22 October 2019

సాంప్రదాయ ఇస్లామిక్ మెడిసిన్ మరియు నివారణలు-ప్రవక్త(స) యొక్క మందులు Traditional Islamic Medicine and Remedies-Medicines of the Prophet

Related image





ముస్లింలు ఆరోగ్యం మరియు వైద్య విషయాలతో సహా జీవితంలోని అన్ని రంగాలలో మార్గదర్శకత్వం కోసం దివ్య ఖురాన్ మరియు సున్నత్/హదీసులను అనుసరిస్తారు.
   
హదీసులో పేర్కొన్నట్లు ముహమ్మద్ ప్రవక్త(స) ఒకసారి "అల్లాహ్ వ్యాధిని సృష్టించినాడు మరియు  దాని కోసం నివారణను కూడా  సృష్టించినాడు" అని అన్నారు. అందువల్ల ముస్లింలు సాంప్రదాయ మరియు ఆధునిక షధ రూపాలను అన్వేషించడానికి మరియు ఉపయోగించటానికి  ప్రోత్సహిoపబడినారు  మరియు ఏదైనా నివారణ అల్లాహ్ ఇచ్చిన బహుమతి అని నమ్మకం కలిగి ఉండాలి.

ఇస్లాంలో సాంప్రదాయ షధాన్ని తరచుగా మెడిసిన్ ఆఫ్ ది ప్రవక్త (అల్-టిబ్ అన్-నబావి) అని పిలుస్తారు. ఆధునిక చికిత్సలకు ప్రత్యామ్నాయంగా లేదా ఆధునిక వైద్య చికిత్సకు అనుబంధంగా ముస్లింలు తరచూ ప్రవక్త() యొక్క షధాన్ని అన్వేషిస్తారు.

ఇస్లామిక్ సంప్రదాయంలో భాగమైన కొన్ని సాంప్రదాయ నివారణలు ఇక్కడ ఉన్నాయి.
ఏదైనా చికిత్సకు ప్రయత్నించే ముందు ఎప్పుడూ వైద్య నిపుణుడిని సంప్రదించాలి. కొన్ని మూలికలు కొన్ని పరిస్థితులలో లేదా తప్పుడు పరిమాణంలో వాడినప్పుడు హానికరం

నల్ల విత్తనం(కలోంజి) /Black Seed:

బ్లాక్ కారవే లేదా జీలకర్ర (నిగెల్లా సాటివా) పశ్చిమ ఆసియాలో ఉద్భవించింది మరియు బటర్‌కప్ కుటుంబంలో భాగం.

ముహమ్మద్ ప్రవక్త(స) ఒకసారి తన అనుచరులకు సలహా ఇచ్చారు: “నల్ల విత్తనాన్ని వాడండి, ఎందుకంటే ఇది మరణం తప్ప ప్రతి రకమైన అనారోగ్యానికి నివారణను కలిగి ఉంటుంది.”

నల్ల విత్తనం జీర్ణక్రియకు సహాయపడుతుందని, ఇందులో యాంటిహిస్టామైన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ మరియు అనాల్జేసిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. శ్వాసకోశ వ్యాధులు, జీర్ణ సమస్యలు తగ్గించడానికి  మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి ముస్లింలు తరచుగా నల్ల విత్తనాన్ని తీసుకుంటారు

తేనె /Honey:

ఖురాన్లో తేనె వైద్యం యొక్క మూలంగా వర్ణించబడింది:

ఈ ఈగ [తేనెటీగల] కడుపు లో నుండి రంగు రంగుల పానకం ఒకటి వేలుబడుతుంది. అందులో ప్రజల కోసం వ్యాధి నివారణ శక్తీ ఉన్నది, ఆలోచించే వారికి ఇందులోకుడా  నిశ్చయంగా ఒక సూచనా ఉంది”(దివ్య ఖురాన్ 16:69).

ఇది జన్నా(స్వర్గం) యొక్క ఆహారాలలో ఒకటిగా కూడా పేర్కొనబడింది:
భయభక్తులు కలవారికి వాగ్ధానం చేయబడిన స్వర్గం యొక్క వైభవం ఇలా ఉంది, అందులో నిర్మలమైన నీటి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, సేవించేవారికి మధురంగా ఉండే మద్యపు కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి స్వచ్చమైన తేనే కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. (దివ్య ఖురాన్ 47:15).

తేనెను ప్రవక్త(స) "వైద్యం," "ఆశీర్వాదం" మరియు "ఉత్తమ ఔషధం" అని పదేపదే ప్రస్తావించారు.

ఆధునిక కాలంలో, తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మరియు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కనుగొనబడింది. తేనె నీరు, సరళమైన మరియు సంక్లిష్టమైన చక్కెరలు, ఖనిజాలు, ఎంజైములు, అమైనో ఆమ్లాలు మరియు మంచి ఆరోగ్యానికి అనుకూలమైన అనేక విటమిన్లతో కూడి ఉంటుంది.

ఆలివ్ నూనె /Olive Oil:
దివ్య ఖురాన్ ఇలా చెబుతోంది:
" సీనాయి పర్వతం నుండి పుట్టె  ఒక చెట్టు (ఆలివ్)ను సృష్టించాము అది నూనెను కూడా ఇస్తుంది ఇంకా తినేవారికి కూరగా కూడా ఉపయోగపడుతుంది. (దివ్య ఖురాన్ 23:20)."

ముహమ్మద్ ప్రవక్త(స) ఒకసారి తన అనుచరులతో ఇలా అన్నారు: "ఆలివ్ తినండి మరియు దానితో అభిషేకం చేయండి (ఎందుకంటే అది ఒక ఆశీర్వాద చెట్టు."

ఆలివ్ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, అలాగే విటమిన్ ఇ ఉన్నాయి. ఇది కొరోనరీ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి వినియోగించబడుతుంది మరియు చర్మంపై మృదుత్వం మరియు స్థితిస్థాపకత/ఎలాస్టిసితి పెంచుతుంది.

ఖర్జూరాలు /Dates:

ఖర్జూరాలు  (తేమర్) రంజాన్ ఉపవాసాలను విరమించడానికి ఉపయోగించే సాంప్రదాయ మరియు ప్రసిద్ధ ఆహారం. ఉపవాసం తరువాత ఖర్జూరాలు తినడం రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి  సహాయపడుతుంది మరియు ఇది ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం మరియు సంక్లిష్ట చక్కెరల యొక్క అద్భుతమైన మూలం.

జామ్జామ్ నీరు /Zamzam Water:

సౌదీ అరేబియాలోని మక్కాలోని భూగర్భ ఊట/స్ప్రింగ్ నుండి జామ్జామ్ నీరు వస్తుంది. ఇది మంచి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను పెద్ద మొత్తంలో కాల్షియం, ఫ్లోరైడ్ మరియు మెగ్నీషియం కలిగి ఉంది.

మిస్వాక్ /Siwak:

అరక్ చెట్టు యొక్క కొమ్మలను (సాల్వడోరా పెర్సికా) సాధారణంగా సివాక్ లేదా మిస్వాక్ అంటారు. ఇది సహజ టూత్ బ్రష్ గా ఉపయోగించబడుతుంది మరియు దాని నూనెలు టూత్ పేస్టు లో ఉపయోగించబడతాయి. నోటి పరిశుభ్రత మరియు చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడటానికి దాని మృదువైన ఫైబర్స్  ను  దంతాలు మరియు చిగుళ్ళపై సున్నితంగా రుద్దుతారు.

పరిమిత ఆహారం /Moderation in Diet:

ముహమ్మద్ ప్రవక్త(స) తన అనుచరులకు మితంగా భుజించమని సలహా ఇచ్చారు, వారు అతిగా తినకూడదు.ప్రవక్త (స) ఇలా చెప్పారు :
"ఆడమ్ కొడుకు కు కొన్ని ముద్దలు మాత్రమే అవసరమవుతాయి, అతను తన ఉదరం లో  మూడింట ఒక వంతు ఆహారం కోసం కేటాయించాలి, మరొక మూడవ భాగం తన పానీయం కోసం, మరియు చివరి మూడవ భాగం  శ్వాస కోసం. "
ఈ సలహా విశ్వాసులు తమను తాము అధికంగా భుజింప కుండా మంచి ఆరోగ్యానికి హాని కలిగించకుండా నిరోధించడానికి ఉద్దేశించబడింది.

తగినంత నిద్ర/Adequate Sleep:

సరైన నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలు అధికం

దివ్య  ఖురాన్ వివరిస్తుంది: “మీ కొరకు రాత్రిని వస్త్రంగాను, నిద్రను మృత్యు సాన్తిగాను, పగలును బ్రతికి లేచే సమయంగాను చేసినవాడు అల్లహయే” దివ్య ఖురాన్ 25:47

"అయన సూచనలలో రాత్రి, పగలు మీరు నిద్రపోవటం, మీరు అయన అనుగ్రహాని అన్వేషించడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, (శ్రద్దగా) వినేవారికి ఇందులో చాలా సూచనలు ఉన్నాయి. ( దివ్య ఖురాన్ 30:23).

ప్రారంభ ముస్లింల అలవాటు ఇషా ప్రార్థన తర్వాత నిద్రపోవటం, తెల్లవారుజామున ప్రార్థనకు ఉదయాన్నే మేల్కొలవడం మరియు మధ్యాహ్నం చిన్న కునుకు/నిద్రపోవటం. అనేక సందర్భాల్లో, ప్రవక్త ముహమ్మద్ (స)రాత్రి అంతా  ప్రార్థన చేయటానికి నిద్రను విడిచిపెట్టిన ఉత్సాహపూరితమైన ఆరాధకులను నిరాకరించారు.

ప్రవక్త(స)ఒకరితో  ఇలా అన్నారు:
"మీ శరీరానికి మీపై హక్కు ఉoది. ప్రార్థనలు చేయండి మరియు రాత్రి నిద్రించండి" మరియు మరొకరితో , "మీరు చురుకుగా ఉన్నప్పుడు  ప్రార్థన చేయండి  మరియు మీరు అలసిపోయినప్పుడు నిద్రపోండి" అని అన్నారు.


No comments:

Post a Comment