మగ్‌ఫూర్ అహ్మద్ అజాజీ Maghfoor Ahmad Ajazi (1900–1966) బీహార్‌కు చెందిన ప్రముఖ భారతీయ
స్వాతంత్ర సమర యోధుడడు, రాజకీయ మరియు సామాజిక కార్యకర్త.
అజాజీ 3 మార్చి
1900 న
బీహార్‌లోని ముజాఫర్పూర్ జిల్లా, సాక్రా బ్లాక్ లోని దిహులి గ్రామంలో జన్మించాడు. అజాజీ
తండ్రి మౌల్వి హఫీజుద్దీన్ హుస్సేన్ మరియు తల్లి మహఫూజున్నిసా. అజాజీ తాత హాజీ ఇమామ్ బక్ష్. అజాజీ తండ్రి-తాతలు జమీందార్లు మరియు అతని తల్లితరుపు
తాత రెహ్సాత్ హుస్సేన్ (Reysat Husain) సీతామార్హిలో ప్రముఖ న్యాయవాది. అజాజీ
తన తండ్రి నుండి దేశభక్తిని వారసత్వంగా పొందాడు.
అజాజీ తన తల్లిని బాల్యంలోనే కోల్పోయాడు మరియు పాఠశాలలో
ఉన్నప్పుడు తండ్రి మరణిoచారు. అజాజి అన్నయ్య మంజూర్ అహ్సాన్ అజాజీ కూడా స్వాతంత్ర్య
సమరయోధుడు. వారికి ఒక సోదరి నూరున్ నిసా కలదు.
అజాజి నార్త్ బ్రూక్ జిల్లా
పాఠశాలలో చేరాడు, కాని
రౌలాట్ చట్టాన్ని వ్యతిరేకించినందుకు మరియు విప్లవాత్మక కార్యకలాపాల్లో
పాల్గొన్నందుకు అతన్ని పాఠశాల నుండి బహిష్కరించారు. అజాజీ తన కళాశాల చదువును
బి.ఎన్. కాలేజ్ పాట్నా లో చదివాడు మరియు మహాత్మా గాంధీని అనుసరించి 1921 లో నాన్-కోఆపరెషణ్ ఉద్యమంలో చేరారు. అజాజీ జాతీయ ఉద్యమం లో చురుకుగా పాల్గొనటం
తోపాటు విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, సైమన్ గో బ్యాక్ మరియు భారత్
చోరో (క్విట్ ఇండియా)వంటి ఉద్యమాలలో పాల్గొన్నారు.
అతను వాలంటీర్ కార్ప్స్, రామాయణ
మండలి, చార్ఖా
సమితి మరియు కనూన్-ఎ-నిజాత్ల Kanoon-e-Nijaat ను
నిర్వహించడం ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాడు. స్వాతంత్య్ర
సంగ్రామానికి 'ముథియా' డ్రైవ్
ద్వారా నిధులు కూడా సేకరించారు. 'ముథియా' అంటే
స్వాతంత్య్ర సంగ్రామానికి నిధులు సమకూర్చడానికి ప్రతి భోజనాన్ని తయారుచేసే ముందు
ముత్తి లేదా పిడికిలి ధాన్యం ని తీయడం.
అజాజీ 1921 లో అహ్మదాబాద్‌లో జరిగిన ఎఐసిసి సమావేశానికి హాజరయ్యాడు మరియు 'సంపూర్ణ
స్వాతంత్ర్యం' పై హస్రత్
మోహని యొక్క తీర్మానానికి మద్దతు ఇచ్చాడు, ఖిలాఫత్ ఉద్యమంలో చేరి కేంద్ర ఖిలాఫత్ కమిటీ సభ్యుడయ్యాడు. అజాజీ కి మొహమ్మద్
అలీ జౌహర్ మరియు షౌకత్ అలీలతో పరిచయం ఏర్పడి వారి సహచరుడు అయ్యాడు.
అఖిల పక్ష సమావేశంలో అజాజి సెంట్రల్
ఖిలాఫత్ కమిటీకి ప్రాతినిధ్యం వహించాడు మరియు నెహ్రూ నివేదికపై అన్ని ముస్లిం
పార్టీల సమావేoలో మౌలానా షౌకత్ అలీ, బేగం ఎండి. అలీ, అబ్దుల్
మాజిద్ దర్యాబాది, మౌలానా
ఆజాద్ సుభాని, మౌలానా
అబుల్ మొహసిన్ ఎండి. సజ్జాద్ మరియు ఇతరులతో కలసి పాల్గొన్నాడు. ముహమ్మద్ అలీ జౌహర్ ఆదేశాల మేరకు ఖిలాఫత్ కమిటీ కలకత్తా
బాధ్యతలు స్వీకరించారు. సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాడు మరియు అరెస్టు కాబడి
విడుదల అయ్యాడు. అతను కలకత్తా హోమియోపతిక్ మెడికల్ కాలేజీ నుండి డిగ్రీ పొందాడు.
అబ్దుల్ బారి ఉప ఎన్నిక సమయంలో, అతన్ని
అరెస్టు చేసి పూర్నియా జిల్లా నుండి బహిష్కరించారు. "దిహులి కుట్ర కేసు"
తో సహా అనేకసార్లు అజాజి జైలు శిక్ష అనుభవించాడు.. 'దిహులీ కుట్ర' కేసులో అతనిపై విచారణ జరిగింది మరియు అతని
కార్యాలయాన్ని శోధించారు. 1923 లో
అతని భార్య మరియు అతని కుమారుడు 1942 లో
మరణించినప్పుడు కూడా అతను భారత స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ఉన్నాడు.
1934 లో సంభవించిన బిహార్ భూకంపం వచ్చిన తరువాత, అజాజీ మరియు రాజేంద్ర ప్రసాద్ కలసి సహాయక
కార్యక్రమాలలో తీవ్రంగా పాల్గొన్నారు.
జిన్నా యొక్క రెండు దేశాల
సిద్ధాంతాన్ని మరియు ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటును అజాజీ వ్యతిరేకించారు. అతను
జిన్నా యొక్క అఖిల భారత ముస్లిం లీగ్‌ను ఎదుర్కోవటానికి అఖిల భారత జమ్హూర్ ముస్లిం
లీగ్ All-India Jamhur Muslim League ను
స్థాపించాడు మరియు దాని మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
అఖిల
భారత జమ్హూర్ ముస్లిం లీగ్ All-India Jamhur Muslim League మొదటి
సెషన్
అజాజీ ఉర్దూ భాషలో కవి, రచయిత మరియు
వక్త. ఉర్దూ భాష ఫ్లాగ్ బేరర్. అతని పత్రాలు, డైరీలు, లేఖలు
మరియు ఫైళ్లు న్యూ డిల్లి లోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం & లైబ్రరీ
లో, నేషనల్ ఆర్కైవ్స్,న్యూ డిల్లీలో మరియు
పాట్నాలోని ఖుడా బక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీలో భద్రపరచబడ్డాయి.
ఆగస్టు 1942 క్విట్
ఇండియా ఉద్యమం లో, అతని
ఇంటిని పోలీసులు శోధించారు అప్పుడు అతను రహస్యం(అండర్-గ్రౌండ్)గా పని చేసాడు అతని
పెద్ద కుమారుడు ముజాఫర్ హుస్సేన్ అజాజీ 25 జూలై 1942 న
మరణించారు.
స్వాతంత్ర్యం తరువాత అజాజీ తన
జీవితాంతం అణగారిన ప్రజల సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణతో పాటు ఉర్దూ భాష
అభివృద్ధికి అంకితం చేశారు. అతను ట్రేడ్ యూనియన్ ఉద్యమంతో చురుకుగా సంబంధం కలిగి
ఉన్నాడు. ఉత్తర బీహార్‌లోని వివిధ ముఖ్యమైన కార్మిక సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు.
అజాజి మంచి క్రీడాకారుడు మరియు
క్రీడా ప్రేమికుడు కూడా. అతను బీహార్‌లోని ఓల్డ్ తిర్హట్ డివిజన్ (ప్రస్తుత తిర్హట్, సరన్
మరియు దర్భంగా విభాగాలు) మరియు గ్రామీణ క్రీడలలో వుడ్మాన్ ఛాలెంజ్ షీల్డ్, ఇంటర్
స్కూల్ టోర్నమెంట్ మరియు ఎడ్లబండ్ల రేసు మొదలగు వివిధ క్రీడా కార్యక్రమాల
నిర్వాహకుడు.
అజాజీ మొదటి నుండి బీహార్‌లో
ఉర్దూ ఉద్యమానికి మార్గదర్శకుడు. 1936 లో అంజుమాన్ తారక్వి-ఇ ఉర్దూ బీహార్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అజాజీ 1960 లో ముజఫర్పూర్ జరిగిన
యొక్క ఉర్దూ సమావేశానికి చైర్మన్. దీనిలో మొదటిసారి ఉర్దూను బీహార్లో అధికారిక భాషగా అంగీకరించాలని కోరుతూ ఒక
తీర్మానం ఆమోదించబడింది.
సర్ సయ్యద్ ఎడ్యుకేషనల్ సొసైటి
నమూనా ఆధారంగా అజాజీ “అంజుమాన్ ఖుద్దాం-ఎ-మిల్లత్” సొసైటీ స్థాపించారు. ఈ సొసైటీ ఒక పాఠశాలను మరియు
ముజఫర్పూర్ యొక్క బాగ్ మసీదును పునరుద్ధరించింది. ఒక విశ్రాంతి గృహం నిర్మించింది మరియు దిక్కులేని
అనాధల మృతదేహాల చివరి కర్మలను చేపట్టుతుంది.
మరణం:
అజాజీ 26
సెప్టెంబర్ 1966 న
ముజాఫర్పూర్ లో 66 ఎళ్ళ
వయస్సులో మరణించారు.
·
అజాజి
మరణానికి సంతాపం తెలిపిన భారత
రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, "భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో డాక్టర్ అజాజీ అగ్రగామి. అతని
జీవిత కథ దేశంలోని ఒక ముఖ్యమైన శకం యొక్క ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన కథ"
అని అన్నారు.
·
ఆచార్య జె.బి. కృపాలానీ అభిప్రాయం లో
"డాక్టర్ అజాజీ గొప్ప దేశభక్తుడు, మానవత్వానికి అంకితమైన సేవకుడు
మరియు ప్రేమగల స్నేహితుడు. అతని లాంటి నిస్వార్థ దేశభక్తుడు చాలా అరుదుగా దొరుకుతారు.
అతని మరణం సమాజానికి నష్టం".
·
జర్నలిస్ట్ కలాం హైద్రీ మరియు నవలా
రచయిత మరియు జర్నలిస్ట్ మొయిన్ షాహిద్ ఉర్దూ భాష పట్ల ఆయన చేసిన సేవలకు
"బాబా-ఎ-ఉర్దూ, బీహార్"
(బీహార్‌లో ఉర్దూ తండ్రి) అని పిలిచారు.
·
జర్నలిస్ట్ మరియు కవి వాఫా మాలిక్‌పురి
ఉర్దూ కోసం పాత 'ముజాహిద్' (క్రూసేడర్)
గా అజాజీ ని అభివర్ణించారు
·
డాక్టర్ అజాజీ నివాసానికి వెళ్ళే
రహదారికి ముజాఫర్పూర్ మునిసిపల్ బోర్డు అతని గౌరవార్థం "డాక్టర్ అజాజీ
మార్గ్" అని పేరు పెట్టారు
·
మఘ్ఫూర్ అహ్మద్ అజాజీ స్వాతంత్ర్య
సమరయోధుడు మహాత్మా గాంధీచే ఎంతో ప్రేరణ పొందారు. అతను ఖిలాఫత్ ఉద్యమంలో కీలక
సభ్యుడు. ఈ రోజు ఆయన చేసిన కృషిని గౌరవిస్తున్నాము అని అల్ ఇండియా కాంగ్రెస్ తన ట్విట్టర్లో
పేర్కొన్నది.
No comments:
Post a Comment