5 April 2020

ముహమ్మద్ మియాన్ మన్సూర్ అన్సారీ (Muhammad Mian Mansoor Ansari)1884-1946



upload.wikimedia.org/wikipedia/hi/1/18/Muhammad...
-

ముహమ్మద్ మియాన్ మన్సూర్ అన్సారీ (1884 - 11 జనవరి 1946) భారత స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు, రాజకీయ కార్యకర్త మరియు ఇస్లామిక్ తత్వవేత్త/పండితుడు అతను 1868లో  దారుల్ ఉలూం, దియోబంద్ స్థాపకుల్లో ఒకరైన  ముహమ్మద్ ఖాసిమ్ నానౌతవి Muhammad Qasim Nanautavi మనవడు.

మహమ్మద్ మియా మన్సూర్ అన్సారీ 1884మార్చి 10న యుపి సహారాన్‌పూర్‌లోని అన్సారీ కుటుంబంలో జన్మించాడు. అతను అల్లామా అబ్దుల్లా అన్సారీ ఇంట్లో పెరిగాడు. అతను తన ప్రాధమిక విద్యను గులాతి Gulaothi,లోని మదర్సా-ఎ మన్బా అల్-ఉలుమ్లో Madrasa-e Manba al-Ulum పొందాడు, అక్కడ అతని తండ్రి ప్రధాన ఉపాధ్యాయుడు. దార్ అల్-ఉలం నుండి పట్టభద్రుడు అయిన తరువాత  అతను వివిధ ప్రదేశాలలో ఉపాధ్యాయుడిగా మరియు ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆతరువాత  మన్సూర్ అన్సారీ దారుల్-ఉలూమ్ డియోబంద్ వద్దకు తిరిగి వచ్చి క్రమంగా పాన్-ఇస్లామిక్ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.

సిల్క్ లెటర్స్ ఉద్యమంలో ముహమ్మద్ మియాన్ మన్సూర్ అన్సారీ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు.. ఇతను ఇస్లామిక్ స్కూల్ ఆఫ్ డియోబంద్ కు సంభందించిన ముస్లిం మతాధికారుల నేతృత్వంలో జరిగిన భారత స్వాతంత్ర్య ఉద్యమo పాల్గొన్న   అత్యంత చురుకైన మరియు ప్రముఖ సభ్యులలో ఒకరు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, అతను డియోబంద్ స్కూల్  నాయకులలో ఒకడు.   మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మౌలానా మహ్మద్ అల్ హసన్ నాయకత్వంలోని పాన్-ఇస్లామిక్ ఉద్యమంలో పాల్గొన్నాడు. షేఖుల్ హింద్ మహమూద్ అల్-హసన్ నేతృత్వంలో, భారతదేశంలో పాన్-ఇస్లామిక్ విప్లవం (సిల్క్ లెటర్ ఉద్యమం) కోసం ఇతర దేశీయుల మద్దతు కోరడానికి భారతదేశం విడిచి వెళ్ళాడు.
మొదటి ప్రపంచ యుద్ధంలో ఆఫ్ఘన్ అమీర్ హబీబుల్లా ఖాన్‌ను సహాయం అడగటానికి మన్సూర్ అన్సారీ కాబూల్ వెళ్లారు. అతను డిసెంబర్ 1915 లో కాబూల్‌లో ఏర్పడిన తాత్కాలిక భారత ప్రవాస ప్రభుత్వంలో చేరాడు మరియు యుద్ధం ముగిసే వరకు ఆఫ్ఘనిస్తాన్‌లోనే ఉన్నాడు.

1916, ఏప్రిల్ లో భారతదేశానికి తిరిగి వచ్చి, జూన్ లో భారతదేశంలోని స్వాతంత్ర్య సమరయోధులను కాబుల్ తీసుకువెళ్లాడు. తరువాత అతను రష్యాకు వెళ్లినాడు. అక్కడ నుండి అనేక ఇతర దేశాల గుండా ప్రయాణిస్తూ టర్కీ వెళ్లి అక్కడ రెండు సంవత్సరాలు గడిపాడు.

1946 లో భారత జాతీయ కాంగ్రెస్ అతనిని భారతదేశానికి తిరిగి రావాలని కోరింది మరియు బ్రిటిష్ ప్రభుత్వం అతనికి అనుమతి ఇచ్చింది. కానీ అతను కాబుల్ లోనే ఉండి బోధనలు చేశాడు. అక్కడ అతను తఫ్సీర్ షేక్ మహముదుల్ హసన్ డియోబండి (కాబూలీ తఫ్సీర్ అని పిలుస్తారు) బోధించే మరియు అనువదించే కార్యక్రమాన్ని ప్రారంభించాడు.

భారతదేశం స్వేచ్ఛగా మారడానికి ఒక సంవత్సరం ముందు ముప్పై ఒక్క సంవత్సరాల ప్రవాసం తరువాత 1946 లో ముహమ్మద్ మియాన్ మన్సూర్ అన్సారీ తీవ్ర అనారోగ్యానికి గురై, 11 జనవరి 1946 న ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ వద్ద మరణించారు మరియు అక్కడ ఖననం చేయబడ్డారు.



No comments:

Post a Comment