4 November 2016

భవిష్యత్తులోభారతీయ ముస్లింలు జనాభా, ఉపాది రీత్య అనుకూల స్థితి లో




ఎన్నిక సీజన్ ప్రారంభమైనది. భారతదేశం యొక్క అతిపెద్ద మైనారిటీ వర్గం అయిన ముస్లింలకు వివిధ రాజకీయ పార్టీలు  కోటాలను వాగ్ధానం చేస్తున్నారు. కాని వాస్తవానికి  కోటా వాగ్దానాలకు  తగినట్లు సంఘటిత రంగంలో ఉద్యోగాలు లేవు. ముస్లింలకు  కోటాల వంటి నిచ్చెనల  అవసరం లేదు. వారు ప్రపంచ పోటీతత్వ జాబ్ మార్కెట్లో జనాభా ఆధారంగా ప్రయోజనము పొందగలరు.

వృద్ధి మందగమనం, అధిక ఆటోమేషన్, వ్యవసాయ ఉత్పత్తులు  పడిపోవడం తో ఉద్యోగాల కోసం అనేక వర్గాల వారు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్నారు.  వెనుకబాటు లెక్కింపు అర్హత లేనప్పటికీ సాంప్రదాయకంగా భూ యాజమానులు అయిన జాట్లు, గుజ్జర్లు, పట్టిదార్లు, మరాఠాలు, జాబ్ లో కొటాల కోసం తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

కోటాలు కోసం  డిమాండ్ చేస్తున్న వర్గాల వారు ఒక సాధారణ తప్పు చేస్తున్నారు. ఉద్యోగాలు ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థ యొక్క వ్యవస్థీకృత రంగాల్లో తగినంత వేగం గా  పెరుగుట లేదు. ఉద్యోగాలు ఇన్ఫార్మల్(informal) మరియు సర్విస్ రంగం లో సృష్టించబడుతున్నాయి. ఒక సంఘటిత రంగంలో ఉద్యోగ విపణిలో కోటాలు చాలా కొద్ది మందికి  ప్రయోజనం కల్పించవచ్చు. కానీ వృత్తులలో మరియు వ్యాపారాలలో నైపుణ్యం సాదించడం వలన ఎక్కువ మందికి ఉపాధి కల్పించ వచ్చు.

జనాభా పెరుగుదల ముస్లింల విషయంలో, రాబోయే దశాబ్దాలలో వారికి అనుకూలంగా మారబోతుంది

19 సంవత్సరాల లోపు వారు ముస్లింలలో 47% మంది ఉన్నారు.  హిందువులలో  40% మంది ఉన్నారు. అనగా వచ్చే దశాబ్దంలో ముస్లిం లలో ఎక్కవ మంది ఉత్పత్తి తరగతి (productive phase) లోకి వస్తారు. దీనికి విరుద్ధంగా, మరింత మంది  హిందువులు ఉత్పత్తి తరగతి (productive phase) నుంచి నిష్కమిస్తున్నారు. ఇప్పటికే 20-60 వయస్సు గల వారు హిందువులలో 51% మంది ఉండగా అది ముస్లింలలో  46% మాత్రమే ఉన్నారు. అనగా ఎక్కువ మంది  హిందూవులలో  రిటైర్ అవుతున్నారు.  ముస్లిం జనన రేటు హిందూ జనన రేట్ కన్నా ఎక్కువ  (హిందువులలో జననాల రేట్  16.8%ఉండగా అది ముస్లింలలో 24.6 శాతం గా ఉంది. అనగా జనాభా పెరుగుదల ఒకటి లేదా రెండు దశాబ్దాల్లో ముస్లింల పట్ల అనుకూలంగా ఉంటుంది.

గతంలో అనేక దశాబ్దాలుగా  ముస్లింలు ముఖ్యంగా డిమాండ్ రంగాలలో అనగా ప్రభుత్వోద్యాగాలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలు, మరియు బహుళజాతి, ప్రైవేటు రంగ సంస్థలలో అత్యల్పంగా  ఉద్యోగాలు పొందారు. ముస్లింలు ఆదాయం తక్కువ వచ్చే వర్తకాలు మరియు వివిధ వృత్తుల్లో స్థిర పడినారు.కానీ ఈ రంగాలే భవిష్యత్తులో పెద్ద ఉద్యోగ సృష్టికర్తలు గా ఉండబోతున్నాయి.

స్వాతంత్ర్యము వచ్చిన  ఏడు దశాబ్దాల కాలం కోటాలు మరియు మెరిట్ ఆధారిత ఉద్యోగాలు ఒబిసిలు, దళితులతో  సహా హిందూ మధ్యతరగతి వర్గం పొందినవి. విభజన సందర్భంగా భారతదేశం ముస్లిములలో విద్యాధికులు దేశం విడిచి వెళ్ళినారు మరియు దేశం వీడని  మిగిలిన పేద, నిరక్షరాస్య ముస్లింలు "లౌకిక" పార్టీలకు  ఓటు బ్యాంక్ లుగా ఉపయోగ పడ్డారు. వారు విద్య, ఉద్యోగాల బదులు  రక్షణ పొందారు. కాని బాబ్రీ (1992)పతనం తరువాత, ముస్లింలకు "లౌకిక" పార్టీల పట్ల విశ్వాసం సన్నగిల్లింది మరియు వారు వారి విద్య కోసం  సొంత పెట్టుబడి పెట్టారు  మరియు వారి స్వంత ఉద్యోగ అవకాశాలు సృష్టించుకొన్నారు.

స్వాతంత్రం అనంతరం  భారత ఆర్థికవ్యవస్థ లో ముఖ్యంగా అసాంఘిటిత రంగం లో వివిధ వ్రుతులు, వ్యాపారాలలో  ముస్లింలు ఇప్పటికే చొచ్చుకు చొచ్చుకు వస్తున్నారు.
సాంప్రదాయకంగా హిందూ మధ్యతరగతి వర్గం  ఆధిపత్యం ఉన్న రంగాలలో సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు, ప్రభుత్వ రంగ, మరియు వ్యవస్థీకృత వ్యాపారాలు లేదా ఐటి సేవలు వంటి రంగాలలో ఉద్యోగాలు తగ్గుముఖం  పట్టినవి.

దీనికి విరుద్ధంగా ఉద్యోగాలు అసంఘటిత  రంగం లో అనగా పరిశ్రమలు, వివిధ వృత్తి రంగాలలో  పెరిగినవి.వీటిలో ఆసక్తి, చిన్న చూపు తో  ఇతర వర్గాల వారు ప్రవేసించ లేదు. ముస్లిం ప్రాతినిద్యం ఈ రంగాలలో ఎక్కువ.
మే లో విడుదల చేసిన హెచ్డిఎఫ్సి(HDFC) బ్యాంక్ జాబ్స్ నివేదిక ప్రకారం, భవిష్యత్తులో భారతదేశం టాప్ 10 విభాగాలలో బలమైన పోటీతత్వ ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది: కంప్యూటర్ ఎలక్ట్రానిక్ మరియు ఆప్టికల్ ఉత్పత్తులు, ఫర్నిచర్, తోలు మరియు ఉత్పత్తులు, ప్రింటింగ్ మరియు పబ్లిషింగ్, రబ్బరు మరియు ప్లాస్టిక్ ఉత్పత్తులు, ధరించి దుస్తులు ఇతర కాని లోహ ఖనిజ ఉత్పత్తులు, మోటారు వాహనాలు, కాగితం మరియు కాగితం ఉత్పత్తులు, విద్యుత్ పరికరాలు, మరియు మెటల్ ఉత్పత్తులు. ఈ పై జాబితాలో మనం భారతదేశం యొక్క రిటైల్ రంగం తో పాటు  వినోదం, ఆరోగ్య, పర్యాటక మరియు విశ్రాంతి పరిశ్రమ  జోడించవచ్చు. పెరిగే  జనాభా తో పాటు ఈ రంగాలలో వృద్ది కనిపిస్తుంది.

ఫర్నిచర్, తోలు, మోటార్ వాహనాలు (గ్యారేజీలు మరియు మరమ్మత్తు దుకాణాలు), వినోదం (బాలీవుడ్), పర్యాటక, హస్తకళలు, లోహపు కళ, టైలరింగ్, రిటైల్ వాణిజ్యం, తదితర రంగాలలో ముస్లింల ప్రవేశాన్ని ఉహించండి.  ముస్లింలు తమ జనాభ నిష్పత్తి ని మించి ఈ వ్యాపారాలు మరియు ఈ వృత్తులు లలో ఉన్నారు.  ఈ ఉద్యోగాలు వారి DNA లో ఉన్నాయి అందువల్ల వారు సంపన్నులవుతారు మరియు ఆర్ధికం గా ఉన్నతి పొందుతారు.

కోటాల ప్రస్తుత  శకంలో, హిందూ మధ్యతరగతి వారి సొంత జనాభా డివిడెండ్ సాయంతో ప్రధాన లబ్ధిదారులుగా ఉన్నారు. కాని ముందు దశకాలలో అభివృద్ధి  దారితీసే  వ్యవస్థాపకత మరియు ప్రైవేట్ కృషి రంగాలలో ముస్లింలు మంచి భవిష్యత్తు కలిగి  వారి సొంత జనాభా డివిడెండ్ తో విజయం సాదిoచుతారు.
ముస్లింలకు  కోటాలు వంటి నిచ్చెనలు అవసరం లేదు. వారు జనాభా డివిడెండ్ సహాయం తో జాబ్ మార్కెట్ లో ప్రపంచ పోటీతత్వ ప్రయోజనo ద్వారా లాభం పొందే అవకాశం ఉంది.భారతదేశం యొక్క జనాభా డివిడెండ్ లో ముస్లిలు అధికంగా  పాల్గొనడం వలన పూర్తి ప్రయోజనం ఉంటుంది.


No comments:

Post a Comment