30 October 2020

విద్య యొక్క ప్రాముఖ్యత పై ముహమ్మద్ ప్రవక్త(స) భావాలు What Prophet Muhammad said about the importance of education?

 


భారత ముస్లింల దుస్థితి కి  ప్రధాన కారణం అయిన విద్య (జ్ఞానం) లో వెనుకబడి ఉన్నారనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని, ముస్లిం పండితులు ముస్లింలను ప్రవక్త(స) నిర్దేశించిన విధంగా జ్ఞానాన్ని పొందమని ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది.

జ్ఞానం(అరబిక్ - ఇల్మ్, ఏకవచనం; ఉలూమ్ - బహువచనం) సంపాదించడం ద్వారా మాత్రమే భారతీయ ముస్లింల సమస్యలను పరిష్కరించవచ్చు.

 

ప్రపంచంలోని ఏ మూల నుంచి అయినా    జ్ఞానాన్ని పొందమని చెప్పే ప్రవక్త(స) సంప్రదాయాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. హదీసు  సాహిత్యం (ప్రవక్త యొక్క సూక్తులు) కూడా జ్ఞానం యొక్క విలువను తెలుపుతుంది..

విద్య పై ప్రవక్త(స) యొక్క కొన్ని సూక్తులు:

·       ప్రతి ముస్లిం (పురుషులు లేదా మహిళలు) జ్ఞానం పొందడం తప్పనిసరి"

·       జ్ఞానం  గల మనిషి సాతానుకు వ్యతిరేకంగా మరింత బలీయమైనవాడు

·       " చైనా వరకు వెళ్లి అయినా జ్ఞానాన్ని పొందండి."

·       అమరవీరుడి రక్తం కంటే జ్ఞానం గల వ్యక్తి సిరా పవిత్రమైనది."

·       జ్ఞానం కోసం ఎవరైనా ప్రయాణిస్తే, అల్లాహ్ అతన్ని స్వర్గం లో ప్రయాణించేలా చేస్తాడు. జ్ఞానాన్ని కోరుకునే వారితో దేవదూతలు తమ ఆనందం ప్రకటిస్తారు.

·        అల్లాహ్ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి  స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని సులభతరం చేస్తాడు.

·       "భక్తుడిపై జ్ఞానం గల మనిషి ఆధిపత్యం, రాత్రి వేళ నక్షత్రాల కంటే ప్రకాశించే చంద్రుడిలా ఉంటుంది ".

·        "ఓ అల్లాహ్, ప్రయోజనకరమైన జ్ఞానం, ఆమోదయోగ్యమైన చర్య మరియు మంచి సదుపాయం కోసం నేను నిన్ను అడుగుతున్నాను

·       "జ్ఞానం అనేది ముస్లిం యొక్క కోల్పోయిన ఆస్తి; అందువల్ల మీరు ఎవరినుంచి అయినా దాన్ని పొందండి.

·        "అల్లాహ్ యొక్క సృష్టి గురించి ఒక గంట ఆలోచించడం మరియు అధ్యయనం చేయడం  ఒక సంవత్సరం ప్రార్థనల కంటే మంచిది."

·       జ్ఞానం ఒక నిధి లాంటిది.

·       "జ్ఞానాన్ని సంపాదించి ప్రజలకు ఇవ్వండి."

·       'మరణం తరువాత మనిషి వదిలివేయగల గొప్ప సంపద  అతని జ్ఞానం.'

·       "నలుగురు ముస్లింలకు  చదవడo మరియు వ్రాయడo నేర్పిస్తే యుద్ధ ఖైదీకి  స్వేచ్ఛ ఇవ్వండి" (ఇస్లాం యొక్క ప్రారంభ కాలంలో ప్రవక్త యొక్క ఆదేశం )

·       పండితుల ఏకైక వారసత్వం జ్ఞానం, కాబట్టి ఎవరైతే దాని నుండి వాటా తీసుకుంటారో, అతను నిజమైన వాటాను తీసుకున్నాడు.

·       "ఎవరు జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళతారో అతను తిరిగి వచ్చేవరకు అతను అల్లాహ్ మార్గంలో ఉంటాడు."

·       "ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అతని మూడు పనులు ఉంటాయి: నిరంతర దాతృత్వం (సదాకా), ఇతరులు (ఇల్మ్ నాఫ్) నుండి ప్రయోజనం పొందిన జ్ఞానం మరియు అతని కోసం ప్రార్థించే నీతిమంతుడు."

·       "ముస్లిం జ్ఞానాన్ని పొందినప్పుడు, అతడు దానిని  తన సోదరులకు (ఇతరులకు) కుడా  బోధిoచాలి.."

 

ప్రవక్త (స)సాంప్రదాయాలు) ఇస్లాం చరిత్ర అంతటా ప్రతిధ్వనించాయి మరియు ముస్లింలను జ్ఞానం కోరేలా ప్రోత్సహించాయి.ఒక మోమిన్ జీవితం "యల నుండి సమాధి వరకు నేర్చుకునే ప్రయాణం" గా ఉండాలి. ఈ సంప్రదాయాలను పాటించినందున ముస్లింలు దాదాపు పది శతాబ్దాలుగా అభివృద్ధి చెందారు. ముస్లిం నాగరికత యొక్క అత్యున్నత స్థాయికి ఎదగడానికి కారణం వారి ప్రాపంచిక జ్ఞానం. మతపరమైన జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చి ఆధునికీకరణ మార్గాన్ని వదిలివేసినప్పుడు వారి క్షీణత ప్రారంభమైంది. సుప్రసిద్ధ ఇస్లామిక్ పండితుడు మౌలానా అబుల్ హసన్ అలీ నద్వి ప్రకారం జ్ఞానం (విజ్ఞాన శాస్త్రం) ను మతంతో విడదీయడం వల్ల మానవత్వం చాలా కోల్పోయింది మరియు ఈ విభజన ఇస్లామిక్ సొసైటీకి హాని గా మారింది. 


ముస్లింలకు వారి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఉత్తమ మార్గం జ్ఞానాన్ని పొందడం

No comments:

Post a Comment