1857 మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో, ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా ఢిల్లీ మరియు మీరట్‌లకు వ్యూహాత్మకంగా సామీప్యత కారణంగా ముఖ్యమైన పాత్ర పోషించింది. బులంద్‌షహర్‌లో, తిరుగుబాటు ప్రధానంగా స్థానిక గుజ్జర్ మరియు రాజ్‌పుత్ కమ్యూనిటీలచే ప్రారంబి౦ప బడినది. మలగూర్ నవాబ్ మరియు బులంద్‌షాదర్ సుబేదార్ నవాబ్ వాలిదాద్ ఖాన్ వలస ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తిరుగుబాటు ఉద్యమానికి నాయకుడిగా ఎంపికయ్యారు.
నవాబ్ వాలిదాద్ ఖాన్ మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ యొక్క బావ. 11 జూన్ 1857న, నవాబ్ వాలిదాద్ ఖాన్ దళాలు బులంద్‌షహర్‌పై నియంత్రణ సాధించేందుకు బ్రిటిష్ వారిని ఓడించాయి. నవాబ్ వాలిదాద్ ఖాన్ చే ప్రభుత్వ భవనాలు, రికార్డులు ధ్వంసం చేయబడి, కొత్త రెవెన్యూ పరిపాలన ప్రారంభించి, ఆ ఆదాయాన్ని ఢిల్లీకి పంపించారు. త్వరలోనే, ఎగువ దోయాబ్ ప్రాంతం (ఆధునిక పశ్చిమ యుపి) పాలనను నవాబ్ వాలిదాద్ ఖాన్ కు అప్పగించారు. నవాబ్ వాలిదాద్ ఖాన్ వలన వలస ప్రభుత్వ నియంత్రణను పూర్తిగా స్తంభించినది. .
బ్రిటీష్ వారు జిల్లాను తిరిగి
స్వాధీనం చేసుకోవడానికి బలగాలతో తిరిగి వచ్చినప్పుడు, బ్రిటిష్ వారు మళ్లీ
ఓడిపోయారు. వాలిదాద్ ఖాన్ యొక్క ప్రజాదరణను విచ్ఛిన్నం చేయడానికి, ఆంగ్లేయులు నవాబ్
వాలిదాద్ ఖాన్ కు వ్యతిరేకంగా స్థానిక జాట్‌లను ప్రేరేపించారు మరియు నవాబ్ వాలిదాద్
ఖాన్ ని ఓడించడానికి స్థానిక జాట్‌ల సహాయం కోరారు. చివరకి భితోరాలో నవాబ్ వాలిదాద్ ఖాన్ దళాల ఓటమికి
దారితీసింది. నవాబ్ నవాబ్ వాలిదాద్ ఖాన్ మొఘల్ చక్రవర్తి నుండి అదనపు బలగాలను
కోరాడు మరియు సెప్టెంబరు 28న ఇరు
పక్షాల మద్య భీకర యుద్ధం జరిగింది. పలితంగా యుద్ధం లో నవాబ్ నవాబ్
వాలిదాద్ ఖాన్ ఓటమి పొందినాడు. బ్రిటీష్ వారు నవాబ్ నవాబ్ వాలిదాద్ ఖాన్ ని
పట్టుకుని, బులంద్‌షహర్‌లోని
కాలా ఆమ్‌లో బహిరంగంగా ఉరితీశారు
No comments:
Post a Comment