పార్లమెంట్
సెంట్రల్ హాల్ (సెంట్రల్ హాల్) లో భగత్
సింగ్ బాంబులు విసిరినప్పుడు బ్రిటిష్
ప్రభుత్వం భగత్ సింగ్ కుటుంబం మరియు వారి సన్నిహితుల
పై నిర్దయతో కక్షపురిత చర్యలను ప్రారంభించినది.. బ్రిటిష్ వారి అణచివేతకు భయపడి
అతని కుటుంబ సభ్యులకు ఆశ్రయం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో పంజాబ్లో
చాలా ప్రభావవంతమైన నాయకుడు మౌలానా హబీబుర్రహ్మాన్ లుధియాన్వి భగత్ సింగ్ కుటుంబ
సభ్యులకు ఆశ్రయం కల్పించడానికి ముందుకు వచ్చారు.
మౌలానా
తన ఇంటిలో భగత్ సింగ్ కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు. వారు ఒక నెలకు పైగా మౌలానా హబీబర్
రెహ్మాన్ ఇంట్లో అతిదులుగా ఉన్నారు. మౌలానా హబీబర్ రెహ్మాన్ కూడా ఆజాద్
హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్‌తో కూడా సన్నిహితంగా ఉండేవారు మరియు భారత జాతీయ ఉద్యమం లో ముఖ్యమైన పాత్ర
పోషించారు
మౌలానా
హబీబ్-ఉర్-రెహ్మాన్
లుధియాన్వి ఒక అరేన్ (తెగ) కు చెందినవాడు మరియు 1857 నాటి భారత తిరుగుబాటు
సమయంలో బ్రిటిష్ వలసరాజ్యాల పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిపిన స్వాతంత్ర్య
సమరయోధుడు షా అబ్దుల్ ఖాదిర్ లుధియాన్వి యొక్క ప్రత్యక్ష వంశస్థుడు.
1857 నాటి భారత తిరుగుబాటు సమయంలో హబీబ్-ఉర్-రెహ్మాన్
లుధియాన్వి తాత షా అబ్దుల్ ఖాదిర్ లుధియాన్వి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై
సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు మరియు పంజాబ్ నుండి వారిపై తిరుగుబాటు చేసిన
వారిలో మొదటివాడు. అతను ఒక పెద్ద పోరాట శక్తిని సేకరించి బ్రిటిష్ వారిని లూధియానా
నుండి మాత్రమే కాకుండా పానిపట్ నుండి కూడా తరిమికొట్టాడు. ఈ పోరాట శక్తిలో
ముస్లింలు, హిందువులు మరియు సిక్కులు
ఉన్నారు. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌కు మద్దతుగా దిల్లికి వెళ్లారు. అతను 1857 లో డిల్లి లోని చాందిని చౌక్
వద్ద వేలాది మందితో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన ప్రాణాలను త్యాగం
చేసినాడు..
మౌలానా
హబీబ్-ఉర్-రెహ్మాన్
లుధియాన్వి 3
జూలై 1892 న పంజాబ్
లోని లుధియానాలో జన్మించారు. మౌలానా హబీబ్-ఉర్-రెహ్మాన్ లుధియాన్వి మౌలానా
అబ్దుల్ అజీజ్
కుమార్తె బీబీ షఫతున్నిసాను వివాహం చేసుకున్నారు..
ఆయన
భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. ఖిలాఫత్ ఉద్యమం మరియు నాన్ కో ఆపరేషన్ ఉద్యమంలో
మౌలానా చాలా చురుకుగా పనిచేశారు. మౌలానా హబీబుర్ రెహ్మాన్ 1921 డిసెంబర్ 1 న మొట్టమొదటసారి
అరెస్టు చేయబడ్డాడు. లూధియానాలో వారి
ఉత్తేజకరమైన ప్రసంగాల వల్ల, అక్కడి ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు
చేశారు, ఆ
తర్వాత అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. వారు 14 సంవత్సరాలు
దేశంలోని అనేక జైళ్లలో గడిపారు మరియు హింసను అనుభవించారు.
మౌలానా
బంధువులు కూడా జాతీయోద్యమం లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు, స్వాతంత్ర్య
సమరయోధురాలు అయిన అయిన మౌలానా భార్య
షఫతున్నిసా బీబీకూడా జాతీయోద్యమం
లో పాల్గొని బ్రిటిష్ పోలీసుల
చేతిలో క్రూరమైన అణచివేతకు గురి అయినారు..
జమైత్-ఉల్-ఉలామా-ఎ-హింద్‌లో
కీలక పాత్ర పోషించిన లుధియాన్వి ఒక విప్లవ వక్త
మరియు భారతదేశంలో బ్రిటిష్ పాలనను అంతం చేయాలనుకున్న జాతీయవాద ఉద్యమం
మజ్లిస్-ఎ-అహ్రార్-ఉల్-ఇస్లాం(1920) (ది సొసైటీ ఆఫ్
ఫ్రీమెన్) వ్యవస్థాపకులలో ఒకరు.వారు
మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సలహా ప్రకారం ఈ పని చేసినారని మౌలానా అంతరంగికుల వాదన.ఈ
సమయంలో లుదియానా లో జరిగిన ఒక సంఘటన వారిన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేటట్లు
చేసింది..
1929 లో, బ్రిటిష్ 'డివైడ్ అండ్ రూల్' విధానం ప్రకారం పంజాబ్‌లోని
లుధియానాలోని గ్రాస్ మండి చౌక్ వద్ద హిందువులు మరియు ముస్లింల కోసం వేరు వేరు గా నీటి
కుండల ఉంచారు. మౌలానా మౌలానా హబీబర్ రెహ్మాన్
దానిని తీవ్రంగా వ్యతిరేకించారు మరియు
"సబ్కా పానీ ఏక్ హై" పేరుతో ఒక ప్రచారాన్ని ప్రారంభించాడు, ఇది దేశవ్యాప్తంగా
వ్యాపించింది. లూధియానాలో ఈ విషయంపై పెద్ద
నిరసన జరిగింది, ఇందులో
పండిట్ నెహ్రూ కూడా పాల్గొన్నారు. నిరసన
పలితంగా బ్రిటీష్ ప్రభుత్వం దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఒకే నీటి కుండను ఏర్పాటు
చేయవలసి వచ్చింది, ఇది
సబ్కా పానీ ఏక్ హై అనే సందేశాన్ని ఇస్తుంది.
మౌలానా
హబీబర్ రెహ్మాన్ ఎల్లప్పుడూ బ్రిటిష్ వారికి తలనొప్పి కల్గించేవారు.. అతను 1931 లో
షాహి జామా మసీదు సమీపంలో సుమారు మూడు వందల మంది బ్రిటిష్ అధికారులు మరియు పోలీసుల
సమక్షంలో భారత జెండాను ఎగురవేసారు. వారిని అరెస్టు చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం, వారిని సిమ్లా, మనాలి, ధర్మశాల, ముల్తాన్, లూధియానాతో సహా
వివిధ జైళ్లలో 14
సంవత్సరాలు ఉంచారు.
తన
చివరి క్షణం వరకు ప్రజల స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం కోసం కట్టుబడి ఉన్న మౌలానా
హబీబ్-ఉర్-రెహ్మాన్ లుధియాన్వి, 1956 సెప్టెంబర్
2 న కన్నుమూశారు (వయసు 64). అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆయనకు సన్నిహితులు
అని చెబుతారు. నెహ్రు అభ్యర్థన మేరకు మౌలానా హబీబర్ రెహ్మాన్‌ను డిల్లి లోని జామా
మసీదు సమీపంలోని స్మశానవాటికలో ఖననం చేశారు.
ఈ
సమాచారం అంతా ప్రసిద్ధ చరిత్రకారుడు మాస్టర్ తారా సింగ్ రాసిన 'హిస్టరీ ఫ్రీడమ్
మూవ్మెంట్ ఇన్ ఇండియా' పుస్తకంలో
ఉంది. మాస్టర్ తారా సింగ్ కూడా మౌలానాకు సన్నిహితులు.
మౌలానా
హబీబర్ రెహ్మాన్ మనమడు లూధియానాలోని షాహి జామా మసీదు ఇమామ్ మౌలానా హబీబుర్రహ్మాన్ కస్మిII ప్రకారం, సర్దార్ భగత్
సింగ్ కుటుంబ వాసులు ఇప్పటికీ ఆయనను సందర్శిస్తారు మరియు తమ పూర్వీకులు చెప్పిన సమాచారాన్ని
గుర్తు చేసుకొంటారు. భగత్ సింగ్ సోదరుడి కుమారుడు సంధు కూడా తరచుగా ఇక్కడకు వస్తాడు. అతను అభిప్రాయంలో
మౌలానా హబీబుర్రహ్మాన్ గొప్ప వ్యక్తి నిజమైన దేశభక్తుడు మరియు వారి కుటుంభ
దేశబక్తులగల కుటుంభం అని అంటాడు..
No comments:
Post a Comment