6 April 2020

ప్రొఫెసర్ అబ్దుల్ బారి 1892-1947 Professor Abdul Bari1892-1947


.
 Abdul Bari (professor) - Alchetron, The Free Social Encyclopedia

ప్రొఫెసర్ అబ్దుల్ బారి (1892-1947) 1892లో బీహార్ లోని జహానాబాద్ జిల్లా కాన్సువా (Kansua)లో జన్మించారు. అబ్దుల్ బారి బీహార్ లోని మాలిక్ ఫ్యామిలీకి చెందినవాడు అతని తండ్రి ఎండి. ఖుర్బాన్ అలీ.

ప్రొఫెసర్ బారి ప్రముఖ భారతీయ విద్యా వేత్త మరియు సామాజిక సంస్కర్త. విద్య ద్వారా ప్రజలను మేల్కొల్పి  భారతీయ సమాజంలో సామాజిక సంస్కరణను తీసుకురావడానికి ఆయన ప్రయత్నించారు. బానిసత్వం, సామాజిక అసమానత మరియు మతతత్వ అసమానత లేని భారతదేశం ఆయన కోరుకొన్నారు.
.
అబ్దుల్ బారి తన M.A. డిగ్రీ ని పాట్నా కళాశాల, పాట్నా విశ్వవిద్యాలయం నుండి పొందాడు.మహాత్మా గాంధీని మొదటిసారి కలిసినప్పుడు అబ్దుల్ బారి బీహార్ నేషనల్ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. మహాత్మా గాంధీ ప్రారంభించిన అహింసా సిద్ధాంతం ఆయనకు ఎంతో ప్రేరణ కలిగించింది. 1921 లో సదాకత్ ఆశ్రమo పాట్నాలో జాతీయ స్థాయి కళాశాల స్థాపించబడింది, దీనిలో డా. రాజేంద్ర ప్రసాద్ ప్రిన్సిపాల్, అబ్దుల్ బారి ప్రొఫెసర్.

ప్రొఫెసర్ బారి  1922 లో నాన్-కో-ఆపరేషన్ ఉద్యమంలో రాజేంద్ర ప్రసాద్ తో కలసి చురుకైన పాత్ర పోషించాడు. 1917-1947 వరకు జాతీయోద్యమ మరియు కార్మిక సంఘ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు.గాంధీ యొక్క శాసనోల్లంఘన ఉద్యమం మరియు ఉప్పు సత్యాగ్రహాలలో చురుకుగా పాల్గొన్నాడు.

1921, 1922 మరియు 1942 లో స్వాతంత్ర్య పోరాట ఉద్యమం పాల్గొని బీహార్, బెంగాల్ మరియు ఒరిస్సాలోని కార్మిక సంఘ కార్యక్రమాలలో  చురుకైన పాత్ర వహించినాడు. బారత ప్రధమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ యొక్క  శిష్యుడు మరియు సహోద్యోగి అయిన ప్రొఫెసర్ అబ్దుల్ బారి "ఖిలాఫత్ ఉద్యమం" లో కూడా పాల్గొన్నాడు. బారి సోషలిస్ట్ పార్టీ, స్వరాజ్ పార్టీతో సహా పలు రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చారు

అబ్దుల్ బారి తన జీవితకాలంలో అనేక ముఖ్యమైన పదవులకు అధిస్టించినాడు. 1936 లో జరిగిన ప్రాంతీయ ఎన్నికలలో, బీహార్‌ లో M.L.A గా ఎన్నికయ్యారు మరియు బీహార్ లో మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు డిప్యూటి స్పికర్ గా ఎన్నికైనాడు. 1937 లో అబ్దుల్ బారి బీహార్ లేబర్ ఎంక్వైరీ కమిటీ వైస్ చైర్మన్ గా అయ్యారు. రాజేంద్ర ప్రసాద్ దానికి చైర్మన్

ప్రొఫెసర్ బారి  నేతాజీ షుబాష్ చంద్రబోస్‌తో కూడా చాలా సన్నిహితంగా ఉండేవాడు. నేతాజీ అభ్యర్థన మేరకు అబ్దుల్ బారి జంషెడ్‌పూర్‌లో కార్మిక సంఘానికి 1936లో నాయకత్వం వహించాడు.. నేతాజీ సలహా మేరకు 1937 లో జంషెడ్పూర్ లేబర్ అసోసియేషన్ పేరును టాటా వర్కర్స్ యూనియన్ గా మార్చారు. టాటా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడుఅయ్యాడు.1937 లో టిస్కో (ఇప్పుడు టాటా స్టీల్) మేనేజ్‌మెంట్‌తో కార్మిక నాయుకుడిగా మొదటి చారిత్రక ఒప్పందం కుదుర్చుకొన్నాడు.

అతను అఖిల భారత మజ్దూర్ సేవక్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ప్రొఫెసర్ బారి భారతదేశంలో కార్మిక పోరాటంలో అతిపెద్ద నాయకులలో ఒకరు .అబ్దుల్ బారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, కార్మికుల హక్కుల విషయానికి వస్తే అతను తన సొంత పార్టీ కాంగ్రెస్‌ను ప్రశ్నించాడు

1942క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆయన తరువాత బీహార్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. అతను 1946 నుండి మార్చి 28, 1947 వరకు మరణించే వరకు బీహార్ కాంగ్రెస్ కమిటీ (B.P.C.C) అధ్యక్షుడిగా ఉన్నారు.

మహాత్మా గాంధీ ఆదేశించిన కొన్ని అధికారిక పనుల కోసం అబ్దుల్ బారి 1947 మార్చి 28 న జంషెడ్పూర్ నుండి పాట్నాకు వెళుతుండగా ఫతువా రైల్వే క్రాసింగ్ సమీపంలో  కాల్చి చంపబడ్డాడు. అతని మరణం తరువాత, పూర్తి సమ్మె గమనించబడింది మరియు టాటా అవసరమైన సేవలను మినహాయించి అన్ని సేవలను మూసివేసింది.

అబ్దుల్ బారి యొక్క దారుణ హత్య అనంతరం గాంధీ జీ అతని స్వస్థలమైన కోయెల్వార్koelwarను సందర్శించి, దుఖిత  కుటుంబాన్ని కలిశారు. గాంధీ, మార్చి 29, 1947 న చేసిన ప్రసంగంలో, బారి యొక్క సరళత మరియు నిజాయితీని పెర్కొన్నాడు.  తన ప్రసంగంలో గాంధీ బారిని "ఫకీర్ హృదయంతో చాలా ధైర్యవంతుడు" అని పేర్కొన్నాడు.

ఈ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడి కుటుంబం దారుణమైన పేదరికం అనుభవిస్తున్న దృశ్యం గాంధీజిని కలచివేసింది. అత్యక్రియలకు కూడా  కూడా కుటుoబం  వద్ద డబ్బు లేదు. అతనిని పీర్ మోహాని  కబ్రిస్తాన్, పాట్నాలో సమాధి చేయడం జరిగింది.

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అతని మొదటి మరణ వార్షికోత్సవం సందర్భంగా మజ్దూర్ అవాజ్లో ప్రచురించిన సందేశం ద్వారా దేశానికి చేసిన కృషిని (ఇద్దరూ కలిసి 1921 లో కలిసి పనిచేశారు) గుర్తుచేసుకున్నారు. ప్రొఫెసర్ బారి  దేశం కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు.

ఖ్యాతి/లెగసి:

అతని పేరుమీద అనేక సంస్థలు స్థాపించబడినవి.
*అబ్దుల్ బారి మెమోరియల్ కాలేజ్, గోల్మురి, జంషెడ్పూర్
అబ్దుల్ బారి టౌన్ హాల్, జెహనాబాద్
బారి మైదాన్ సక్చి  (Sakchi), జంషెడ్పూర్
బారి పార్క్, రాంచీ
ప్రొఫె. అబ్దుల్ బారి టెక్నికల్ సెంటర్, పాట్నా
* ప్రొఫె. అబ్దుల్ బారి మార్గం, పాట్నా
ప్రొఫె. అబ్దుల్ బారి మెమోరియల్ హై స్కూల్, నోముండి ఐరన్ మైన్, సింగ్భూమ్ (W), జార్ఖండ్
బారి మైదాన్, బర్న్‌పూర్, అసన్సోల్
ప్రొ. అబ్దుల్ బారి రైలు-రహదారి వంతెన, కోయిల్వర్
బారి మన్జిల్ (యునైటెడ్ ఐరన్ & స్టీల్ వర్క్స్ యూనియన్), కుల్తి






























No comments:

Post a Comment