొత్తం 489 మంది సభ్యుల్లో 11 మంది మాత్రమే ముస్లింలు. తరువాతి 30 సంవత్సరాల్లో ఆ సంఖ్య పెరిగింది. గరిష్టంగా 1980 లో పెరిగింది.

స్వాతంత్ర్యం తరువాత భారతదేశం యొక్క ప్రధాన రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (INC) వలన ఈ సంఖ్య పెరిగింది. 1980 లో 49 మంది ముస్లిం ప్రతినిధులలో 30 మంది  కాంగ్రెస్ సబ్యులు. ఉబయ కమ్యునిస్ట్ పార్టీలు మరియు జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్లో స్థిరంగా ముస్లిం ప్రతినిడులను కలిగి ఉన్న ఇతర రాజకీయ పక్షాలు - త్రివేది సెంటర్ ఫర్ పొలిటికల్ డేటా.

జామియా మాలియా ఇస్లామియా లో భారత రాజకీయాల పై పరిశోధన చేస్తున్న  పరిశోధకుదు మొహమ్మద్ ఒసామా   ప్రకారం  1970 లలో మరియు 1980 ల ప్రారంభంలో భారత రాజకీయ పార్టీల యొక్క విచ్ఛిన్నత వలన ముస్లింలు అధిక  ప్రాతినిధ్యo పొందారు.  రాజకీయాల్లో అధికారం పొందటానికి ప్రతి రాజకీయ పార్టీ ద్వారా ముస్లిం  సమాజానికి, ఇతర మైనారిటీ గ్రూపులకు చేరుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. తత్ఫలితంగా ముస్లింలను వారు తమ  అభ్యర్థిగా ప్రకటించేవారు. ఈ విధంగా 1980 లో ముస్లింల పొందిన  అధిక ప్రాతినిధ్యం రాబోయే మూడు దశాబ్దాల్లో దాదాపు పూర్తిగా తిరగబడింది.

రాజకీయ శాస్త్రవేత్తలు క్రిస్టోఫ్ జాఫ్రెలోట్ మరియు గిల్లెస్ వెర్రియర్స్ ప్రకారం ముస్లిం ప్రజా ప్రతినిధుల తిరోగమనం కు ఒక ముఖ్య కారణం: బిజెపి పెరుగుదల.
 1980 లో స్థాపించిన బిజెపి, 1984 జాతీయ ఎన్నికలలో కేవలం రెండు సీట్లు గెలుచుకుంది. 1998 నాటికి దేశంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచినది మరియు 2014 మరియు 2019  లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పూర్తి విజయం సాధించింది.

బిజెపి సామాజిక విధానాలు పాశ్చాత్యీకరణ మరియు లౌకికవాదంపై హిందూ మత ఆధారిత సాంస్కృతిక సంప్రదాయవాదాన్ని మరియు హిందూ జాతీయవాదo(హిందుత్వ) ను  ప్రోత్సహించుట. అనేక మంది హిందూ జాతీయవాదులు ముస్లింలు  ఎప్పుడూ భారతీయులు కాలేరనే ఆలోచనను వ్యక్తం చేశారు, ఎందుకంటే హిందువుల వలె కాకుండా, ముస్లింల  పవిత్ర స్థలాలు భారతదేశంలో లేవు. 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత  మరియు 2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లు  దేశం లో బిజెపి వృద్ధి కి తోడ్పడినవి.

బిజెపి పార్టీ యొక్క ఆర్థిక విధానాలు  మార్కెట్ అనుకూల మరియు రెడ్ టేపిజం కు వ్యతిరేకoగా ఉన్నవి. భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్న రైతులకు/ వ్యవసాయ ఆధారిత పేదలకు మద్దతునిచ్చే విధానాలకు ఇది అనుసరిస్తుంది.

బిజెపి అల్ప సంఖ్య లో ముస్లిం అభ్యర్థులను కలిగి ఉంది. జాఫ్రెలోట్ మరియు వెర్నియర్స్ అభిప్రాయo ప్రకారం  1980 నుండి, పార్టీ బిజెపి  కేవలం 20 మందిని మాత్రమే  సాధారణ ఎన్నికలకు నిలబెట్టింది. వీరిలో కేవలం ముగ్గురు మాత్రమే గెలిచారు. 2014,2019 ఎన్నికలలో ఈ పార్టీ తరుపున ముస్లిం అబ్యర్ధులు ఎవరు ఎన్నిక కాలేదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్ట మొదటిసారి కేంద్రం లో అధికారం లో ఉన్న పార్టి ముస్లిం సభ్యులను కలిగిలేదు.

ముస్లిం ప్రజా ప్రతినిదుల క్షీణతకు  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మరియు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రo నుండి ముస్లిం సబ్యుల తక్కువ ఎన్నిక. ఉత్తరప్రదేశ్లో బిజెపి మరింత శక్తివంతమైనది. యూ.పి.నుంచి 2014 లో పార్లమెంటులో ముస్లిం సభ్యుల సంఖ్య సున్నా  కు పడిపోయినది. 2019 లో ఆరుగురు ఎన్నికైనారు.ఆ ఆరుగురు నాన్-బిజెపి కి చెందినవారు.ఉత్తరప్రదేశ్ జనాభాలో సుమారు 20% మంది ముస్లింలు. 2019 లో మహారాష్ట్ర నుంచి ఒకరు ఎన్నికైనారుమరియు మధ్యప్రదేశ్ నుంచి ఎవరు ఎన్నిక కాలేదు.

2014 నుండి అనేక మంది ముస్లింలు బిజెపి తమ్ము మరింత అణగదొక్కుతుందని  ఆందోళన వ్యక్తం చేశారు మరియు ప్రభుత్వం ముస్లిం-వ్యతిరేక మత విద్వేషాల వ్యక్తీకరణలకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు అని విమర్శించారు.  హిందూ హక్కుల పరిరక్షణ మరియు గో సంరక్షణ పేరిట ముస్లింలకు వ్యతిరేక దాడులు నిర్వహించబడినవి. అనేకమంది ముస్లింలు మూక హింసకు గురి అయినారు. కొంతమంది హత్యకు గురియినారు. ముస్లింలకు వ్యతిరేకంగా పెరుగుతున్న దాడులకు బయపడి కొంతమంది భారతీయ ముస్లింలు తమ్ము  ముస్లింలుగా గుర్తించే దుస్తులను ధరించుట లేదు.

బిజెపి అనుసరిస్తున్న  ముస్లిం వ్యతిరేక భావాలచే ప్రభావితం అయిన  ఇతర రాజకీయ పక్షాలు కూడా తాము  ముస్లింలకు అల్ప ప్రాతినిద్యం ఇవ్వసాగినవి అని  వెర్నియర్స్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్  మరియు ఇతర రాజకీయ పార్టిలు  ముస్లిం అభ్యర్థులకు  టికెట్ ఇస్తే  తమను హిందు వ్యతిరేకిగా బిజెపి చిత్రికరిస్తుందని  భయపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టి దానితో గత్యంతరం లేక సాఫ్ట్ హిందుత్వ ను అనుసరించ సాగింది. దీని ఫలితంగా, ఈ ఎన్నికలలో పోటీచేసే ముస్లిం అబ్యర్దుల  సంఖ్య గణనీయంగా తగ్గింది.  ఈ ఎన్నికలో కాంగ్రెస్ తరుపున దేశం మొత్తం మీద కేవలం నలుగురు ముస్లిం అబ్యర్ధులు మాత్రమె విజయం పొందినారు.  2019 ఎన్నికలలో  ఉత్తరప్రదేశ్ నుంచి ఆరుగురు ముస్లిం  అబ్యర్ధులు విజం సాధించారు. వారు ఎస్పి, బిఎస్పీ పార్టికి చెందిన వారు.

 2019 ఎన్నికలలో బిజెపి ఆరుగురు ముస్లిం అబ్యర్ధులను నిలబెట్టగా ఒక్కరు విజయం సాధించ లేదు. NDA కూటమి నుంచి ఒక అబ్యర్ది LJP తరుపున బీహార్ నుంచి ఎన్నికైనారు.

ముస్లింలు లోక్ సభ ఎన్నికలలో 40 నియోజక వర్గాలలో పలితాలను నిర్ణయిoచే స్థితి లో ఉన్నారు.  

2019 లోక్ సభ ఎన్నికలలో గుజరాత్, మద్య ప్రదేశ్, రాజస్తాన్, కర్నాటక, ఆంద్ర ప్రదేశ్, డిల్లి నుంచి ఒక్క ముస్లిం అబ్యర్ది కూడా విజయం సాధించ లేదు. అ రాష్ట్రాలలో ముస్లిం జనాభా తగు పరిమాణం లో ఉన్నప్పటికి ముస్లిం అబ్యర్ది విజయం సాధించ లేదు.

ముస్లిం అబ్యర్ధులు కేవలం 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల లోనే విజయం సాధించారు.
2018 డిసెంబర్ నాటి జనాభా రీత్యా ముస్లింలు లోక్ సభ లో 65 స్థానాలు కలిగి ఉండాలి.

 రాజకీయ విశ్లేషకురాలు  మరియు కంప్యూటర్ శాస్త్రవేత్త సుళని భోగలే ప్రకారo లోక్ సభ లో ముస్లిం సబ్యుల కొరత వలన  తీవ్ర విధానపరమైన పరిణామాలు ఉండవచ్చు. 1999 నుండి 2017 వరకు పార్లమెంటులో అడిగిన 276,000 ప్రశ్నలను ఆమె విశ్లేషించారు. ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసాకాండ మరియు ముస్లిం ఖైదీల పట్ల అనుసరిస్తున్న విధానాలు గురించి ముస్లిం సబ్యుల కన్నా ఇతర వర్గాల సబ్యులు ఎక్కువుగా ప్రశ్నలు అడిగినారు. లోక్ సభ   సభ్యులలో 1% కంటే తక్కువ మంది ముస్లిం మహిళలు ఉన్నారు అని   భగలే అభిప్రాయపడ్డారు, అందువల్ల ఈ విభాగానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావించే అవకాశం లేదు.

భారతదేశంలో ముస్లింలకు 2019 ఎన్నికలు కీలకమైనవి. ఈ ఎన్నికలలో ఎక్కువ మంది ముస్లిం అబ్యర్ధులు  ఎన్నిక కాక పోతే రాజకీయo గా దేశం యొక్క అతి పెద్ద మైనారిటీని మరింత పక్కన పెట్టడం జరుగుతుంది.

No comments:

Post a Comment