13 May 2018

ఉన్నత విద్య అద్యాపకులలో కేవలం 4.9% మంది ముస్లింలు.-AISHE నివేదిక



భారతదేశంలోని ఉన్నత విద్యాసంస్థలపై 2016-17 సంవత్సరానికి విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) ప్రకారం భారతదేశంలోని ఉన్నత విద్యాసంస్థలలో ముస్లిం అద్యాపకుల  ప్రాతినిధ్యం కేవలం 4.9% ఉంది. అది భారతదేశ జనాభాలో ముస్లిం కమ్యూనిటీ యొక్క నిష్పత్తి (14.2%) కంటే తక్కువగా ఉంది.

షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్యం దేశ జనాభా లో రెండు వర్గాల జనాభా నిష్పతి కంటే తక్కువగా ఉంటుంది.మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించిన  సర్వేలో - ఉన్నత విద్యాసంస్థ లోని ఉపాధ్యాయుల మొత్తం సంఖ్యలో ఎస్సీల ప్రాతినిధ్యం 8.3% వద్ద ఉండగా ST ప్రాతినిధ్యం 2.2%.గా ఉంది. షెడ్యూల్డ్ కులాలు భారతదేశ జనాభాలో 16.6% మరియు ఎస్.టి. లు 8.6%గా ఉన్నారు.తెలంగాణలో 10.8 శాతం ఎస్సీ, 3.6 శాతం ఎస్.టి.ఉపాధ్యాయలు ఉండగా , ఆంధ్రప్రదేశ్లో 13.6 శాతం ఎస్.సి. ఉపాద్యాయులు, 1.6 శాతం ఎస్ టీ ఉపాధ్యాయులు  ఉన్నారు.మహారాష్ట్రలో 11 శాతం ఎస్సీ, 1.4 శాతం ఎస్.టి. ఉపాధ్యాయులు ఉన్నారు.

"అఖిల భారత స్థాయిలో, సాధారణ వర్గానికి చెందిన ఉపాధ్యాయులు(OC జనరల్ ) సగానికి పైగా ఉన్నారు, వారు భారతదేశంలోని మొత్తం ఉపాధ్యాయులలో 58.2% ఉన్నారు. ఒబిసిలు 31.3 శాతంగా ఉన్నాయి 'అని సర్వే నివేదిక తెలిపింది.
భారతదేశంలో సాధారణ వర్గం(జనరల్) మరియు ఓబిసి జనాభా సంఖ్య గురించి  ఖచ్చితమైన గణాంకాలు లేదు.1931 నుండి భారత దేశం లో ఒక్క  SC / ST జనాభా తప్ప మిగతా ఎటువంటి కుల గణన సమాచారం లేదు . ఓబిసి జనాభా NSSO ద్వారా  52%గా   మండల్ కమిషన్ ద్వారా 41%గా నిర్ధారించ బడినది. .

నివేదిక ఉన్నత విద్య స్థాయిలో బోధన వృత్తిలోని  లింగ అసమానతలను  తెల్పుతుంది.
బీహార్ అత్యధికంగా  లింగ అసమానత నిష్పత్తిని కలిగి ఉంది, 75.3% పురుష ఉపాధ్యాయులు ఉండగా కేవలం 24.7% మాత్రమే స్త్రీ ఉపాధ్యాయులు ఉన్నారు. జార్ఖండ్ లో మగ ఉపాధ్యాయులు 60% గా ఉండగా స్త్రీ ఉపాద్యాయులు 40% గా ఉన్నారు.  
"కొన్ని రాష్ట్రాలలో ఉదా: కు  కేరళ, పంజాబ్, చండీగఢ్, మేఘాలయ, నాగాలాండ్, ఢిల్లీ మరియు గోవాలో ఎక్కువ మంది స్త్రీ ఉపాధ్యాయులు ఉన్నారని  అని నివేదిక పేర్కొంది.

No comments:

Post a Comment