సయ్యద్ మొహమ్మద్ షర్ఫుద్దీన్
క్వాద్రి (1901–2015) భారతీయ
స్వాతంత్ర్య సమర యోధుడు, గాంధేయవాది మరియు యునాని వైద్యుడు.
సయ్యద్ మొహమ్మద్
షర్ఫుద్దీన్ క్వాద్రి 1901 డిసెంబర్ 25న బిహార్
రాష్ట్రంలోని నవాడా జిల్లాలోని కుమ్రావాలో యునాని వైద్యుడైన మొహమ్మద్ మొహిబుద్దిన్
కు జన్మించాడు. అతనికి ముపై సంవత్సరాల
వయస్సులో అతని కుటుంబం కలకత్తాకు
వెళ్లింది, అక్కడ అతను తన
జీవితాంతం గడిపాడు. తన తండ్రి నుండి యునాని వైద్యం నేర్చుకున్న అతను
తన తండ్రికి మెడికల్ ప్రాక్టిస్ లో సహాయం చేశాడు. అతను భారత స్వాతంత్ర్య పోరాటంలో
కూడా పాల్గొన్నాడు మరియు గాంధీజీతో పాటు 1930 లో సాల్ట్ మార్చ్ లో పాల్గొన్నాడు మరియు జైలు
పాలయ్యాడు మరియు బ్రిటిష్ పాలనలో కటక్ జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు గాంధీజీ
జైలు సెల్ సహచరుడు.
స్వాతంత్ర్యం తరువాత అతను
రాజకీయాలకు దూరంగా ఉన్నాడు మరియు దేశానికి తన వంతు కృషి చేస్తూనే ఉన్నాడు భారతదేశానికి
మొదటి అధ్యక్షుడైన రాజేంద్ర ప్రసాద్ శ్వాసకోశ సమస్యల కారణంగా అనారోగ్యానికి
గురైనప్పుడు, అతనికి చికిత్స
చేయడంలో క్వాద్రి తన తండ్రికి సహాయం చేశాడు.
.క్వాద్రి యునాని వైద్య
పత్రిక హిక్మత్-ఎ-బంగల స్థాపకుడు, కాని నిధుల కొరత కారణంగా ఆ పత్రిక చివరికి మూసివేయబడింది. 1994 లో కలకత్తా యునాని
మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ స్థాపనలో సయ్యద్ ఫైజాన్ అహ్మద్‌కు సహాయం చేశాడు.
భారత ప్రభుత్వం అతనికి భారతీయ వైద్యానికి(యునాని) ఆయన చేసిన కృషికి గాను 2007 లో పద్మ భూషణ్ అవార్డు
ప్రధానం చేసింది. . అతను 30 డిసెంబర్ 2015న, 114 సంవత్సరాల
వయస్సులో కోల్‌కతాలోని తన రిపోన్
స్ట్రీట్ నివాసంలో మరణించాడు, అతని ఏడుగురు
పిల్లలు కలరు.
No comments:
Post a Comment