సమ్మర్ ఒలింపిక్స్‌లో 1900
ఎడిషన్ నుండి ఇప్పటివరకు భారత్ 35 పతకాలు సాధించింది.
ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయుడు
నార్మన్ ప్రిచర్డ్.
1900
పారిస్ ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ భారతదేశానికి మొదటి ఒలింపిక్ పతకాన్ని
సాధించాడు.
ప్రిచర్డ్, ఆంగ్లో-ఇండియన్ అథ్లెట్. ప్రిచర్డ్ అథ్లెటిక్స్ ఈవెంట్‌లలో రెండు రజత పతకాలను సాధించినాడు.
ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పోటీపడుతున్న
ప్రిచర్డ్ 200 మీటర్ల పరుగు మరియు 200
మీటర్ల హర్డిల్స్ రెండింటిలోనూ రజతం సాధించాడు.
ప్రిట్‌చర్డ్ ప్రాతినిధ్యం గురించి కొంత
వివాదం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)
ప్రిట్‌చర్డ్
పతకాలను భారతదేశానికి జమ చేస్తుంది.
1928
ఆమ్‌స్టర్‌డామ్ ఒలింపిక్స్‌లో పురుషుల ఫీల్డ్ హాకీ జట్టు స్వర్ణం సాధించినది.
స్వతంత్ర దేశంగా
1948
లండన్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి మొదటి స్వర్ణ పతకం పురుషుల హాకీలో వచ్చింది.
నాలుగు సంవత్సరాల తరువాత 1952లో రెజ్లర్
KD
జాదవ్
కాంస్యం సాధించడం ద్వారా స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి వ్యక్తిగత పతక విజేత అయినాడు.
No comments:
Post a Comment