12 January 2018

మదరసాలో అద్యయనం ఒక అద్భుతమైన అవకాశం, ముప్పు కాదు.






ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మదరసాలు ఇటివల కాలం లో ప్రధానంగా తీవ్రవాదం కారణం గా తమ ఖ్యాతి ని పోగొట్టు కొన్నవి. ఇస్లామిక్ మదరసాలు తివ్రవాదుల స్థావరాలు లేదా 'జిహాద్ మెషీన్స్' గా  పిలవబడుతున్నాయి. ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమే. మీడియా వాస్తవ చిత్రాన్ని చూపించవు. నిజానికి మదరసాలు చదవటానికి ఒక అద్భుతమైన అవకాసం మాత్రమే, ముప్పు కాదు. గ్రామిణ పేద  యువ విద్యార్థుల అక్షరాస్యతకు ఏకైక స్థలం. పేద తల్లిదండ్రులకు,  వారి పిల్లల పర్యవేక్షణ, ఆకలి తీర్చడం లోను  మరియు బోధన లో  భరోసాతో కూడిన  కీలక పాత్ర పోషిస్తాయి. మతపరమైన విషయాల్లో ముస్లిం సమాజానికి నాయకత్వం వహించే నాయకులను అభివృద్ధి చేయడంలో మదరసాలు కీలకమైన పాత్రను పోషిస్తాయి.

జాతీయోద్యమం లో మదరసాలు వహించిన పాత్ర:
మదరసాలు తొలినుంచి  జాతీయ  భక్తి తో పనిచేసినవి.  మదరసా నాయకుకులు, అధ్యాపకులు, విద్యార్ధులు  తొలి నుంచి భారత జాతియ ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నారు. మదరసా మొట్టమొదటి విద్యార్ధి మరియు తరువాత మదరసా లో బోధించిన మౌలానా మహ్మద్-ఉల్-హసన్ 1915 లో రాజా మహేంద్ర ప్రతాప్ నాయకత్వన  కాబూల్లో ఏర్పాటు చేయబడిన జాతీయవాద ప్రభుత్వంలో పనిచేసారు. ఆ ప్రభుత్వం లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన సిల్క్ రుమాలు కుట్రలో పాల్గొన్న  మౌలానా బర్కతుల్లా విదేశాంగ మంత్రిగా పనిచేసారు.  మౌలానా హుస్సేన్ అహ్మద్ మదాని మరియు మౌలానా ఓజైర్ గుల్ వంటి దియోబాంద్ ప్రారంభ నాయకులు జాతియోద్యమము లో అరెస్టయ్యారు మరియు అనేక సంవత్సరాలు మాల్టా ద్వీపంలో నిర్బంధంలో ఉన్నారు. మహ్మూద్-ఉల్-హసన్ ప్రతి ఇంగ్లీష్ ఉత్పత్తిని బహిష్కరించడానికి "టార్క్-ఎ-మవలాట్tark-e-mawalat  (వస్తువుల బహిష్కరణ)" యొక్క ఫత్వాను ఇచ్చాడు. దీనిని మహాత్మా గాంధీని స్వీకరించి వలస రాజ్యాలకు వ్యతిరేకంగా ఉపయోగించిన సమర్థవంతమైన సాధనంగా చెప్పవచ్చు. "డియోబందిస్" అని పిలవబడే మదరసా విద్యార్ధులు స్పష్టంగా గర్వంగా "భారతదేశం మా మాతృదేశం మరియు మేము దానిని అమితంగా ప్రేమిస్తాము” అని అంటారు.

మదరసా వ్యవస్థ- పూర్వ చరిత్ర:
మదరసా వ్యవస్థ వెయ్యి సంవత్సరాల వయస్సు గలది. 859 లో, జామియా అల్ కరవియ్యిన్, మొరాకో (మరాకష్) లోని ఫెజ్ స్థాపింపబడింది. జామియా అల్ కరౌయిన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా అతి ప్రాచీన విశ్వవిద్యాలయంగా గుర్తింపబడింది.ఇస్లామీయ ప్రపంచంలో ఇది ప్రథమ మదరసా. దీనిని 'ఫాతిమా అల్ ఫిహ్రి' స్థాపించారు. ఈమె, ప్రఖ్యాత వర్తకుడు ముహమ్మద్ అల్ ఫిహ్రి కుమార్తె.

అబ్బాసీయ కాలంలో ముస్లిం ప్రపంచంలో మొట్టమొదటి ప్రధాన విద్యాసంస్థ ను  సెల్జుక్ వజీరు (మంత్రి) యైన నిజామ్ అల్-ముల్క్, అబూ అలీ అల్-హసన్ అల్-తుసీ (1018-1092) మదరసా నిజామియ్యను స్థాపించాడు. ఈ మదరసా విధానానికి  నిజామియ అనే పేరు సార్థకమైంది. 11వ శతాబ్దంలో ఇలాంటి మదరసాలు అనేక అబ్బాసీయ నగరాలులో స్థాపింపబడ్డాయి. ఇవి ఇస్లామిక్ జ్ఞానాన్ని అందించడంతోపాటు విజ్ఞానశాస్త్రం, తత్వశాస్త్రం, ప్రజా పరిపాలన మొదలగు అంశాలలో లౌకిక విద్యను అందించెవి. ఐరోపాలో మొదటి మదరసా స్పెయిన్ మరియు ఎమిరేట్ ఆఫ్ సిసిలీ మున్నగు ప్రదేశాలలో స్థాపింపబడినవి.1191 లో దక్షిణ ఆసియా లో ప్రప్రధమం గా  భారతదేశంలోని  అజ్మీర్లో మొట్టమొదటి మదరసా స్థాపించబడింది.

మదరసాలు ఇస్లామిక్ తత్వచిoతనను మరియు ఇస్లామిక్ న్యాయచిoతన ను వ్యాప్తి చేయడం లో    కీలక పాత్ర పోషించాయి, సున్నీమదర్సాలలో భారత దేశం లోని దియోబంద్, కైరో లోని అల-అజహర్ మరియు షియా మదరసాలలో ఇరాన్ లోని క్వాం మరియు ట్యునీషియాలోని జైటునియా లోగల హవ్జాస్ ప్రసిద్ది చెందినవి.

భారత దేశం లో మదరసా వ్యవస్థ:
ప్రపంచం లోని అత్యంత ప్రభావవంతమైన సంస్థల్లో ఒకటి, ఆసియా ఖండం లోని మదర్సాలకు మార్గదర్సి  మరియు భారత  ఉపఖండంలో ఇస్లామిక్ సంప్రదాయాలను, ఆచారాలను  ప్రభావితం చేసే సంస్థలలో ఒకటైన దారుల్ ఉలూమ్ 150 వ సంవత్సరాలకు పూర్వం దియోబంద్ నగరం లో  స్థాపించ బడినది. ఇది దక్షిణ ఆసియా లోని 500 మిలియన్ల ముస్లింలకు ఆధ్యాత్మిక వేదికగా ఉంది మరియు ఉపఖండంలో "ఇస్లాం యొక్క కేంద్రస్థానం (సిటాడెల్)" గా పరిగణించబడుతుంది. దియోబంద్ పట్టణం లో హిందువులు మరియు ముస్లింలు శాంతియుతంగా సహజీవనం సాగిస్తున్నారు. మదరసా లో విద్యార్ధులు  టోపిలను ధరించి పవిత్ర ఖుర్ఆన్ అద్యయనం చేస్తుంటారు. వారు అనుభవం గల ఉపాధ్యాయులచే పర్యవేక్షిoచబడతారు. తెల్లవారిజామున లేచి తుహీజ్ దివ్య ఖురాన్ కంఠస్థం చేస్తుంటారు. దివ్య ఖుర్ఆన్ లోని అన్ని 6,236 ఆయతులను కంఠస్థం చేసిన  ముస్లిం హఫీజ్ అని పిలవబడే హక్కు సంపాదిస్తాడు.


18వ శతాబ్దం :

18వ శతాబ్దం ఆరంభం నుండి ముస్లిం ప్రపంచం యొక్క పెద్ద భాగాలు వాటి వలసవాద దేశాల ఆధునికతతో ప్రభావితం అయ్యాయి. ఆధునిక పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, కొత్త అధికారిక భాషలు మరియు నూతన విజ్ఞాన శాస్త్రం పరిచయం చేయబడింది. మదరసాలు  మతపరమైన బోధనా కొనసాగించడం తో పాటు బోధన మరియు పాఠ్యాంశాల విషయo లో కొంతవరకు ఆధునికతను సంపాదించినవి. 18 వ శతాబ్దపు పండితుడు ముల్లా నిజాముద్దీన్ సహల్వి, ప్రధాన భారతీయ మదరసాల కోసం నూతన విద్యా పాఠ్యాంశాలను రూపొందించాడు. అందువలన మదరసా  పాఠ్య ప్రణాళికను అతని పేర  "దర్స్-ఇ-నిజామి" గా పేర్కొన్నారు.

1856 నాటి ప్రధమ భారత స్వాతంత్ర్య యుద్ధం, మదరసా విద్యను విభజించింది. ఈ విభాగాన్ని డియోబoద్ మరియు అలీఘర్ సంప్రదాయాల్లో చూడవచ్చు, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అవసరం మరియు  కాలానుగుణ్యమైన విద్యావ్యవస్థ యొక్క అభివృద్ధిని నొక్కిచెప్పారు. భారతదేశ ఉపఖండంలో ఇస్లామిక్ మతపరమైన విలువలు మరియు సంప్రదాయాన్ని కాపాడాలని దియోబoద్ వాదులు  పట్టుబట్టారు.

బ్రిటిష్ సామ్రాజ్యవాద నేపథ్యంలో ముస్లిం గుర్తింపు మరియు వారసత్వాన్ని కాపాడటానికి 1866 లో దారుల్ ఉలూమ్ స్థాపించబడింది, డియోబoద్ నాయకులు దివ్య ఖురాన్ మూలాలకు తిరిగి వెళ్లి పాఠ్యప్రణాళిక నుండి నూతన భావనలను తొలగించారు. దియోబంద్  యొక్క వ్యవస్థాపకులు దీనిని "ఇస్లాం ధర్మంలో కొత్తగా ఏర్పడిన సంప్రదాయవాదం" గా పేర్కొన్నారు, దక్షిణ ఆసియా మదరసాలను  పరిశోధించిన బ్రిటిష్ రాయబారి అలెగ్జాండర్ ఎవాన్స్ ప్రకారం. "దారుల్  ఉలూమ్ యొక్క పునాది ఆధునిక జ్ఞానపు  తలుపులు మూసివేసింది," అని అన్నాడు.

మదరసా యొక్క సైద్ధాంతిక పునాదులు పాఠశాల యొక్క చార్టర్ (మస్లాక్) నిర్వచించినది అవి: (1) ఇస్లామీయ ధర్మానికి  (షరియా) అనుగుణ్యత , (2) సూఫీ-ప్రేరేపిత స్వీయ శుద్దీకరణ మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణత కోసం అన్వేషణ (సులక్-ఇ బాతిన్), (3) ప్రవక్త(స) మరియు అతని సహచరులు ఏర్పరచిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా వ్యవరించడం  (సున్నా) (4) హనఫీ న్యాయశాస్త్ర సూత్రాలపై  ఆధారపడటం, (5) హానాఫీ వేదాంతి అల్-మధురిడి విశ్వాసాలకు అనుగుణ్యంగా  ప్రవర్తించటం  (6) చట్టవిరుద్ధమైన విషయాలు (ముంకిరాట్) తొలగించడం మరియు ముఖ్యంగా వాటి పట్ల  తిరస్కారం చూపుట (7) మదరసా యొక్క వ్యవస్థాపకులు, ముహమ్మద్ ఖాసిమ్ మరియు రషీద్ గంగోహి ద్వారా వ్యక్తిగతంగా ఏర్పరచిన  సూత్రాలకు కట్టుబడి ఉండటం.

దారుల్ ఉలూమ్ 13 సంవత్సరాల్లో 3,500 మంది విద్యార్థులను  విద్యావంతులను చేస్తుంది. 10,000 దరఖాస్తుదారుల నుండి ప్రతీ సంవత్సరం ప్రవేశానికి 800 మంది ఎంపిక చేయబడతారు.  ట్యూషన్ ఫీజులు లేవు. కఠినమైన ఇస్లామిక్ అధ్యయనాలు, బుక్ బైండింగ్ మరియు IT నైపుణ్యం లో శిక్షణ పొందుతారు. దియోబంద్ మదరసా  దాని ఫత్వాలకు ప్రసిద్ధి చెందింది, అవి  ఆంగ్లంలో, ఉర్దూ మరియు అరబిక్ వంటి ఇతర భాషలలో జారి చేయబడతాయి.
మదరసాల పట్ల విమర్శ:
దియోబంద్ వాదులు అంగీకరించిన లేక పోయినా  మదరసా విద్య లో ఆధునిక విద్యా ప్రణాళిక  లేకపోవడంతో, ముస్లింలు ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో పోటీ చేయలేరని గట్టిగా విశ్వసించిన కొంతమంది ఇస్లామిక్ విద్యావేత్తలు  విద్యా సంస్కరణల ఉద్యమం నడిపారు. ఈ విద్యావేత్తలు సామాజిక మరియు ఆర్థిక అంశాల ఆధారంగా ముస్లిం కమ్యూనిటీ అనుసరించే విద్య ఆధునిక సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలి అని నమ్మారు.

పాత గ్రంథాల అద్యయనానికి మదరసాలు ప్రాముఖ్యతను ఇవ్వటాన్ని విమర్శకులు తరచూ ఉదహరిస్తారు. అయితే  సాంప్రదాయవాదులు, "నిజామీ పాఠ్యప్రణాళిక" క్రమశిక్షణ కలిగి విద్యార్ధి నైపుణ్యాన్ని పెంచుతుంది మరియు వారిని  ఏ సమకాలీన సమస్యను పరిష్కరించడానికైనా  అనుమతిస్తుంది అంటారు.
సెక్యులర్ ముస్లిం విద్యావేత్తలు మదరసాల యొక్క 13 వ లేదా 14 వ శతాబ్దానికి చెందిన కొన్ని విజ్ఞాన శాస్త్రం మరియు వేదాంతం పాఠాలను  మదరసా కరిక్యులం కలిగి ఉండటాన్ని తప్పు బడతారు. వారి ద్రుష్టి లో అవి అవుట్-డేటెడ్. వారి ద్రుష్టి లో ఆధునిక ప్రపంచములో మదరసా గ్రాడ్యుయేట్లు ఏమీ చేయలేరు. ఒక్క బోధకుడు అవ్వటం లేదా మరొక మదరసాను తెరవటం మినహాయించి?.

వాస్తవానికి, కొంతమంది ఉలేమాలు మదరసా వ్యవస్థలో మార్పు కోసం అవసరమైన అవగాహన కలిగి ఉన్నారు. మదరసా పాఠ్యప్రణాళికలో మరియు పాఠ్యాంశాల్లోని విషయాలలో  కూడా మార్పు రావాలని వారు ఒత్తిడి తెస్తున్నారు.

మదరసాల పట్ల అనుసరించవలసిన ప్రభుత్వ వైఖరి:
సాధారణంగా మదర్సాలను ఆధునిక విద్యా విలువలకు అనుగుణంగా లేని సంస్కృతులుగా పరిగణిస్తారు. ఇది వాస్తవానికి చాలా దూరంగా ఉంది. మతపరమైన అభ్యాసన కేంద్రాలు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి మరియు ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షించలేక పోతున్నాయి. ప్రభుత్వం వాటి విషయం లో రాడికల్ సంస్కరణలకు  పట్టుపడటం కన్నా వాటి పునర్నిర్మాణ విషయం లో   మరింత సహాయక మార్గంలో వ్యవహరించాలి. మదరసాలు పాఠ్య ప్రణాళిక మరియు నిర్వహణ లో స్వతంత్ర అధికార పరిధిని కలిగి ఉండాలి. మదరసాలు పాఠ్య ప్రణాళిక అభివృద్ధి మరియు ఉపాధ్యాయుల శిక్షణ విషయం లో ప్రభుత్వం తో  సహకరించాలి.

మదర్సాలో నేర్చుకుంటున్న నైపుణ్యాలపై భవిష్యత్ ఆధారపడ్డ విద్యార్థుల కుటుంబాల ఆర్థిక మరియు సామాజిక సంక్షేమ కోసం బాధ్యత వహించాలని అర్థం చేసుకోవాలి. మదరసాను ప్రభుత్వ విరుద్ధమైన విద్యా వ్యవస్థగా చూడకూడదు. వాటిని ఒక ప్రత్యామ్నాయాన్ని పరిగణించాలి. ఆప్పుడే ఉన్నతస్థాయిలో ఉన్న కుటుంబాలు కూడా తమ  పిల్లలను మదర్సాకు పంపుతారు.

సంస్కరణలు సంక్లిష్టంగా ఉంటాయి మరియు ప్రభుత్వ నేతృత్వంలో ఆధునికీకరణ అనేది స్వీకారం, ట్రస్ట్, ఆర్ధిక ప్రోత్సాహకాలు, మదర్సాస్ యొక్క పనితీరుపై ప్రభుత్వ విధానాల ప్రభావం మరియు సమాజ వనరులపై దాని ప్రభావం వంటి అనేక అంశాల పై ఆధార పడి ఉంటుంది. కొన్ని మదరసాలు ఇప్పుడు స్వయంగా తమ ఆర్ధిక వనరులను సమకూర్చుకొంటున్నాయి.

మదరసాల పట్ల ప్రభుత్వ అవగాహన మరియు వ్యూహం సంతులితంగా ఉండాలి. ఇప్పుడు కావలసింది సాంప్రదాయిక దృక్పధాన్ని గౌరవిస్తు, ఆధునిక మరియు  సాంప్రదాయికమైన అభ్యాసాన్ని సమగ్ర పరచడానికి చేసే ప్రయత్నాలకు చేయూత నివ్వడం.

ఈ మద్య  భారతదేశం లోని అనేక మదరసాసులు తమ పాఠ్యప్రణాళికలో సాధారణ ప్రధాన స్రవంతి విద్యా విషయాలను ప్రవేశపెట్టడం ద్వారా, లౌకిక, ఆధునిక విద్యకు తలుపులు తెరిచారు.  గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుండి వారి డిగ్రీలకు గుర్తింపు పొందడం మరియు  తమ సిలబుస్ లో నైపుణ్యం-శిక్షణా కోర్సులను చేర్చడం మొదలైనవి చేసారు.


ముగింపు:

భారతదేశంలో మదరసా  విద్య,  ఇస్లామిక్ అధ్యయనాలు మరియు సంస్కృతి యొక్క కేంద్రంగా, దాని ప్రత్యేకమైన గుర్తింపును నిర్వహించడానికి మరియు సమాజంలోని ప్రస్తుత ఆవశ్యకతలకు తగిన విధంగా ఉండవలయును.

నూతన మదర్సాలను మరియు ఉన్నత విద్యాసంస్థలను పురాతన సమర్ఖండ్ లేదా బొఖారా విద్యాసంస్థల   వలే తయారు చేయడానికి  మనం ప్రయత్నించాలి. మదరసా ఆధునీకరణ గురించి  నొక్కి వక్కాణించడం తో పాటు  ఇస్లామిక్ స్వర్ణ యుగపు చరిత్రలో వాటి అద్భుతమైన ఖ్యాతిని చాటుదాం.


No comments:

Post a Comment