11 April 2019

లెజెండరీ "బెంగళూరు ముస్లిమ్స్" ఫుట్ బాల్ టీం



.


భారత దేశంలో ఫుట్ బాల్ ఆటకు పేరుగాంచిన జట్టులలో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్, మొహమ్మదన్ స్పోర్ట్స్ క్లబ్, డెంపో,సల్గోగోoకర్, హైదరాబాద్ పోలీస్ టీం, చర్చిల్ బ్రదర్స్, జగ్జీత్ కాట్టన్ అండ్ టెక్స్టైల్స్ టీం,కేరళ టీం ప్రముఖమైనవి. అలాగే ఫుట్ బాల్ టోర్నమెంట్స్ లలో  రోవర్స్ కప్, డురాండ్ ట్రోఫీ, సంతోష్ ట్రోఫీ,సుబర్తో కప్,IFA షీల్డ్, ఫెడరేషన్ కప్ ముఖ్యమైనవి.

1888 లో బ్రిటిష్ సైనికుల కోసం ప్రారంభమైన డురాండ్ కప్ భారత దేశంలో అతి ప్రాచిన కప్.
రోవర్స్ కప్ దేశంలోని  మూడు అతి పెద్ద టోర్నమెంట్లలో రెండవది, ఇది 1891 లో బ్రిటీష్ వారిచే ప్రారoబించబడినది.  ప్రారంభ సంవత్సరాల్లో, టోర్నమెంట్లో బ్రిటీష్ సైనిక  రెజిమెంట్ల ఫుట్ బాల్ జట్లు మాత్రమే పాల్గోనేవి.



1937 లో రోవర్స్ కప్ గెలుచుకున్న మొట్టమొదటి భారత జట్టు “బెంగళూరు ముస్లిమ్స్ ఫుట్  బాల్ క్లబ్ ”
 (Rovers Cup winners, 1937. Bangalore Muslims Football Club)

బెంగుళూర్ లోని అల్-అమీన్ కాలేజీ యొక్క క్రీడా స్టోర్ రూమ్ లో లబించిన కొన్ని చారిత్రాత్మిక ఫోటోలలో గత కాలపు ఒక ప్రముఖ ఫుట్బాల్ జట్టు యొక్క ఫోటోను అల్-అమీన్ విద్యా సంస్థల ఛైర్పర్సన్ ముంతాజ్ అలీ ఖాన్ ప్రదర్శించారు. ఆ ఫోటో యొక్క శీర్షిక: "రోవర్స్ కప్ విజేతలు, 1937 బెంగుళూరు ముస్లిమ్స్ ఫుట్బాల్ క్లబ్. 45 సంవత్సరాల క్రితం టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి ఈ ట్రోఫీని గెలుచుకున్న మొదటి భారత జట్టు బెంగుళూరు ముస్లిమ్స్.
ఈ పాత ఫోటోలు, ట్రోఫీలు మరుగుపడ్డ బెంగలూరు ఫుట్ బాల్  జట్టు జ్ఞాపకాలను మరోసారి గుర్తుకు తెచ్చాయి
బెంగళూరు ముస్లిమ్స్  (The Bangalore Muslims)

బెంగుళూరు ముస్లిమ్స్  ఫుట్బాల్ క్లబ్ సభ్యులు పొడవైన అర చేతుల చొక్కాలను  ధరించేవారు. చొక్కాలు తెలుపు స్లీవ్లు, పాకెట్లు మరియు పట్టీలతో నల్లగా ఉండేవి. వీరు  ఫుట్ బాల్ ఆటలో బ్రిటీష్ వారిన  ఓడించిన బూట్లెస్(bootless) టీం సభ్యులు.

రోవర్స్ కప్ దేశంలో మూడు పెద్ద టోర్నమెంట్లలో రెండవది, ఇది 1891 లో బ్రిటీష్ ప్రారంభమైంది. దాని ప్రారంభ సంవత్సరాల్లో, రోవర్స్ కప్ టోర్నమెంట్లో బ్రిటీష్ సైన్యం రెజిమెంట్ల ఫుట్ బాల్ జట్లు మాత్రమే ఉన్నాయి.

1910 ప్రారంభంలో, భారత సైనికులతో కూడిన టీం బెంగాల్ యునైటెడ్ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో రోవర్స్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు.  1923 లో, భారతీయ సివిల్/పౌర ఫుట్బాల్ క్లబ్లు రోవర్స్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు అనుమతించబడ్డాయి.

మోహన్ బాగన్ జట్టు  ఆ సంవత్సరపు ఫైనల్కు చేరినది. కాని గెలువ లేదు. టోర్నమెంట్ లో విజయం సాధించాలన్న భారత జట్టు కల మరో 45 సంవత్సరాలకు గాని  నెరవేరలేదు. బెంగుళూరు ముస్లిమ్స్  జట్టు (Bangalore Muslims Team)  యొక్క బేర్ఫుట్(boot less) పురుషులు బాంబేస్ కోపరేజ్ ఫుట్ బాల్ స్టేడియంలో రోవర్స్ కప్ లో చరిత్ర సృష్టించారు.


మ్యాచ్ థ్రిల్లర్గా కొనసాగింది. వార్తాపత్రికల కథనం ప్రకారం, బ్రిటీష్ రెజిమెంట్లను ఓడించిన తరువాత ఫైనల్స్కు చేరుకున్న బెంగళూరు ముస్లిమ్స్  మరియు మొహమ్మదిన్ FC - రెండు భారతీయ జట్లను చూడటానికి స్టేడియం లో 20,000 కన్నా ఎక్కువ మంది ఫుట్ బాల్ ప్రేమికులు ఉన్నారు. .ఈ మ్యాచ్ 1-0తో ముగిసింది, బెంగుళూరు ముస్లిమ్స్ జట్టు  యొక్క లక్ష్మినారాయణ్ గెలుపు గోల్ సాధించాడు.
ఒక సంవత్సరం తరువాత, బెంగుళూరు ముస్లిమ్స్  ట్రోఫీని సాధించారు. ఈసారి బ్రిటీష్ సైన్యం యొక్క అర్గిల్ మరియు సదర్లాండ్ హైలాండర్స్ రెజిమెంట్ జట్లను  ఓడించారు.
.
బెంగుళూరు ముస్లిమ్స్  టీం మెంబెర్స్  Members of the Bangalore Muslims team
బెంగళూరు ముస్లిమ్స్ టీం యొక్క ప్రాముఖ్యత వారి రోవర్స్ కప్ విజయాన్ని మించినది.1937 లో రోవర్స్ టోర్నమెంట్ గెలిచిన జట్టులో ఐదుగురు ఆటగాళ్ళు - ధర్మ, కాదర్వేల్, లింగన్న, మురుగేష్ మరియు లక్ష్మీనారాయణ్ - హిందువులు మరియు విభిన్న నేపథ్యాల నుండి వచ్చారు..

ఈ క్రమంలో బెంగుళూరు నుండి   అనేక ఇతర ఫుట్బాల్ జట్లు తమ పేర్లతో బెంగుళూర్ తగిలించుకొని  (బెంగుళూర్ బ్లూస్, బెంగుళూర్ రోవర్స్, బెంగుళూరు క్రెసెంట్) ఆరంభమయ్యాయి. సాధారణంగా అన్ని జట్టు సభ్యులను 'ముస్లిమ్స్  The Muslims’ గా పిలిచేవారు. జట్టులో ఉన్న హిందూ ఆటగాళ్లు కూడా ఈ పేరును గర్వంగా భావించేవారు.
 “బేర్ఫుట్ టు బూట్” అను గ్రంధంను రాసిన నోవీ కపాడియా ప్రకారం  1937 లో, బెంగళూరులోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(INC) యొక్క బృందం ఈ ఫుట్ బాల్ టీం కొరకు ఒక ప్రత్యేక స్వాగత కార్యక్రమం  నిర్వహించింది. వారు సెక్యులరిజం ప్రతినిధులుగా సత్కరించబడ్డారు మరియు వారి విజయం హిందూ-ముస్లిం ఐక్యతకు చిహ్నంగా పరిగణించబడింది.

" ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INC అభిప్రాయం లో  బెంగుళూరు ముస్లిమ్స్” స్వాతంత్ర్యం తరువాత కూడా  భారత్ ఒక అవిభక్త మరియు లౌకిక దేశంగా ఉంటుందనే తన వాదనను బలపరిచింది."అని నోవీ కపాడియా అభిప్రాయపడ్డారు.

ది జలేబి-స్టైల్ The Jalebi-Style


 
బెంగుళూరు ముస్లిమ్స్ టీం  ఆటగాళ్ళు ఒక ప్రత్యెక విలక్షణమైన శైలి ఆటని అభివృద్ధి చేసారు. వారు సాద్యమైనతవరకు బంతిని తమ స్వాధీనం లో ఉంచుకొనే వారు. ప్రత్యుర్ధులకు అందకుండా బంతిని  తమలో తాము ద్రిబ్లింగ్ చేసుకునేవారు దాంతో వారి ప్రత్యర్థులు విసిగి త్వరగా అలసిపోయేవారు.  ఈ విచిత్ర శైలి త్వరలోనే 'జలేబి' అనే మారుపేరును సంపాదించింది.
కపాడియా ప్రకారం, బెంగుళూరు ముస్లిమ్స్ యొక్క  ఈ శైలి వ్యూహం కన్నా అవసరం నుండి ఉద్భవించింది."ఈ టీం  ఆటగాళ్ళు చిన్న పాస్లు  ద్వారా బంతిని స్వాధీనం లో ఉంచుకొనే వారు. ఈ శైలి సంవత్సరాల్లో పరిపూర్ణత పొందింది మరియు 'బెంగుళూరు స్కూల్ అఫ్ ఫుట్బాల్”గా మారింది.

బెంగళూర్ ముస్లిమ్స్ ఆట చూడడానికి ఒక ఆనందం, ఒక సంపూర్ణ వినోదాన్ని అందించెది.
ఆ తరువాత సంవత్సరాలలో, బెంగుళూరు ముస్లిమ్స్ క్లబ్ జట్టు తిరిగి 1948 లో రోవర్స్ కప్ను గెలుచుకుంది మరియు అహ్మద్ ఖాన్ లాంటి  భారతదేశం యొక్క పలువురు ప్రముఖ ఫుట్బాల్ ఆటగాళ్ళు జట్టుకు ఆడారు. వాస్తవానికి, బెంగుళూరు ముస్లిమ్స్ జట్టు లో  ఖాన్ ఆట   1948 లండన్ ఒలింపిక్స్లో అతనికి  భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించింది.అహ్మద్ ఖాన్ 2017 లో పరమపదించారు. అప్పటికి అతను బెంగుళూరు ముస్లిమ్స్ జట్టు  స్వర్ణ యుగానికి చెందిన ఆటగాళ్ళలో చివరి వాడు.  

క్రమంగా క్రికెట్ పాపులారిటి తో బెంగుళూరు నగరం క్రికెట్ ఆటగాళ్ళకు ప్రసిద్ది చెందినది. చారిత్రాత్మక ఫుట్బాల్ టీం బెంగళూర్ ముస్లిమ్స్  యొక్క జ్ఞాపకం క్రమంగా  క్షీణిస్తుంది.



No comments:

Post a Comment