20 April 2020

అబ్దుల్ ఖాదిర్ బవాజీర్ (-31 డిసెంబర్, 1931)

ప్రఖ్యాత భారత స్వాతంత్ర సమర యోధుడు: గాంధీజీ  సహచరుడు.

Album Matter in Telugu and English.p65 Pages 101 - 150 - Text ...

ఇమామ్ సాహెబ్ అని ప్రేమగా పిలువబడే అబ్దుల్ ఖాదీర్ బవాజీర్  గుజరాత్ లోని ఒక  సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించాడు. ఇమాం సాహెబ్ తండ్రి బొంబాయిలోని ప్రసిద్ధ జుమ్మా మసీదుకు చెందిన ముయెజిన్. ఇమామ్ సాహెబ్ యొక్క పూర్వీకులు అరబ్బులు మరియు భారతదేశానికి వచ్చి కొంకణ్ ప్రాంతం లో  చాలాకాలం క్రితం స్థిరపడ్డారు.అబ్దుల్ ఖాదిర్ లేదా ఇమాంసాబ్ కు మాతృభాష గుజరాతీ, కానీ కొంకణి, అరబిక్, ఇంగ్లీష్ మరియు క్రియోల్ ఫ్రెంచ్‌ మరియు ఉర్దూ తెలుసు. సాధారణ పాఠశాల విద్య మాత్రమే అబ్యసించాడు.

తన బాల్యం నుండే వ్యాపార చతురతను సంపాదించిన అబ్దుల్ ఖాదిర్ బవాజీర్ అరేబియా గుర్రాలు మరియు గుర్రపు బండ్ల వ్యాపారం చేయడానికి దక్షిణాఫ్రికా వెళ్ళి వ్యాపారిగా చాలా సంపాదించాడు  మరియు ట్రాన్స్‌వాల్‌లో స్థిరపడ్డాడు. అబ్దుల్  ఖాదిర్ బవాజీర్  జోహాన్నెస్‌బర్గ్ మసీదులో ఇమామ్ గా పని చేసినoదున అతన్ని ఇమామ్ సాహెబ్అని ప్రేమగా పిలుస్తారు.

1903 లో అతనికి మొదటిసారి దక్షిణాఫ్రికాలో గాంధీజీతో పరిచయం ఏర్పడినది మరియు ఆ పరిచయం గాంధీజీ తో సన్నిహిత సానిహిత్యానికి దారితీసింది.
  
అబ్దుల్ ఖాదీర్ బవాజీర్ 1904 లో గాంధీజీ స్థాపించిన ఫీనిక్స్ సెటిల్మెంట్‌లో తన కుటుంభం తో సహా చేరాడు. గాంధీజీతో కలిసి  అబ్దుల్ ఖాదీర్ బవాజీర్ ఫీనిక్స్లో ఫకీర్జీవితాన్ని గడిపినాడు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా భారతీయులు చేపట్టిన అన్ని ఆందోళనలలో  ఆయన ముందున్నారు. 1907లోహమీడియా ఇస్లామిక్ సొసైటీఅధ్యక్షుడిగా అబ్దుల్ ఖాదీర్ బవాజీర్ ప్రజలకు సేవ చేశాడు. అతను 1908 లో జైలు పాలయ్యాడు.

1914 లో గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు అబ్దుల్ ఖాదీర్ దక్షిణాఫ్రికాలో తన వృద్ధి చెందుతున్న వ్యాపారాన్ని మరియు సుఖ జీవితాన్ని విడిచిపెట్టి, మహాత్మా గాంధీ తో కలిసి భారతదేశానికి వచ్చి సబర్మతి ఆశ్రమ స్థాపనలో గాంధీజీ కి సహాయం చేశాడు. అబ్దుల్ ఖాదీర్ మరియు అతని కుటుంబ సభ్యులు సబర్మతి ఆశ్రమంలో నివసించారు మరియు  సబర్మతి ఆశ్రమం నిర్వహించిన ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసేవారు.

అబ్దుల్ ఖాదిర్ ప్రెస్‌లో కంపోజిటర్‌గా మరియు అతని భార్య, ఇద్దరు  కుమార్తెలు అమీనా మరియు ఫాతిమా ప్రెస్ మరియు ఆశ్రమంలోని ఇతర పనులు నిర్వహించేవారు.  అబ్దుల్ ఖాదిర్  పెద్ద కుమార్తె అమీనా వివాహం సబర్మతి ఆశ్రమంలో జరిగినప్పుడు, గాంధీజీ, ఇమామ్ సాహెబ్ తన సోదరుడని అతిదులకు వివరించి ఇమామ్ సాహెబ్‌ తరుపున స్వయంగా అతిథులను సాదరంగా ఆహ్వానించారు.

జాతీయ ఉద్యమంలో అనేక సార్లు ఇమామ్ సాహెబ్ మరియు అతని కుమార్తెలను అరెస్టు చేసి జైలులో పెట్టారు. 1928 లో, అబ్దుల్ ఖాదీర్ సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో కలిసి బార్డోలి సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొన్నారు. 1930 లో గాంధీజీ దండి మార్చిప్రారంభించినప్పుడు, అబ్దుల్ ఖాదీర్ మార్చ్‌ లో ముందు నడిచారు. దండి మార్చ్ లో పాల్గొన్న అతన్ని అరెస్టు చేసి జైలులో పెట్టారు. జైలులో అతని ఆరోగ్యం క్షిణించినది.  అబ్దుల్ ఖాదిర్  1931 లో విడుదలయ్యాడు.

ఇమామ్ సాహెబ్ అబ్దుల్ ఖాదీర్ బవాజీర్ 1931 డిసెంబర్ 31 న కన్నుమూశారు మరియు సబర్మతి ఆశ్రమం సమీపంలో ఖననం చేయబడ్డాడు. గాంధీజీ  అబ్దుల్ ఖాదిర్ ను సత్యాగ్రహం మరియు హిందూ ముస్లిం ఐక్యత కోసం ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తిఅని కొనియాడారు. అతని సంస్మరణను సర్దార్ పటేల్ 1931 డిసెంబర్ 13 నవజీవన్ లో రాశారు. ఇమామ్ సాహెబ్  మునిమనవడు జస్టిస్ అకిల్ అబ్దుల్ హమీద్  కురేషి ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా పనిచేస్తున్నారు. .





No comments:

Post a Comment