అనంత కరుణామయుడు,
అపార కృపాశాలి అయిన అల్లాహ్ పేరుతో
ప్రారంభిస్తున్నాను. (In the Name of Allah, the Most Gracious and Most Merciful)
గురువు లేదా ఉపాధ్యాయుడు
అంటే ప్రజలు నేర్చుకోవడానికి సహాయపడే వ్యక్తి. జీవితానికి అవసరమైన విలువలు, సరైన నైతిక విలువలు మరియు క్రమశిక్షణ నేర్చుకోవడంలో
ఉపాధ్యాయుడు విద్యార్థులకు సహాయం చేస్తాడు. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆధ్యాత్మిక
రూపం. బోధనా ఇస్లాంలో అత్యంత ఆదరణియమైన వృత్తిగా
పరిగణించబడుతుంది.
ప్రవక్తలందరూ కూడా
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు పంపబడిన ఉపాధ్యాయులు మరియు ప్రవక్త
ముహమ్మద్ (స) మానవాళి అందరికీ గురువు. విద్య అనేది జ్ఞానోదయo పొందటానికి సహాయపడుతుంది. ఈ విలువైన జ్ఞానాన్ని పొందడానికి
నిజంగా సహాయపడేది గురువు.
ఇస్లాం ప్రకారం గురువు
యొక్క స్థానం:
·
పవిత్ర ఖుర్ఆన్ లో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ (SWT) ఇలా అంటాడు; "అల్లాహ్ మీ లో విశ్వసించినవారికి మరియు జ్ఞానాన్ని సంపాదించినవారిని ఉన్నత స్థానాలు
ప్రసాదిస్తాడు." (58: 11)
·
అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో ఇలా అంటాడు “తెలిసినవారు
(జ్ఞానం ఉన్నవారు) మరియు తెలియని వారు ఇద్దరు ఎప్పుడైనా సమానులు కాగలరా?” (ఖుర్ఆన్ 39: 9)
పై ఆయాతులలో జ్ఞానం ఉన్న వ్యక్తిగా
ఉండటం ఎంత ముఖ్యమో మనకు స్పష్టంగా అర్థం అవుతుంది..
గురువు ఆధ్యాత్మిక పోషణను అందించేవాడు మరియు విద్యార్ధుల ప్రవర్తన వ్యవహారాలను మెరుగుపరుస్తాడు.
· పవిత్ర ఖుర్ఆన్
యొక్క 96 వ అధ్యాయం(అల్
అలఖ్) మొదటి ఆయత్ యొక్క మొదటి పదం 'ఇక్రా' (చదవడం లేదా పఠించడం)- ఇది
స్పష్టంగా 'ఇల్మ్ ' (జ్ఞానం) సూచించును.
అధ్యాపక వృత్తి పాల్గొనే
వ్యక్తి ప్రోత్సాహం మరియు ప్రశంసలు అర్హుడని గమనించవచ్చు.ఉపాధ్యాయులను ప్రతి ధర్మం
లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా భావిస్తారు. యువతకు విద్యనందించడానికి వారు చేసే కృషి, సామాజిక అభివృద్ధి,నిర్మాణంలో మొదటి
ఇటుకగా వారు ఉండెదరు. ఉపాద్యాయుడు విద్యార్ధుల వ్యక్తిగత అభివృద్ధి మరియు సమాజ వికాసానికి మార్గనిర్దేశం చూపుతాడు. విద్యార్థి నైతిక
స్వభావం మరియు మర్యాదలను అభివృద్ధి చేస్తాడు.
ఉపాధ్యాయుడికి భావ
ప్రకటనా స్వేచ్ఛ ఉండాలి. ఉపాధ్యాయులు గౌరవం పొందాలి. కోవిడ్-19 సంక్షోభం లో
కూడా ఆన్‌లైన్ మోడ్‌ల ద్వారా విద్యనభ్యసించచే విద్యార్థులకు సహాయం చేయడానికి ఉపాధ్యాయులు ప్రయత్నిస్తున్నారు.
వారు ఆన్‌లైన్‌లో ఉపన్యాసాలు ఇస్తారు, విద్యార్థులతో ఆన్- లైన్లో సంభాషించెదరు.
సంక్షోభంలో కూడా మన
భవిష్యత్తును తిరిగి విశ్లేషించడానికి లేదా పున రూపకల్పన చేయడానికి సహాయపడే ఉపాధ్యాయులందరిని ప్రశంసల ప్రోత్సాహంతో మరింత ఉత్తేజపరచాలి.
No comments:
Post a Comment