తమిళనాడు మరియు కేరళలో “క్వాయిడ్-ఎ- మిల్లెత్ Quaid-e-Millat("దేశ నాయకుడు")”
గా ఆప్యాయం గా పిలువబడే ఎం ముహమ్మద్ ఇస్మాయిల్ రౌథర్ ఆధునిక భారతదేశంలోని ముఖ్యమైన ముస్లిం
నాయకులలో ఒకరు. స్వాతంత్య్రానంతర దక్షిణ భారత ముస్లిం ప్రజల నాయకుడిగా ఆయన పేరుగాంచారు మరియు దక్షిణ భారతదేశంలో ప్రముఖ రాజకీయవేత్తగా
పరిగణించ బడినారు.
ఎం. ముహమ్మద్ ఇస్మాయిల్ (5 June 1896—5 April 1972)
బ్రిటిష్
ఇండియా (1947) విభజన తరువాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ స్థాపకుడు. ఇస్మాయిల్
మద్రాస్ శాసనసభ సభ్యుడు మరియు ప్రతిపక్ష నాయకుడు (1946—52). అతను భారత రాజ్యాంగ అసెంబ్లీ లో
సభ్యుడు (1948—50). ఇస్మాయిల్ లోక్ సభ 1962—67, 1967—70 మరియు 1971-72)లో సబ్యుడు మరియు రాజ్యసభ (1952—58)
సబ్యుడు.
ఎం. ముహమ్మద్ ఇస్మాయిల్ తిరునెల్వేలి (మద్రాస్ ప్రెసిడెన్సీ)లోని
పెట్టై Pettai, in Tirunelveli(ప్రస్తుత తమిళనాడు)లో 5 జూన్ 1896 న మౌలవి కె. టి. మియాఖాన్
రౌథర్ కు జన్మించారు. అతను తిరునెల్వేలిలోని సి. ఎం. ఎస్. కాలేజీ మరియు ఎం. డి.
టి. హిందూ కాలేజీలో మరియు తరువాత సెయింట్ జోసెఫ్ కాలేజ్, ట్రిచినోపోలీTrichinopoly మరియు మద్రాసులోని క్రిస్టియన్
కాలేజీలో విద్యను అభ్యసించాడు
ఇస్మాయిల్, 1909 లో 13 సంవత్సరాల వయస్సులో తన సొంత పట్టణం తిరునెల్వేలి పెటాయిలో 'యంగ్ ముస్లిం సొసైటీ'ని ప్రారంభించాడు 1918 లో 'మజ్లిస్-ఉల్-ఉలామా' ('కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్
స్కాలర్స్') ను స్థాపించడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇస్మాయిల్ 1920 లలో వ్యాపారంలోకి ప్రవేశించి తోలు
మరియు మాంసం పరిశ్రమ మరియు మద్రాస్ కామర్స్ కు నాయకుడు అయ్యాడు.
ఇస్మాయిల్ నవంబర్ 1923 లో జమాల్ హమీదా బిని వివాహం
చేసుకున్నాడు. పిల్లలు జమాల్ మియాఖాన్ (కొడుకు)
ఇస్మాయిల్ సోదరుడు, కె. టి. ఎం. అహ్మద్ ఇబ్రహీం, మద్రాస్ ప్రెసిడెన్సీలో అఖిల
భారత ముస్లిం లీగ్ యొక్క ప్రధాన నాయకుడు.
మద్రాస్ కామర్స్ లో విజయం ఇస్మాయిల్‌ను భారతీయ రాజకీయాల్లోకి
నడిపించింది. కె. ఎం. సీతి సాహెబ్, బి. పాకర్ మరియు కె. ఉప్పి
సాహెబ్‌లతో పాటు, ఇస్మాయిల్1930 ల మధ్యకాలం నుండి మద్రాస్
ప్రెసిడెన్సీలో అఖిల భారత ముస్లిం లీగ్ యొక్క ప్రధాన నాయకులలో ఒకరు.
1896 లో జన్మించిన ఎం ఇస్మాయిల్ సాహిబ్
స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. అతను స్వాతంత్ర్యానికి ముందే మదారస్ స్టేట్
ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు,
స్వాతంత్ర్యం
తరువాత ఏర్పడిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు మరియు
మరణించే వరకు దాని చీఫ్ గా కొనసాగాడు.
1945లో, ఇస్మాయిల్ అఖిల భారత ముస్లిం లీగ్ యొక్క
మద్రాస్ ప్రెసిడెన్సీ యూనిట్ అధ్యక్షుడయ్యాడు. 1936మద్రాస్ శాసనసభ ఎన్నికలలో, అఖిల భారత ముస్లిం లీగ్ రిజర్వు చేసిన స్థానాలలో పది మరియు 1946 లో రిజర్వు చేసిన స్థానాలు అన్నిటినీ గెలుచుకుంది. 1946 ఎన్నికల తరువాత అసెంబ్లీలో
లీగ్ రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది మరియు ఇస్మాయిల్ 1946-52లో శాసనసభలో ప్రతిపక్ష
నాయకుడిగా పనిచేశారు.
బ్రిటిష్ ఇండియా భారతదేశం మరియు పాకిస్తాన్లలో విభజించబడినప్పుడు, అఖిల భారత ముస్లిం లీగ్
వాస్తవంగా రద్దు చేయబడింది (డిసెంబర్, 1947). మద్రాస్ ముస్లిం లీగ్ యొక్క
అప్పటి అధ్యక్షుడైన ఇస్మాయిల్, లీగ్ యొక్క ఇండియన్ సెగ్మెంట్
కన్వీనర్‌గా ఎంపికయ్యాడు. లీగ్ యొక్క భారతీయ సభ్యులు మద్రాసులో ఇండియన్ యూనియన్
ముస్లిం లీగ్ను ఏర్పాటు చేశారు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ యొక్క మొదటి
అధ్యక్షుడిగా ఇస్మాయిల్ ఎన్నికయ్యారు.
విభజన తరువాత, ఇస్మాయిల్ మద్రాస్ శాసనసభ నుండి
రాజ్యాంగ సభకు 1948 లో ఎన్నికయ్యారు. మైనారిటీలపై సలహా కమిటీ నివేదిక చర్చించినప్పుడు
(1949), లీగ్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్ ముస్లింలకు రిజర్వు చేసిన సీట్లను
మరియు ప్రత్యేక కమ్యూనల్ ఎలెక్టరేట్ నిలుపుకోవాలని retention
of reserved seats for Muslims and a separate communal electorate ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు.
రాజ్యంగ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని తిరస్కరించింది.
భారతదేశ అధికారిక భాషలలో తమిళం మరియు హిందూస్థానీ రెండింటినీ
ఇస్మాయిల్ కోరుకున్నారు. రాజ్యాంగ అసెంబ్లీలో మైనారిటీల లేదా
భాష యొక్క హక్కులపై చర్చలలో లేదా సమాన హక్కులు మరియు గుర్తింపు కోసం జరిగిన రాజకీయ
పోరాటంలో, ముహమ్మద్ ఇస్మాయిల్ నిర్వహించిన పాత్ర
ప్రముఖమైనది.
ఎం ముహమ్మద్ ఇస్మాయిల్ సమాజం లోని ఇతర
వర్గాలు మరియు నాయకులతో మద్య రహదారిగా నిలిచారు. సమాజం లోని అణగారిన ప్రజల ప్రతినిధిగా వారి
హక్కుల కోసం పోరాడాడు. ఎం ఇస్మాయిల్ సాహిబ్ మత శక్తులతో పోరాడాడు. రాజ్యాంగ సభ, లోక్ సభ మరియు రాజ్యసభ సబ్యుడైన ఎం ఇస్మాయిల్ సాహిబ్
దక్షిణ భారతదేశంలో ఉన్నతశ్రేణి ముస్లిం నాయకుడు..
స్వాతంత్ర్యం తరువాత, అతను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
(ఐయుఎంఎల్) కు నాయకత్వం వహించాడు మరియు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అప్పటి మద్రాస్
రాష్ట్రంలో శక్తివంతమైన శక్తిగా నిలిచింది.
1957 సార్వత్రిక ఎన్నికలలో తమిళనాడులో లీగ్ పరాజయాన్ని చవిచూసింది.
అక్టోబర్, 1961 లో పార్టీ విడిపోయింది. లీగ్ అప్పుడు ద్రావిడ మున్నేట కజగం తో
పొత్తు పెట్టుకుంది.
1952 లో, ఇస్మాయిల్ మద్రాస్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు మరియు 1958 వరకు సభ్యుడిగా ఉన్నారు. M.P. గా తన ఎమోల్యూమెంట్ emolument లో కొంత భాగాన్ని జాతీయ
రక్షణ నిధికి ఇవ్వాలని అభ్యర్థించిన మొదటి పార్లమెంటు సభ్యుడు (M.P). రాజ్యసభ సబ్యునిగా భారతీయ ముస్లింల కోసం షరియా చట్టాన్ని కొనసాగించడానికి
ఆయన మద్దతు ఇచ్చారు. రాజ్యసభ నుండి ముస్లింల వాణి వినిపించాడు.
1956 లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం
ద్వారా కేరళ రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఇస్మాయిల్ కేరళ రాజకీయాలకు మారారు. 1962 లో
(మూడవ లోక్ సభ ), 1967 (నాల్గవ లోక్ సభ ) మరియు 1971 (ఐదవ
లోక్ సభ ) ను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థిగా మంజేరి పార్లమెంటరీ
నియోజకవర్గం నుండి లోక్‌సభకు మూడుసార్లు ఎన్నుకున్నారు.
ఎం ఇస్మాయిల్ సాహిబ్ 125 వ వార్షికోత్సవం సందర్భంగా, డిఎంకె చీఫ్ స్టాలిన్ మాట్లాడుతూ,
ఎం
ఇస్మాయిల్ సాహిబ్ ను “క్వాయిడ్-ఎ-మిల్లాట్” గా కీర్తించారు. పెరియార్ మరియు అన్నాదురైలతో
క్వాయిడ్-ఎ-మిల్లాట్ స్నేహాన్ని, 1967 లో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు
చేయడానికి డిఎంకెకు ఎలా సహాయపడ్డారో స్టాలిన్ గుర్తుచేసుకున్నారు. ఇస్మాయిల్
సాహిబ్ సామరస్యాన్ని మరియు రాష్ట్రల స్వయంప్రతిపత్తిని harmony and state autonomy సమర్దించే మార్గదర్శక కాంతి గా
నిలిచారు అని అన్నారు.ఆ తరువాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కేరళలో
బలీయమైన శక్తిగా మారింది.
ఇస్మాయిల్ 1920 లలో వ్యాపారంలోకి ప్రవేశించి వివిధ
వాణిజ్య కమిటీలలో పాల్గొన్నాడు. మద్రాస్ ప్రెసిడెన్సీ యొక్క తోలు మరియు మాంసం
పరిశ్రమ యొక్క లో ప్రసిద్ధ వ్యాపారవేత్త.
అతను సభ్యుడైన బోర్డులు మరియు కమిటీలు:
• మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ బోర్డ్, బోర్డ్
ఆఫ్ ఇండస్ట్రీస్ (మద్రాస్), మద్రాస్ ప్రావిన్షియల్ మార్కెటింగ్
బోర్డ్, మద్రాస్ ఎక్సైజ్ లైసెన్సింగ్ బోర్డు
మరియు సౌత్ ఇండియా రైల్వే అడ్వైజరీ కమిటీ.
• ఇండస్ట్రియల్ ప్లానింగ్ కమిటీ (మద్రాస్
ప్రభుత్వం), సౌత్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్
ఇండస్ట్రీ (ఒకప్పుడు ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్
కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మరియు కోర్ట్ ఆఫ్ అలీఘర్ ముస్లిం
విశ్వవిద్యాలయం.
• ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్
రీసెర్చ్ (హైడ్స్ అండ్ స్కిన్స్ Hides and Skins), హైడ్స్ సెస్
ఎంక్వైరీ కమిటీ, మైకా ఎంక్వైరీ కమిటీ, చైర్మన్
(లెదర్ అండ్ లెదర్ గూడ్స్ కమిటీ, మద్రాస్ ప్రభుత్వం), గౌరవ
కార్యదర్శి మరియు ఉపాధ్యక్షుడు (దక్షిణ భారతదేశ స్కిన్ అండ్ హైడ్ మర్చంట్స్
అసోసియేషన్, మద్రాస్ ) మరియు, అధ్యక్షుడు
(మద్రాస్ స్టేట్ మటన్ డీలర్స్ ఛాంబర్).
లెగసి(వారసత్వం):
·
M.ముహమ్మద్ ఇస్మాయిల్ 1972 లో
మరణించారు (సుదీర్ఘ అనారోగ్యం తరువాత). అతను తమిళనాడు మరియు కేరళలో
"క్వాయిడ్-ఎ-మిల్లాట్" ("దేశ నాయకుడు") గా ప్రసిద్ది చెందాడు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు ఎం. భక్తవత్సలం
చేత ఇస్మాయిల్ "ప్రతిపక్ష నాయకులందరికీ
ఒక నమూనా" అని అభివర్ణింపబడినారు..
·
అతని గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం నాగపట్నం జిల్లాను "నాగై
క్వాయిడ్-ఎ-మిల్లాట్" జిల్లాగా మార్చారు (అయినప్పటికీ, 1997 లో ఇది
పాత పేరుకు మార్చబడింది, అన్ని వ్యక్తుల పేర్లు జిల్లాల మరియు
రవాణా సంస్థల పేర్ల నుండి తొలగించబడినప్పుడు).
·
2003 లో, తమిళనాడు ప్రభుత్వం ఎం. ముహమ్మద్
ఇస్మాయిల్ కోసం ఒక స్మారక మందిరాన్ని నిర్మించింది.
·
క్వాయిడ్-ఎ- మిల్లెత్ ఎం ఇస్మాయిల్ సాహిబ్ పేరు మీద సంస్థలు, కళాశాలలు మరియు పాఠశాలలు ఉన్నాయి.
·
తమిళనాడులోని అనేక కళాశాలలు- క్వాయిడ్-ఎ-మిల్లాట్ ప్రభుత్వ మహిళా కళాశాల, చెన్నై
మరియు క్వాయిడ్ - ఎ మిల్లాట్ కళాశాల, మెదవక్కం, చెన్నై.కు
ఎం. ముహమ్మద్ ఇస్మాయిల్ పేరు పెట్టారు.
·
"క్వాయిడ్- మిల్లెత్” ఎం ఇస్మాయిల్
సాహిబ్ ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలని కోరుకొన్నారు మరియు ముస్లిం సమాజ చురుకైన సహకారం తో ఈ క్రింది సంస్థలను
స్థాపించారు..
·
ది న్యూ కాలేజ్, మద్రాస్
·
ట్రిచీలోని జమాల్ మహ్మద్ కళాశాల,
·
ఫరూఖ్ కళాశాల, (కేరళ)
·
హాజీ కరుతా రౌథర్ హౌడియా కాలేజ్,
ఉత్తమపాలయం
·
ది ఖాదర్ మొహిదీన్ కాలేజ్, ఆదిరంపట్టినం,
·
వక్ఫ్ బోర్డ్ కాలేజ్, మదురై,
·
నవాబ్ అబ్దుల్ హకీమ్ కాలేజ్,
మెల్విషారామ్,
·
సదాకతుల్లా అప్పా కాలేజ్, పాలయంకోట్టై,
·
మజార్- ఉల్-ఉలూమ్ కళాశాల, అంబూర్
·
ది జాకీర్ హుస్సేన్ కళాశాల,
ఇలయంగుడి.
M. ముహమ్మద్ ఇస్మాయిల్ సాహిబ్ పేరు మీద 1996 భారతదేశం తపాలా బిళ్ళ జారి చేసింది.
ఎం. ముహమ్మద్ ఇస్మాయిల్ రౌథర్,
5 ఏప్రిల్
1972 న చెన్నై లో మరణించారు (వయసు 75)
.
No comments:
Post a Comment