అలీ ముస్లియార్ గా
ప్రసిద్ది కెక్కిన ఎరిక్కున్నన్ పలాట్టు
మలాయిల్ అలీ (1861-1922) బ్రిటీష్
ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో 1921–22 మప్పిలా
తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ప్రముఖ సూఫీ నాయకులలో ఒకరు. అతను ఖాదిరియా తారికా
యొక్క సూఫీ.
ముస్లియార్ మస్జిద్
అల్-హరామ్ నుండి విద్యావంతుడైన ఇస్లామిక్
పండితుడు. అతను 1907 నుండి తిరురంగడి
మసీదు యొక్క ఇమామ్‌గా పనిచేశాడు. మప్పిలా తిరుగుబాటు లో పాల్గోనందుకు కోయంబత్తూ సెంట్రల్ జైలులో ఉరితీయబడ్డాడు. అతను
ఖిలాఫత్ ఉద్యమం యొక్క చురుకైన వక్త.
ముస్లియార్
మలబార్ జిల్లాలోని ఎరనాడ్ తాలూకాలోని నెల్లిక్కునట్టు దేసోంలో కున్హిమోయిటన్
మొల్లా మరియు కోటకల్ అమినా దంపతులకు జన్మించాడు. అతని తల్లి కోటక్కల్ అమినా
పొన్నాని యొక్క ప్రసిద్ధ ఇస్లామిక్ పండితుల మక్దూమ్ కుటుంబంలో జన్మించినది. ముస్లియార్ తాత మాసా "మలప్పురం
అమరవీరులలో" ఒకరు. అలీ ముస్లియార్ విద్యను ఖురాన్, తజ్విద్ మరియు మలయాళ భాషలను కక్కడమ్మల్ కునుకుమ్ము
మొల్లా దగ్గిర నేర్చుకొన్నారు. షేక్ జైనుద్దీన్ మక్దుమ్ I (అఖిర్) దగ్గిర మతం
మరియు తత్వశాస్త్రంలో అధ్యయన కోసం పొన్నాని డార్సేకు వెళ్ళాడు అక్కడ అతను 10 సంవత్సరాల
అధ్యయనం విజయవంతంగా పూర్తి చేశాడు.
తరువాత మరింత
విద్య కోసం హరామ్, మక్కా (మక్కా) వెళ్ళాడు. ఈ కాలంలో, సయ్యద్ అహ్మద్
సాహ్ని దహ్లాన్, షేక్ ముహమ్మద్ హిస్బుల్లాహి మక్కి, మరియు సయ్యద్
హుస్సేన్ హబ్షిలతో సహా పలువురు ప్రసిద్ధ పండితులు ఆయనకు మార్గనిర్దేశం చేశారు.
మక్కాలో ఏడు సంవత్సరాలు గడిపిన తరువాత, లక్ష దీవులలోని
కవరట్టిలో చీఫ్ ఖాసీగా పనిచేశారు.
1894లో, తన సోదరుడు మరియు
ఇతర కుటుంబ సభ్యులు 1896నాటి
మలబార్ అల్లర్లలో హత్య కావిoపబడిన
విషయం తెలుసుకున్న తరువాత, ముస్లియార్ మలబార్కు తిరిగి వచ్చాడు. ఆ అలర్ల లో అనేకమంది
అతని సంభందికులు మరియు తోటి విద్యార్థులు చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. 1907 లో ఎరనాడ్
తాలూకాలోని తిరురంగడి వద్ద మసీదుకు చీఫ్ ముస్లియార్‌గా నియమితులయ్యారు.
అతను ఖిలాఫత్ ఉద్యమ
నాయకుడయ్యాడు ఖిలాఫత్ ఉద్యమం ఆరoభం తరువాత, 1921 ఆగస్టు 22 న జమాత్ మసీదులో
ఖిలాఫత్ రాజుగా ప్రకటించబడి ఖిలాఫత్ ప్రభుత్వo తరపున మార్కెట్ ఫీజులు, ఫెర్రీ మరియు
టోల్ ఆదాయం వసులు చేయసాగాడు.
అతను మలబార్ ప్రజల
గొప్ప నాయకుడు అయ్యాడు. ఖిలాఫత్ మరియు నాన్-కోపరేషణ్ సమావేశాలు అలీ ముసాలియార్ అద్వర్యం
లో క్రమం తప్పకుండా జరిగాయి. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చురుకైన మరియు
ప్రత్యక్ష కార్యాచరణ కోసం ముస్లియార్ మరియు అతని అనుచరులు రహస్య సన్నాహాలు
చేస్తున్నారు. గాంధీ మరియు అలీ బ్రదర్స్ సహాయంతో అఫ్ఘనిస్తాన్ అమీర్, భారతదేశంపై దాడి చేయబోతున్నారని వార్తలు వ్యాపించాయి ఖిలాఫత్
వాలంటీర్లను నియమించారు మరియు ఖిలాఫత్ కొరకు మరణానికైన సిద్దం అని వారు పవిత్ర
ఖురాన్ మీద ప్రమాణం చేశారు. అలీ ముసాలియార్ స్వచ్చంద సేవా దళాలు ఆప్రాంతమంతా సాయుధ
యూనిఫాంలో తిరిగేవి. 1921జూలై 24 న పొన్నానిలో
జరిగిన నాన్-కోపరేషణ్ సమావేశంలో సుమారు 50 నుండి 100 మంది స్వచ్ఛంద సేవకులు ఖిలాఫత్ యూనిఫాం ధరించి కవాతు చేశారు. ఆ ప్రాంత వ్యవసాయ
దారులలో అసంతృప్తి ఉంది
1921 ఆగస్టు 20 న అలీ ముస్లియర్ తో సహా ముగ్గురు నాయకులను అరెస్టు చేయడానికి
పోలీసులు ప్రయత్నించిన తరువాత 1921–22 ముపిల్లా తిరుగుబాటు
ప్రారంభమైంది. బ్రిటిష్ దళాలు మంపురం మసీదును నాశనం చేశాయని మోప్లాస్ ద్వారా పుకార్లు
వ్యాపించాయి మరియు మోప్లాలు భారీ సంఖ్యలో, 15,000 మరియు 30,000 మధ్య బయటకు వచ్చారు. ఇది బ్రిటిష్ దళాలు మరియు
స్థానిక ప్రముఖ వర్గాల ఉచకోతకు దారితీసింది దక్షిణ మలబార్ అంతటా భవనాలు, రైలు వంతెనలు, రోడ్లు మొదలైన ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం
వాటిల్లింది. విస్తృతమైన హింసాకండ జరిగింది.దానికి అలీ ముసాలియార్ నాయకత్వం వహించారు మరియు ఇతర
మోప్లా కుటుంబాలు (తంగల్ కుటుంబాలు) నిర్వహింహినవి..
బ్రిటిష్ సైనిక దళాలు అనేక పట్టణాల్లో పైచేయి సాధించినప్పటికీ, అనేక మంది తిరుగుబాటుదారులు గెరిల్లా కార్యకలాపాలను
ప్రారంభించారు, బ్రిటిష్ వారు అదనపు
సైనిక విభాగాలను మోహరించి మరియు
"దూకుడు" పెట్రోలింగ్‌ను ప్రవేశపెట్టారు. క్రమంగా ఫిబ్రవరి 1922 లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు ముగిసింది. బ్రిటిష్
న్యాయస్థానం మోపిల్లా విచారించి మర్డర్, ఆర్సన్ మొదలైన
నేరాలకు గాను మరణశిక్ష విధించిన డజను మంది నాయకులలో అలీ
ముస్లియార్ కూడా ఉన్నారు. తరువాత అతన్ని 17 ఫిబ్రవరి 1922 న కోయంబత్తూ సెంట్రల్ జైలులో ఉరితీశారు.
.
No comments:
Post a Comment