22 May 2018

స్వీయ నియంత్రణ అభివృద్ది -రమదాన్ లో ఉపవాస ప్రాధాన్యత
రమదాన్ ఇస్లామీయ చంద్రమాన  క్యాలెండర్ యొక్క 9 వ నెల. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ ముస్లింలకు ఒక ప్రత్యేక నెల. దీనిని  కొన్నిసార్లు "11 నెలల సుల్తాన్" గా పిలుస్తారు.. ఈ నెలలో ఆరోగ్యకరమైన వయోజన ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. తినడం, త్రాగటం మరియు పగటి పూట సమయంలో సంభోగం చేయటం ఉపవాస సమయం లో నిషిద్దం. ఉపవాసం సహరి తో ప్రారంభించి  ఇఫ్తార్ తో విరమిస్తారు. ప్రియ  ప్రవక్త (స) ఉపవాసం ను ఖర్జూరం,  ఆలివ్ లేదా కొంత నీటితో విరమించేవారు. అదే సంప్రదాయం అందరు పాటిస్తారు.

ప్రతి సంవత్సరం 9 నుండి 90 ఏళ్ల వయస్సు వరకు ఉన్న 500 మిలియన్లకు పైగా ముస్లింలు ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం, వారి ప్రాపంచిక పని లేదా వ్యాపారాన్ని మామూలుగా నిర్వహించకుండా నిరోధించదు. ఇస్లాం లో ఉపవాసం బహుశా అత్యంత ఆరాధన రూపం. ముస్లింలు తమ ఆధ్యాత్మిక జీవితాల కోసం రమదాన్ ను ఒక అపురూపమైన అవకాశంగా భావిస్తారు.

రమదాన్ అనేది అల్లాహ్ యొక్క తీవ్ర ఆరాధన మరియు అల్లాహ్ పట్ల  భక్తి, సమగ్రమైన కృతజ్ఞతలతో, ​​అల్లాహ్ బోధనలను ప్రతిబింబిస్తూ, స్వీయ-నియంత్రణ, దయ కలిగి ఉండటం, ఆధ్యాత్మికంగా మెరుగైన వ్యక్తిగా తమ్ము తాము అభివృద్ధి పరచుకోవడం మరియు , ఇతరులతో సంబంధాలు కలిగి ఉండటం నేర్పుతుంది.

ఇస్లాం ధర్మంలో ఉపవాసము తప్పనిసరి మతపరమైన విధిగా, పరిగణించ బడుతుంది. రంజాన్ లో ఉపవాసం స్వీయ-నియంత్రణ నేర్పుతుంది. ఉపవాసము వలన ఆత్మ కోరికల నుండి విముక్తి పొందింది. ఉపవాసము కఠినమైన అలవాట్లకు  విరామం ఇస్తుంది.ఉపవాసం సమయంలో, కడుపుతో పాటు నాలుక, కళ్ళు, చెవులు, ఇతర అవయవాలు, మరియు గుండె మరియు మనస్సు సమానంగా నియంత్రణలో ఉంటాయి. మన భౌతిక ఆకలిని తో పాటు ప్రతికూల భావాలను, చర్యలను కూడా నియంత్రించాలి.

ముహమ్మద్ ప్రవక్త (స), ప్రకారం ఉపవాసము ఆహారం మరియు పానీయం నుండి వ్యక్తిని నిరోధించటమే కాదు, వ్యక్తిని దుర్మార్గపు చర్యల నుండి దూరంగా ఉంచుతుంది. ఒక వ్యక్తి తన భావాలను మరియు ప్రవర్తనను నియంత్రించకపోతే, ఆ మనిషి ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ఎవరైనా మాటలతో, చేతలతో ఉపవాసి పట్ల అమర్యాద గా వ్యవహరిస్తే లేదా బాధిస్తే  "నేను ఉపవాసం ఉంటున్నాను  అని అనండి." ఇస్లాం ప్రకారం ఈ నెలలో , ఒకరి అవయవాలు మాత్రమే కాక, ఒకరి ఆలోచనలు మరియు భావాలను కఠినంగా నియంత్రించాల్సిన అవసరం ఉంది.


ఉపవాసం అనేది ఆకలిని  అనుభవించే మార్గం మరియు తక్కువ అదృష్టం ఉన్నవారి పట్ల  సానుభూతి నేర్పుతుంది.  దేవుని అనుగ్రహాలన్నిటికి కృతజ్ఞత చూపుతుంది. ఉపవాసము ఆర్ధికలేమి కలిగిన ప్రజల పట్ల సానుభూతి మరియు కరుణ పెంచుతుంది. ఆకలి అనుభవంలోకి వస్తుంది ఈ లోతైన, అంతర్గత పరిజ్ఞానం మనకు వ్యర్థాలను తగ్గిస్తుంది మరియు అవసరం ఉన్నవారికి సహాయం చేయడానికి సహాయపడుతుంది.

 రమదాన్ దాతృత్వం యొక్క సమయం. రమదాన్ మాసం లో మంచి మరియు స్వచ్ఛంద పని చేయడానికి ప్రజలు మరింత ఉదారంగా, మరింత హృదయపూర్వకoగా  మరియు మరింత సిద్ధంగా ఉoటారు. ముస్లింలు తరచూ స్నేహితులు మరియు అతిథులను ఆహ్వానిస్తారు ముఖ్యంగా పొరుగువారితో ఇఫ్తార్  మరియు బహుమతులను  మరియు ఉత్తమ శుభాకాంక్షలు తెలుపుకొంటారు.

ఉపవాసం జుడాయిజం మరియు క్రిస్టియానిటీ మతాచారాలతో కూడా కన్పిస్తుంది. ఉపవాసం దేవునికి భక్తి యొక్క ముఖ్య అంశంగా గుర్తింపు పొందింది. ఖుర్ఆన్ ఉపవాసం గురించి ఇలా వివరిస్తుంది: "ఓ విశ్వాసులారా! మీకు ముందు ఉన్న ప్రజల మీద సూచించిన విధంగానే ఉపవాసం మీపై సూచించబడింది. "

రమదాన్ సమయంలో ఉపవాసం విధేయత చర్య. ఇది ఆరాధన హృదయము యొక్క నిజాయితీ కృతజ్ఞతను చూపుతుంది.  ఇది మన  శారీరక కోరికలపై ఆధ్యాత్మిక గెలుపును సూచిస్తుంది.  మన శరీరాన్ని ఉపవాసం నియంత్రిస్తుంది. ఉపవాసం బాహ్య శక్తుల ప్రభావాన్ని బలహీనపరుస్తుంది మరియు శరీర నియంత్రణపై మనస్సు మరియు గుండె యొక్క ప్రభావాలను బలపరుస్తుంది.

ముగింపు
రమదాన్ లో ఉపవాసము, విశ్వాసకుల నిబద్ధత నెరవేర్చడానికి సహాయం చేస్తుంది. . ఉపవాసం స్వీయ-నియంత్రణకు మార్గము, దైవభక్తిని పెంచటానికి మరియు శరీర కోరికల దౌర్జన్యం నుండి స్వేచ్ఛను పొందటానికి ఒక మార్గం. రెండవది, ఉపవాసము, ఆరాధన, మరియు కృతజ్ఞతకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది పేదరికం మరియు ఆకలి తో బాధపడుతున్న వారితో సమాజం యొక్క అనుబంధంను సమర్థిస్తుంది. ఉపవాసము దేవుని పట్ల యథార్థ ప్రశంసలు మరియు ఆరాధన యొక్క సారము తెలియజేస్తుంది.  చివరగా, ఉపవాస ఆకలి అనుభూతి దాని నిజమైన స్వభావాన్ని గుర్తుచేస్తుంది. ఇది విశ్వాసం, పరిజ్ఞానం, ఆరాధన మరియు దేవుని ప్రేమ, అలాగే మానవాళికి సేవ చేయడం మరియు  సృష్టి యొక్క ప్రయోజనం యొక్క స్ఫూర్తిని గుర్తు చేస్తుంది.

No comments:

Post a Comment