12 July 2024

80 ఏళ్ల విరామం తర్వాత(1857తరువాత) ఎర్రకోటలో ఈద్ నమాజ్. Namaz in Red Fort after (1857) a gap of 80 years.

 



నవంబర్ 20, 1945, ఢిల్లీకి చెందిన ఒక వార్తాపత్రిక "ది డైలీ అన్సారీ" ఎనభై సంవత్సరాల తరువాత  చారిత్రక ప్రదేశం ఎర్రకోటలో మౌలానా అహ్మద్ సయీద్ దేహ్లావి మొదటి సారి ఈద్ ప్రార్థనకు నాయకత్వం వహించారని, ఇటువంటి ప్రార్థన నిర్వహించడం ఇదే మొదటిసారి అని  ఈ సంఘటన చరిత్రలో ఒక ముఖ్యమైన క్షణంగా భావించబడింది అని ప్రచురించినది.  

 



 

బ్రిటీష్ వారు మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌ను ఎర్రకోట నుండి తొలగించి రంగూన్‌కు పంపిన తరువాత, బ్రిటీష్ వారు ఈ స్థలాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బ్రిటీష్ వారు తమ సైనిక బ్యారక్‌లను ఎర్రకోట లో ఉంచారు.

ఆజాద్ హింద్ ఫౌజ్ మరియు ఎర్రకోట

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రంగూన్‌లోని బహదూర్ షా జాఫర్ సమాధి వద్దకు చేరుకుని "ఢిల్లీ చలో" అని పిలుపునిచ్చారు. దీని తరువాత, ఆజాద్ హింద్ ఫౌజ్ భారతదేశం వైపు కదిలింది దారిలో వారు ఓటమిని ఎదుర్కొన్నారు మరియు లొంగిపోవాల్సి వచ్చింది.

ఆ తరువాత, బ్రిటిష్ వారు ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులను ఎర్రకోటలో విచారణ చేసారు. ఎర్రకోట బ్యారక్‌లలో పెద్ద సంఖ్యలో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులను బంధించారు. ఇంతలో, ఈద్ వస్తుంది మరియు జమియత్ ఉలమా-ఎ-హింద్ సెక్రటరీ మౌలానా అహ్మద్ సయీద్ దెహ్లావి ఎర్రకోటలో ఈద్   ప్రార్థనలకు నాయకత్వం వహిస్తారు. మొఘలుల పతనం తర్వాత ఎర్రకోట చరిత్రలో ప్రార్థనలు జరగడం ఇదే తొలిసారి. దానితో పాటు, వచ్చే వారం గురునానక్ దేవ్ జీ జయంతి అని, కాబట్టి సిక్కు ఖైదీలకు గురునానక్ దేవ్ జీ జయంతిని జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని కూడా అభ్యర్థించబడినది.

ఆగస్టు 31, 1942న తన రేడియో ప్రసంగంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయ ముస్లిం పండితుల అతిపెద్ద సంస్థగా జమియత్ ఉలమా-ఎ-హింద్ ను పేర్కొన్నారు. ముఫ్తీ కిఫయతుల్లా దెహ్లావి జమియత్ ఉలమా-ఎ-హింద్ కు నాయకులు. మౌలానా అహ్మద్ సయీద్ దెహ్లావి స్వయంగా ముస్లిం పండితులు, దేశభక్తి కలిగిన వ్యక్తి అయిన ముఫ్తీ కిఫయతుల్లా దెహ్లావి శిష్యుడు. ముఫ్తీ కిఫయతుల్లా దెహ్లావి భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించారు. 1921 మరియు 1947 మధ్య భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో, ముఫ్తీ కిఫయతుల్లా దెహ్లావి ఎనిమిది సార్లు జైలుకు వెళ్ళారు.

 

No comments:

Post a Comment