11 April 2019

ఆంధ్ర ముస్లిమ్స్ లేదా ఆంధ్రా ప్రదేశ్ ముస్లింలు (Andhra Muslims/Andhra Pradesh)





 
 సాధారణంగా వాడుక బాష లో ఆంధ్రప్రదేశ్ ముస్లింలను  ఆంధ్ర ముస్లింలు లేదా తెలుగు ముస్లింలు అని అందురు. ఆంధ్రప్రదేశ్ ముస్లింలు ప్రత్యేకమైన  సంస్కృతి మరియు సాంప్రదాయాలను కలిగి ఉర్దూ బాష  యొక్క ఒక ప్రత్యేకమైన మాండలికాన్ని మాట్లాడతారు, చాలా మంది  ఆంధ్రా ముస్లింలు తెలుగులో నిష్ణాతులు.
ఆంధ్రప్రదేశ్లోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు మరియు గుంటూరు జిల్లాలలో ఉర్దూ రెండవ అధికార భాష గా ఉంది. ఆహార అలవాట్లలో మరియు ఇతర లౌకిక పద్ధతులలో ఆంధ్రప్రదేశ్ ముస్లింలు విదేశీ సంస్కృతులచే తక్కువుగా  ప్రభావితమయ్యారు.

 ఆంధ్ర ముస్లింలు సున్నీ, మరియు హానాఫీ ఫిఖా ను అనుసరిస్తారు. తీర ఆంధ్రప్రదేశ్లో అల్ప షియా జనాభా కూడా ఉంది.
ఆంధ్రా ముస్లింలు మాట్లాడే భాష ను “దక్షిణ దఖని ఉర్దూ” అది  ప్రామాణిక ఉర్దూ కు బిన్నంగా ఉంటుంది.
మొఘల్స్ , కుతుబ్ షాహిస్ (గోల్కొండ సుల్తానేట్) మరియు అస్సఫ్ జహీల పరిపాలనలో  శతాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో ఇస్లాం వ్యాప్తి చెందినది. 

 

2011 జనాభా లెక్కల ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ యొక్క జనాభాలో 9% తక్కువగా సుమారు 4మిలియన్ ముస్లిం జనాభా కలిగి ఉంది. లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 960 మహిళలకు, జాతీయ సగటు 933 కంటే ఎక్కువగా ఉంది. అక్షరాస్యత రేటు జాతీయ సగటు 64% కంటే ఎక్కువగా 68% వద్ద ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ ముస్లింలు రాష్ట్రం మీద విస్తృతంగా వ్యాప్తి చెంది ఉన్నారు. వారి ఎక్కువుగా  కర్నూలు జిల్లాలో ఉన్నారు మరియు జిల్లా జనాభాలో 17% మంది ఉన్నారు. విజయవాడ, కడప, గుంటూరు మరియు అనంతపురంలో  ఎక్కువుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముస్లింలు చాలా తక్కువ గ్రామీణ జనాభా కలిగి నగరాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. కడప మరియు అనంతపురం నగరాలలో  లో వరుసగా 30% మరియు 25% ఉన్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రలో అతి కొద్దిమంది ముస్లింలు ఉన్నారు.

విభజన తరువాత, A.P. 13 జిల్లాలను కలిగి ఉంది. ఈ 13 జిల్లాల్లో, నాలుగు రాయలసీమ జిల్లాలు (కర్నూలు, కడప, అనంతపురం మరియు చిత్తూరు జిల్లాలు) మరియు నాలుగు తీరప్రాంత ఆంధ్ర జిల్లాలలో  (నెల్లూరు, ఒంగోలు, గుంటూరు మరియు కృష్ణా జిల్లాలు) గణనీయమైన ముస్లిం జనాభా కలిగి ఉంది.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో చిన్న ముస్లిం జనాభా ఉంది.
ఎక్కువమంది ఆంధ్రా ముస్లింలు వ్యవసాయదారులు. అనేకమంది ఆంధ్ర ముస్లింలు అనేక తరాలుగా  వివిధ వృత్తులలో (crafts) కనిపిస్తారు, కొందరు ఎక్కువుగా చిన్న వ్యాపారాలు మరియు "కుటిర్ పరిశ్రమ " లలోఉన్నారు. . ఆంధ్ర ముస్లింలలో ఉన్నత విద్య లేకపోవడం వలన కార్యనిర్వాహక స్థాయి ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం పరిమితం. కొంతమంది  ఆంధ్ర ముస్లింలు రాష్ట్రంలో మరియు కేంద్ర ప్రభుత్వంలో ప్రైవేటు రంగంలో ప్రత్యేకమైన పదవులను  కలిగి ఉన్నారు.


No comments:

Post a Comment