21 January 2018

1860 దశకంలో భారతీయ హజ్ యాత్రికుల హజ్ యాత్ర విశేషాలు




కేంద్ర ప్రబుత్వం హజ్ యాత్రకు ఇచ్చే సబ్సిడీని ఉపసహరించిన తరువాత పాత కాలం లో జరిగిన ఓడ ప్రయాణం తిరిగి మరొ సారి వెలుగు లోకి వచ్చింది. ఈ వ్యాసము లోని సమాచారము నాటి బ్రిటీష్ పాలనలో 1860 దశకం లో ఓడ ద్వారా భారత యాత్రికుల హజ్ యాత్ర గురించి ఉదహరించిన పుస్తకము (ట్రావేలోగ్) నుండి సేకరించబడినది.

ముంబై నుంచి జెద్దా కు  2,515 నాటికల్ మైల్స్ దూరం కలదు. ఇండియన్  హజ్ యాత్రికులు ముంబై నుంచి అరేబియా సముద్రాన్ని దాటి గల్ఫ్ అఫ్ అదెన్  మరియు ఎర్ర సముద్రం (Gulf of Aden and Red Sea) గుండా ప్రయాణిoచి జెద్దా  చేరతారు. 

సముద్ర మార్గాన ప్రయాణం వలన  ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఒక యాత్రికుడికి సముద్ర మార్గం ద్వారా వ్యయం 60,000 రూపాయలు అవుతుంది. అదే విమాన మార్గన 2లక్షలు అవుతుంది.

 హజ్ చేయుట అనేది ఇస్లాం మూల విశ్వాసాలలో ఒకటి. జీవితకాలంలో ఒకసారి అయిన హజ్ యాత్ర చేయాలి  అనేది ప్రతి విశ్వాసి యొక్క దృడ నిశ్చయం. రైళ్ళు, విమానాలు వంటి ఆధునిక రవాణా సౌకర్యాలు   లేనప్పుడు,  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు విశ్వాసులు ఓడ 
ద్వారా తమ హజ్ యాత్ర ను కొనసాగించిన విధానం గుర్తుకు వస్తే మన కళ్ళు చెమర్చక మానవు.

యాత్రికులు అనేక సంవత్సరాలు లేదా అనేక దశాబ్దాల ముందు నుంచి ఆర్థికంగా మరియు మానసికంగా హజ్ యాత్ర కొరకు సిద్దం అయ్యేవారు. యాత్ర ఖర్చుల తో పాటు, స్ట్రీమ్ షిప్స్ ఉపయోగం లోనికి వచ్చిన తరువాత కూడా దక్షిణ ఆసియా నుండి హజ్ యాత్ర చాల కష్టతరం ఉండేది. ఒక హజ్ యాత్రికుడి ప్రయాణo లోని వివిధ దశలను పరిశిలిస్తే వారు పడ్డ కష్టాల గురించి మనం కొంత అవగాహన  పొందవచ్చు.

మొదటిదశ  బొంబాయి చేరటం: పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు, కేవలం ప్రధాన నగరాలు మరియు పట్టణాలు మాత్రమె రైల్వే నెట్వర్క్ లో చేరి ఉండేవి. రైల్ ప్రయాణం అందరకు అందుబాటులో ఉండేది కాదు. భారత దేశ నలుమూలల నుండి యాత్రీకులు బొంబాయి ప్రయాణం చేయడానికి కాలినడక, ఎద్దుల బండ్లు మరియు పడవలు ద్వారా ప్రయాణించి వచ్చేవారు. ఆ రోజులలో హజ్ యాత్ర కు ఓడ బొంబాయి నుంచి బయలుదేరిది. యాత్రికులు షిప్పింగ్ ఎజెంట్ లేదా బ్రోకర్లు ద్వారా టికెట్ పొందేవారు.కొంతమంది  మోసగాళ్లు మరియు దుండగులు  బ్రోకర్లు మరియు ఎజెంట్ లాగా నటించి  యాత్రికులను మోసపుచ్చేవారు. 

విజయవంతంగా మొదటి దశ (బొంబాయి చేరిక) పూర్తి చేసిన తరువాత యాత్రికులు ఓడ బయలుదేరటం కోసం ఓపికగా ఎదురుచూడాల్సి ఉంటుంది. టిక్కెట్ పై  ముద్రించిన నిష్క్రమణ సమయం (time of departure) కు ఓడ  ప్రయాణించేది కాదు. ఏ ఓడ అయినా ఒకటి లేదా రెండుసార్లు దాని నిష్క్రమణను వాయిదా వేయకుండా బాంబేని వదిలిపెట్టది కాదు. కొన్ని సందర్భాల్లో యాత్రికులు ఒక నెల కన్నా ఎక్కువసేపు వేచి ఉండేవారు. ప్రయాణీకులు  తగిన సంఖ్యలో లబించేవరకు  ఓడ బయలుదేరేది కాదు.

అన్ని డేక్కులు కిక్కిరిసిన యాత్రికులతో పూర్తిగా నిండిన తరువాత ఓడ ప్రయాణం సాగేది. అయితే నిష్క్రమణకు ముందుగా, యాత్రికులు పోర్ట్లో ఉన్న వైద్య శిబిరాలను సందర్శించాల్సి వచ్చేది. అక్కడ వైద్య పరిక్షలు సంపూర్తిగా నిర్వహించ బడేవి. యాత్రికుల సామాను ఆవిరి మరియు క్రిమిసంహారక మందులతో  శుద్ది చేయబడేది.  తప్పనిసరి కాకపోయినా, యాత్రికులు   పోర్ట్లో యాత్రికుల పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేయవలసి వచ్చేది. ఓడ యొక్క నిష్క్రమణ ప్రకటించిన తరువాత యాత్రికుల గుంపు(కారవాన్) ఓడ  ఎక్కేవారు.  

 ఓడ  ప్రయాణ మార్గం లో మొదటి మజిలి కరాచి రేవు  చేరిక. అక్కడ మరికొంతమంది యాత్రికులు ఎక్కేవారు. కరాచీ తర్వాత ఎడెన్ వద్ద బొగ్గు లేదా ఇతర కార్గోలను లోడ్/అన్ లోడ్ చేసి కమారాన్ ద్వీపంలో ఓడ  లంగరు వేసేది. యాత్రికులు దాదాపు ఎంతో ప్రతికూల పరిస్థితుల్లో నెలవారీ ప్రయాణం లో క్షీణించి, అలసిపోయేవారు. వారికి  పరిమితమైన రేషన్ లబించేది.  అక్కడ క్వారంటైన్ quarantine జరిగేది. వారి సామాను ఒక డింగీలోకి విసిరివేయబడుతుంది మరియు ద్వీపంలో మరోసారి క్రిమిసంహారక మందు యాత్రికుల సామాను పై  చల్లబడేది. యాత్రికులను క్వారంటైన్ quarantine కుటీరాలకు తరలించేవారు.  కలరా వ్యాప్తి కారణంగా అటువంటి అదనపు భద్రత చర్యలు ప్రవేశపెట్టబడ్డాయి.
క్వారంటైన్ quarantine సమయం అవసరాన్ని బట్టి పక్షం రోజుల నుండి కొన్ని నెలల వరకు కొనసాగేది. యాత్రికుల అనారోగ్యంను జాగ్రతగా పరిశిలించేవారు. కలరా కేసులు చాలా ఆందోళన కలిగించేవి. వైద్యులు అంటువ్యాధుల  ప్రమాదం లేదని ద్రువికరించిన తరువాత యాత్రికులు తిరిగి తమ నౌక కు చేరి యాత్ర ను కొనసాగించేవారు. ఓడ జెద్దా రేవుకు చేరిన తరువాత  యాత్రికులు అక్కడ దిగి మక్కా కు వెళ్ళే యాత్రికుల గుంపుతో కలసి మక్కా కు వెళ్ళేవారు. 
మక్కా ప్రయాణం మరొక పక్షం రోజులు  పడుతుంది లేదా కొద్దిగా తక్కువగా ఉంటుంది.  మక్కా లో యాత్రికులు  సుదీర్ఘoగా  మరియు ఆత్రుతతో  ఎదురుచూస్తున్న హజ్ పూర్తి చేస్తారు. మక్కాలో ఒక వారం లేదా అంతకు మించి ఎక్కువమంది యాత్రికులు ఉంటారు, తర్వాత వారు కాలినడకన లేదా సంపన్నులలైతే ఒంటె ఎక్కి మరొక కారవాన్లో  మదీనాకు వెళ్ళతారు. అక్కడినుంచి తిరిగి జెడ్డాకు చేరుకొంటారు. మొత్తం ప్రయాణానికి నాలుగు నెలల కన్నా తక్కువ సమయం పడుతుంది  మరియు చాలా సందర్భాలలో ఎక్కువ సమయం పడుతుంది. 

మక్కా నుండి తిరిగి వచ్చినప్పుడు, యాత్రికులు హాజీ అని గౌరవప్రదoగా పిలువ బడతారు.  ఈజిప్టులో అనేకమంది హజ్ చేసిన యాత్రికులు తమ ఇంటి గోడలపై  హజ్ సన్నివేశాలను చిత్రీకరిస్తారు అవి సమాజంలో వారి  ఉన్నతమైన హోదాను తెల్పుతాయి. భారతదేశంలో హాజిలు తమ హజ్ యాత్ర ఛాయాచిత్రాలు, సర్టిఫికేట్లు లేదా మక్కా నుండి తెచ్చిన సావనీర్లను తమ గృహాలలో వేలాడదిస్తారు.

కొంత మంది యాత్రికులు యాత్ర అందించిన వ్యాపార అవకాశాల నుండి లాభపడటంతోపాటు, యాత్రా ఖర్చులు పోను ఆదాయాలు పొందుతారు.  పెద్ద సంఖ్యలో ప్రయాణికులు పూర్తిగా వాణిజ్య లక్ష్యాలచే ప్రేరేపించబడ్డారు మరియు మక్కాలో శాశ్వతంగా నివసిస్తున్న భారతీయ వర్తకులు మరియు దుకాణదారుల యొక్క అత్యధిక సంఖ్య దీనిని  ప్రతిబింబిస్తుంది.

No comments:

Post a Comment