18 October 2020

చారిత్రాత్మకంగా మరియు నేటి కాలంలో భారతదేశంలోని దళిత ముస్లింలు, అట్టడుగున ఉన్నారు, ప్రధాన జనజీవన స్రవంతి అంశాలలో వారి ప్రస్తావన చాలా తక్కువ ఉంది India's Dalit Muslims, marginalised historically and in the present day, find scant mention in mainstream discourse


భారతదేశంలో ముస్లింల ప్రాతినిధ్యం, భద్రత మొదలైన వాటి గురించి ప్రధాన జీవన స్రవంతిలో చర్చించేటప్పుడు   దళిత ముస్లింలను వదిలిపెట్టారు.

దళితులపై హింస, కులతత్వం మరియు వివక్షతపై ప్రతిస్పందనగా చర్చలు; #DalitLivesMatter కోసం మద్దతు మరియు  రాజకీయ నాయకులు ప్రతిస్పందనలు, ఆందోళనలు మనం చూస్తున్నాము.. కానీ దళితులలో  ఒక ఉప విభాగం - రెట్టింపు వివక్షకు లోబడి ఉంది.  – దానిని గురించి మాత్రం చాలా అరుదుగా మాట్లాడతాము..

 

"ముస్లిం" మరియు "దళిత" అనే గుర్తింపు భారతీయ సమాజంలో వారి స్థానాన్ని మరింత బలహీనంగా చేస్తుంది. రాజకీయ నాయకులు కూడా వారిని  గురించి పెద్దగా పట్టించుకోరు: ఉదాహరణకు, బీహార్‌లోని ముస్లిం జనాభాలో దళితులు గణనీయమైన విభాగంలో ఉన్నారు, కాని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే వారి మనోవేదనలను పరిష్కరించే ప్రయత్నం చాలా తక్కువ జరిగింది. .

భారత దేశం లోని విద్యా మరియు పరిపాలనా రంగాలలో దళిత ముస్లింల అల్ప లేదా నిరాశపూరిత ప్రాతినిద్యాన్ని  మనం గమనించాలి.

 

భారతీయ సమాజంలో కుల వ్యవస్థ ప్రధానమైన భాగం కాబట్టి, ముస్లింలతో సహా భారతదేశంలోని ప్రతి సమాజంలో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముస్లింలలో కుల వ్యవస్థ చాలా క్లిష్టంగా కనిపిస్తుంది, మత గ్రంథాలు లేదా సిద్ధాంతాలకు బిన్నంగా  వాస్తవికత ఉంటుంది.

 

భారతదేశంలోని ఇతర వర్గాల మాదిరిగానే ముస్లింలు కూడా కుల పరంగా విభజించబడ్డారు. ముస్లింలకు సంబంధించి, ‘అత్యంత వెనుకబడినతరగతులు, అనగా అర్జల్స్ Arzals కూడా షెడ్యూల్డ్ కులాల సభ్యులు లేదా దళితుల మాదిరిగానే పరిస్థితులను/సమస్యలను అనుభవిస్తారు.

 

ముస్లింలలో ప్రాథమికంగా మూడు వర్గాలు ఉన్నాయి:

వారిలో దిగువున  అర్జల్స్ Arzals’’ – (అంటరాని లేదా చాలా తక్కువ కులాల నుండి ఇస్లాం లోకి మతమార్పిడి జరిగినవారు);

తరువాత స్వచ్ఛమైన వృత్తి సమూహాలుగా పరిగణించబడుతున్నప్పటికీ సామాజిక గౌరవంలో వెనుకబడిన అజ్లాఫ్స్ Ajlafs

మరియు పైభాగంలో అష్రాఫ్‌లు Ashrafs’ఉన్నారు, వారు ఆఫ్ఘన్లు, అరబ్బులు, టర్క్‌లు మొదలైన వారి నుండి వచ్చినవారు లేదా ఉన్నత కుల హిందువుల నుండి మతం మారిన వారు.

సాంకేతికంగా అజ్లాఫ్ మరియు అర్జాల్ ఇద్దరినీ వెనుకబడిన తరగతులుగా తీసుకుంటారు, కాని రెండు వర్గాల పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయి. (దురదృష్టవశాత్తు, వారి ఖచ్చితమైన జనాభాను నిర్ణయిoచదానికి  డేటా అందుబాటులో లేదు.)

 

సచార్ కమిటీ నివేదిక ప్రకారం  "అర్జల్స్ ... షెడ్యూల్డ్ కులాల హిందూ సహచరులతో సమానమైన సాంప్రదాయ వృత్తులను కలిగి ఉన్నారు.. వారు ఇస్లాం లోకి హిందూ అంటరానివారి నుండి జరిగిన మతమార్పిడులు అని నమ్ముతారు. మతంలో మార్పు వారి సామాజిక లేదా ఆర్థిక స్థితిలో ఎటువంటి మార్పు తీసుకురాలేదు ”. అదేవిధంగా, సచార్ కమిటీ నివేదిక తరువాత 2007 లో తన నివేదికను సమర్పించిన జాతీయ మత మరియు భాషా మైనారిటీల కమిషన్ లేదా రంగనాథ్ మిశ్రా కమిషన్, దళిత ముస్లింల దుర్బల పరిస్థితిని కూడా గుర్తించింది మరియు దళిత క్రైస్తవులతో పాటు వారిని షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని నొక్కి చెప్పింది. "ఒబిసి 27 శాతం కోటాలో మైనారిటీలకు 8.4 శాతం ఉప కోటా మరియు షెడ్యూల్డ్ కులాల కేటగిరీ 15 శాతం కోటాలో దళిత మైనారిటీలకు కూడా రిజర్వేషన్లు" సిఫార్సు చేసింది. ముస్లిం మరియు క్రైస్తవ సమాజాలలో దళితులు: నేషనల్ మైనారిటీల కమిషన్ (ఎన్‌సిఎంNCM) ఇచ్చిన నివేదిక దళిత ముస్లింలు మరియు దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కుల ప్రతిపత్తిని  సిఫారసు చేసింది.

 

ఈ నివేదికలకు ముందు, అఖిల భారత పాస్మాందా ముస్లిం మోర్చా మరియు ఆల్ ఇండియా పాస్మాందా ముస్లిం మహాజ్ ఈ విషయాన్ని హైలైట్ చేశారు, అర్జల్స్ పరిస్థితి వారి హిందూ సోదరుల కంటే మెరుగైనది కాదని నొక్కి చెప్పారు; ఈ సంస్థలు దళిత ముస్లింలకు పొందికైన సామాజిక సమూహాల హోదా status of coherent social groups ను సాధించడానికి కృషి చేశాయి.

కార్యకర్త, రాజకీయవేత్త అలీ అన్వర్ తన పుస్తకంలో మసవత్ కి జంగ్ Masawat ki Jung: ఉన్నత కులాల చేతిలో దళిత ముస్లింలు ఎదుర్కొంటున్న వివక్షను నొక్కి చెప్పారు. అన్వర్ దిగువ కుల ముస్లింలైన జులాహా (చేనేత కార్మికులు), హలాల్‌ఖోర్, లాల్‌బెగి (స్కావెంజర్స్), భాటియారా, గోర్కాన్ (సమాధి త్రవ్వకాలు), బఖో, పమారియా, మిర్షికర్, డార్జీ, నాట్, చిక్, రాంగ్రేజ్ julaha (weavers), halalkhor, lalbegi (scavengers), bhatiara, gorkan (grave diggers), bakkho, pamaria, mirshikar, darzi, nat, chik, rangrez మరియు  ఇతరులు, వారి కష్టాలు వివరించారు.. బీహార్ మరియు కొన్ని ఇతర రాష్ట్రాల కార్యకర్తలు దళిత ముస్లింలకు సంబంధించిన అనేక సమస్యలను కూడా తెరపైకి తెచ్చారు (ఉదాహరణకు, వారి కుల వ్యక్తులను సాధారణ శ్మశానవాటికలో పాతిపెట్టడానికి అనుమతించబడటం లేదు), సాంప్రదాయ వృత్తిలో బలవంతపు ఉపాధి మొదలైనవి.

 

పాస్మాందా Pasmanda ఉద్యమం ముస్లింలలోని  దిగువ స్థాయివారికి వ్యతిరేకంగా ఉన్న వివక్షతను ఎత్తి చూపినది. పైన పేర్కొన్న అన్ని సంస్థలు, కార్యకర్తలు మరియు పండితుల యొక్క ఉద్దేశ్యం ముస్లిం వెనుకబడిన సమూహాల అణచివేతను కనిపించేలా చేయడమే. గతంలో దళిత ముస్లింల దుస్థితి పై తీవ్రమైన చర్చలు జరగలేదు.

 

ముస్లిం వర్గాలలోని లేనివారికి have nots”   కు ఎటువంటి మంచి జరగదని ఇక్కడ గమనించాలి: రాజ్యాంగంలోని నిబంధనలకు సవరణ అవసరం, తద్వారా అత్యంత వెనుకబడిన వారి  పరిస్థితి మెరుగుపడుతుంది. సచార్ కమిటీ మరియు రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికల తరువాత తన పుస్తకంలో, అబ్దుర్ రెహ్మాన్ (ఐపిఎస్IPS) ఇలా అన్నారు: ముస్లిం దళితులపై ఈ వివక్ష మరియు అన్యాయం 1936 నాటిది. ఇంపీరియల్ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వు ఎస్సీSC స్టేటస్ మరియు ఇలాంటి మూలం కలిగిన  క్రైస్తవులు బౌద్ధులకు తిరస్కరించినది. ఈ డిక్రీ ద్వారా జాబితాలో చేర్చబడిన దళిత ముస్లింలు ప్రయోజనాలను పొందకుండా నిరోధించారు. ఈ ఉత్తర్వు 1950 ప్రెసిడెంట్ ఉత్తర్వులకు ఆధారం అయ్యిందని రెహమాన్ అన్నారు..  

 

1950 ల అధ్యక్ష ఉత్తర్వు ప్రకారం ' హిందూ మతం నుండి బిన్న మతాన్ని అవలంభించే వ్యక్తి షెడ్యూల్డ్ కులాల సభ్యుడిగా పరిగణించబడడు. తరువాత, 1956 మరియు 1990లలో, ఈ ఉత్తర్వు సవరించబడింది, తద్వారా షెడ్యూల్డ్ కులాల హోదా సిక్కులు మరియు నయా బౌద్ధులకు విస్తరించింది. ఏదేమైనా, 1990 ల నుండి, ప్రతి పాలనలో కూడా  దళిత మైనారిటీలు  (ముస్లింలు మరియు క్రైస్తవులు) అట్టడుగున ఉన్నారు,.

 

పరిపాలనాపరంగా మాత్రమే కాదు, విద్యా స్థాయిలో కూడా దళిత ముస్లింలు కనిపించరు. ప్రముఖ AMU చరిత్రకారుడు మరియు పండితుడు మొహమ్మద్ సజ్జాద్ ఈ విషయంలో అనేక ప్రశ్నలను లేవనెత్తారు. "1940 ల నుండి ఎంత మంది దళిత నాయకులు ఎస్సీ విభాగంలో అర్జల్స్‌ Arzals ను చేర్చాలనే డిమాండ్‌ను నిజంగా లేవనెత్తారు? అంబేద్కర్ లేదా జోగెన్ మండల్, జగ్జీవన్ రామ్ గాని లేవనెత్త లేదు.. 1990 ల నుండి ఎంత మంది దళిత నాయకులు దీన్ని నిజాయితీతో అడిగారు? ఈ డిమాండ్ ముస్లింల నుండి మాత్రమే ఎందుకు వస్తుంది? అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ వంటి నాయకులు కూడా 1950లలో ఈ విషయం గురించి మాట్లాడినట్లు లేదు ’’ అని సజ్జాద్ ఒక సంభాషణలో చెప్పారు.

 

అర్జల్స్‌ను చేర్చడం ప్రభుత్వ ఆర్డినెన్స్ ద్వారా సాధ్యమే, అందువల్ల ఇది పెద్ద విషయం కాదు. మైనారిటీ కమిషన్, లేదా ఏదైనా మత సంస్థ నిర్వహించిన అర్జాల్ వర్గాల లేమి గురించి క్షేత్రస్థాయి సర్వే నివేదికలు ఉన్నాయా? లెకపోతే, ఎందుకు లేవు.? కొన్ని ప్రామాణికమైన డేటాబేస్ పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉండాలి. అటువంటి డేటాబేస్ లేకపోవడం అణచివేత మరియు వివక్షత కు మరొక సాక్ష్యం, "అని సజ్జాద్ ముగించారు.

 

దళిత ముస్లింల గొంతులను తెరపైకి తీసుకురావడo అవసరం. ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం నుండి ఏమీ ఆశించనందున దీనిని పౌర సమాజం మరియు విద్యావేత్తలు ప్రారంభించాలి. ముస్లిం సమాజంలోని సమస్యలను కూడా చూడాలి మరియు అందులోని నిరుపేదలు అభివృద్ధి చెందడానికి సహాయపడాలి.

 


No comments:

Post a Comment