2 January 2018

ఇస్లాం లో సేద్యం మరియు వ్యవసాయ అభివృద్ధి (Promotion of Farming and Agriculture in Islam)


.

 Related image


ఇస్లాం వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది, వ్యవసాయం ఆర్థిక వృద్ధికి హామీ ఇస్తుంది.  వ్యవసాయ వృత్తి ఇస్లాం లో గౌరవప్రదమైన వృత్తిగా పరిగణించ బడుతుంది. ఇస్లాం శ్రమ విలువను గుర్తించి శ్రమకు తగిన ప్రతిపలం అంద జేస్తుంది. వ్యవసాయానికి కృషి మరియు శ్రమ అవసరం.

ఒక హదీసు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (స)ఒక వ్యక్తికి  (వ్యవసాయదారునికి) శుభ వార్తను అందించారు.  హజ్రత్ అలీ,  ప్రవక్త ముహమ్మద్ (స) గారిచే  శుభ వార్త ను పొందిన వ్యక్తి  గురించి విన్నప్పుడు, ఆ వ్యక్తి గొప్పతనం గురించి తెలుసుకో దలచినారు. హజ్రత్ ఆలీ గారికి ఆ వ్యక్తి అందు ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. అతను కేవలం వ్యవసాయం మరియు ప్రాథమికoగా మతపరమైన బాధ్యతలు నిర్వహించే  ఒక సాధారణ  రైతు మాత్రమే.

సేద్యం మరియు వ్యవసాయ వృత్తిని ప్రోత్సహించే అనేక హదీసులు కలవు. ప్రవక్త (స) ప్రకారం ఒక వ్యక్తి విత్తనాలను విత్తుతాడు మరియు పంట పెరుగుతుంది.   అనేక జీవులు పంట మరియు చెట్టు నుండి లబ్ధి పొందుతారు. ఒక చిన్న కీటకo పంట నుండి వచ్చే ధాన్యం ను తిన్నా   రైతు ప్రతిఫలo పొందుతాడని  అని అన్నారు. చెట్టు యొక్క నీడలో ప్రజలు కూర్చుంటారు మరియు రైతు దానికి ప్రతిఫలo పొందుతాడు. ప్రజలు మార్కెట్ నుండి ఆహార ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు, దానిద్వారా కూడా రైతు దైవఫలం పొందుతాడు.

ఇస్లాo ప్రకారం  వ్యవసాయ కోత తప్ప మిగతా ఏ వ్యాపారంలోనూ వ్యక్తి పూర్తిగా ముందస్తు చెల్లింపు పొందడం లేదు. రైతు తన పంటలకు  ముందుగానే నగదు పొందటానికి ఇస్లాం అనుమతిస్తుంది. ఈ ప్రత్యేక అభ్యాసంను  “బాయి-ఎ-సలాం Bai-e-Salam” అని పిలుస్తారు.

వర్షాలు లేనప్పుడు, రైతు పంప్ మరియు కృత్రిమ నీటిపారుదల ద్వారా సేద్యం చేసినప్పుడు అతడు చెల్లించవలసిన  శిస్తును ఇస్లాం 1/10 గా తగ్గిస్తుంది. టమాటో, బెండ, క్యాబేజీ వంటి కూరగాయల పంటలపై ఇస్లాం జకాత్  మరియు శిస్తును తొలగిస్తుంది.

9 వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ద ముస్లిం న్యాయవేత్త అబూ ఓబదియా, ఇస్లామిక్ రాజ్యంలో పన్నుల పైన ఒక భారీ పుస్తకాన్ని సంకలనం చేశాడు మరియు అతను  భూ పంపిణీ కోసం కొత్త వ్యూహాన్ని సూచించాడు. ఒక వ్యక్తి భూములను పండించలేనట్లయితే, ప్రభుత్వం  ఆ భూమిని పండించగల మరొక వ్యక్తికి ఇవ్వాలి. దానివల్ల ప్రభుత్వానికి మరియు ప్రజలకు ప్రయోజనం కలగుతుంది. ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో మరియు ఖలీఫాల  కాలంలో వ్యవసాయ కార్యకలాపాలు ప్రోత్సహించ బడ్డాయి.



ప్రవక్త ముహమ్మద్ ఒక హదిసు లో సేద్యం మరియు వ్యవసాయం యొక్క లాభాలను అందంగా వర్ణిస్తారు. ఒక వ్యక్తి పంటలను పండించేటప్పుడు లేదా మొక్కలను నాటినప్పుడు, చెట్టు పూర్తిగా వృద్ధి చెందుతూ, పళ్ళు కాసినప్పుడు, ప్రజలు మరియు అనేక పక్షులు మరియు పురుగులు ఆ చెట్ల ఫలాలను తింటూ, చెట్టు యొక్క నీడలో విశ్రమించినప్పుడు , అల్లాహ్ వ్యవసాయదారుడు మరియు చెట్టు యొక్క రైతు మరియు సంరక్షకుడికి ప్రతిఫలమిస్తాడు.

మహా ప్రవక్త ముహమ్మద్(స) భోదిoచినట్లు అనాస్ బిన్ మాలిక్ (ర)చెప్పారు:ఒక ముస్లిం వ్యక్తి వ్యవసాయం చేసి, లేదా చెట్ల మొక్కలు నాటి, పండించిన ధాన్యఫలాదులలో కొంత పక్షులు లేక మనుషులు లేదా  పశువులు తినివేస్తే అది అతని పట్ల సదకాగా పరిగణిస్తుంది   [సహీహ్ బుఖారి, వాల్యూమ్ III, బుక్ 40 (బుక్ ఆఫ్ కల్టివేషన్), సంఖ్య 513]

వ్యవసాయ  పంటల పన్నుల మీద ఇబ్న్ ఖాల్దున్ యొక్క అభిప్రాయాలు

ఇస్లాం సమాజం లోని ప్రతి ఒక్కరికి ప్రయోజనం లభించేలా చేయడానికి వ్యవసాయంపై పన్నును తగ్గిస్తుంది. వ్యవసాయం ప్రజలకు  అవసరమైన వస్తువు. ప్రముఖ ఇస్లామిక్ ఆర్ధికవేత్త మరియు చరిత్రకారుడు ఇబ్న్ ఖాల్డున్ వ్యవసాయం ఉత్పత్తులపై పన్ను భారం తగ్గించమని  ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. భారీ పన్నులు ఆర్ధిక వ్యవస్థలో ఉత్పత్తి స్థాయిని తగ్గిస్తాయని మరియు  మార్కెట్లో ఆహార ధాన్యాలు సరఫరా తగ్గుతుందన్న వాదనను ఆయన సమర్ధించారు మరియు  ఇది ఆర్ధిక వ్యవస్థలో వ్యయ- ద్రవ్యోల్బణానికి (cost-push inflation) దారితీయవచ్చు.

ఇస్లామిక్ ఆర్ధిక వేత్త ఇబ్న్ ఖల్దున్ ప్రభుత్వం పన్నుల స్థాయిని తగ్గించాలని సూచించాడు. ప్రజలపై అదనపు పన్ను  వ్యాపారాన్ని నిరుత్సాహపరుస్తుంది మరియు ఆర్ధిక వ్యవస్థలో ఉత్పత్తి స్థాయిని తగ్గించి, ప్రభుత్వం యొక్క రాబడిని తగ్గించును అని ఆయన అన్నాడు.ఇది ఉత్పత్తి ద్రవ్యోల్బణం(supply-side inflation)కు దారి తీయును. ఇది ఆధునిక ఆర్ధిక సాహిత్యంలో ఆర్థిక వ్యవస్థలో వ్యయాల ద్రవ్యోల్బణం(cost-push inflation)గా పిలబడుతుంది.
వ్యవసాయoతో సహా దేశంలో ఉత్పాదకతను భారీ పన్నుల విధిoపు  తగ్గిస్తుందని ఆయన వివరించారు. తక్కువ పన్ను రాబడి ఉత్పత్తికి సానుకూల సంబంధాన్ని కలిగి ఉంది. పలువురు పాశ్చాత్య ఆర్థికవేత్తలు పన్ను, ప్రభుత్వం మరియు సాధారణ అర్థశాస్త్రం పై  ఇబ్న్ ఖల్దున్ యొక్క ఆలోచనను మద్దతు ఇచ్చారు. ప్రొఫెసర్ లాఫ్ఫర్ మరియు ఆడమ్ స్మిత్ ఇబ్న్ ఖాల్దున్ ఆలోచనతో అత్యంత ప్రభావితమయ్యారు

మక్సీద్-అల్-షరియా మరియు వ్యవసాయం
ఇస్లాం లో మక్సీద్ అల్-షరియా అనే భావన సమాజంలోని ప్రతి సభ్యుని యొక్క సాంఘిక సంక్షేమం కోరుకొంటది. ఇస్లామిక్ సమాజంలో, అల్లాహ్ అందించిన సహజ వనరులు  సమాజంలోని అందరు సభ్యులందరికీ అందాలి తద్వారా ప్రతి సభ్యుడు తనకు తానూ సంపాదించుకోవడానికి అవకాశాలు మరియు హక్కులను పొందుతారు. ఇస్లాం ఆహార ధాన్యం ఉత్పత్తి కి ప్రాధాన్యత ఇస్తుంది. వ్యవసాయ సమస్యలపై  ఇస్లామిక్ న్యాయ శాస్త్రం పుస్తకంలో ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది తద్వారా దాని ప్రాముఖ్యతను మనం అర్ధం చేసుకోవచ్చు.

 ఆర్ధిక శాస్త్రంలో వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత
సేద్యం మరియు వ్యవసాయం అనేది ప్రాధమిక రంగం లో లెక్కించబడే ఒక పరిశ్రమ. ఇది ఆర్ధిక వ్యవస్థలో ద్వితీయ మరియు తృతీయ రంగాల అభివృద్ధికి దోహదపడుతుంది; అందువలన వ్యవసాయం ఆర్ధిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన రంగం అవుతుంది. యుద్ధ సమయంలో, శత్రు దేశం ఆహారం మరియు నీటి వంటి ప్రాథమిక వనరులను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఆహారాలు మరియు నీరు లబించక ప్రజలు మరణిస్తారు క్లుప్తంగా, సేద్యం మరియు వ్యవసాయం ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగం. ఒక దేశం ప్రాధమిక రంగం లో బాగా ఉండాలి. ఒక ఆర్ధికవ్యవస్థ యొక్క ద్వితీయ మరియు తృతీయ రంగాలు ప్రాధమిక రంగం యొక్క విజయవంతమైన అభివృద్ధిపై ఆధారపడి ఉన్నాయి.

వ్యవసాయoకు  ఇస్లాం ప్రాధాన్యత ఇస్తుంది, కృత్రిమ వర్షాల సమయంలో శిస్తు మొత్తంను తగ్గిస్తుంది.ఆర్థిక వ్యవస్థలో బిలియన్ డాలర్ల విలువైన పరిశ్రమ industry  ప్రాధమిక రంగంపై ఆధారపడి ఉంది. ప్రాథమిక రంగం వ్యవసాయం, గనులు మరియు చేపలు పట్టడం నుండి ముడి పదార్థం మరియు ఆహార ధాన్యాలను అందిస్తుంది. సెకండరీ రంగం ముడి పదార్థాన్ని సేకరిస్తుంది, బట్టలు, గృహాలు, ఫర్నిచర్, కార్లు, మందులు, వివిధ రకాలైన ఆహారాలు వంటి వస్తువులను చేస్తుంది. తృతీయ రంగం ప్రజలకు సేవలను అందిస్తుంది. క్లుప్తంగా, ప్రాధమిక రంగం ద్వితీయ మరియు తృతీయ రంగాలకు ప్రోత్సహిస్తుంది. ద్వితీయ మరియు ప్రాధమిక రంగాల శ్రేయస్సు ఒక శక్తివంతమైన మరియు ఆరోగ్యకరమైన ప్రాధమిక రంగం మీద ఆధారపడి ఉంటుంది.

ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రాధమిక రంగం ప్రముఖ పాత్ర పోషిస్తుందని నిర్ధారించబడింది. ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధి మరియు అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో, స్థూల దేశీయ ఉత్పత్తిలో ప్రాధమిక రంగం మంచి వాటా కలిగి ఉంది. ప్రాధమిక రంగం యొక్క దోపిడీ ఆర్థిక వ్యవస్థ యొక్క రెండు(ప్రధమ,ద్వితీయ) రంగాలను  ప్రభావితం చేస్తుంది మరియు అది మొత్తం ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది. ప్రాథమిక రంగం వినియోగదారుల అవసరాల డిమాండ్నుతీరుస్తుంది. అందువల్ల ఇస్లాం వ్యవసాయాన్నిప్రోత్సహించి దానిని  ఆర్థిక వృద్ధికి ప్రధాన వనరుల్లో ఒకటిగా పరిగణిస్తుంది.

బాయి-ఎ-సలాం పాత్ర
బాయి-ఎ-సలాం అనేది ఇస్లామిక్ న్యాయ మీమాంసలో వ్యాపార ఒప్పందాలలో ఒకటి. ఇది వ్యవసాయం మరియు వ్యవసాయ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇస్లామిక్ న్యాయ మీమాంస మరియు ముమయలాత్తో వ్యవహరించే పుస్తకాల యొక్క లోతైన అధ్యయనం రైతుల సంక్షేమం మరియు రక్షణ కోసం బాయి-ఎ-సలాం ఒప్పందం చేయబడుతుందని తెల్పుతుంది. ఇస్లాం ధర్మంలో వ్యవసాయం మరియు సేద్యం పట్ల  ప్రత్యేక శ్రద్ధ ఉంది.ఇస్లాం ప్రకారం ఉత్పత్తి యొక్క మొత్తం చెల్లింపును స్వీకరించడానికి మరియు భవిష్యత్ డెలివరీను అనుమతించే ఏకైక వృత్తి ఇది.

 సేంద్రీయ ఆహారాలు యొక్క అవసరాలు
 రైతులు సహజంగా పంటలను పెరగడాన్ని ప్రోత్సహించాలి మరియు ప్రస్తుత సమయంలో అవసరమయ్యే సేంద్రీయ ఆహారాన్ని పండించాలి. అకర్బన మరియు కలుషితమైన ఆహారాలు ఆరోగ్యానికి చాలా హాని  చేస్తాయి. నేడు ప్రతి ఇల్లు డయాబెటిక్ మరియు హృదయ రోగులను కలిగి ఉంది. అసహజంగా ఉత్పత్తి చేసే ఆహారాల ఫలితం గా భారతదేశంలో ఔషధ పరిశ్రమను వర్ధిల్లుతుంది.రైతుల సహకారం లేకుండా మనం సేంద్రీయ ఆహారాన్ని ఉత్పత్తి చేయలేము. అందువల్ల రైతుల జీవితాన్ని రక్షించడం, ప్రోత్సహించడం, వారిని విద్యావంతులను చేయడం చాలా ముఖ్యం.


వ్యవసాయ రంగం ఆర్థిక వృద్ధికి కీలకమైనది. ఇది ఆర్ధిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇస్లాం వ్యవసాయం వృత్తిని ప్రోత్సహిస్తుంది, మరియు ఇస్లాం లో వ్యవసాయ వృత్తిలో నిమగ్నమై ఉన్న వ్యక్తుల కోసం అనేక బహుమానాలు ఉన్నాయి.

No comments:

Post a Comment