సర్ అల్లాహ్ బక్స్
ముహమ్మద్ ఉమర్ సూమ్రో (1900 - 14 మే 1943) లేదా
అల్లాహ్ బక్ష్ సూమ్రో ఒక భూస్వామి, ప్రభుత్వ కాంట్రాక్టర్, భారత
స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త మరియు అవిబక్త బ్రిటిష్ ఇండియాలోని సింధ్ ప్రావిన్స్ కు
చెందిన రాజకీయ నాయకుడు. అతను ప్రావిన్స్ యొక్క ఉత్తమ ప్రీమియర్లలో ఒకరిగా
పరిగణించబడ్డాడు. అతన్ని షాహీద్ లేదా "అమరవీరుడు" అని పిలుస్తారు.
అల్లాహ్ బక్స్ సూమ్రో 1900లో నాటి బాంబే ప్రెసిడెన్సీలోని
షికార్పూర్ లో సంపన్న సూమ్రో రాజ్‌పుత్‌ల కుటుంబంలో జన్మించాడు. అతను 1918 లో తన మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తిర్ణత పొంది తన తండ్రి
కాంట్రాక్ట్ వ్యాపారంలో చేరాడు. అతను చిన్న వయస్సులోనే రాజకీయాల్లో చేరాడు మరియు
జాకబాబాద్ మునిసిపాలిటీకి ఎన్నికయ్యాడు.
అతను సింధ్ ఇట్టేహాద్ పార్టీని స్థాపించాడు మరియు సింధ్
ముఖ్యమంత్రిగా 1938-1940 వరకు మరియు 1941 నుండి 1942 వరకు రెండు సార్లు పనిచేశాడు మరియు ఆర్థిక, ఎక్సైజ్ మరియు పరిశ్రమల శాఖలను నిర్వహించారు.
సింధ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, సూమ్రో ఉబైదుల్లా సింధి బహిష్కరణbanishmentను రద్దు చేశాడు మరియు సింది స్వదేశానికి తిరిగి రావడానికి అనుమతించాడు. సూమ్రో
అబ్యుదయవాది ప్రజల శ్రేయస్సు కోసం సంస్కరణలను ప్రవేశపెట్టాడు.
అల్లాహ్ బక్ష్ సూమ్రో అఖిల భారత ఆజాద్ ముస్లిం కాన్ఫరెన్స్ స్థాపించారు
మరియు భారతదేశ విభజనను వ్యతిరేకించాడు. ముస్లిం లీగ్ మరియు మొహమ్మద్ అలీ జిన్నా
ప్రతిపాదించిన రెండు దేశాల సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నారు. 27 ఏప్రిల్ 1940 న, అల్లాహ్ బక్ష్ సూమ్రో అధ్యక్షత
వహించిన అఖిల భారత ఆజాద్ ముస్లిం కాన్ఫరెన్స్ డిల్లి సమావేశం లో 1400 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వారు ‘భారతదేశ ముస్లింలలో ఎక్కువమందికి’ ప్రాతినిధ్యం వహిస్తున్నారని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
అల్లాహ్ బక్ష్
సూమ్రో ఇలా అన్నాడు, "భూమిపై ఏ శక్తి
అయినా ఎవరి విశ్వాసం మరియు నమ్మకాలను దోచుకోదు, మరియు భారతీయ
ముస్లింలను భారతీయ పౌరులుగా వారి హక్కులను దోచుకోవడానికి భూమిపై ఎటువంటి శక్తి
అనుమతించబడదు."
1940 లో, అల్లాహ్ బక్స్ సూమ్రోపై అవిశ్వాస తీర్మానం ఆమోదించబడింది.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముస్లిం లీగ్‌తో చేతులు కలిపి అతనికి వ్యతిరేకంగా ఓటు
వేసింది. తన ప్రభుత్వాన్ని తొలగించిన తరువాత, సూమ్రో నేషనల్
డిఫెన్స్ కౌన్సిల్ సభ్యునిగా నియమించబడ్డాడు. అల్లాహ్ బక్స్
సూమ్రో మార్చి 1941 లో తిరిగి అధికారంలోకి వచ్చారు మరియు సుమారు ఒక సంవత్సరం
పాటు ప్రీమియర్‌గా పనిచేశారు. క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వడం వల్ల ఆయనను
గవర్నర్ పదవి తొలగించారు. మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని
ప్రారంభించినప్పుడు సెప్టెంబర్ 1942 లో, అల్లాహ్ బక్స్ సూమ్రో బ్రిటిష్ ప్రభుత్వం అతనికి ఇచ్చిన నైట్
హుడ్ మరియు ఖాన్ బహదూర్ బిరుదులను త్యజించాడు మరియు అతను జాతీయ రక్షణ మండలికి కూడా
రాజీనామా చేశాడు.
అల్లాహ్ బక్స్
సూమ్రో మే 14, 1943 న తన స్వస్థలమైన షికార్పూర్ లో టాంగాలో ప్రయాణిస్తున్నప్పుడు
నలుగురు మత తీవ్రవాద ఉన్మాదుల చే హత్య చేయబడ్డారు. మరణించేటప్పుడు ఆయన వయసు 43 సంవత్సరాలు. దేశ
విభజన సందర్భంలో అల్లాహ్ బక్ష్ సూమ్రో జీవించి ఉంటే పాకిస్తాన్ తీర్మానానికి సింధ్
అసెంబ్లీ మద్దతు ఇచ్చేది రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు
No comments:
Post a Comment