ప్రపంచంలో భారతదేశం నేడు 10-24 సంవత్సరాల మద్య వయస్సుగల 356 మిలియన్ల యువత ను కలిగి ఉంది. ఈ యువ శక్తీ ని అత్యధికం గా వినియోగించుకోవాలి. అందుకు
ఉపయోగపడే మార్పులు చేయడం ద్వారా, భారతదేశం యొక్క ఈ
యువ శక్తిని మనము అత్యధికంగా ఉపయోగించవచ్చు.
భారతదేశం లో నేడు దాదాపు
ప్రతి సమస్యకు విద్యను ఒక పరిష్కారం గా
సూచించవచ్చు. విద్య యొక్క ప్రయోజనాలు తెలిసినప్పుడు మాత్రమే విద్య సాధారణ ప్రజానికానికి చేరువ అవుతుంది.
భారతదేశం లో అందరికి విద్య అందించడం కోసం “ఈచ్ వన్ టీచ్ వన్” వంటి కార్యక్రమాలు ప్రతి
భారతీయ ఉద్యోగులందరికీ 6 నెలల పాటు తప్పనిసరి చేయవలసి ఉంటుంది.
పట్టణ మురికివాడలు,
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగు అవసరం మరియు పల్లెలలో శుబ్రమైన మరియు పర్యావరణాన్ని కాపాడే వంటచేయడానికి ఉపయోగపడే మరియు 40% ఇంధనాన్ని
పోదుపుచేసే ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలు
అయిన తెర్మో-ఎలెక్ట్రిక్ స్టవ్ లాంటి వినూత్న ఉత్పత్తులు రూపొందించాలి. ఇందుకుగాను భారత దేశం లోని యువ వ్యవస్థాపకులు స్వీడన్, వంటి దేశాలలో గృహ
వ్యర్థాలను 99% రీసైకిల్ చేసి మరియు శక్తి గా మార్చే రీసైక్లింగ్ విప్లవంను అనుసరించవలసి ఉంటుంది.
యువతరం నేటి భారత
రాజకియాలలో ప్రముఖ పాత్ర వహించాలి. యువ
రాజకీయ నాయుకులు మహాత్మా గాంధీ ఉపాధి పదకం, గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టులు, ప్రధాన మంత్రి
గ్రామీణ సడక్ వంటి ప్రాథమిక ప్రభుత్వ పథకాలు మరియు మహిళా రిజర్వేషన్ బిల్లు, లోక్ పాల్ బిల్, రహదారి భద్రత బిల్లు వంటి
వాటిని మరియు వారి నియోజకవర్గంలో ప్రజా నిధుల సక్రమ వ్యయం ఉండేలా, సమర్థవంతంగా
అమలు జరిపే భరోసా ప్రజలకు ఇవ్వవలసి ఉంటుంది.
సిఎస్ఆర్ (CSR)విధులు నిర్వహించే
భారతీయ యువ మ్యానేజర్లు వారి CSR చర్యల ప్రభావం
ఎంతవరకు సమాజంలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడిందో విశ్లేషించవలసి ఉంది. అందుకు గాను భారత దేశం లోని జనాభా లో 80%
జనాభా లో మార్పు తీసుకురావటానికి భారత యువతలో విద్య మరియు శ్రేయస్సు పరంగా 20% మంది కృషి
చేయవలసి ఉంటుంది.
కేవలం ప్రభుత్వం మాత్రమే ఒంటరిగా
విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రహదారుల నిర్మాణo, విద్యుత్ ప్లాంట్ల
వంటి ప్రాథమిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. భారతదేశం ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే ఈ మిషన్ లో భారతీయ కంపెనీలు చేయూత నివ్వాలి. భారత దేశం లోని
ప్రతి ఒక్క మల్టీ నేషనల్ కార్పోరేషన్ (MNC) ఒక విద్యా సంస్థ
మరియు ప్రపంచ స్థాయి సౌకర్యాలు గలిగిన ఒక ఆసుపత్రి ఏర్పాటు చేస్తే భారత దేశం లో మార్పు
దూరం కాదు.
అవినీతి భారతదేశం లో
దాదాపు ప్రతి సమస్య యొక్క మూల కారణం. పౌర సేవకులు(civil servants)
గా పనిచేసే యువతరం క్షేత్ర
స్థాయిలో అభివృద్ధి పనిని అమలు చేసే బాధ్యత వహించాలి. ప్రతి బ్లాక్ అభివృద్ధి అధికారి
తన బ్లాక్ లో పని సక్రమం గా అమలు జరిపిన, ప్రతి జిల్లా కలెక్టర్ తన క్రింద
పనిచేసే పోలీసు దళం సహాయం తో తన పరిధి లో శాంతిభద్రతల
నిర్వహణ సక్రమంగా ఉండటట్లు చూస్తే మరియు ప్రజా పనుల విభాగం అధికారులు ప్రజల
సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కార భరోసా
ఇస్తే నగరాలు,పట్టణాలు మరియు గ్రామాలు శరవేగంతో
అభివృద్ధి చెందుతాయి.
భారతీయ యువత ఉపాధ్యాయులు, ఆచార్యులు మరియు
పరిశోధకులు గా మారాలి. భారతదేశంలో నేడు
పిల్లలకు సమాజంలో వారి పాత్ర పట్ల సరైన అవగాహన
ఉండాలి. ఉపాద్యాయులు విలువలు మరియు ప్రకృతి పరిరక్షణకు ఉపయోగ పడే నైతికపరమైన
విద్య ఇవ్వాలి. అజ్ఞానం, భయం, పక్షపాతం మరియు
ఉదాసీనతలను అనియంత్రణగా వదిలేస్తే అవి ప్రపంచంలోనే ద్వేషం మరియు తీవ్రవాదాన్ని పెంచే చీడలుగా
తయారు అవుతాయి. మన దేశము బహుళ జాతి, బహుళ మత, బహుళ-భాషాలతో కూడినది మరియు వాటివల్ల మన దేశము విబిన్న
సమస్యలకు గురి కావచ్చు కాబట్టి ప్రతి
విద్యార్థి నైతిక విలువలను కలిగి భారతదేశం
లోని విబిన్న జాతుల పట్ల తమ గుర్తింపు మరియు గౌరవం ప్రదర్శించాలి.
ఆరోగ్యమే మహా భాగ్యం మరియు ఆరోగ్యకరమైన ఒక దేశ పౌరునిగా
యువత ఆరోగ్య రంగంలో ఉత్పాదక మరియు
సమర్థవంతమైన కార్యక్రమాలను నిర్వహించాలి. భారతదేశం యొక్క సగటు ఆయుర్దాయం 66 సంవత్సరాలు గా
ఉంది. జపాన్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అది చాలా తక్కువ. స్వీడన్
వంటి దేశాల్లో (స్వీడన్ సగటు ఆయుర్దాయం 81 సంవత్సరాలు) లాగా ఆరోగ్య సేవలను ప్రభుత్వం మరియు వివిధ కార్పొరేట్లు ప్రారంభించాలి. నేడు స్వీడన్ లో మొత్తం
ఆరోగ్య సంరక్షణ స్పెక్ట్రం కు ప్రాతినిధ్యం వహిస్తూ సుమారు 350 కంపెనీలు మరియు
సంస్థలు కలవు. అవి సిబ్బందితోపాటు వైద్య
సాంకేతికత, మందులు, మరియు బయోటెక్
నుండి మెడికల్ తెక్నలాజి,ఫార్మాసూటికల్ ,హెల్త్ కేర్ సేవలను విశ్వవిద్యాలయాలు, కౌంటీ కౌన్సిళ్ల
మరియు ప్రపంచ సంస్థల వరకు ఆరోగ్య సేవలు
అందిస్తున్నవి.
భారతదేశం కోసం అంతర్జాతీయ ఛాంపియన్షిప్పు లలో పతకాలు
సాదించిన యువత ఇతరులను చైతన్యపరచటంలో మరియు సరైన కోచింగ్, ట్రైనింగ్
సదుపాయాలు అందజేస్తూ సహాయపడాలి. కేంద్ర
క్రీడా అధికారులు అన్ని క్రీడలకు సమాన
ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించాలి మరియు భారత దేశం లోని వివిధ రాష్ట్రాల్లో ప్రపంచ తరగతి స్టేడియంలను
నిర్మించాలి.
చివరగా, బాధ్యత గల పౌరులుగా
యువత తమ పాత్ర ను నిర్వహించాలి. డాక్టర్, ఇంజనీర్, దుకాణదారుడు, రైతు, కాపలాదారు గా ప్రతి వ్యక్తి తమ ఉపాధి లేదా ఉద్యోగం జవాబుదారిగా చేయాలి. పర్యావరణ వ్యవస్థ అందించే అవకాశాలు మరియు వనరులు భారత యువత అందిపుచ్చు కోవాలి. ముందెన్నడు లేనివిధంగా భారతదేశం లోని యువశక్తీ భారతదేశం యొక్క ముఖ చిత్రం మార్చవలసి ఉంటుంది.
పేదరికం,ఆకలి
తొలగించాలి. ఆరోగ్య సంరక్షణ చేపట్టాలి.
నాణ్యమైన విద్య అందించాలి, లింగ సమానత సాదించాలి మరియు మంచి నీరు మరియు పారిశుద్యం
అందరికి అందుబాటులోకి తేవాలి. చౌక గా శక్తిని వినియోగంలోనికి తేవాలి.
ఆర్దికాభివ్రుద్ది సాధన – పని కల్పన, పరిశ్రమల స్థాపన మరియు అవస్థాపన సౌకర్యాల
అబివృద్ది చేయాలి.
ఆర్ధిక అసమానతలను
దూరం చేసి, సంతులిత నగరీకరణ మరియు విబిన్న
వర్గాల అభివృద్ధి పై ద్రుష్టి పెట్టాలి. వనరుల
వినియోగం మరియు తయారీలో బాద్యత వహించుట, పర్యావరణ పరిరక్షణ, మత్స్య సంపద
అబివృద్ది, అటవికరణ, వనాల ఏర్పాటు, శాంతి మరియు న్యాయం పెంపొందించుట, లక్ష్య సాధన
లో అందరి తోడ్పాటు వంటి చర్యలను యువకులు చేపట్ట వలసి ఉంటుంది.
ఇది యువశక్తి విప్లవం కు
అనుకూలమైన సమయం మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఒక ఉదాహరణగా భారతీయ యవత ఉండాలి.
No comments:
Post a Comment