జినత్ మహల్ అని పిలువబడే బేగం సాహిబా జీనత్ మహల్ (زینت محل), (1823 - 17 జూలై 1886) కడపటి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా II జాఫర్ తరపున మొఘల్
సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాస్తవ సామ్రాజ్ని. ఆమె అతనికి ఇష్టమైన భార్య. మొఘల్ కడపటి చక్రవర్తి
బహదూర్ షా జాఫర్ భార్య అయిన బేగం జీనత్ మహల్ చాలా చిన్న వయస్సు గలది ఆమె వయస్సు
చక్రవర్తి వయస్సు లో సగం ఉండేది.జినత్ మహల్ 1840 నవంబర్ 19 న డిల్లి లో బహదూర్ షా II ను వివాహం చేసుకున్నారు మరియు వారికి మీర్జా జవాన్ బఖ్త్ అనే కుమారుడు
జన్మించాడు.
జీనత్ మహల్ తన కాలంనాటి అత్యంత ప్రభావవంతమైన మహిళలలో ఒకరు. ఆమెను
నూర్జహాన్ (జహంగీర్ భార్య) లక్ష్మీబాయి, రజియా సుల్తానా, హోల్కర్
అహిలియాబాయి మరియు చంద్ బీబీ తో పోల్చవచ్చు. ఆమె చక్రవర్తిని బాగా ప్రభావితం చేసింది మరియు క్రౌన్ ప్రిన్స్ మీర్జా దారా బఖ్త్ మరణం తరువాత, ఆమె తన కుమారుడు మీర్జా జవాన్ బఖ్త్ ను చక్రవర్తి
సింహాసనం కు వారసునిగా ప్రోత్సహించడం ప్రారంభించింది. కానీ బ్రిటీష్ వారి
ప్రిమోజెన్చర్ విధానం కారణంగా, ఇది అంగీకరించబడలేదు. ప్యాలెస్ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకున్నందుకు 1853 లో డిల్లి లోని బ్రిటిష్ రెసిడెంట్ థామస్ మెట్‌కాల్ఫ్ ను ఆమె విషపూరితం చేసినట్లు
అనుమానించబడింది.
స్వాతంత్ర్య సమరయోధురాలు అయిన ఆమె మే 11, 1857 ఉదయం మీరట్ నుండి వచ్చిన
తిరుగుబాటు సిపాయిలకు ఎర్ర కోట యొక్క తలుపులు తెరిచింది. కాని
సింహాసనాన్ని దక్కించుకునే ప్రయత్నంలో ఆమె తన కొడుకును తిరుగుబాటుదారులతో
సంబంధం లేకుండా చేసింది. బ్రిటీష్ వారు తిరుగుబాటును అనిచివేసినారు. చక్రవర్తి యొక్క మరో ఇద్దరు కుమారులు తిరుగుబాటుదారులకు మద్దతు ఇచ్చినందుకు
కాల్చి చంపబడ్డారు; అయినప్పటికీ, ఆమె కుమారుడు వారసుడు కాలేదు.
ఆమె ఎర్రకోటలో నివసించినప్పటికీ, డిల్లి
లోని లాల్ కువాన్లోని Lal Kuan, ఆమెకు సొంత హవేలీ కలదు.బ్రిటిష్ వారి పట్ల విధేయత చూపిన కొంతమంది సిపాయి
తిరుగుబాటుదారులు ఆమె హవేలీపై దాడి చేశారు. 1857 అక్టోబర్ మొదటి వారంలో
సాధారణ స్థితి నెలకొన్న తరువాత, ఆంగ్లేయులు డిల్లిని తిరిగి స్వాధీనం
చేసుకున్నారు మరియు వారి బేగం పట్ల అయిష్టత కారణంగా ఆమె హవేలికి నష్టం చేసారు.
1858 లో ఆమె భర్తను బ్రిటిష్ వారు పదవీచ్యుతుని చేసి, మొఘల్ సామ్రాజ్యాన్ని అంతం చేశారు, మరియు ఆమె తన భర్తతో కలిసి రంగూన్‌కు
బహిష్కరించబడింది. 1862 లో ఆమె భర్త మరణించిన తరువాత, రాచరికం రద్దు చేసే ప్రయత్నంలో బ్రిటిష్ వారు
చక్రవర్తి పదవిని పొందకుండా ఎవరినీ నిషేధించారు.
ఆమె జూలై 17, 1886 న మరణించింది(వయసు 93-94). కొంతమంది ఆమె భర్త మరణించిన తరువాత 20 సంవత్సరాలు మరణించినది అంటారు. ఆమెను రంగూన్
లో భర్త సమాధి స్థలం వద్ద ఖననం చేసారు. ఈ ప్రదేశం తరువాత బహదూర్ షా జాఫర్ దర్గా
అని పిలువబడింది. అనేక దశాబ్దాలుగా మరుగున పడిన తరువాత, 1991 లో పునరుద్ధరణ సమయంలో ఈ సమాధి కనుగొనబడింది.
ప్రస్తుతం దిల్లిలోని ఆమె హవేలిలో 111 సంవత్సరాల క్రితం
స్థాపించబడిన జీనత్ మహల్ బాలికల సీనియర్ సెకండరీ ప్రభుత్వ పాఠశాల ఉంది. ప్రస్తతం
దానిని "సర్వోదయ కన్యా విద్యాలయ, లాల్ కువాన్" అని పిలుస్తారు.
No comments:
Post a Comment