మైనారిటీ పౌరులు (ముస్లింలు ) భారత దేశం యొక్క రాజకీయ పటం నుండి కనుమరుగు
అయ్యే అవకాశం ఉంది
నిస్సందేహంగా, ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం
భారతీయ ప్రజాస్వామ్యంలో తగ్గుతుంది. భారతదేశ జనాభాలో ముస్లింలు అధికారికంగా 14.5 శాతం మంది ఉన్నారు. ఈ సమస్యను సకాలంలో
పరిష్కరించకపోతే, మైనారిటీ పౌరులు దేశం యొక్క రాజకీయ మ్యాప్ నుండి కనుమరుగవుతున్న
అవకాశం ఉంది.
దీర్ఘకాలంగా, భారతదేశంలోని రాజకీయ పార్టీలు,
పార్టీ లో మరియు శాసనసభలో మైనారిటీలకు సరసమైన
ప్రాతినిధ్యo ఇస్తూ వచ్చినాయి. అయితే ఇటీవల మైనారిటీలకు ముఖ్యంగా ముస్లింలకు రాజకీయ
ప్రాతినిధ్యం తగ్గుతున్నది.
16వ లోక్ సభ లో ముస్లిం
ప్రాతినిద్యం 23కు అనగా 4% కు తగ్గింది. 2019 లో ముస్లిం ప్రాతినిద్యం 27
కు అనగా 5% శాతం కు తగ్గింది. దేశ చరిత్రలో మొదటిసారిగా 2014, 2019 లోక్ సభ
ఎన్నికలలో అధికారం లోకి వచ్చిన పార్టీ నుంచి దేశం లో అతి పెద్ద మైనార్టి వర్గమైన
ముస్లిమ్స్ నుంచి ఎవరు ప్రతినిధులు లేరు.
గతంలో ముస్లింల జనాభా పరిమాణం మరియు లోక్ సభ లో వారి ప్రాతినిధ్యం మధ్య అంతరం బాగా
నిర్వహించబడింది. ఉదాహరణకు, భారత పార్లమెంటు 1952 లో ముస్లింలు 2% ఉంటె అది 1980 లో 10% కు పెరిగింది. 1984 నుండి 2009 వరకు, ముస్లిం ఎంపీల బలం ఎనిమిది శాతం
నుండి ఆరు శాతం వరకు ఉంది.
మైనారిటీల యొక్క సరిఅయిన ప్రాతినిధ్యం ప్రధాన పార్టీల చిహ్నాలతో
ఎన్నికలలో పోటీ చేయబడిన అభ్యర్థుల సంఖ్యతో ముడిపడి ఉంది. అయితే, గత రెండు దశాబ్దాలుగా, లోక్ సభ ఎన్నికలలో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టటానికి
ప్రధాన పార్టీలు స్థిరమైన ఉదాసీనతను
చూపాయి. ఉదాహరణకు, 2009 లో, బిజెపి నిలబెట్టిన నలుగురు ముస్లిం అబ్యర్దులలో ఒకరు
మాత్రమే విజయం సాధించారు.
2014 లో బిజెపి ఏడు ముస్లిం
అభ్యర్థులను నిలబెట్టింది కానీ ఎవరూ గెలవలేదు. 2019 పార్లమెంటరీ ఎన్నికలకు బిజెపి ఆరుగురు
ముస్లిం అభ్యర్థులను ప్రకటించింది. కాని ఎవరు విజయం పొందలేదు. 2009 లో, కాంగ్రెస్ నిలబెట్టిన ముస్లిం అభ్యర్ధులలో 10 మంది మాత్రమే గెలిచారు. 2014 లో ప్రకటించిన 31 మంది ముస్లిం అభ్యర్థులలో కేవలం
ఏడుగురు మాత్రమే గెలిచారు. 2019 లో, కాంగ్రెస్ పార్టీ తరుఫున 32 ముస్లిం అభ్యర్థులు పోటిచేయగా
కేవలం 4గురు మాత్రమే విజయం సాధించారు. ఆసక్తికరంగా
, మైనారిటీ ఓట్లపై ఎక్కువగా ఆధారపడిన ప్రాంతీయ పార్టీలు (ఒక్క
TMC తప్పితే) కూడా ఇదే విధమైన తిరస్కరణను
ప్రదర్శిస్తున్నాయి.
భారతదేశంలో మొత్తం 675 జిల్లాలలో 90 జిల్లాలలో ముస్లింలు 20 శాతం కన్నా ఎక్కువ ఉన్నారు.
ముస్లింలు 20 శాతం కంటే ఎక్కువ ఉన్న 85 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. దేసవ్యప్తంగా మొత్తం 4,121 అసెంబ్లీ నియోజకవర్గాలలో 720 లో ముస్లింలు నిర్ణయాత్మక
సంఖ్యలో ఉన్నారు. ముస్లిం ఓటర్లు అభ్యర్థుల మరియు పార్టీల విధిని మార్చే మంచి స్థితిలో అనేక స్థానాలలో ఉన్నారు. కానీ
ప్రబలమైన అభిప్రాయానికి వ్యతిరేకంగా, ముస్లింలు ఎన్-బ్లాక్ గా ఓటు
వేయరు.
ఎన్నికల ప్రక్రియలో సమానంగా, రాజకీయాల్లో పాల్గొనడానికి ముస్లింల
ఆశలు తిరస్కరించినప్పటికీ అవి పెరుగుతున్నవి. 2009 లో లోక్ సభ ఎన్నికలలో 819 ముస్లిం మంది ముస్లిం అభ్యర్థులు పోటి చేయగా వారి సంఖ్య 2014 లోక్ సభ ఎన్నికలలో 882 కు పెరిగింది.
అదేవిధంగా, ముస్లింలు ప్రత్యేకంగా ఒక
రాజకీయ పార్టి నిలబెట్టితే తప్ప ముస్లిం అభ్యర్థులకు
వోటు వేయరు అని అనడం మనం గమనించవచ్చు. అయినప్పటికీ, మెజారిటీ రాజకీయ పార్టీలు
మైనారిటీ కమ్యూనిటీలను టికెట్ ఇవ్వడం లో నిర్లక్షం
చేస్తూ ఉన్నవి.వారిని వోట్ బ్యాంక్ గా గుర్తిస్తున్నవి.
నిస్సందేహంగా, మైనారిటీ వర్గాల నుండి
అభ్యర్థిత్వం యొక్క ఉద్దేశపూర్వక తిరస్కారం జనాకర్షక మెజారిటీ వాదం కు సూచనగా
చెప్పవచ్చు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. రాజకీయ పరంగా మైనార్టీల వాణి తిరస్కారం
ప్రజాస్వామ్య సంక్షోభం కు సూచన. తిరస్కారం
మైనారిటీల మధ్య మొదటిగా రాజకీయ నిరాసక్తిని కల్పిస్తుంది. రెండవది, ప్రజాస్వామ్య వ్యవస్థలో వైవిధ్య
భిన్నత్వం యొక్క సూత్రాన్ని పాటించదు.
ముస్లింలకు అభ్యర్ధనను తిరస్కరించడానికి, రెండు అసంబద్ద ఆధారాలు
ఇవ్వబడ్డాయి. ఒకటి విజయ అవకాశం. రెండవది
ధ్రువీకరణ(పోలరైజేషన్). ఈ రెండు కారకాల ముందు, సమాన పౌర హక్కుల తిరస్కారం
మరియు రాజకీయంగా సమాన అవకాశాన్ని తిరస్కరించడం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం
చేయబడ్డాయి.
భారతదేశంలో ఈ పెరుగుతున్న ధోరణి 'ఓటింగ్ హక్కుల' నిర్వచనాన్ని మార్చింది.
దురదృష్టవశాత్తు భారతదేశంలో రైట్ వింగ్ పాలిటిక్స్ ప్రభావం కు లోబడి ఈ మినహాయింపు దొరణి ప్రాంతీయ పార్టీలలో కూడా బలపడుతోంది.
తిరస్కారం పరిష్కరించడానికి, ఒక శాసన రిజర్వేషన్ సూత్రం ప్రతిపాదన
అందించవచ్చు. కానీ, ఇది అపరిపూర్ణ పరిష్కారం. విభజన తరువాత రాజ్యాంగ అసెంబ్లీ
చర్చలో, మైనారిటీల కోసం శాసన రిజర్వేషన్ల ఆలోచనను ముస్లిం సభ్యులు
వ్యతిరేకించారు. అయితే ముస్లింల ప్రయోజనాలను ముస్లిం
ప్రత్యేక పార్టీలు మరియు సంస్థల ద్వారా మాత్రమే రక్షించవచ్చని కొందరు వాదిస్తున్నారు.
ఈ ఆలోచన సరి అయినది కాదు.
ముస్లింలు ముందు తమ కమ్యూనిటీ నాయకత్వాలను అభివృద్ధి చేయటమేకాక
మతాతీత పౌర సమాజ సంస్థల కార్యకలాపాల్లో చురుకుగా
పాల్గొనాలి. సాంస్కృతిక మరియు భావోద్వేగ అజెండా నుండి ముస్లింల జీవనోపాధిని
మెరుగుపరిచేందుకు అనుకూలమైన పథకాలు, విధానాలు మరియు కార్యక్రమాల వైపు
కమ్యూనిటీ దృష్టిని మార్చవలసిన అవసరం
ఉంది.
ముస్లిం కమ్యూనిటీ తమ కోసం పనిచేసే మేధావి వర్గాన్ని
సృష్టించాలి. మైనారిటీలు నాయకత్వ శిక్షణ
పొందకపోతే, వారి సమాజ ప్రత్యేక ఆసక్తులను నడిపించడానికి అవకాశం
కల్పించకపోతే ఏదీ సాధించబడదు. రాజకీయ తిరస్కారం అనేది మైనారిటీల వైఫల్యం మాత్రమే
కాదు, "వైవిధ్యంలో ఐక్యత" అనే భారతదేశ సాంప్రదాయ
వారసత్వం ను కూడా కోల్పోవడం అవుతుంది.
No comments:
Post a Comment