2 April 2020

మౌల్వి ముహమ్మద్ బాకీర్ Moulvi Muhammad Baqir(1780-1857)



 Heritage Times on Twitter: "On the day 16 September 1857 Great ...

మౌల్వి ముహమ్మద్ బాకిర్ (1780-1857) Delhi భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు  మరియు పాత్రికేయుడు. 1857 స్వాతంత్య్ర యుద్ధ వీరులలో ఒకరైన  మౌల్వి ముహమ్మద్ బాకీర్ (1780-1857). డిల్లి కి చెందిన మత పండితుడు మౌలానా ముహమ్మద్ అక్బర్ అలీ యొక్క ఏకైక కుమారుడు మౌల్వి బకీర్ మత మరియు ఆధునిక విద్యను పొందినాడు మరియు  అరబిక్, పెర్షియన్ మరియు ఇంగ్లీష్ మరియు ఉర్దూ భాషలలో నిపుణుడు

అతను మొదట్లో డిల్లి కాలేజీలో బోధించినాడు  తరువాత బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసినాడు. సాహిత్యం మరియు జర్నలిజం పట్ల ఆయనకున్న ఆశక్తీ  తో అతను 1834 లో లిథోగ్రాఫిక్ ప్రెస్‌ను కొనుగోలు చేసినాడు. 1837 లో మౌల్వి బకీర్ “డెహ్లీ ఉర్దూ అఖ్బర్ Delhi Akhbar” అనే  ఉర్దూ వారపత్రికను ప్రారంభించాడు. ఇది ఉర్దూ యొక్క మొట్టమొదటి లిథో-ఆధారిత వారపత్రిక.ఇది 21సంవత్సరాలు నడిచినది. మౌల్వి బాకీర్ ప్రసిద్ధ కవి, బహదూర్ షా జాఫర్ ఆస్థానం లో పనిచేసేవాడు.


మౌల్వి పత్రిక “డెహ్లీ ఉర్దూ అఖ్బర్” బ్రిటిష్ పాలకులను విమర్శించడం ప్రారంభించినది  మరియు 1857 తిరుగుబాటుకు రంగాన్ని తయారు చేయడం లో కీలక పాత్ర వహించినది..

మే 10, 1857 న బ్రిటిష్ వారిచే  'గదర్' లేదా 'దేశద్రోహం' అని పిలిచే స్వాతంత్ర్య యుద్ధం ప్రారంభమైనప్పుడు, మౌల్వి బకీర్ ఆ యుద్ధం లో ముందు వరుసలో ఉన్నాడు మరియు భారతీయులు విదేశీ శక్తి నుండి తమ స్వేచ్చా స్వాతంత్రాల తిరిగి పొందటానికి పోరాడుతున్నందుకు అతను తనను మరియు తన వార్తాపత్రికను అంకితం చేశాడు. డిల్లి ఉర్దూ అఖ్బర్ పత్రిక  ప్రజలలో స్వేచ్ఛా–స్వాతంత్ర భావనలను రేకెత్తించింది మరియు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి సామాన్య ప్రజానీకం లో ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇచ్చింది.

అతను రిపోర్టర్ మరియు ఎడిటర్‌గా మాత్రమే కాకుండా, పోరాటానికి నాయకత్వం వహిస్తున్న బహదూర్ షా జాఫర్‌కు విశ్వసనీయ సహాయకుడిగా కూడా పనిచేసాడు మరియు తన వార్తాపత్రికను అక్బర్-అల్-జాఫర్ Akhbar-al-Zafar గా పేరు మార్చాడు.

1857 మే 10 న మీరట్‌లో ప్రారంభమైన తిరుగుబాటు న్ మే 11 నాటికి డిల్లి చేరుకొంది. మౌల్వి ముహమ్మద్ బాకీర్ తన ఉర్దూ వార పత్రిక అఖ్బర్ లో  తిరుగుబాటుదారుల పురోగతి గురించి ఒక వివరణాత్మక నివేదిక ప్రచురించాడు. అతను నిరంతరం బ్రిటీష్ చర్యలను ఖండిస్తూ తన రాతల ద్వారా ప్రజలను మరియు సిపాయిలను దేశ స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రోత్సహించాడు.

బ్రిటిష్ అధికారులు దిల్లిలోని జామీ మసీదు మరియు ఇతర ప్రముఖ ప్రదేశాల గేట్ల పై వాల్-పోస్టర్స్ ద్వారా బ్రిష్ పరిపాలనలోని భారతీయులను   బెదిరించడం మరియు వారి మత విశ్వాసాలను ప్రశ్నించినప్పుడు, మౌల్వి బకీర్ తన వార్తాపత్రికలోభారతీయుల పట్ల బ్రిటిష్ వారి నైతిక మరియు మతపరమైన అవగాహానా రాహిత్యం ను  సవాలు చేస్తూ  సమాధానం ఇచ్చారు.

మౌల్వి ముహమ్మద్ బాకీర్ హిందూ ముస్లిం ఐక్యత కొరకు పాటుపడినాడు.  స్వాతంత్ర్య పోరాటాన్ని బలహీనపరిచేందుకు బ్రిటిష్ వారు ప్రజలలో అసమ్మతి బీజాలు విత్తడం ప్రారంభించినప్పుడు డిల్లి ఉర్దూ అఖ్బర్ పత్రికలో బ్రిటిష్ పాలకుల వ్యూహానికి వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించారు మరియు ఐక్యంగా ఉండాలని వారికి విజ్ఞప్తి చేశాడు.

1857 యుద్ధ సంఘటనల సమయంలో, డిల్లి కాలేజీ ప్రిన్సిపాల్ ఫ్రాన్సిస్ టేలర్ ను మౌల్వి బకీర్ తన ఇంటిలో ఒక రోజు దాచి కాపాడాడు. ముస్లింలను మరియు హిందువులను వారి మతం నుండి క్రైస్తవ మతంలోకి మార్చడానికి టేలర్ ప్రసిద్ది చెందాడు.కాని చివరకు విప్లవ జనం టేలర్‌ను కనుగొని కొట్టారు. అరెస్టు చేసిన తరువాత మౌల్వి బాకీర్‌కు మరణశిక్ష విధించడానికి టేలర్ మరణమే కారణమని కొందరు భావిస్తున్నారు.

1857 సెప్టెంబరులో బ్రిటిష్ వారు 1857 తిరుగుబాటును అణచివేసిన తరువాత డిల్లి ని తిరిగి స్వాధీనం చేసుకున్నప్పుడు, వారు చేసిన మొదటి పని 'దిల్లీ ఉర్దూ ఇఖ్బర్' కార్యాలయాన్ని జప్తు చేసి సంపాదకుడిని అరెస్టు చేయడం. మౌల్వి బకీర్‌ను సెప్టెంబర్ 14, 1857 న అరెస్టు చేశారు, మరియు 1857 సెప్టెంబర్ 16 న కెప్టెన్ హడ్సన్ ముందు హాజరుపరిచారు.అదే రోజు మౌల్వి బకీర్ డిల్లి గేట్ వెలుపల ఉన్న మైదానంలో కాల్చి చంపబడ్డాడు.

మౌల్వి మొహమ్మద్ బకీర్ భారత చరిత్రలో తన జీవితాన్ని త్యాగం చేసిన మొదటి సంపాదకుడు అయ్యాడు మరియు మన భారతదేశం యొక్క స్వేచ్ఛ కోసం అమరవీరుడు అయ్యాడు.

 మౌల్వి మొహమ్మద్ బాకీర్ (1810-1857) డిల్లి ప్రగతిశీల ముస్లిం. అతను డిల్లి యొక్క మొట్టమొదటి ఉర్దూ వార్తాపత్రిక "దిల్లీ ఉర్దూ అఖ్బర్" ను ప్రారంభించాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు వార్తలు రాసినందుకు మరియు వార్తలను వ్యాప్తి చేసినందుకు బ్రిటిష్ వారిచే  ఉరితీయబడిన మొదటి భారతీయ పాత్రికేయుడు ఆయన.

ఉర్దూ జర్నలిజం లో మౌల్వి బాకిర్ యొక్క పాత్రను సరిగా పరిశోధింపబడలేదని ప్రముఖ చరిత్రకారుడు జి.డి.చందన్ అన్నారు. డిల్లి లో  మ్యూజియం లేదా ఆడిటోరియం కు అతని  పేరు పెట్టలేదు.




No comments:

Post a Comment