13 April 2020

సయ్యద్ అమీర్ అలీ Syed Ameer Ali(1849-1928)Syed Ameer Ali - Wikipedia 
సయ్యద్ అమీర్ అలీ(1849-1928) ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు పొందిన ఒక బ్రిటిష్ భారతీయ న్యాయవాది. అతని తండ్రి ఒరిస్సాలో స్థిరపడ్డారు. అమీర్ అలీ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, రచయిత మరియు అఖిల భారత ముస్లిం లీగ్ వ్యవస్థాపక సభ్యుడు. బ్రిటిష్ ఇండియా మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రముఖ ముస్లిం న్యాయ పండితుడుగా ప్రసిద్ది చెందాడు.

సయ్యద్ అమీర్ అలీ 1849 ఏప్రిల్ 6, ఒడిశాలోని కటక్, బెంగాల్ ప్రెసిడెన్సీ లో  సయ్యద్ సాదత్ అలీ యొక్క ఐదుగురు కుమారులలో నాల్గవ కుమారుడుగా జన్మించాడు. అతని తండ్రి కుటుంబాన్ని కలకత్తాకు, తరువాత చిన్సురాకు తరలించి అక్కడ శాశ్వతంగా స్థిరపడ్డాడు. అమీర్ అలీ 1867 లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు మరియు 1868 లో చరిత్రలో MA డిగ్రీ పొందాడు. ఎల్‌ఎల్‌బి డిగ్రీ 1869 లో పొందాడు.. కలకత్తాలో లా ప్రాక్టిస్ మొదలు పెట్టాడు.

అమీర్ అలీ స్టేట్ స్కాలర్‌షిప్‌ను గెలుచుకున్నాడు మరియు 1869 మరియు 1873 మధ్య ఇంగ్లాండ్‌కు వెళ్లాడు, ఈ సమయంలో అతను ఇన్నర్ టెంపుల్‌లో చేరాడు మరియు 1873 లో బార్‌ లో ఎన్రోల్ అయ్యాడు. అతను బెంగాల్ యొక్క మొట్టమొదటి ముస్లిం బార్-ఎట్-లా.

అమీర్ అలీ లండన్ లో ఉండగా అక్కడ  కొంతమంది ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నాడు. సమకాలీన ఉదారవాదం యొక్క ప్రభావాన్ని ఆయన గ్రహించారు. అతను భారతదేశానికి సంబంధించిన దాదాపు అందరు పరిపాలన వేత్తలతో మరియు ప్రముఖ ఆంగ్ల ఉదారవాదులైన జాన్ బ్రైట్ మరియు ఫాసెట్స్, హెన్రీ (1831-1898) మరియు అతని భార్య మిల్లిసెంట్ ఫాసెట్ (1847-1929.) తో పరిచయాలు కలిగి ఉన్నాడు.

ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు, అతను తన మొదటి పుస్తకం, ది క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ ముహమ్మద్, వ్రాసాడు మరియు 1873 లో అది ప్రచురింపబడినది.

1873 లో తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత సయ్యద్ అమీర్ అలీ కలకత్తా హైకోర్టులో తన లా ప్రాక్టీసును తిరిగి ప్రారంభించాడు మరియు ముస్లిం చట్టంలో ప్రావీణ్యం సంపాదించాడు.1875 లో అతను తన ఇంగ్లీష్ పరిచయాలను పునరుద్ధరించడానికి మూడు వారాలపాటు లండన్ సందర్శించాడు. సంవత్సరం తరువాత, అతను కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క ఫెలోగా ఎన్నికయ్యాడు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఇస్లామిక్ లా లెక్చరర్‌గా నియమించబడ్డాడు. ముస్లిం న్యాయ శాస్త్రంలో గుర్తింపు మరియు ఖ్యాతిని పొందాడు.,

1877 లో సర్ సయ్యద్‌తో కలిసి భారతీయ ముస్లింల జీవితంలో రాజకీయాల ప్రాముఖ్యత గురించి అమీర్ అలీ చర్చించారు. భారతదేశంలో ముస్లింలు తమ సొంత రాజకీయ సంస్థను స్థాపించకుండా  అభివ్రుద్దిచెందలేరని ఆయన సర్ సయ్యద్‌తో అన్నారు.

1878 లో ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ పదవికి  ఎంపికయ్యాడు మరియు కొలదికాలం లోనే ఆఫీషియేటింగ్ చీఫ్ పెసిడెన్సీ మేజిస్ట్రేట్గా నియమించబడినాడు. ఈ పదవిలో నియమించబడిన మొదటి భారతీయ మరియు ముస్లిం అమీర్ అలీ. కొంతకాలం తరువాత  ఆ పదవికి రాజీనామా చేసి న్యాయవాద వృత్తిని తిరిగి ఆరంభించాడు.

అమీర్ అలీ 1878 లో కలకత్తాలో సెంట్రల్ నేషనల్ మొహమ్మడన్ అసోసియేషన్ అనే రాజకీయ సంస్థను స్థాపించారు. ముస్లింల ఆధునీకరణ మరియు వారిలో  రాజకీయ చైతన్యాన్ని రేకెత్తించడంలో అసోసియేషన్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ సంస్థ  మద్రాస్ నుండి కరాచీ వరకు 34 శాఖలతో దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఈ సంస్థను స్థాపించిన తరువాత సయ్యద్ అమీర్ అలీ భారతదేశంలోని సుదూర ప్రాంతాలలో పర్యటించి సంస్థ లక్ష్యాలను వ్యాప్తి చేశారు. అమీర్ అలీ మొదటి ఇరవై ఐదు సంవత్సరాలు వ్యవస్థాపక-కార్యదర్శిగా ఉన్నారు.

అమీర్ అలీ ఎడిన్బ్రో రివ్యూ, కాంటెంపరరీ రివ్యూ, ఆసియాటిక్ రివ్యూ, మాంచెస్టర్ గార్డియన్, మరియు టైమ్స్ వంటి ప్రముఖ బ్రిటిష్ పత్రికలలో అనేక వ్యాసాలు మరియు లేఖలను రాయడం ద్వారా ముస్లింలకు అనుకూలంగా బలమైన ప్రజాభిప్రాయాన్ని విజయవంతంగా సృష్టించాడు. ముస్లింలకు ప్రత్యేక నియజకవర్గాలను సాధించడం అసోసియేషన్ విజయంగా చెప్పవచ్చు. అమీర్ అలీ  ముస్లింల రాజకీయ పురోగతి కోసం పనిచేశాడు.


అమీర్ అలీ వేర్పాటువాది కాదు. ఆధునిక పద్దతుల ద్వారా భారతదేశం యొక్క అభివృద్ధి హిందువులు మరియు ముస్లింల స్నేహపూర్వక సహకారం మీద ఆధారపడి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లిమేతరులందరితో ఐక్యత మరియు సామరస్యంతో పనిచేయాలని ఆయన తన సంఘాన్ని ప్రోత్సహించారు. విద్యావంతుడైన భారతీయుడిగా, స్థానిక స్వపరిపాలన సూత్రాలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని, రాజ్య సేవలో ఉన్నత పదవుల్లో భారతీయులకు ఉపాధి కల్పించాలని, భారతీయ సైన్యంలో ఉన్నత స్థాయి లో భారతీయులకు స్థానం కల్పించాలని  ఆయన సూచించారు.

అసోసియేషన్ చాలా మంది ముస్లిమేతరుల మద్దతును కూడా పొందింది. పైక్‌పారాకు చెందిన రాజా ఇందర్ చుందర్ సింగ్ దాని గౌరవ ఉపాధ్యక్షులలో ఒకరు మరియు నిర్వహణ కమిటీలో బాబు సాలిగ్రామ్ సింగ్ మరియు కెఎమ్ ఛటర్జీ ఉన్నారు.

1878 లో, అతను బెంగాల్ శాసనమండలి సభ్యునిగా నియమించబడ్డాడు. అతను 1880 లో ఒక సంవత్సరం ఇంగ్లాండ్‌ను తిరిగి సందర్శించాడు.అతను 1881 లో కలకత్తా విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్ అయ్యాడు. 1883 లో గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యత్వానికి నామినేట్ అయ్యాడు. 1884 లో సయ్యద్ అమీర్ అలీ  ఇసాబెల్లాను వివాహం చేసుకున్నాడు

1884
లో, అతను ఠాగూర్ లా ప్రొఫెసర్‌షిప్‌ను గెలుచుకున్నాడు. ఠాగూర్ లా ప్రొఫెసర్‌షిప్‌ సాధించిన మొదటి ముస్లిం. అతని అనేక సేవలకు గుర్తింపుగా, అతనికి 1887 లో CIE బిరుదు లభించింది మరియు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యొక్క గౌరవ LLD ను ప్రదానం చేశారు.

1890 వ సంవత్సరం లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడిన మొదటి ముస్లిం జస్టిస్ అమీర్ అలీ.

సయ్యద్ అమీర్ అలీ 1908లో లండన్ ముస్లిం లీగ్‌ను స్థాపించారు. ఈ సంస్థ ఒక స్వతంత్ర సంస్థ. 1909లో అతను ప్రివి కౌన్సిల్ యొక్క జ్యుడిషియల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన మొదటి భారతీయుడు అయ్యాడు, దానిలో  అతను 1928 లో మరణించే వరకు పనిచేశాడు. ప్రివి కౌన్సిల్‌కు నియామకం తరువాత అతను రైట్ హానరబుల్ గా  గౌరవిoపబడినాడు.

1909 లో సయ్యద్ అమీర్ అలీ నేతృత్వంలోని ప్రతినిధివర్గం  అప్పటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మోరేలీకి ముస్లింలకు ప్రత్యేక ఓట్లు (Separate Electorate) మంజూరు చేయాలని ఒప్పించారు.

నవంబర్ 1910 లో సత్యేంద్ర పి. సిన్హా రాజీనామా చేసిన తరువాత సయ్యద్ అమీర్ అలీ భారత ప్రభుత్వ న్యాయ సభ్యుని పదవిని చేపట్టిన రెండవ భారతీయుడు అయ్యాడు

1910లో అతను ప్రముఖ బ్రిటిష్ ముస్లింల బృందంతో కలిసి లండన్ మసీదు నిధిని స్థాపించాడు. ఆ నిధితో నేడు యూరప్‌లోని అతిపెద్ద మసీదులలో ఒకటైన  ఈస్ట్ లండన్ మసీదు నిర్మించారు. అతని కార్యకలాపాల రంగం విస్తరించి అతను ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సంక్షేమం కోసం నిలబడ్డాడు.

 1920లలో, ఖిలాఫత్ ఉద్యమం సందర్భంగా, సయ్యద్ అమీర్ అలీ భారత ముస్లింల భావోద్వేగ దృక్పథాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించారు.

సయ్యద్ అమీర్ అలీ 1904 లో బెంగాల్ హైకోర్టు నుండి పదవీ విరమణ చేసి, ఇంగ్లాండ్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు.

ముస్లింలు బ్రిటిష్ వారి పట్ల విధేయతతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని సయ్యద్ అమీర్ అలీ అభిప్రాయపడ్డారు. ముస్లింలు  అధిక ఆంగ్ల విద్య పొందాలని  పిలుపునిచ్చారు. సయ్యద్ అమీర్ అలీ ఇస్లాం గురించి సానుకూల రచనలు చేసాడు. అతని రచనలు ముస్లిం యువతకు ఆశా భావాన్ని సృష్టించాయి.

అమీర్ అలీ తన సామాజిక పనులకు కూడా ప్రసిద్ది చెందారు. అతను భారతీయ మహిళల కోసం మెడికల్ ఎయిడ్ ఫండ్‌ను స్థాపించారు. ఈ ఫండ్ సహాయంతో భారతీయ మహిళల కోసం  డఫెరిన్ హాస్పిటల్ కలకత్తాలో స్థాపించబడింది. బాల్కన్ యుద్ధాలు మరియు మొదటి  ప్రపంచ యుద్ధంలో అరబ్ ముస్లింలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో సహాయపడటానికి అతను రెడ్ క్రెసెంట్ సొసైటీని స్థాపించాడు.

తన కెరీర్ మొత్తంలో అమీర్ అలీ  న్యాయవాది మరియు ప్రసిద్ధ ఇస్లామిక్ పండితుడిగా ప్రసిద్ది చెందాడు. ఇస్లాం చరిత్ర మరియు దాని నాగరికత యొక్క అధ్యయనానికి ఆయన కృషి చేసాడు.  సయ్యద్ అమీర్ అలీ భారతదేశంలోని ముస్లిం పునరుజ్జీవనానికి ఎక్కువ సానుకూల మరియు గణనీయమైన కృషి చేసాడు,


అతని పెద్దకొడుకు  తారిక్ అమీర్ అలీ 1931 నుండి 1944 వరకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.అతను ఆగష్టు4,1928 న సస్సెక్స్‌ లో మరణించాడు మరియు బ్రూక్‌వుడ్ స్మశానవాటికలో ఖననం చేయబడ్డాడు. అతని మరణం వలన భారత దేశం  ఒక గొప్ప భారతీయుడిని మరియు 'గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇస్లాం ను కోల్పోయింది

సయ్యద్ అమీర్ రచనలు:

ఎ క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ మొహమ్మద్ (1873)
ది పర్సనల్ లా ఆఫ్ ముహమ్మడేన్స్  (1880)
ది స్పిరిట్ ఆఫ్ ఇస్లాం (1891, 1922, 1953 ఎడిషన్స్  )
ఎథిక్స్ ఆఫ్ ఇస్లాం (1893)
ఎ షార్ట్ హిస్టరీ ఆఫ్ సారాసెన్స్ (1899) [5]
ఇస్లాం (1906)
ది లీగల్ పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇస్లాం (1912)

గౌరవాలు మరియు గుర్తింపు:

·        బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహి విశ్వవిద్యాలయంలో  చాలా ప్రసిద్ధ హాల్ ఉంది, దీనికి ఆయన గౌరవార్థం "సయ్యద్ అమీర్ అలీ హాల్" అని పేరు పెట్టారు.
·        పాకిస్తాన్ పోస్టల్ సర్వీస్ తన 'పయనీర్స్ ఆఫ్ ఫ్రీడం' సిరీస్‌లో 1990 లో స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
·        దక్షిణ కలకత్తాలో ఒక రహదారికి  అతని పేరు పెట్టడం జరిగింది.


No comments:

Post a Comment