కేవలం 100
రూపాయలకే డయాలసిస్ - నమ్మశక్యంగా లేదు కదూ!
కోల్‌కతా కమ్యూనిస్ట్ రాజకీయ నాయకుడు, వైద్యుడు డాక్టర్ ఫువాద్ హలీమ్ చేసే సేవ నిజంగా వందలాది మంది ప్రాణాలను కాపాడింది మరియు విఫలమైన కిడ్నీలకు చేసే ఖరీదైన డయాలసిస్ చికిత్స ను ఖర్చు భరించలేని వారికి కూడా ఆశను ఇచ్చింది.
డాక్టర్ ఫువాద్ హలీమ్ కొంతమంది తోటి వైద్యులతో
కలిసి 20 సంవత్సరాల క్రితం 100 రూపాయలకే డయాలసిస్ కార్యక్రమాన్ని
ప్రారంభించాడు. రోజురోజుకు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులను తట్టుకోలేని పేద ప్రజలకు వైద్య ఛార్జీలు తగ్గించబడి
చేస్తున్న వైద్య సేవ బహుశా ఇదే.
డయాలసిస్‌కు మొదట్లో రూ.600గా నిర్ణయించిన ఛార్జీలు నేడు రూ.100గా
ఉన్నాయి.
డాక్టర్ ఫువాద్ హలీమ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్
ఇండియా (మార్క్సిస్ట్) సభ్యుడు. ఫువాద్ హలీమ్ తండ్రి హషీమ్ అబ్దుల్ హలీమ్ వామపక్ష
నాయకుడు మరియు రెండు దశాబ్దాలకు పైగా బెంగాల్ శాసనసభ మాజీ స్పీకర్.
డాక్టర్ ఫువాద్ హలీమ్ కూడా 2021 అసెంబ్లీ ఎన్నికలు మరియు 2019 లోక్‌సభ
ఎన్నికలలో పోటీ చేశారు, కాని విజయం పొందలేదు.
ఫువాద్ హలీమ్ కోల్‌కతాలో జన్మించాడు మరియు
సెయింట్ ఆంథోనీస్ స్కూల్‌లో మరియు తరువాత సెయింట్ జోసెఫ్స్ కొలీలో చదువుకున్నారు..
ఫువాద్ హలీమ్ నీల్ రతన్ సర్కార్ మెడికల్ కాలేజీ నుండి వైద్యశాస్త్రంలో డిగ్రీ
పొందాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రాయల్ కాలేజీకి చెందిన అపోలో గ్రూప్‌లో ఫెలోషిప్
చేశారు.
ఫువాద్ హలీమ్ తన స్నేహితులు మరియు సహాయకుల
సహకారం తోనే డయాలసిస్ కార్యక్రమాన్ని ప్రారంభించి, కొనసాగించగలిగానని చెప్పారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో డాక్టర్ ఫువాద్ హలీమ్ వద్ద
రూ. 50 టోకెన్ రుసుముతో దాదాపు 24,000
డయాలసిస్ చేయించుకున్నారు!
“ప్రస్తుతం, డయాలసిస్‌కు మా రేటు రూ. 100. మేము ప్రారంభించినప్పుడు డయాలసిస్ రేట్ రూ.600, రెండేళ్ల తర్వాత రూ.550కి తగ్గించాం. 2009లో అది 500కి తగ్గింది. తర్వాత
రెండేళ్లలో అది 450కి చేరింది. కోవిడ్‌కు ముందు రూ.300కి
డయాలసిస్‌ని అందజేసేవాళ్లం, మహమ్మారి సమయంలో దీన్ని 50 రూపాయలకు తగ్గించారు. ” అని డాక్టర్ ఫువాద్ హలీమ్ అన్నారు.
డయాలసిస్‌కు ఒక సెషన్‌కు రుసుము రూ. 100. డాక్టర్ ఫువాద్ హలీమ్ కన్సల్టేషన్ రుసుము రూ. 50.
దీనికి తోడూ డాక్టర్ ఫువాద్ హలీమ్ హాస్పటల్ లో నామమాత్రపు
రుసుముతో కంటి నుండి శుక్లాన్ని తొలగించే దాదాపు
3,000 కంటిశుక్లం ఆపరేషన్లను నిర్వహించారు.
రక్తదానం శిబిరాలు నిర్వహించారు.
కోల్‌కతా స్వాస్థ్య సంకల్ప్‌తో డా. హలీమ్‌తో
అనుబంధం ఉన్న సంస్థ 2009లో జాతీయ అవార్డును
కూడా అందుకుంది.
డాక్టర్ ఫువాద్ హలీమ్ డయాలసిస్ మిషన్ 82
ఏళ్ల సంస్థ - పీపుల్స్ రిలీఫ్ కమిటీతో కలిసి ప్రారంభించబడింది.
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగి
ప్రాణాలను కాపాడాలంటే, సరైన కాలానికి సరైన
డయాలసిస్ చేయడం చాలా ముఖ్యము. డయాలసిస్ ఖర్చును తగ్గించడ౦ లో హాస్పటల్ సేకరించే విరాళం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
డాక్టర్ హలీమ్ తాత 1925లో
కోల్‌కతా కార్పొరేషన్ ఎన్నికల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌తో కలిసి పోటీ చేశారు. డాక్టర్
హలీమ్ తండ్రి హషీం అబ్దుల్ హలీం కమ్యూనిస్టు పార్టీలో చేరి కార్యకర్తగా పని
చేస్తూ అట్టడుగు స్థాయిలో పనిచేశారు.
No comments:
Post a Comment