5 December 2014

శీతాకాలం లో తీసుకోవలసిన పండ్లు-కాయగూరలు-ఆకుకూరలు


శీతాకాలం వచ్చింది. చలి పెరిగింది . పగటి సమయం తగ్గి రాత్రి సమయం పెరిగింది. ఉష్ణోగ్రతలు తగ్గుతున్నవి. మరి ఈ కాలం లో మన ఆరోగ్యాన్ని కాపాడుకొని ఫిట్ గా ఉండటానికి మనము తినే  ఆహారములో కొన్ని ఫలాలను-కూరగాయలను చేర్చవలసి ఉంది.
శీతాకాలం లో మన శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవటానికి  కావలసిన శక్తీని గోధుమ,జొన్నలు, సజ్జలు, మినుములు, రాగులు, కందిపప్పు, బెల్లం, స్వీట్స్, క్రీం, పాలు, మేవా మొదలగునవి అందించును. వాటితో పాటు జామ,నారింజ, యాపిల్, అరటి, బొప్పాయి,ఖజ్జురం, వేరుసెనగ, గాజర్ తో చేసిన హల్వా, దానిమ్మ వంటివి మన ఆరోగ్యమును కాపాడును. ఆమ్ల,రాడిష్, క్యారెట్, దోస,టమోటా తో చేసిన సలాడులు,జ్యూస్ లు మన ఆరోగ్యమును కాపాడి శరీరానికి కావలసిన రక్షణ ఇచ్చును.  శీతాకాలం లో పెద్ద ఉసిరి తో చేయబడిన చవనప్రాశ్య తీసుకోవడం వలన శరీరానికి కావలసినంత విటమిన్ సి లబించి వ్యాధినిరోధక శక్తీ పెరిగి శ్వాశకోస వ్యాదులు నివారించబడును.
మేతి, పాలక్ మొదలగు ఆకుకూరలలో విటమిన్ ఏ, విటమిన్ సి అధికముగా ఉండి అంటి-ఆక్సిడెంట్స్ గా పని చేయును. ఆవాలు, ఇంగువ, జిలకర్ర,నల్ల మిరియాలు మొదలగు సుగంధ ద్రవ్యాలు శరిరమునకు కావలసిన శక్తిని ఇచ్చును.శీతాకాలం లో శరీరం పొడిగా తయారు అగును. చర్మపు పోడితత్వం ను అరికట్టుటకు రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు త్రాగవలయును.
పరిమితంగా మాంసం,ఆవు, పాలు, నట్స్, పన్నీర్, మిల్క్, దాల్, సోయబిన్, ఫిష్, గుడ్లు, వంటి హై-ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం వలన అవి చర్మం, కీళ్ళు మొదలగు వాటిని రక్షించును. శీతాకాలం లో అల్లపు టి, పసుపు తో కూడిన గోరువెచ్చని పాలు, గోరువెచ్చని నిటి తో   కూడిన నిమ్మరసం, తేనే. తులసి మొదలగు వాటిని తీసుకొనడం మంచింది. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తిసుకోనవలయును. నడక, స్క్కిప్పింగ్, సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయాయం కూడా చేయవలయును.
చలిని ఎదుర్కొని ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే కొన్ని రకాల ఫలాలు –కూరగాయలు, వాటి పోషక విలువలను తెలుసుకొందాము!
క్యాబేజీ:
సామాన్యులకు కుడా తక్కువ ధరలో అందుబాటులో ఉండే కూరగాయాలలో క్యాబేజీ ఒకటి. క్యాబేజీ విటమిన్స్ మరియు మినరల్స్ (విటమిన్ సి,కే,మరియు ఫోలేట్),పిచుపదార్ధం, అంటి-ఆక్సిడెంట్స్,అంటి-కార్సినోజేనిక్ (కాన్సర్ వ్యతిరేక) పదార్ధాలతో కూడి ఉందును. కొలస్టరాల్, క్యాన్సర్,డయాబిటిక్స్ ను తగ్గించును.
బంగాళ దుంప

పిండి పదార్ధం,పొటాషియం, మెగ్నీషియం,ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, ప్రోటీన్ లతో కూడిన బలవర్ధకరమైన ఆహారం బంగాళ దుంప. లో బ్లడ్ ప్రెజర్ తగ్గించును. అంటి-ఆక్సిడెంట్ లాగా పని చేయును. అనేక ఆహార పదార్ధములతో కలిపి వండవచ్చును.

ఉల్లిపాయలు:
సంవత్సరం పొడువునా ఉపయోగపడే ఆహార పదార్ధం ఉల్లిపాయలు. సూప్,సలాడ్, మాంసం లో వాడబడును. ఉల్లిపాయ కోయునప్పుడు వచ్చే కన్నీళ్ళు కంటి కి మంచి చేయును. తక్కువ కాలరీలు, అధికంగా విటమిన్ సి, పిచు పదార్ధంను కలిగి ఉండును. చెడు కొలస్టరాల్ ను తగ్గించును.
క్యారెట్
క్యారెట్ లో బీటా-కరోనిన్ అధికంగా ఉందును.  రోగనిరోధక శక్తిని పెంచును. విటమిన్ ఎ అధికముగా ఉండుటవలన కళ్ళకు,చర్మమునకు, మ్యుకస్ మేమ్బరిన్ కు తోడ్పడును. విటమిన్ సి అధికముగా ఉందును. అంటి-అక్సిడెంట్స్ కలిగి క్యాన్సర్ ప్రమాదమును, హృదయ సంబంధ వ్యాధులను తగ్గించును.
ముల్లంగి
ముల్లంగిలో మంచి పోషక విలువలు కల పదార్దములు కలవు. అధికముగా పీచు, పొటాషియం,విటమిన్ సి , ఫోలేట్ కలిగివుండును. సూప్, కూర తయారు చేసుకోవచ్చును. ప్రతి రోజు ఒక కప్పు ముల్లంగి తీసుకొన్న దానిలో  విటమిన్ సి అధికంగా ఉంది 55 కేలరీల విలువైన పోషక పదార్ధాలను అందించును. వ్యాధినిరోధక శక్తిని పెంచును, బ్యాక్టిరియా,వైరస్ లను ఎదుర్కొనును.  

చిలకడ దుంప
చిలకడ దుంప లో పీచు పదార్ధం, బీటా-కరోతిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, అంటి-ఆక్సిడెంట్స్ కలిగిఉండును. మధుమేహమును నియంత్రించును. వ్యాధినిరోధక శక్తిని పెంచు కణజాలమును శరీరంలో ఉత్పత్తి చేయును.
 సిట్రస్ ఫలాలు-ఆరెంజ్, కమల మొదలగునవి.  

 సిట్రస్ ఫలాలు విటమిన్ సి, ఫ్లెవనొయిడ్స్ కలిగి నోటికి రుచి నిచ్చును మరియు క్యాన్సర్ ప్రమాదమును తగ్గించును. అల్జిమేర్స్,పార్కిన్సన్  వ్యాధి రాకుండా ఉపయోగపడును, మధుమేహం, కలరా, కంట్లో శుక్లాలు, జిన్జివిటిస్ మొదలగు వ్యాధులు రాకుండా కాపాడును.  
దానిమ్మ కాయ

దానిమ్మ కాయలు మానవునికి అతి ప్రాచిన కాలమునుండి పరిచయం ఉన్నవి. అధిక పోషక విలువలతో కూడినవి మరియు అంటి-ఆక్సిడెంట్స్, అంటి-ఇంఫ్లమేటరి గా పనిచేయును. అధిక కొలస్టరాల్, అధిక రక్తపోటు, గుండె పోటు ను నివారించును. దానిమ్మ రసం ధమనులలోని కొవ్వును కరిగించును,గుండె కు బలమును కల్గించును.

ఆకుపచ్చని ఆకు కూరలు :


ఆకు కూరలలో విటమిన్ ఎ,విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం పొటాషియం, ఫైటో కెమికల్స్ మరియు అంటి-ఆక్సిడెంట్లు ఉండును. వ్యాధి నిరోధక శక్తిని పెంచును. ఇవి మానవ శరీరానికి కావలసిన పోషణను ఇచ్చును. ఆకు కూరలను అన్ని వంటకాలలో  కలిపి  వాడవచ్చును. జీర్ణక్రియ లో సహాయ పడును. కొలెస్టరాల్ తగ్గుదలకు, క్యాన్సర్ నిరోధానికి తోడ్పడును. 

No comments:

Post a Comment