విశ్వసించిన
ప్రజలారా ! ఉపవాసం మీకు విధిగా నిర్ణయిoపబడినది- ఎవిధంగా మీకు పూర్వం ప్రవక్తలను
అనుసరించేవారికి కూడా విధించాబడినదో, దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం
ఉంది.”- దివ్య ఖురాన్ 2:183
ఈ అయత్ ఉపవాసాలను ఒక
బాధ్యతగా సూచిస్తుంది. ఇది రంజాన్‌లో తప్పనిసరి ఉపవాసం గురించి మూడు ముఖ్యమైన
విషయాలను తెలియజేస్తుంది: (1) రంజాన్ మాసంలో
ఉపవాసం ఉండమని విశ్వాసులకు అల్లాహ్ ఆజ్ఞాపించాడు; (2) ఉపవాసం వారికి కొత్త విషయం కాదు, ఎందుకంటే ఇది
మునుపటి ప్రజలకు కూడా ఆజ్ఞాపించబడింది మరియు (3) ఉపవాసం యొక్క నిజమైన ఉద్దేశం లాఅల్లకుం
తట్టకూన్ (తద్వారా మీరు దైవబీతి పరులు అవుతారు).
రంజాన్‌లో ఉపవాసం
తప్పనిసరి, ఐచ్ఛికం కాదు.
వయోజనడైన, తెలివిగల మరియు
శారీరకంగా బాగా ఉన్న ప్రతి ముస్లిం (అతడు/ ఆమె) రంజాన్ సమయంలో ఉపవాసం ఉండాలి.
సలాత్ (ప్రార్థనలు)
మాదిరిగా పూర్వపు ప్రవక్తల
అనుచరులకు కూడా ఉపవాసం తప్పనిసరి విధి.
యేసుక్రీస్తు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడని బైబిలు చెబుతోంది (మాథ్యూ 4: 1-4, మార్కు 1: 12-13 మరియు లూకా 4: 1-4). పేతురు 2: 21 లో క్రీస్తు అనుచరులు
తమ ప్రవక్త చేసినట్లుగా ఉపవాసం ఉండాలని ఆదేశించారు. వేదాలు, పురాణాలు కూడా
ఉపవాసాలను సూచిస్తాయి. ఆ విధంగా వివిధ మతాల ప్రజలు ఉపవాసాలు ఉనప్పటికీ, ఉపవాసం ఉండే రోజుల సంఖ్య
మరియు నిర్దేశించిన సమయాలలో తేడా ఉంది.
భక్తిని పెంపొందించే
ప్రధాన వనరులలో ఉపవాసం ఒకటి. ఇది నెల రోజుల శిక్షణా కోర్సు.
రమజాన్ నెలలో విశ్వాసులు తెల్లవారుజాము
నుండి సాయంత్రం వరకు తినడం,
త్రాగటం మరియు
శృంగారంలో పాల్గొనడం మానేస్తారు. ఇలా ఉండటం వారికి షరియా నిషేధించినదాని నుండి మరియు ప్రాపంచిక
ప్రలోభాల నుండి దూరంగా ఉండటానికి వీలు
కల్పిస్తుంది..
No comments:
Post a Comment