3 April 2015

ఇస్లాం లో సెల్ఫ్ మానేజ్మెంట్ (స్వయం నిర్వహణ విధానం) Self-Management in Islam



మనకున్న సమయం ను  సరిఅయిన దిశలో ఉత్పాదకత వైపు మరల్చి మన జీవితం ను అర్థవంతం/సుఖవంతం  చేయుటకు కావలసిన ప్రణాళిక ను రచించి, అమలుపరచుటను సెల్ఫ్ మానేజ్మెంట్ గా నిర్వచించవచ్చును. సెల్ఫ్ మానేజ్మెంట్ స్థూలంగా మూడు అంశాలను కలిగి ఉండును. అవి ఒకటి పర్సనల్(వ్యక్తిగత) మానేజ్మెంట్, రెండు సోషల్(సామాజిక) మానేజ్మెంట్, మూడు ఎన్విరోనల్(పరిసరాల) మానేజ్మెంట్. ఇందులో  పర్సనల్ మానేజ్మెంట్ ఆత్మ,మనస్సు,శరీరం ను, సోషల్ మానేజ్మెంట్ కుటుంబంను, స్నేహితులను, ఎన్విరోనల్ మానేజ్మెంట్ ఇంటి మరియు పని ప్రదేశం ను కలిగి ఉండును.
సెల్ఫ్ మానేజ్మెంట్ ను వివిధ  వ్యక్తులకి వివిధ  రకాలుగా, కొన్ని సార్లు ఒకే వ్యక్తి కి  వివిధ సందర్భాలలో వివిధ   రకాలుగా ను అన్వయించవచ్చును. కొంత మంది వ్యక్తులు పుట్టుకతో నిర్వహణ నైపుణ్యం ను కలిగి ఉంటారు, మరికొంత మంది వాటిని సాధించ వలసి ఉంటుంది. కొంత మంది తమ నైపుణ్యం ను సొంతంగా ఉపయోగిస్తారు, కొంతమంది తమ  నైపుణ్యం ప్రదర్శించుటకు   తమ  గురువుల స్నేహితుల, కుటుంభ సబ్యుల, సహయం పొందవలసి ఉంటుంది. సెల్ఫ్ మానేజ్మెంట్ నైపుణ్యాలు పుష్కలం గా  ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత, సాంఘిక, వృతి పరమైన జివితంను సమర్ధవంతంగా,అర్థవంతం గా నిర్వహించ గలడు.
మానేజ్మెంట్ లో సెల్ఫ్-మానేజ్మెంట్ అనునది నవీన తమ భావన ఐనప్పటికే ఇస్లాం లో దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. సెల్ఫ్-మానేజ్మెంట్ లో మొదటి అంశం ఆత్మ (soul) కి సంభందించినది. ఇస్లాం ప్రకారం ప్రతి వ్యక్తి తన ఆత్మ ను పరిశుద్దగా ఉంచవలయును. అల్లాహ్ దివ్య కురాన్ లో అంటాడు “ నిశ్చయంగా తన ఆత్మ ను పరిశుద్ద పరుచుకొన్న వక్తి సఫలుడయ్యాడు,దానిని అణిచివేసిన వాడు విఫలుడయ్యాడు.” 91 :9-10. 
పై ఆయతుల ప్రకారం ప్రతి వ్యక్తి  తన లోని మంచి,చేడులను తెల్సుకొని తన ఆత్మ ను పరిశుద్ద పరుచుకోవలయును. కాబట్టి ప్రతి వ్యక్తి తన్ను తాను తెలుసుకొని తనలోని మంచి గుణాలను అబివృద్ది చేసుకొనవలయును తద్వారా తన ఆత్మను శుబ్రపరుచుకోన వలయును. మహమ్మద్ ప్రవక్త (స) ప్రకారం  “అల్లాహ్ మాకు మంచి ఆత్మను ప్రసాదించి దానిని శుబ్రపరుచు, నీవు మాత్రమే ఉత్తమoగా శుబ్రపరిచేవాడివి, రక్షించేవాడివి మరియు ప్రోత్సాహం ఇచ్చే వాడివి.” –– ముస్లిం.
సెల్ఫ్- మానేజ్మెంట్ ద్వితీయ  అంశం మనస్సు. ఇస్లాం ప్రకారం  ఒకని పై  పూర్వనిచ్చిత అబిప్రాయలు కలిగి ఉండటం , ఒకని పై గూడాచారితనం చేయుట , పరోక్షం లో ఒకరి పై నిందలు వేయటం, పరుల పై అసూయ మొదలగునవి నిషేదాలు. ఇవి లేకుండా ఉండటం సెల్ఫ్-మానేజ్మెంట్ కు లక్షణం. వీటి నుంచి దూరంగా ఉండటం వలన మనస్సు ఎటువంటి  చెడు భావన లేక  ఉత్పాదకత వైపు మరలుతుంది. అందువలన మనస్సు ను శాంతియుతంగా, ప్రశాంతం గా ఉంచాలి. దాని వలన వ్యక్తి తన కార్యక్రమాలను సమర్దవంతం గా నిర్వహించగలుగుతాడు. ప్రవక్త (స) ప్రకారం “అర్థవంతమైన ఒక గంట ఆద్యాత్మిక చింతన/ద్యానం, ఒక సంవత్సరం నిరుపయోగ భగవత్ ఆరాధన కన్న మిన్న” –అజ్లుని మరియు కష్ఫ్ అల్ ఖఫా.
ఇక మూడవ అంశం ఆరోగ్యం. ఇస్లాం ప్రకారం ఆరోగ్యం మానవుని ప్రాధమిక హక్కు. ఆరోగ్యం మానవాళి కి అల్లాహ్ ప్రసాదించిన గొప్ప వరం. విశ్వాసం తరువాత అంత గొప్పది ఆరోగ్యం. ప్రవక్త(స) ప్రకారం “క్షమ మరియు ఆరోగ్యం కొరకు అల్లాహ్ ను ప్రార్ధించండి, ప్రార్ధన మన్నించబడిన తరువాత ఆరోగ్యం కన్న మిన్న లేదని గుర్తించండి.”  తిర్మిజి.  ప్రవక్త (స) ప్రకారం  “మీ శరీరం కు మీపై హక్కు కలదని గుర్తించండి.” – బుకారి . పై హదీసు ప్రకారం మానవుని ఆరోగ్యంనకు అత్యంత ప్రాధాన్యత కలదని అర్థం అవుతుంది. జీవితాన్ని సంపూర్ణం గా అర్థవంతoగా చేయుటకు  మానవుడు శారీరక,మానసిక,సామాజికం గా సంపూర్ణ ఆరోగ్యవంతుడై  ఉండవలయును. అల్లాహ్ చూపిన మార్గమున ఉత్సహంగా, చురుకుగా నడచుటకు విశ్వాసి సంపూర్ణ ఆరోగ్యవంతుడగుట ప్రధానం.

నాల్గోవ ప్రాధాన్యత కల అంశం కుటుంభం. ప్రవక్త (స) తన కుటుంబ జీవితం ను చక్కగా హయిగా గడిపినారు. “విశ్వాసుల మాత అయేషా తో మాట్లాడుతూ రాత్రి సమయమున  కలిసి నడుస్తూ ఉండేవారు.” – బుకారి. అయేషా తో కలసి పరుగు పందెం లో పాల్గొనే వారు.  అబిసీనియా వారు కత్తి-డాలు తో ప్రదర్సన జరుపుతున్నప్పుడు విశ్వాసుల తల్లి అయేషా వారి వెనుక నిలబడి విక్షించేవారు. అప్పుడు ఆమె చెంప వారి చెంపను ను తాకేది మరియు ఆమె కోరికతీరేవరకు ఆమెను ఎత్తుకొనేవారు. తన మనవలు హుస్సెన్,హాస్సెన్ తో ఆడుకొనేవారు. తన దైనందిన జీవితం లో కుటుంబ జీవితంనకు తగు సమయం, ప్రాధాన్యతను ఇచ్చేవారు.
ఐదోవ  అంశం స్నేహితులు. ఇస్లాం లో స్నేహితులకు, బంధుత్వానికి అత్యంత  ఉన్నత స్థానం ఇవ్వబడింది. తన సన్నిహితులు,సహచరులు, బందువులతో  ప్రవక్త (స) మంచి సానిహిత్యం ఉంచేవారు. రోగులు,దీనులను పరామర్శించేవారు. గొర్రె ను జిబా చేసినప్పుడు దాని మాంసం ను ఖదీజా బిబి స్నేహితులకు పంపేవారు. స్నేహితులకు , బందుత్వానికి ప్రవక్త (స) అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు.
ఆరోవ అంశం స్వగృహం. విశ్వాసుల తల్లి అయేషాను మహా ప్రవక్త ఇంటివద్ద ఏమి  చేసేవారని ప్రశ్నించగా ఆమె  ప్రకారం “మహా ప్రవక్త  కుటుంబ సబ్యులకు ఇంటి పనులు చేయడం లో సహాయం చేసేవారు.” -బుకారి. వారు సామాన్య పురుషుల  మాదిరిగా  ఇంటిపనులలో కుటుంబ సబ్యులకు సహాయం చేసేవారు. “స్వయంగా పాలు పితకటం,తన దుస్తులను కుట్టుకోవడం,తన పాద రక్షలను బాగు చేయడం, అవసరమైన  ఇంటి పనులను చేయడం లో కుటుంబ సబ్యులకు సహాయపడటం లో తన సమయాన్ని గడిపేవారు.”-తిర్మిజి
ఇక ఏడోవ అంశం పనికి సంభందించినది. ప్రవక్త (స) ప్రకారం “ఒక పనిని సంపూర్ణం గా పూర్తిచేయడం అల్లాహ్ కు ప్రితికరం.” – ఇబ్న్ హాజర్. ప్రవక్త తన పనులను అత్యంత ప్రభావంతం  గా పూర్తి చేసేవారు. ప్రవక్త (స) జీవితం వృత్తికి-వ్యక్తిగత జీవితం సమన్వయమునకు  సరిఐన ఉదాహారణ. ప్రవక్త విధులను నిర్వహించడం తో బాటు ఉపాద్యాయుడు, రాజినీతి వేత్త, న్యాయాధికారి,మొదలగు విధులను నిర్వహించేవారు. సైన్యాన్ని నడపడం తో బాటు,శాసనాలు చేయడం,సామ్రాజ్యాలు,ప్రజలను,తెగలను,ప్రపంచ జనాభా లో మూడోవంతు ప్రజలకు దిశా-నిర్దేశం చేసేవారు. అజ్ఞాన కాలం నాటి ప్రజల విశ్వాసాలను, వారి దేవుళ్ళను, వారి ఆచారాలను మార్చి  వారి హృదయాలలో పరివర్తన తెచ్చారు. ఒక తాత్వికునిగా,ఉపన్యాసకునిగా,శాసన కర్తగా, వీరునిగా, ఆలోచనల విజేతగా, సరియైన జ్ఞాన బోధకునిగా,ఎకేస్వరోపాసకునిగా, విగ్రాహారాధ విరొధకునిగా, 20 సామ్రాజ్యాల స్థాపకునిగా,ఒక ఆద్యాత్మిక సామ్రాజ్య అధిపతిగా  మొదలగు  అన్నిరంగాలలో తన పాత్రను విజయవంతంగా నిర్వహించినారు.
మహా ప్రవక్త తన అనుచరులను యాచించటం నుంచి నిషేదించినారు. వారు ఎంత పేదరికం లో ఉన్నప్పటికి, అవసరం లో ఉన్నప్పటికీ  ఇతరులను యాచించే వారు కాదు. వారికి ఇతరుల సహాయం నచ్చేది కాదు. ఉదాహారణకు “అశ్వాన్ని అధిరోహించినప్పుడు కొరడా జారిన, దాన్ని చేతికి అందించమని ఇతరులను అడుగక స్వయంగా తామే అశ్వాన్ని వీడి కోరడాను తీసుకొనేవారు.”-ముస్లిం.
మరొక ముఖ్య అంశం ఒక వ్యక్తికి సెల్ఫ్-మానేజ్మెంట్ లో సుశిక్షణ  ఇవ్వటం. ఉదాహరణకు ప్రార్ధన సెల్ఫ్-మానేజ్మెంట్ నేర్పును. ”నమాజ్ ముగిసిన తరువాత భూమి పై వ్యాపించండి, అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషించండి; అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి. బహుశా మీకు సాఫల్య భాగ్యం కలుగవచ్చు.” – దివ్య ఖురాన్ 62:10. పై ఆయత్ ప్రకారం పని చేయండి, సమయం అయినప్పుడు  ప్రార్ధనకు వెళ్ళండి, ప్రార్ధన పూర్తి అయిన తరువాత పనికి తిరిగి వెళ్ళండి. సెల్ఫ్-మానేజ్మెంట్ కు ఇది సరిఐన ఉదాహరణ.
ఉపవాసం సెల్ఫ్-మానేజ్మెంట్ కు సరి అయిన ఉదాహరణ. రమదాన్ మాసం లో ఉపవాసం ఒక వ్యక్తి షెడ్యుల్ ను పూర్తిగా మార్చును. నిద్ర లేచుట,నిద్రించుట,అల్ఫాహారం,రాత్రి  భోజన సమయాలలో మార్పులు వచ్చును. మారిన సమయానికి అనుకూలంగా తన్ను తానూ మార్చుకోవటం వ్యక్తి లో సెల్ఫ్-మానేజ్మెంట్ లక్షణములను పెంచును.
మహా ప్రవక్త (స) జీవితం సెల్ఫ్-మానేజ్మెంట్ కు సరి అయిన ఉదాహరణ. 23 సంవత్సరాల వ్యవధి లో అజ్ఞాన కాలం నాటి సమాజం ను, విగ్రహారాధకులను,ప్రజలను సంపూర్ణం గా మార్చి ఒక దేవుని నమ్మేవారిగా రుపొందించెను.  అరేబియా  తెగల అంతర్గత తగాదాలను,యుద్దాలను నివారించి అజ్ఞానము,అంధకారం లో ఉన్న అరబ్ సమాజం ను క్రమశిక్షణ, అత్యుత్తమ నైతిక విలువలు గల సమాజంగాను, మార్చి, అరబ్ వాసులను   ఉన్నత నాగరికత గల  మానవులుగా మార్చినారు. శాస్త్ర, సాంకేతికరంగాలలో వారిని అగ్రగాములుగా రుపొందిoచినారు. మతభోదకునిగా,రాజ్య స్థాపకునిగా,అత్యుత్తమ నైతిక నియమాల కర్తగా, అనేక సామాజిక, రాజికీయ సంస్కరణల ప్రతిపాదికునిగా ప్రవక్త (స) పేరుగాంచెను. మానవుని ఆలోచన విధానంను,అతని ప్రవర్తనను ప్రభావితంచేసేను. మానవ చరిత్రలో ఇంతటి స్వల్ప కాలంలో సమాజం ను, కాలంను, సంపూర్ణంగా ప్రభావితం చేసిన వ్యక్తి,అద్భుతాలు సృష్టించిన వ్యక్తి  ఇంకోకరు కనపడరు. ప్రవక్త (స) జీవితం సెల్ఫ్-మానేజ్మెంట్ కు మంచి ఉదాహారణ.
ఒక వ్యక్తి తన కున్న సమయంను సరిగా వెచ్చించి అన్ని రంగాలలో  విజయవంతుడగుటకు సెల్ఫ్-మానేజ్మెంట్ తోడ్పడును. మన కున్న స్పల్ప సమయంలో జీవితం లో అభివృద్ధి సాధించుటకు సెల్ఫ్-మానేజ్మెంట్ తోడ్పడును. ప్రవక్త (స) జీవితం ను ఉదాహరణగా తీసుకోని మన కున్న సమయంను సరిగా ఉపయోగించి ఆరోగ్యకరమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ అనుత్పాదక పనులను విడనాడి తమ గమ్యం/లక్ష్యం  పై దృష్టిని నిలిపవలయును.
.

No comments:

Post a Comment