27 September 2020

భారతదేశంలో ముస్లిం విద్య: కొన్ని సూచనలు Muslim education in India: Some Suggestions


ముస్లింలు మరియు బలహీన వర్గాలలోని ఇతరులు అభివృద్ధి పరంగా ఇతర మత సమూహాలలో ఉన్నవారి కంటే చాలా వెనుకబడి ఉన్నారు. ప్రీ-స్కూల్ నుండి ఉన్నత విద్య ద్వారా వరకు విద్య లో అభివృద్ధి లోటు కన్పిస్తుంది.

 

2006 యొక్క సచార్ కమిటీ నివేదిక భారత దేశం లోని అనేక ప్రాంతాలలోని  మైనారిటీలు విద్యా పరంగా  "అభివృద్ధి లోటు" ను కలిగి ఉన్నారని వెల్లడించింది. ఈ నివేదిక భారతదేశంలో మైనారిటీల అభివృద్ధి కోసం బోర్డు ప్రోగ్రాంను రూపొందించింది.

 

2011 జనాభా లెక్కల ప్రకారం, ముస్లింలలో  అక్షరాస్యత రేటు 68.5 శాతానికి పెరిగింది. ముస్లిం స్త్రీల అక్షరాస్యత రేటు 52 శాతానికి తగ్గలేదు.

 

2013 చివరిలో యుఎస్ ఇండియా పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఒక అధ్యయనం ప్రకారం, 2006 నుండి,ఇతర వర్గాల జనాభాతో పోలిస్తే ముస్లింల అక్షరాస్యత స్థాయి మరియు మెరుగుదలలు నిరాడంబరంగా modest ఉన్నాయి.

 

అదే అధ్యయనం ప్రకారం, భారతదేశంలో ముస్లింలలో కేవలం 11 శాతం మంది మాత్రమే (జాతీయ సగటు సుమారు 19 శాతం) ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు అని తెలిపింది.

 నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) 75 వ రౌండ్ నివేదిక 3 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల ముస్లిం బాలికలలో 22 శాతం మంది ఎప్పుడూ అధికారిక/ఫార్మల్  విద్యా కోర్సులో చేరలేదని తేలింది.

సచార్ కమిటి నివేదిక తరువాత ముస్లిం సామాజిక వర్గం విద్యాపరంగా కొంత పురోగతి సాధించబడింది, కాని ఇంకా చాలా చేయాల్సి ఉంది.

 

అందుకు కొన్ని సూచనలు:

 అన్ని స్థాయిలలో విద్యావకాశాలను, నాణ్యతను మెరుగుపరచాలి. విద్యా అక్షరాస్యత ప్రారంభ రేఖగా ఉండాలి మరియు ఉన్నత విద్య ముగింపు రేఖగా ఉండాలి.

 ప్రాధమిక మరియు ద్వితీయ స్థాయిలలోని విద్యార్థుల కోసం, భాష, విజ్ఞానం, గణితం మరియు సాంకేతిక పరిజ్ఞానంలో ప్రాథమిక జ్ఞానం, నైపుణ్యాలు మరియు సామర్ధ్యాలను నిర్ధారించడానికి విద్యా మెరుగుదల కార్యక్రమాలను అప్‌గ్రేడ్ చేయవలసిన  అవసరం ఉంది.

ముస్లిం పిల్లలు మరియు యువత మదరసాల లో 2-4 శాతం మధ్య మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు. మదరసాలు  తమ పాఠ్యాంశాలను ఆధునీకరించాలి మరియు ఇస్లాం కేంద్రీకృత విద్య నుండి సమగ్ర విద్యా విధానానికి మారాలి.  మదరసా విద్యార్ధులు  పూర్తిగా భారతీయ సమాజంలో కలిసిపోయే విద్యావిధానం ను అనుసరించాలి.

 సెకండరీ మరియు పోస్ట్ సెకండరీ స్థాయిలలో సాంకేతిక, వృత్తి మరియు వృత్తి విద్యను కలిగి ఉండాలి.

 విద్య 21 వ శతాబ్దపు కేరియర్స్ లో  పాల్గొనడానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పోటీపడే సామర్థ్యాలు పెంచేదిగా ఉండాలి. విద్యా సౌకర్యాల విస్తరణ  ముస్లింలలోని పేదరికం తొలగించడానికి ఉపయోగపడుతుంది.

 ముస్లింలకు విద్యావకాశాలు కల్పించడంలో ముస్లిం సంస్థలు కృషి చేయాలి.

ముస్లిం బాలికల విద్యా ప్రాప్యతను మెరుగుపరచడానికి కృషి చేయవలసి ఉంది. విద్య బాలికలలో మార్పు ఏజెంట్ కావలి. తల్లి తన పిల్లలను విద్యావంతులను చేయగలదు. ముస్లిం  మహిళా గ్రాడ్యుయేట్లు భారతదేశాన్ని మరియు ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి అమూల్యమైన కృషి చేస్తారు.

భారత దేశం లోని వక్ఫ్ బోర్డులు  మరియు సంపన్న ముస్లింలు  "ప్రపంచ స్థాయి విద్యా సంస్థల" ఏర్పాటు మరియు అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయవలసిన అవసరం ఉంది.  భారత దేశం లోని ముస్లింలు మరియు ఇతర వర్గాల "అక్షరాస్యత మరియు హాజరు అంతరాలను" తగ్గించడానికి ఇది తోడ్పడుతుంది.

 

 

 

 

No comments:

Post a Comment