.
అర్థశాస్త్రంలో నేడు ప్రధాన స్రవంతి అయిన
సంప్రదాయక ఎకనామిక్స్ యొక్క కాలవ్యవధి
ముగిసింది మరియు ఒక ప్రత్యామ్నాయ ఆర్ధికశాస్త్ర౦ యొక్క అవసరం ఉంది. ప్రత్యామ్నాయంగా ఇస్లామిక్
అర్ధశాస్త్రం యొక్క ప్రాథమిక లక్షణాలను చర్చించవచ్చును. దానిపై విశాలమైన సాహిత్యం
అందుబాటులో ఉంది.
నేడు
1.రియల్ ఎకానమీ మరియు
ఫైనాన్షియల్ ఎకానమీ మధ్య బేధం విస్తృతి చెందింది. ఫైనాన్షియల్ ఎకానమీ యొక్క
పరిమాణం రియల్ ఎకానమీ కంటే పది రెట్లు ఎక్కువ ఉంది.
2. క్రెడిట్ సులభం మారింది. పలితంగా నేడు, కార్పొరేట్ రంగ౦,
ప్రభుత్వరంగం రెండింటి ఆర్ధిక వ్యవస్థ లో అప్పు ఈక్విటీ
కాపిటల్ కంటే వేగంగా పెరుగుతూ వస్తోంది. ఇది సంస్థాగత మరియు దేశియ రుణ సంక్షోభం కు దారితీస్తోంది.
3. కార్పొరేట్ ఆర్థిక వ్యవస్థలు జాతీయ ఆర్థిక
వ్యవస్థల పై ఆధిక్యత పొందినవి.
4. ఫ్యూచర్ ఆర్ధిక వనరులను ఒక అనియంత్రిత పద్ధతిలో నేడు ఖర్చు
బెడుతున్నారు పలితంగా రాబోయే రోజుల్లో భూమిపై జీవితం యొక్క నాణ్యత గురించి
తీవ్రమైన పర్యావరణ ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఇస్లాం చట్టం యొక్క ప్రాధమిక
లక్షణమును కింద విధంగా వర్ణించవచ్చు:
• ప్రజాప్రయోజన౦ (maslahah) పొందట౦ లేదా అమలు
చేయడం మరియు
•చెడు(Mafsada)ను నివారించుట లేదా తగ్గించుట.
ఇజ్జ్ ఎల్-దిన్ అబ్దుస్
సలాం (660H / 1260 CE) అనే పండితుడు ఇస్లామిక్
ఎకనామిక్స్ ను అల్ అదల్ (న్యాయం) మరియు
అల్-ఇహ్సన్ (ఈక్విటి తో సమ న్యాయం
మరియు ఈక్విటీ తో కొంత ప్రయోజనం(maslahah) చేకుర్చుట లేదా కొంత
చెడు (Mafsada) నివారించడం) గా
వర్ణించాడు. ఇస్లామిక్ పండితులు చెడు(Mafsada) నివారణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. చెడు (Mafsada) నివారించబడితే ప్రయోజనాలు (maslahah) సహజంగా ఉంటాయి.
వారు ఇస్లామిక్ చట్టం (Maqasid-అల్-షరియా) యొక్క
అయిదు లక్ష్యాలు వర్ణిస్తారు. ఇవి ఆర్థిక వ్యవస్థకు కూడా వర్తించుతాయి.
ఈ ఐదు
లక్ష్యాలు(Maqasid):
1. డీన్ (విశ్వాసం) 2. నఫ్స్ (జీవితం) 3. అఖల్ (తెలివి)
4. నసల్ (వంశ౦ / సంతాన / భావితరాలకీ) 5. మాల్ (ఆస్తి / సంపద)
మకసిద్(Maqasid)
1. మకసిద్ (Maqasid) ఫలః Falah (మంచి) పై మరియు
మరియు హయత్-ఇ-తయ్యిబా (గుడ్ లైఫ్) పై
ఆధారపడి ఉంటాయి.
2. ఫలః మరియు హయత్-ఇ-తయ్యిబా యొక్క సహజ పరిణామం
మానవుల మంచి- చెడులు అర్థశాస్త్ర మార్గంగా ఉండాలి. ఇస్లామిక్ అర్ధశాస్త్రం మానవుని
కించపరిచే మరియు అతనిని పట్టించుకోని లేదా అతని దుఃఖాన్ని పెంచే మార్కెట్ లేదా
రాజ్య వ్యవస్థ లేదా రెండిoటి పట్ల అయిస్టత చూపుతుంది.
ఇస్లామిక్
అర్థశాస్త్రం - ప్రపంచ దృష్టికోణ౦
ఇస్లామిక్ అర్ధశాస్త్రం
తౌహీద్ (దేవుని ఏకత్వo) అనే ఇస్లామిక్ ప్రపంచ దృష్టికోణాన్నికలిగి ఉంది. తౌహీద్, ఖిలాఫత్ ను సూచిస్తుంది. సృష్టికర్త అయిన దేవుడు
మనిషిని భూమి మీద తన ప్రతినిధి గా
నియమించాడు. అందరు మానవులు సమాన స్వేచ్ఛ, సమాన హక్కులు కలిగి మరియు వారు విశ్వ
సోదర బంధంలో ఉంటారు. మనుష్యులు వనరుల వినియోగానికి దేవుని జవాబుదారీగా ఉంటారు.
దేవుడు అనేక వనరులను జాగ్రతగా ఉపయోగించుకోమని
మానవులకు అందిoచాడు.
తౌహీద్ • ఖిలాఫత్
I) సమాన స్వేచ్ఛ ii) విశ్వ సోదర భావం iii) ట్రస్ట్ లాగా వనరుల ఏర్పాటు iv) జవాబుదారీతనం
ఇస్లాం మరణం
తరువాత జీవితం లో విజయం సాధించే పద్ధతితో పాటు ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారం అందిస్తుంది.
నిజానికి, ఈ రెండు మార్గాలు వేరు
కాదు. పరలోక జీవిత సాఫల్యo భూమిపై జీవిత శ్రేయస్సుతో ముడిపడి ఉంది. ఒక ఋజుమార్గం రెండింటిని
కలుపుతుంది. ప్రకృతిలో ప్రాథమిక పరిష్కారాలను
ఉన్నాయి మరియు అవి ప్రజలకు ఎల్లవేళలా
అన్ని పరిస్థితుల్లోనూ చెందుతావి. ఇస్లాం
పునాదులను అందిస్తుంది మరియు వాటితో ప్రపంచంలో ప్రశాంతతతో జీవించమని ఆహ్వానిస్తుంది. ప్రపంచంలోని సమస్యలకు ఇస్లామిక్
పద్దతి లో పరిష్కార మార్గం ఈ క్రింది విధం చూపవచ్చు.
• ఖచ్చితమైన బోధనలు మరియు నిషేధించబడిన ముఖ్య
విషయాలు
• నైతిక వడపోత (Moral Filter)
• సమస్యలను మానవ మేధస్సుతో పరిష్కరించుట.
ఖచ్చితమైన బోధనలు
మరియు నిషేధించబడిన ముఖ్య విషయాలు:
ఇస్లాం ఎకనామిక్స్ తో సహా అన్ని విషయాలలో ప్రాథమిక మరియు సార్వత్రిక బోధనలు అందించింది.
ఈ బోధనలు ప్రకృతిలో సహజమైనవి మరియు కొన్ని
కార్యకలాపాలను నిషేధించడం జరిగింది.
ఇస్లాం వ్యక్తి చెయ్యాల్సిన విషయాల పొడవైన
జాబితాను అందించదు బదులుగా అనుమతించబడని విషయాల చిన్న జాబితా అందిస్తుంది.
ఇస్లామిక్ చట్టం (Shari'ah)
ముఖ్య ఉద్దేశం
నిషేదిoప బడిన పనులు చేయకుండుట. ఇస్లామిక్ పండితులు ఆర్థికoగా చేయకూడని పదిహేను
అంశాల జాబితా గుర్తించారు.
అవి
1. వడ్డీ లేదా రిబా (RIBA) 2. జూదము (maysirమయ్సిర్
మరియు కిమర్ qimār)
3. హాని కలిగించుట లేదా హాని పొందుట (ధరార్ dharar) 4. ఇతరులను తప్పుదారి
పట్టించుట (ఘరార్ gharar) 5. తగిన సమాచారం
లేకపోవడం - వివాదం కు దారితీయుట
పదార్థం (జహ్ల్ముఫ్దిల్ అల్-నిజా
jahlmufdhīIla- al-nizā ') 6. ఉత్పత్తి గురించి అసత్యకథనం మరియు తప్పు
అభిప్రాయాన్ని కలిగించుట (తడ్లిస్ tadlīs) 7. వస్తువుల యొక్క అసత్య
వివరణ (తఘిరీర్ taghrīr) 8. అధిక లాభాలు (ఘబాన్
ghaban) 9. సంజ్ఞలు మరియు
అమ్మకాలు చర్చ ద్వారా కొనుగోలుదారులను ఆకట్టుకొనుట/మోసం
కళ (ఖిలబః khilābah) 10. ఆహార ధాన్యాల
మరియు అవసరమైన వస్తువుల నిలువ (ఇహ్తికర్ ihtikār) 11. ఒకటిని రెండుగా లావాదేవీ (బయాతాన్ ఫై బే bay'atayn fi bay) 12.ఒప్పందం రద్దు చేసుకొని నష్ట పరిహారాన్ని పొందుట
(ఖయర్ Khayār) 13. సంబంధిత సంస్థ / వ్యక్తి లేకుండా రిస్క్
లేకుండా లాభం పొందుట (dhamānదామన్ ఖరజ్ kharāj Bay'ma'dūm) 14. వస్తువులు లేకుండా వ్యాపారం చేయుట (బెమాదంbay‘ma‘dūm) 15. ఇతర వ్యక్తుల
ఆధీనంలోని సరుకులతో వ్యాపారం చేయుట (milk al-ghayr మిల్క్ అల్ ఘర్)
సమకాలీన రచయితలు పై
వాటిలో వడ్డీ తప్పితే మిగతా అన్ని నిషిద్ధ లావాదేవీలు అంగీకరించారు. ఇస్లాం
దృష్టిలో జూదం, ఫార్వర్డ్ ట్రేడింగ్ మరియు కమోడిటీ ఎక్స్చేంజెస్ నిషిద్దం.
నైతిక వడపోత (Moral Filter): ఇస్లాం లో మానవ
జీవన విధానం యొక్క అన్ని రంగాలను నైతికత కలిపి
ఉంచుతుంది. ఇస్లాం లో నైతికత మారని శాశ్వత విలువను కలిగి ఉంటుంది. ఆర్ధిక,
వాణిజ్య రంగాలలో ఇస్లాం కొన్ని నైతిక విలువలు కలిగి ఉంది.
సమస్యలను మానవ
మేధస్సుతో పరిష్కరించుట: ఇస్లాం సమస్యలు
పరిష్కరించేందుకు మానవ మేధస్సునoదు విశ్వాసం ఉంచుతుంది. ఖియాస్ ఆధారంగా కొత్త
సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు మానవ మనస్సును ఉపయోగించడం మకసిద్ అల్ షరియా అనబడుతుంది.అది ప్రయత్నించదగినది మరియు
పలితాలు ఇవ్వదగినది.
No comments:
Post a Comment