16 May 2021

క్వాయిడ్-ఎ-మిల్లత్ ముహమ్మద్ ఇస్మాయిల్ Quaid-e-Millat Muhammad Ismail .





 

“క్వాయిడ్-ఎ-మిల్లాట్ Quaid-e-Millat గా బిరుదు పొందిన ఎం ముహమ్మద్ ఇస్మాయిల్ ఆధునిక భారతదేశంలోని ముఖ్యమైన ముస్లిం నాయకులలో ఒకరు. స్వాతంత్య్రానంతర దక్షిణ భారత  ముస్లిం ప్రజల నాయకుడిగా  ఆయన పేరుగాంచారు  మరియు దక్షిణ భారతదేశంలో ప్రముఖ రాజకీయవేత్తగా పరిగణించ బడినారు..

ఎం ముహమ్మద్ ఇస్మాయిల్ రాజ్యాంగ అసెంబ్లీ సభ్యుడు, పార్లమెంటు సభ్యుడు మరియు ఐయుఎంఎల్ నాయకుడు.  ముహమ్మద్ ఇస్మాయిల్ ముస్లింల ప్రతినిధి మరియు సమాజం లోని ఇతర వర్గాలు మరియు నాయకులతో మద్య రహదారిగా నిలిచారు.  సమాజం లోని అణగారిన ప్రజల ప్రతినిధిగా వారి హక్కుల కోసం పోరాడాడు.

రాజ్యాంగ అసెంబ్లీలో మైనారిటీల లేదా భాష యొక్క హక్కులపై చర్చలలో లేదా సమాన హక్కులు మరియు గుర్తింపు కోసం జరిగిన రాజకీయ పోరాటంలో, ముహమ్మద్ ఇస్మాయిల్ నిర్వహించిన పాత్ర ప్రముఖమైనది..

1896 లో జన్మించిన ఎం ఇస్మాయిల్ సాహిబ్ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. అతను స్వాతంత్ర్యానికి ముందే మదారస్ స్టేట్ ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు, స్వాతంత్ర్యం తరువాత ఏర్పడిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు మరియు మరణించే వరకు దాని చీఫ్ గా కొనసాగాడు.

ఎం ఇస్మాయిల్ సాహిబ్ IUML ను స్థాపించడమే కాక అనేక ముస్లిం సంస్థలను స్థాపించాడు. అతను మత శక్తులతో పోరాడాడు మరియు రాజ్యాంగ సభ నుండి లోక్ సభ  మరియు రాజ్యసభ నుండి ముస్లింల వాణి  వినిపించాడు.

ఎం ఇస్మాయిల్ సాహిబ్ దక్షిణ భారతదేశంలో ఉన్నతశ్రేణి ముస్లిం నాయకుడు.. స్వాతంత్ర్యం తరువాత, అతను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) కు నాయకత్వం వహించాడు మరియు పార్టీ అప్పటి మద్రాస్ రాష్ట్రంలో శక్తివంతమైన శక్తిగా నిలిచింది.

 

ఎం ఇస్మాయిల్ సాహిబ్ 125 వ వార్షికోత్సవం సందర్భంగా, డిఎంకె చీఫ్ స్టాలిన్ మాట్లాడుతూ, ఎం ఇస్మాయిల్ సాహిబ్ ను “క్వాయిడ్-ఎ-మిల్లాట్” గా కీర్తించారు. పెరియార్ మరియు అన్నాదురైలతో క్వాయిడ్-ఎ-మిల్లాట్ స్నేహాన్ని, 1967 లో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి డిఎంకెకు ఎలా సహాయపడ్డారో స్టాలిన్ గుర్తుచేసుకున్నారు. ఇస్మాయిల్ సాహిబ్ సామరస్యాన్ని మరియు రాష్ట్రల స్వయంప్రతిపత్తిని harmony and state autonomy సమర్దించే మార్గదర్శక కాంతి గా నిలిచారు అని అన్నారు.ఆ తరువాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కేరళలో బలీయమైన శక్తిగా మారింది.

ఎం ఇస్మాయిల్ సాహిబ్ పేరు మీద సంస్థలు, కళాశాలలు మరియు పాఠశాలలు ఉన్నాయి. తమిళనాడులోని ఒక జిల్లాకు కొంతకాలం 'నాగపట్నం ఖైద్-ఎ-మిల్లాట్' అని పేరు పెట్టారు, అయితే వ్యక్తుల పేర్లతో అన్ని జిల్లాలు పేర్లు కోల్పోయినప్పుడు, అది మళ్ళీ నాగపట్నం అయింది.

"క్వాయిడ్-మిల్లెత్” ఎం ఇస్మాయిల్ సాహిబ్ ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలని కోరుకొన్నారు మరియు  ముస్లిం సమాజ చురుకైన సహకారం తో ఈ క్రింది సంస్థలను స్థాపించారు..

·       ది న్యూ కాలేజ్, మద్రాస్

·       ట్రిచీలోని జమాల్ మహ్మద్ కళాశాల,

·       ఫరూఖ్ కళాశాల, (కేరళ)

·       హాజీ కరుతా రౌథర్ హౌడియా కాలేజ్, ఉత్తమపాలయం

·       ది ఖాదర్ మొహిదీన్ కాలేజ్, ఆదిరంపట్టినం,

·       వక్ఫ్ బోర్డ్ కాలేజ్, మదురై,

·       నవాబ్ అబ్దుల్ హకీమ్ కాలేజ్, మెల్విషారామ్,

·       సదాకతుల్లా అప్పా కాలేజ్, పాలయంకోట్టై,

·       మజార్- ఉల్-ఉలూమ్ కళాశాల, అంబూర్

·       ది జాకీర్ హుస్సేన్ కళాశాల, ఇలయంగుడి.

 

 

 

 

 

.

 

No comments:

Post a Comment