20 May 2019

రమాదాన్ – సప్త ఆరోగ్య ప్రయోజనాలు (Seven Surprising Health Benefits of Ramadan)

రమదాన్ సమయంలో ఉపవాసం ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని  భయపడుతున్నారా! భయపడకండి, ఈ నెలరోజులలో  వేగవంతమైన ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను ఎలా  పొందవచ్చో తెలుసుకోండి.

ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది రమదాన్ మాసం లో ఆధ్యాత్మిక ప్రక్షాళన కొరకు ఉపవాసం ను విజయవంతంగా పూర్తిచేసిప్పటికీ, కొందరు వ్యక్తులు అలాంటి సుదీర్ఘ కాల ఉపవాసం తమ  ఆరోగ్యం మీద హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని  భయపడుతున్నారు. మీరు అలాంటి  భయస్తులల్లో ఒకరైతే, ఉపవాసం ఉండుట వలన  రమదాన్ నెలలో  మరియు ఆతర్వాత పొందగల ఏడు ఆరోగ్య ప్రయోజనాలను గమనించండి.


ఖర్జూరాలు: ఆధ్యాత్మికంగా రమదాన్లో ప్రతి రోజు ఇఫ్తార్ ప్రారంభంలో మూడు ఖర్జూరాలు సేవించటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాల కలవు. ఉపవాసం యొక్క అత్యంత ముఖ్యమైన అంశo శక్తిని సరైన పరిమాణంలో పొందటం. ఉపవాసి  తీసుకొనే ఖర్జూరాలు సగటున  31 గ్రాముల ( 1 ఔన్స్ కన్నా అధికం ) కార్బోహైడ్రేట్ల కలిగి వుంటాయి.ఖర్జూరం  మనకు శక్తిని అందించే పరిపూర్ణ ఆహారాలలో ఒకటి. ఖర్జూరం  జీర్ణ క్రియకు సహాయపడే పీచు పదార్ధం (ఫైబర్) అధిక మాత్రలో కలిగి ఉంటుంది. దీనిలో పొటాషియం, మెగ్నీషియం మరియు B విటమిన్లు అధికంగా ఉండును. ఆరోగ్యకరమైన పండ్లలో ఖర్జూరం  ఒకటి అని స్పష్టo అవుతుంది2.మెదడుకు శక్తీ  : మానసిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక దృక్పథం మీద ఉపవాసం కలుగచేసే సానుకూల ప్రభావాలను మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటాo, కానీ దానితోబాటు రమదాన్ ఉపవాసం   మెదడుకు శక్తీ నిస్తుంది. అమెరికాలో శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో రమదాన్ ఉపవాసం మెదడు లో ఉత్పన్నమయ్యే  న్యూరోట్రోఫికల్ (neurotrophic) కారకం యొక్క స్థాయిని పెంచుతుంది, దీని వలన శరీరo అధిక  మెదడు కణాలను ఉత్పత్తి చేస్తుంది దానితో మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అదేవిధంగా, అడ్రినల్ గ్రంధి ఉత్పత్తి చేసిన హార్మోన్ కార్టిసోల్ మొత్తంలో తగ్గింపు జరుగుతుంది దానివలన  రమదాన్ సమయంలో మరియు ఆ తర్వాత ఒత్తిడి స్థాయిలు బాగా తగ్గించబడతాయి.3.చెడు  అలవాట్లకు దూరం  : మీరు పగటి  సమయంలో ఉపవాసం పాటించేటప్పుడు, మీ చెడు అలవాట్లను  వదులుకోవటానికి రమదాన్ సరైన సమయం. ధూమపానం మరియు తీపి ఆహారపదార్ధాలకు   రమదాన్ సమయంలో దూరంగా ఉండుటవలన క్రమంగా మీ శరీరం ఆ నిషేదాలకు అలవాటుపడి మీరు ఆరోగ్యవంతులు అగుదురు. మీరు ఒక సమూహంలో ఉండుటవలన చెడు అలవాట్లకు త్వరలో దూరం అగుదురు.రమదాన్ అలాంటి అవకాసం కల్పించును.  చెడు అలవాట్లను వదిలివేయటంలో ఉపవాసo తోడ్పడును.  UK నేషనల్ హెల్త్ సర్వీస్ నివేదిక ధూమపానం వదిలివేయడానికి అనువైన సమయం గా రమదాన్ ను సిఫార్సు చేస్తుంది.


4.కొలెస్ట్రాల్ తగ్గింపు: రమదాన్ సమయంలో ఉపవాసం వలన శరీరం  యొక్క బరువు తగ్గును మరియు మనం శరీరం లో ఆరోగ్యకరమైన మార్పులను గమనించవచ్చు.  UAE కార్డియాలజిస్టుల బృందం రమదాన్ లో వ్యక్తుల లిపిడ్ ప్రొఫైల్లో సానుకూల ప్రభావాన్ని గుర్తించారు, అనగా రక్తంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గిపోతుందని అర్థం. తక్కువ కొలెస్ట్రాల్ హృదయ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇది గుండె జబ్బు, గుండెపోటు, లేదా స్ట్రోక్ బాధల  ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా, రమదాన్ తర్వాత కూడా మీరు ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారంను తీసుకొంటే తగ్గించిన కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడం చాలా సులభం.5.శాశ్వత ఆకలి తగ్గింపు: రమదాన్లో తినే ఆహారంలో తగ్గుదల వలన  మీ ఉదర పరిమాణం  క్రమంగా తగ్గిపోతుంది. మీరు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటును పొందాలనుకుంటే, దానికి రమదాన్ గొప్ప సమయం. రమదాన్ నెల ఉపవాసాలు పూర్తయినప్పుడు, మీ ఆకలి ముందు కంటే తక్కువగా ఉంటుంది, మరియు మీరు అతిగా తినడం మానివేస్తారు. అది ఒక సానుకూల పరిణామం.6.మలినాల తొలగింపు: ఆధ్యాత్మికంగా మిమ్మల్లి పరిశుభ్రపరచడం తో బాటు రమదాన్  మీ శరీరం లోని  అద్భుతమైన మలినాల నివారిణిగా పనిచేస్తుంది. ఉదయం తినడం లేదా తాగడం చేయనందున మీ జీర్ణవ్యవస్థ లోని మలినాల తొలగింపుకు  ఉపవాసం  అరుదైన అవకాశాన్ని ఇస్తుంది. మీ శరీరం లోని కొవ్వు నిల్వలను తగ్గించడం తో బాటు, కొవ్వు నిల్వలలో ఉండే హానికరమైన టాక్సిన్ను కూడా తొలగిస్తుంది. ఈ శరీరం ను శుభ్రపరిచి  ఒక ఆరోగ్యకరమైన, స్థిరమైన జీవనశైలి కి పునాది రాయి వేస్తుంది.


7.మరిన్ని పోషకాల గ్రహణ : రమదాన్ సమయంలో ఉదయం అంతా తినకపోవటం వలన  మీ జీవక్రియ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. శరీరం గ్రహించే ఆహార పోషకాల విలువ  పెరుగుతుంది. ఆపిపోనిక్టిన్ అని పిలువబడే హార్మోన్ పెరుగుదల వలన శరీర కండరాలు  మరింత పోషకాలను గ్రహిస్తాయి.శరీరమంతా మంచి శోషణం మరియు పోషకాలను కలిగి ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది.  


No comments:

Post a Comment