16 October 2020

ఫకీర్-సన్యాసి తిరుగుబాటు Fakir-Sannyasi rebellion (1770-1802)

 

 

 

ఫకీర్-సన్యాసి తిరుగుబాటు అనేది 18 వ శతాబ్దం చివరలో బెంగాల్‌లోని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ముస్లిం ఫకీర్లు (సూఫీలు) మరియు హిందూ సన్యాసిస్ (యోగులు) యొక్క సాయుధ ప్రతిఘటన. ఈ ప్రతిఘటన 1760 లో ప్రారంభమైంది మరియు నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగింది.

 

భారతీయ చరిత్రలో ఫకీర్-సన్యాసి తిరుగుబాటు యొక్క ప్రాముఖ్యతపై చరిత్రకారులలో బిన్నాభిప్రాయలు కలవు. 1764 లో బక్సార్ యుద్ధం తరువాత బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పన్ను వసూలు చేసే హక్కు ఇవ్వబడినందున, విదేశీ పాలన నుండి భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం ఇది ఒక ప్రారంభ యుద్ధంగా కొందరు సూచిస్తున్నారు, మరికొందరు దీనిని బెంగాల్ కరువు తరువాత  హింసాత్మక బందిపోటు చర్యలుగా వర్గీకరించారు. కొంతమంది ఆధునిక చరిత్రకారులు ఈ ఉద్యమం ఎప్పుడూ ప్రజాదరణ పొందలేదని వాదించారు. ఇతర చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, తిరుగుబాటు ను ముస్లిం ఫకీర్లు మరియు హిందూ సన్యాసిస్ ఏకగ్రీవంగా నడిపించారు.

ఈ సుదీర్ఘ ప్రతిఘటన వెనుక కారుణాలు  అస్పష్టంగానే ఉన్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా నిబంధనలు ముస్లిం ఫకీర్లు మరియు హిందూ సన్యాసిల జీవన విధానాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఫకీర్ మరియు సన్యాసి  సమూహాలు  మరియు వారి అనుచరులు ఎక్కువగా గ్రామాలలో ప్రజలు అందించే భిక్షపై ఆధారపడేవారు. కంపెనీ ప్రభుత్వం ఫకీర్లు మరియు సన్యాసిస్ వంటి వ్యవస్థీకృత సమూహాలచే  గ్రామ ప్రజల నుండి  అనధికారికంగా భిక్ష వసూలు చేయడాన్ని నిషేధించింది. దీనికి ప్రతిస్పందనగా, ఫకీర్ మరియు సన్యాసి  సమూహాలు  కంపెనీ పాలకులపై ప్రతిఘటన ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రతిఘటన ఉద్యమానికి గ్రామిణరైతుల నుండి మద్దతు లభించింది

 

ప్రతిఘటించిన  ఫకీర్లు పదిహేడవ శతాబ్దం రెండవ భాగంలో షా సుల్తాన్ హసన్ సూర్య బుర్హానా నాయకత్వంలో బెంగాల్‌లో అభివృద్ధి చెందిన  మదరియా తారికాకు చెందినవారు, సన్యాసిలు ఏక్-దండి సన్యాసిజం యొక్క గిరి మరియు పూరి సమూహాలకు చెందిన వేదాంత హిందూ యోగులు. ఫకీర్లు మరియు సన్యాసిస్ ఇద్దరూ వరుసగా ఖంకాస్ మరియు అఖ్దా khankas and akhdas లలో నివసించే సాయుధ బృందాలు. ఆచారాలు మరియు అభ్యాసాలలో సూఫీ ఫకీర్లు మరియు యోగి సన్యాసిస్ మధ్య మంచి అనుబంధం ఉంది మరియు ఇది విదేశీ పాలనకు వ్యతిరేకంగా వారి ఉమ్మడి కూటమికి దోహదపడింది.

ఫకీర్-సన్యాసి ప్రతిఘటన ఉద్యమాన్ని మదరియా శాఖకు చెందిన సూఫీ సాధువు మజ్ను షా నేతృత్వం వహించారు. అతను పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో బీహార్ ఆధారిత మదరియా సూఫీ ఆర్డర్ కు నాయకత్వం వహించాడు.  మూసా షా, చెరాగ్ అలీ షా, పరాగల్ షా, శోభన్ షా, కరీం షా వంటి సూఫీలు అతని ముఖ్య అనుచరులు. భవాని పాథక్, గణేష్ గిరి, చౌధురానీ, హిందూ సన్యాసిస్ తిరుగుబాటుదారులకు నాయకత్వం వహించారు.

1760 లో ఫకీర్-సన్యాసి  ప్రతిఘటన ప్రారంభమైంది మరియు 1763 లో తీవ్ర రూపం దాల్చినది.  వారి ప్రధాన లక్ష్యం కంపెనీ కుతి అనగా కంపెనీ పాలకులకు విధేయులైన జమీందార్ల రెవెన్యూ కాచారీలు మరియు వారి అధికారుల ఇళ్ళు. తిరుగుబాటుదారులు కత్తులు, ఈటె మరియు లాన్సులు, తుపాకీ, ఫైర్ విసిరే పరికరం, హవాయి మరియు తిరిగే ఫిరంగులను ఉపయోగించారు.

 

ఫకీర్లలో మజ్ను షా మరియు అతని ముఖ్యానుచరులు మాత్రమే ఒక వ్యూహాత్మక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు గుర్రాన్ని ఉపయోగించారు. ఒంటెలను సదుపాయాలు మరియు మందుగుండు సామగ్రిని తీసుకెళ్లడానికి ఉపయోగించారు. వారి కార్యకలాపాలు ప్రధానంగా గెరిల్లా స్వభావం కలిగి ఉన్నాయి. చాలా సందర్భాలలో వారు కంపెనీ సిబ్బందిపై మరియు వారి సంస్థలపై గెరిల్లా  దాడి చేసేవారు. రెగ్యులర్ ఆపరేషన్లలో మరియు నిర్దిష్ట యుద్ధంలో తరచుగా ఐదు నుండి ఆరు వేల ఫకీర్-సన్యాసిస్ ఉండేవార్. 1770 నాటికి ఫకీర్లు మరియు సన్యాసిస్ సంఖ్య యాభై వేల లేదా అంతకంటే ఎక్కువ పెరిగింది. తిరుగుబాటుదారులు తమ ఇంటెలిజెన్స్ ఏజెంట్లను గ్రామస్తులలో  కలిగి ఉన్నారు, వారు కంపెనీ దళాల కదలికను వారికి తెలియజేసేవారు.

 

తిరుగుబాటుదారులు 1763 లో బేకర్‌గంజ్ లోని కంపెనీ వాణిజ్య కుతిపై దాడి చేసి, కుతిని దోచుకున్నారు. అదే సంవత్సరంలో వారు డాకా కుతి పై దాడి చేసారు అయితే  కెప్టెన్ గ్రాంట్ తరువాత ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాడు. అదే సంవత్సరం, రాజ్‌షాహిలోని రాంపూర్ బోలియా వద్ద తిరుగుబాటుదారులు కంపెనీ కుతిపై దాడి చేశారు ఫ్యాక్టరీ చీఫ్ బెన్నెట్‌ను బంధించారు. పాట్నాకు బందీగా పంపబడిన ఫ్యాక్టరీ చీఫ్ బెన్నెట్‌ అక్కడ చంపబడ్డాడు.

 

1767 నాటికి రంగాపూర్, రాజ్‌షాహి, కుచ్ బీహార్, జల్పాయిగురి మరియు కోమిల్లాలో తిరుగుబాటుదారుల దాడి తీవ్రమైంది. ఉత్తర బెంగాల్‌లోని తిరుగుబాటుదారుల కార్యకలాపాలను అణిచివేయడానికి 1767 లో కెప్టెన్ డి. మాకెంజీ ఆధ్వర్యంలో ఒక ఆంగ్ల సైన్యం రంగపూర్‌కు పంపబడింది. తిరుగుబాటుదారులు నేపాల్ వైపు వెనక్కి తగ్గారు. 1768-70 మధ్యకాలంలో ఫకీర్-సన్యాసి దాడులు ప్రధానంగా సరన్ (బీహార్), బెనారస్, పూర్నియా, రంగ్పూర్, దినాజ్‌పూర్, రాజ్‌షాహి, కొమిల్లా మరియు చిట్టగాంగ్ జిల్లాల్లో కొనసాగాయి.

 

ఫెల్థం ఆధ్వర్యంలోని ఒక సైన్యం 1771 లో రంగాపూర్ లోని ఘోరఘాట్ మరియు గోవింద్గంజ్ లకు వెళ్లేటప్పుడు అకస్మాత్తుగా ఫకీర్-సన్యాసిలపై దాడి చేసింది, అక్కడ ఫకీర్-సన్యాసిలు  ఓటమిని చవిచూశారు. గాయపడిన వంద మందికి పైగా అనుచరులతో మజ్ను షా మహాస్తాన్ వైపు వెళ్లారు. 1772 లో రజ్పూర్, రాజ్‌షాహి మరియు బోగ్రా జిల్లాల్లోని కంపెనీ స్థావరాలపై  మజ్ను షా దాడి చేశారు. ఒక సందర్భంలో, అతను వందలాది మంది సాయుధ అనుచరులతో కలిసి రాజ్‌షాహిలోని కంపెనీ రెవెన్యూ కార్యాలయంపై దాడి చేసి, సేకరించిన నిధిని స్వాధీనం చేసుకుని, కాచారిని తన ఆధీనంలో ఉంచాడు. 1773 లో పూర్ణియా, బుర్ద్వాన్, కుమార్‌ఖాలి, జెస్సోర్, మైమెన్‌సింగ్, సిల్హెట్, డాకా, మిడ్నాపూర్, బిర్భం, రంగ్‌పూర్, దినజ్‌పూర్, బోగ్రా, జల్పాయిగురిలపై తిరుగుబాటుదారులు విస్తృతమైన దాడులు నిర్వహించారు.

 

1776 లో బోగ్రా, రాజ్‌షాహి, దినజ్‌పూర్, చిట్టగాంగ్ జిల్లాల్లో ఫకీర్-సన్యాసి దాడులు ముమ్మరం అయ్యాయి.. 1777 మరియు 1781 మధ్య కాలంలో ఫకీర్-సన్యాసి దాడులు ప్రధానంగా బోగ్రా, రాజ్‌షాహి, రంగ్‌పూర్, చిట్టగాంగ్, సిల్హెట్ మరియు మైమెన్‌సింగ్ ప్రాంతాల్లో కొనసాగాయి. 1782 లో మైమెన్‌సింగ్‌లోని అలప్సింగ్ పరగణాలో తిరుగుబాటుదారుల కార్యకలాపాలు తీవ్రంగా మారాయి. పుఖూరియా వద్ద తీవ్రమైన యుద్ధం తరువాత మజ్ను షా తన అనుచరులతో కలిసి మధుపూర్ అడవిలోకి పారిపోయారు.

 

ఆ తరువాత 1785 లో అతను మహాస్థాన్‌గర్ వైపు వెళ్ళాడు మరియు ఒక యుద్ధంలో ఓడిపోయాడు. మరుసటి సంవత్సరంలో, మజ్ను షా తన ఆధ్వర్యం లో తూర్పు బెంగాల్‌లో మరియు తన లెఫ్టినెంట్ మూసా షా ఆధ్వర్యంలో ఉత్తర బెంగాల్ ప్రాంతంలో ఏకకాలంలో దాడి చేయాలని ప్లాన్ చేశాడు. కలేశ్వర్ ప్రాంతంలో లెఫ్టినెంట్ బ్రెనన్ ఆధ్వర్యంలో కంపెనీ సైన్యానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో (8 డిసెంబర్ 1786) మజ్ను షా తన అనుచరులను పెద్ద సంఖ్యలో కోల్పోయారు, మరియు అతని గాయపడిన కొంతమంది అనుచరులను మేవాట్కు తీసుకువెళ్లారు. కలేశ్వర్ వద్ద జరిగిన యుద్ధంలో మజ్ను షా గాయపడ్డాడు మరియు 1788 జనవరి 26 న మరణించాడు

 

మజ్ను షా మరణం తరువాత మూసా షా, చెరాగ్ అలీ షా, పరాగల్ షా, శోభన్ షా, మాదర్ బక్ష్, జారి షా, కరీం షా, కృపనాథ్, రోవ్షన్ షా, అనుప్ నారాయణ్ మరియు శ్రీ నిబాష్ వంటి ముఖ్య అనుచరులు క్రీ.శ 1800-1812 వరకు తిరుగుబాటును కొనసాగించారు కానీ మజ్ను షా మరణం తరువాత ఉద్యమం క్రమంగా దాని దిశ మరియు గతిశీలతను కోల్పోతోంది.

 

18 వ శతాబ్దం చివరి మూడు దశాబ్దాలలో సన్యాసిస్ మరియు ఫకీర్లు ప్రావిన్స్‌లోకి ప్రవేశించకుండా లేదా వారు  డబ్బు వసూలు చేయకుండా నిరోధించడానికి కంపెనీ దళాలు ప్రయత్నించినప్పుడు, తరచూ ఘర్షణలు జరిగాయి, కంపెనీ బలగాలు ఎల్లప్పుడూ విజయం సాధించలేదు. కరువు తరువాత సంవత్సరాల్లో చాలా ఘర్షణలు నమోదయ్యాయి, కాని అవి తక్కువ పౌన పున్యం ఉన్నప్పటికీ, 1802 వరకు కొనసాగాయి 1790 ల చివరినాటికి మరియు తరువాతి దశాబ్దంలో చెదరుమదురు ప్రతిఘటన రూపంలో తిరుగుబాటు రూపాంతరం చెందినది.

 

1799 నాటి చువార్ తిరుగుబాటు మరియు 1855–56 యొక్క సంతల్ తిరుగుబాటుతో సహా బెంగాల్ ప్రావిన్స్ యొక్క పశ్చిమ జిల్లాల్లో జరిగిన తిరుగుబాటులలో ఫకిర్-సన్యాసి తిరుగుబాటు మొదటిది. ఫకీర్-సన్యాసి తిరుగుబాటు తరువాత జరిగిన తిరుగుబాట్లపై ఎలాంటి ప్రభావం చూపింది అనేది చర్చనీయాంశం. ఈ తిరుగుబాటు ప్రభావం తో భారతదేశపు మొట్టమొదటి ఆధునిక నవలా రచయిత బంకీమ్ చంద్ర ఛటర్జీ ఆనందమత్ అనే పుస్తకం రచించినాడు

 

 

 

 

No comments:

Post a Comment