ఫెమినిజం(స్త్రీ
వాదం) అనే పదాన్ని పాశ్చాత్య పదజాలంగా భావిస్తాము. ఈ పదానికి ఇస్లామిక్ సమాజం లో
స్థానం లేదు అని భావిస్తాము. మహిళలు పురుషులకన్న తక్కువ స్థాయి లో ఉన్నారని
భావించిన రోజులలో అనగా 1400 సంవత్సరాలకు పూర్వమే మొదట సారిగా ఇస్లాం మహిళలకు ఒక క్రమపద్దతిలో
సాదికరికతను ప్రసాదించినది. స్త్రీకి పురుషుని తో పాటు సమాన గౌరవం మరియు
సమాన హక్కులు అందించినది.
ఇప్పుడు అసలు స్త్రీ
వాదం అంటే ఏమిటో పరిశీలించుదాము? స్త్రీ వాదం అంటే మహిళ కేవలం రెండో లైంగిక
పరిగణన కాదు, పురుషునితో పాటు సమానమని
మరియు మహిళా సాధికారికత సాదించుటకు జరపబడుతున్న ఉద్యమం అని అర్ధం.
పాశ్చాత్య
దేశాలలో ఇరవయ్యవ శతాబ్దపు మొదటి భాగం వరకు స్త్రీకి పురుషుని తో బాటు సమాన హోదా లేదు. కేవలం 20 శతాబ్దపు 30వ దశకం ప్రారంభం నుండి మాత్రమే
స్త్రీ చట్టరీత్యా పురుషునితో బాటు సమాన
స్థాయి కలిగి ఉంది. అనేక పశ్చిమ దేశాలు ఈ రకంగా చట్టాలు చేసినాయి. అయితే ఆ
దేశాలలో ఇంకా పితృస్వామ్యం అమలు లో ఉంది.
దివ్య
ఖురాన్ ప్రకారం స్త్రీకి పురుషునితో
బాటు సమాన హోదా మరియు సాదికారికత కల్పించినప్పటికీ లింగ సమానత్వంను అంగికరించుటకు
ఆనాటి ముస్లిం సమాజం సిద్దంగా లేదు. అరబ్ సంస్కృతి పితృస్వామ్యం తో కూడి
స్త్రీ-పురుష సమానత్వం ను తొందరగా అంగీకరించ లేదు. ఆమె స్థాయిని తగ్గించడానికి
మరియు స్త్రీ పురుషుని పై ఆధారపడినది అని నిరూపించే విధంగా అనేక హదీసులు మరియు దివ్య ఖురాన్ యొక్క వక్ర సూత్రికరణలు
చేయబడినవి. ఒక హదీసు ప్రకారం ఆమె సజ్దా చేయవలసి వస్తే ఆమె భర్త ఎదుట మాత్రమే చేయవలెనని
చెబుతుంది.
ఇది దివ్య ఖురాన్
భావనకు
పూర్తిగా విరుద్ధంగా ఉంది కానీ
ఎవరు పట్టించుకుంటారు. మన చట్టాలను దివ్య ఖురాన్ కాక పితృస్వామ్యం ప్రభావితం చేయునప్పుడు. వాస్తవానికి దివ్య ఖురాన్ ను గాని దాని సూత్రీకరణలను గాని పితృస్వామ్యం అసలు పట్టించుకోలేదు. కాని ఇప్పుడు దివ్య ఖురాన్
యొక్క నిజమైన అర్థం ను పట్టించుకోవలసిన
అవసరం వచ్చింది. కానీ ఇస్లామిక్ ప్రపంచం ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్లు అనిపించడం
లేదు.
పేదరికం మరియు
అజ్ఞానం కారణంగా ముస్లిం మహిళలకు దివ్య ఖురాన్ తమకు ప్రసాదించిన హక్కుల గురించి తెలియదు. ఈ హక్కుల
గురించి ముస్లిం మహిళలు తెలుసు కోనేటట్లు ఒక ప్రచారం ఆరంభించ వలసి వుంటుంది.
మరో ముఖ్యమైన
ప్రశ్న ఇస్లామిక్ మరియు పశ్చిమ స్త్రీవాదం కు మధ్య తేడా, ఉందా లేదా? ఉంటె ఏo తేడా ఉంది? మనం స్త్రీవాద నిర్వచనం ప్రకారం
చూస్తే సిద్దాoతపరం గా మహిళల సాధికారత విషయం లో ఏమీ
తేడా లేదు. కాని చరిత్ర ప్రకారం ముస్లిం
మహిళలు పితృస్వామ్య ఆధిపత్యంగా తమ హక్కులు
కోల్పోయారు. పడమటి దేశాలో మరోవైపు, మహిళలకు ఎలాంటి హక్కులు లేవు కానీ
పోరాటo ద్వారా గెలుచుకున్నారు మరియు ఈ పోరాటం ను 'స్త్రీవాదం' అనగా మహిళల సాధికారతక అన్నారు. కానీ
ఇస్లాం మరియు పాశ్చాత్య స్త్రీవాదం మధ్య మరికొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి.
ఇస్లామిక్
స్త్రీవాదం సమానత్వం తో కూడిన గౌరవం,
ఆత్మాభిమానం పై ఆధారపడినది. దానిలో స్వేఛ్చ,స్వతంత్రం
కొన్ని బాద్యతలతో కూడినవి. పశ్చిమ దేశాలలో స్వాతంత్రం సామాజిక మరియు సాంస్కృతిక రంగాలలో
విశృంఖలతో కూడినది. పశ్చిమ సంస్కృతిలో లైంగిక స్వేచ్ఛ మహిళల హక్కు గా మారింది
మరియు సెక్స్ ఒక ఆట వస్తువుగా మారి దాని పవిత్రత ను కోల్పోయింది.
అయితే దివ్య ఖురాన్
బురఖా లేదా నిఖాబ్ ను సూచించలేదు కాని లైంగిక ప్రవర్తన కోసం కొన్ని కఠిన
నిబంధనలను నిర్దేశించినది. స్త్రీ పురుషులకు తమ లైంగిక సంతృప్తిని వైవాహిక బందం లో తీర్చుకోవచ్చు. ఏ రూపంలో
అయిన వివాహేతర సెక్స్ స్వేచ్ఛ భావన లేదు.
సెక్స్ వైవాహిక బంధం లో మాత్రమే అనుమతించబడుతుంది. ఇస్లాం ప్రకారం సెక్స్ ఆటవస్తువు
కాదు దానికి ఒక పవిత్రత ఉంది.
పితృస్వామ్య
సమాజం లో పురుషుడు తన లైంగిక ప్రవర్తన
యొక్క నిబంధనలను రుపొందిస్తాడు. సామాన్యంగా మనిషి సెక్స్ కోసం ఎక్కువ కోరిక
కలిగి ఉంటాడు కాబట్టి అతనికి అనేక మంది
భార్యలు అవసరం మరియు స్త్రీ పాత్ర నిష్క్రియాత్మక
మైనదిగా ఉంటుంది అని పితృస్వామ్య సమాజం చెబుతుంది.
కాని ఇది దివ్య ఖురాన్ ప్రకారం నిజం
కాదు. దివ్య ఖురాన్ భావన దీనికి చాలా భిన్నంగా ఉంటుంది. అది ఏక పత్ని లేదా బహు
పత్ని విధానం ను సూచిస్తుంది.
ఏక పత్ని వివాహం
ను దివ్య ఖురాన్ సూచిస్తుంది (4: 3 మరియు 4: 129). బహు పత్ని వివాహాలు లైంగిక కోరిక తీర్చడం కోసం కాక వితంతువులు మరియు అనాధల యొక్క సంరక్షణ కొరకు మాత్రమే
అనుమతించబడినవి. (4: 129) మొదటి భార్య ను నిర్లక్షం చేయక
రెండోవ భార్యతో సమానంగా చూస్తాను అన్న నియమం పై రెండో వివాహం అంగికరించబడినది.
అందువలన దివ్య ఖురాన్ లో లైంగిక
సంతృప్తి హక్కు స్త్రీ- పురుషులకు ఇద్దరికీ సమానంగా ఉంది. విడాకులు పొందిన మరియు వితంతువులు వారి లైంగిక కోరికలు సంతృప్తి కలిగించుకోవటానికి వివాహం ద్వారా అనుమతించబడినది.
అలాగే పశ్చిమ పెట్టుబడిదారీ దేశాలలో మహిళల
గౌరవo క్షీణిoచబడి ఆమె దోపిడీ సరుకుగా తయారు అయినది. ఆమె అర్ధ నగ్న భంగిమలు మరియు ఆమె లైంగికతను వాణిజ్యపరంగా దోపిడీ జరుగుతోంది. ఇది పూర్తిగా
స్త్రీ గౌరవం మరియు ఆత్మాభిమానం యొక్క భావనకు వ్యతిరేకం. దురదృష్టవశాత్తు పశ్చిమ
స్త్రీవాదులు ఈ అభ్యంతరకరమైన భావనను పరిగణన
లోనికి తీసుకోనక దానిని స్త్రీ స్వేచ్ఛలో
భాగంగా అంగీకరిస్తున్నారు. కొందరు (చాలా
మంది అయితే) ఆహరం సంపాదించడానికి వ్యభిచారం మహిళ యొక్క హక్కుగా సమర్థిస్తున్నారు.
ఇది ఇస్లామిక్ ఫెమినిజం భావనకు వ్యతిరేకం. ఇస్లామిక్ ఫెమినిజం లైoగిక
సంతృప్తి స్త్రీ-పురుషుల హక్కు అని చెబుతుంది. ఇస్లాం ఒక వైపు స్త్రీ-పురుషులకు వైవాహిక లైంగిక వ్యతిరేక సంభందాలను నిషేధిస్తుంది
మరియు రెండో వైపు స్త్రీ గౌరవం, ఆమె
ఆత్మాభిమానం ను గౌరవిస్తుంది. సెక్స్ కు పవిత్రత ఆపాదిస్తుంది మరియు
ఆటవస్తువుగా దానిని అంగీకరించదు.
ఇస్లామిక్
ఫెమినిజం, ఆధునిక పశ్చిమ స్త్రీవాదంతో కొన్ని విషయాలలో కలవగా కొన్ని విషయాలలో మాత్రం వ్యత్యాసంను చూడవచ్చు. ఇస్లామిక్ స్త్రీవాదులు ఆధునిక పాశ్చాత్య
స్త్రీవాదులు అంగీకరించని కొన్ని విషయాలను
నిబంధనలను ఆచరిస్తారు
.
|
6 November 2016
ఇస్లామిక్ ఫెమినిజం (ISLAMIC FEMINISM)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment